Candrababunaidu Government
-
విత్తన సమస్య పాపం బాబు సర్కారుదే
సాధారణంగా ఈ సంవత్సరం జూన్లో పంట వేయాలంటే గత ఏడాది నవంబర్లోనే విత్తనాల సేకరణ ప్రారంభించి ఏప్రిల్ కల్లా పూర్తి చేయాలి. మే నెలలో వాటిని పంపిణీ చేయాలి. కానీ, గత ప్రభుత్వం అలా చేయకపోవడం వల్లే రైతులు ఇక్కట్లు పడుతున్నారు. అమరావతి : రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు విత్తనాల కోసం ఇక్కట్లు పడుతుండటానికి గత ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకమే కారణమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శాసనసభలో మాట్లాడారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు అందించాల్సిన విత్తనాల సేకరణ కూడా గత ప్రభుత్వం చేయలేదన్నారు. సాధారణంగా ఈ సంవత్సరం జూన్లో పంట వేయాలంటే గత ఏడాది నవంబర్లోనే విత్తనాల సేకరణ ప్రారంభించి ఏప్రిల్ కల్లా పూర్తి చేయాలని, మే నెలలో పంపిణీ చేయాలని చెప్పారు. వాస్తవంలో అలా జరగక పోవడం వల్లే రైతులు ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా ప్రభుత్వం జూన్లో వచ్చింది. అంటే మా ప్రభుత్వం వచ్చినప్పటికే విత్తన సేకరణ పూర్తయి రైతులకు పంపిణీ జరుగుతుండాలి. అలా జరగనందునే రైతులు రోడ్డు మీదకు రావాల్సిన దుస్థితి ఏర్పడింది. మేం బాధ్యతలు స్వీకరించిన నాటికి 4.41 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు రైతులకు సరఫరా చేయాలని ప్రణాళిక ఉంది. తీరా చూస్తే కేవలం 50 వేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గత ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని లేఖలు రాసినా నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని అధికారులు చెప్పార’ని వివరించారు. నిధులు ఇవ్వాలంటూ ఫిబ్రవరి 19న ఆంధ్రప్రదేశ్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు గత ప్రభుత్వానికి రాసిన లేఖతోపాటు మరో లేఖను కూడా స్పీకర్ అనుమతితో టీవీ స్క్రీన్పై చూపిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆంగ్లంలో చదివి వినిపించారు. అధికారులు ఒకటి కాదు రెండు కాదు ఇన్నిన్ని లేఖలు రాశారంటూ లేఖల కట్టను చేత్తో పట్టుకుని పైకెత్తి చూపించారు. గత ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన పని సమయానికి చేయకపోవడం వల్ల రైతాంగం పరిస్థితి ఇంత దారుణంగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో 4.41 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అవసరం ఉంటే కేవలం 50 వేల క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్న పరిస్థితిలో మేం అధికారంలోకి వచ్చాం. ఎన్నిసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించనందున ఏమీ చేయలేకపోయామని అధికారులు చెబుతుంటే చాలా బాధనిపించిందని సీఎం వివరించారు. -
చంద్రబాబు పార్టీ డ్రామాల పార్టీ
-
నేరస్తులకు ప్రభుత్వ రక్షణ
సాక్షి, హైదరాబాద్: మహిళలపై దౌర్జన్యాలు చేసి వారి మరణాలకు కార కులైన నేరస్తులను చంద్రబాబునాయుడి ప్రభుత్వం వెనకేసుకొస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు. నేరస్థులకు అండగా నిలిచి మహిళా వ్యతిరేకిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపాల్ బాబూరావు పాత్ర ఉందని సాక్షాత్తూ మృతురాలి తండ్రి మొరపెట్టుకుంటున్నా నిందితుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో తాము బాబూరావు పేరు ప్రస్తావించగానే టీడీపీ నేత ధూళి పాళ్ల నరేంద్ర, మంత్రి గంటా శ్రీనివాసరావు ఉలిక్కిపడ్డారన్నారు. బాబూరావుకు వ్యతిరేకంగా సాక్ష్యాలేవీ లభించలేదని డీజీపీ జేవీ రాముడు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. దర్యాప్తులు లేవు, నివేదికలు రావు.. తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యం చేసిన కేసులో విచారణే ముందుకు సాగడంలేదని విమర్శించారు. నారాయణ విద్యాసంస్థల్లో ఇద్దరమ్మాయిల మరణంపై త్రిసభ్య విచారణ కమిటీ నివేదిక రాలేదని, పుష్కరాల్లో మహిళల మరణాలపై ఏం దర్యాప్తు చేస్తున్నారో తెలియదని, రిషితేశ్వరి మృతిపై విచారణ జరిపిన బాలసుబ్రమణ్యం కమిటీ నివేదికను ప్రభుత్వం ఆమోదించలేదని రోజా ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో మంత్రి నారాయణ టీడీపీకి మద్దతునిచ్చారు కాబట్టే ఆయన విద్యాసంస్థల్లో 11 మంది మృతి చెందినా సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించకుండా అండగా నిలిచారన్నారు. మంత్రి గంటాకు నారాయణ వియ్యంకుడు కావడంతో అక్కడ ఎంత మంది చనిపోయినా విచారణకు ఆదేశించరన్నారు. కడప నారాయణ కాలేజీలో ఒకే రూంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మృతదేహాలపై గాయాలున్నందున రీపోస్ట్మార్టం జరపాలని ఆ విద్యార్థినుల కుటుంబాలను పరామర్శించే సందర్భంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అన్యాయాలపై మహిళలు స్పందించాలని, మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నపుడు వారిని నిలదీయాలని రోజా పిలుపు నిచ్చారు.