రాష్ట్రంలో రెండు కేన్సర్ వైద్య కేంద్రాలు
♦ రూ.200 కోట్లతో ఆదిలాబాద్, వరంగల్‌లలో ఏర్పాటుకు యోచన
♦ కేంద్ర ఆర్థిక సహకారంతో నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు ప్రాంతీయ కేన్సర్ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. దీనికి సంబంధించి వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు తయారు చేస్తోంది. ఆదిలాబాద్, వరంగల్‌లలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఒక్కో కేంద్రానికి రూ.100 కోట్ల చొప్పున ఖర్చవుతుందని అంచనా. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఈ ప్రాంతీయ కేన్సర్ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణరుుంచినట్లు ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
ఎంఎన్‌జేపై పెరిగిన ఒత్తిడి
తెలంగాణ, ఏపీలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలకు కూడా హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రే కీలకంగా మారింది. ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడికి రోజుకు 500 మందికి పైగా రోగులు వస్తుంటారు. ఏడాదికి లక్ష మందికిపైగా రోగులు చికిత్సానంతర వైద్యం కోసం వస్తుంటారు. మరోవైపు కేన్సర్ వ్యాధి బాధితుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ఎంఎన్‌జే ఆస్పత్రిలో పడకల సంఖ్య, వైద్య సిబ్బంది సరిపోక.. వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతు న్నారుు. ఈ నేపథ్యంలో కేంద్ర సహకారంతో వరంగల్, ఆదిలాబాద్‌లలో ప్రాంతీయ కేన్సర్ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో అందే సేవలన్నీ కూడా వాటిలో అందిస్తే.. రోగులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. స్క్రీనింగ్ సహా కేన్సర్ నిర్ధారణ పరీక్షలు ప్రాంతీయ కేంద్రాల్లో చేయడం వల్ల ఎంఎన్‌జేపై ఒత్తిడి తగ్గించే అవకాశం ఉంటుంది.
పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
ప్రస్తుతం ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో 266 మంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. పడకల సంఖ్య రెట్టింపు స్థాయిలో పెరుగుతుండటంతో అదనంగా 288 పోస్టులు అవసరమని ఎంఎన్‌జే అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం 100 పోస్టులనే మంజూరు చేసినట్లు తెలిసింది. ఇందులో 50 డాక్టర్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. మిగతా 50 పోస్టుల్లో నర్సులు, రేడియో థెరఫిస్టులు, ఇతర పారామెడికల్ సిబ్బంది పోస్టులు ఉన్నాయి. వీటి భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీచేసే అవకాశముంది.