కలెక్టరేట్, న్యూస్‌లైన్: శుక్రవారం మంచి ముహూర్తం ఉండడంతో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాగా రెండు రోజులు పెద్దగా ఎవరూ నామినేషన్లు వేయలేదు. మూడో రోజు ముహూర్తం కుదరడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.
మొత్తం రెండు పార్లమెంటు, 12 అసెంబ్లీ స్థానాలకు గాను.. టీఆర్‌ఎస్ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి నలుగురితోపాటు . ఒక్కొక్కరు చొప్పున బీజేపీ, టీడీపీ, టీపీఎస్, యూసీసీఆర్‌ఐ(ఎంఎల్) అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్ పార్లమెంట్ ని యోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి ఒకటి, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఒకటి దాఖలయ్యూరుు. మహబూబాబాద్ పార్లమెంట్‌కు ఇండిపెండెంట్ అభ్య ర్థి ఒకరు నామినేషన్ వేశారు. కొన్నిచోట్ల అభ్యర్థులు నేరుగా వచ్చి నామినేషన్ వేయగా మరికొన్ని చోట్ల వారి బంధువులు, ప్రతినిధులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్లకు అందజేశారు. ములుగు నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థి ఒక సెట్ టీఆర్‌ఎస్ నుంచి, మరో సెట్ ఇండిపెండెంట్‌గా వేశారు.
మూడో రోజు కుదిరిన ముహూర్తం
Published Sat, Apr 5 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM
Advertisement
Advertisement