candiates nominations
-
తుపాకులు, పుస్తకాలు..పెయింటింగ్స్
రాజస్తాన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో పలువురు అభ్యర్థులు తుపాకులు, లగ్జరీ కార్లు, పెయింటింగులు, పుస్తకాలే తమ ఆస్తులుగా చూపిం చారు. కేంద్ర సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తన దగ్గర 15 తుపాకులు ఉన్నాయని, వాటి విలువ 9 లక్షల రూపాయలని పేర్కొన్నారు. రాథోడ్ పేరొందిన షూటర్ అన్న సంగతి తెలిసిందే. ఈ తుపాకుల్లో పది తనకు బహుమానంగా వచ్చాయని ఆయన అఫిడవిట్లో వివరించారు. జల్వార్–బరన్ నుంచి పోటీలో దిగిన దుష్యంత్ సింగ్ తనకు ఐదు రోల్స్‌రాయస్ కార్లు ఉన్నాయని పేర్కొంటే, అజ్మీర్ కాంగ్రెస్ అభ్యర్థి రిజు ఝన్‌ఝన్‌వాలా 16 లక్షల రూపాయల విలువైన కళాఖండాలను తన ఆస్తులుగా అఫిడవిట్లో ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ తరపున రాజ్‌సమంద్ నుంచి పోటీ చేస్తున్న జైపూర్ యువరాణి దియా కుమారి తనకు 64.89 లక్షల రూపాయల విలువైన నగలున్నాయని తెలిపారు. ఇక కోటా నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్న రాం నారాయణ్ మీనా దగ్గర 25,500 రూపాయల విలువైన పుస్తకాలు ఉన్నాయట. -
మూడో రోజు కుదిరిన ముహూర్తం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: శుక్రవారం మంచి ముహూర్తం ఉండడంతో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాగా రెండు రోజులు పెద్దగా ఎవరూ నామినేషన్లు వేయలేదు. మూడో రోజు ముహూర్తం కుదరడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. మొత్తం రెండు పార్లమెంటు, 12 అసెంబ్లీ స్థానాలకు గాను.. టీఆర్ఎస్ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి నలుగురితోపాటు . ఒక్కొక్కరు చొప్పున బీజేపీ, టీడీపీ, టీపీఎస్, యూసీసీఆర్ఐ(ఎంఎల్) అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్ పార్లమెంట్ ని యోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి ఒకటి, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఒకటి దాఖలయ్యూరుు. మహబూబాబాద్ పార్లమెంట్‌కు ఇండిపెండెంట్ అభ్య ర్థి ఒకరు నామినేషన్ వేశారు. కొన్నిచోట్ల అభ్యర్థులు నేరుగా వచ్చి నామినేషన్ వేయగా మరికొన్ని చోట్ల వారి బంధువులు, ప్రతినిధులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్లకు అందజేశారు. ములుగు నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థి ఒక సెట్ టీఆర్ఎస్ నుంచి, మరో సెట్ ఇండిపెండెంట్‌గా వేశారు.