canned fresh air
-
స్కై వాటర్: సూర్యరశ్మి, గాలితో వాటర్..!
ప్రస్తుతం మహా నగరాల్లో తాగునీటి ఇక్కట్లు మాములుగా లేవు. మన దేశంలో బెంగుళూరు, ముంబై, హైదరబాద్ వంటి నగరాలు సమ్మర్ వస్తే చాలు నీటి సమస్యతో అల్లాడిపోతున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో జనాలు నివశించడానికే భయపడే పరిస్థితి ఎదురవ్వుతుందని హెచ్చరిస్తున్నారు కూడా. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి చేసిన తప్పిదాలే ఇందుకు కారణమని పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచే మొత్తుకుంటున్నారు. నీటి ఎద్దడి కోసం పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. అవన్నీ ఆయా ప్రాంతాలను బట్టి సక్సెస్ అవ్వడం అనేది ఆధారపడి ఉంది. అయితే ఇప్పుడూ ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేలా ఓ సరికొత్త వాటర్‌ని తాజాగా శాస్త్రవేత్తలు సృష్టిస్తున్నారు. త్వరలోనే ఆ నీటిని బాటిల్స్ రూపంలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు కూడా. ఇంతకీ పరిశోధకులు ఎలా నీటిని సృష్టిస్తున్నారంటే..అరిజోనా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు సూర్యుడు, గాలితో నీటిని తయారుచేసే సరికొత్త సాంకేతికను కనుగొన్నారు. ఏంటీ సూర్యకాంతి, గాలితోనా అని ఆశ్చర్యపోకండి. గాలిని స్వేదనంగా మార్చేందుకు హైడ్రోపనెల్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ సాయంతో గాలి నుంచి నీరు ఆవిరిని అయ్యేలా చేసి..ఆ నీటిని సేకరిస్తారు. ఇందుకోసం సోలార్ ప్యానెల్ మాదిరిగా ఉండే వాటిని తీసుకుంటారు. అయితే ఇవి విద్యుత్తుకు బదులు స్వచ్ఛమైన నీటిని ఉత్పత్తి చేశాయి.ఇక్కడ ఈ ప్యానెళ్లు గాలి నుంచి నీటి ఆవిరిని తీసుకుంటాయి. ఈ తేమను సాంద్రీకృత గాలి ప్రవాహంలోకి విడుదల చేసేందుకు మళ్లీ సౌరశక్తిని వినియోగిస్తుంది. ఈ ప్యానెల్ లోపల నీటి నిష్క్రియాంతక సంక్షేపణను అనుమతిస్తుంది. అంతేగాదు ప్రతి ప్యానెల్ ఒక వ్యక్తి రోజువారీ అవసరాలకు సరిపోయేలా మూడు లీటర్ల వరకు త్రాగునీటిని ఉత్పత్తి చేయగలదు. ఈ నీరు స్వచ్ఛమైనది, మినరలైజ్ చేసినది. త్రాగేందుకు సురక్షితంగా ఉండేలా ఓజోనేటెడ్ చేయబడుతుంది కూడా.నిజానికి దీన్ని జీరోమాస్ వాటర్ పేరుతో అమెరికా సోర్స్ కంపెనీ 2014లోనే ప్రారంభించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 56 దేశాల్లో హైడ్రోప్యానెల్స్ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్లను గ్రౌండ్ శ్రేణులుగా లేదా ఇంటి పైకప్పులపై తాగునీటితో అనుసంధానించవచ్చు. ప్రతి హైడ్రోప్యానెల్ ధర సుమారు రూ. 2 లక్షల్లో అందుబాటులో ఉండేలా చేసి, నీటి కొరత సమస్యను నివారించాలని భావిస్తున్నారు పరిశోధకులు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ పద్ధతిలో నీటిని తయారు చేసే ప్రక్రియను ప్రారంభించేశారు కూడా. ఇక్కడ రోజుకు దాదాపు మూడు వేల లీటర్‌ని ఉత్పత్తి చేస్తున్నారు కూడా. అంతేగాదు సెప్టెంబర్ 2024 కల్లా యూఎస్ అంతటా స్కైవాటర్ బ్రాండ్‌తో పునర్వినియోగించే అల్యూమినియం క్యాన్‌ల్లో ఈ నీటిని విక్రయించాలని చూస్తున్నారు. అంతేగాదు అమెరికా కంపెనీ సోర్స్ స్కై వాటర్‌ని ప్రజలకు పరిచయం చేసేలా మార్కెటింగ్ చేయాలనుకోవడమే గాక హైడ్రోపనెల్ టెక్నాలజీ గురించి అవగాహన పెంచి స్థిరమైన నీటి వనరులను ప్రోత్సహించడమే లక్ష్యం అని చెబుతోంది. ప్రస్తుతం సోర్స్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఈ హైడ్రోప్యానెల్స్ అధిక ధర కాస్త అవరోధంగా ఉంది. భవిష్యత్తులో వీటి ధరలు గణనీయంగా తగ్గితే సదరు కంపెనీకి మంచి లాభదాయకమే గాక అన్ని దేశాలు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు చక్కని పరిష్కారం దొరుకుతుందని చెప్పొచ్చు. (చదవండి: ఆ రెస్టారెంట్లో దోస, ఇడ్లీ రేట్లు తెలిస్తే కంగుతింటారు: హర్ష గోయెంకా ట్వీట్) -
గాలిని బంధించి.. అమ్మేస్తున్నారు!
చైనాలో వాతావరణ కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది. ఆ పరిస్థితిని సొమ్ము చేసుకోడానికి కెనడాలో ఓ స్టార్టప్ కంపెనీ వినూత్నమైన ఆలోచన చేసింది. తమ దేశంలో పర్వతప్రాంత నగరమైన బాన్ఫ్ నుంచి తాజా గాలిని సేకరించి, దాన్ని క్యాన్లలో బంధించి చైనాకు ఎగుమతి చేస్తోంది. ఈ కంపెనీ పేరు వైటాలిటీ ఎయిర్. ఎందుకైనా మంచిదని తొలి బ్యాచ్‌లో కేవలం 500 క్యాన్లు మాత్రమే పంపగా, అవన్నీ రెండు వారాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి! అంతేకాదు.. తమకు ఈ గాలి క్యాన్లు పంపాలంటూ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయని కంపెనీ డైరెక్టర్ హారిసన్ వాంగ్ తెలిపారు. ఇంతకీ ఈ గాలి క్యాన్ల ధర ఎంతో తెలుసా.. సైజును బట్టి 935 నుంచి 1337 రూపాయల వరకు ఉంది!! ఉత్తర చైనాలో కలుషితమైన పొగమంచు చాలా ఎక్కువ. దీనివల్ల ఒక్కోసారి గాలి కూడా ఆడదు. ప్రధానంగా చలికాలంలో పవర్ ప్లాంట్లలోను, ఇళ్లలోను వెచ్చదనం కోసం బొగ్గు మండిస్తారు. దీనివల్ల వచ్చే పొగ, బయట ఉండే మంచు కలిసి కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతుంది. ఈ పొగమంచు కారణంగా గతవారం బీజింగ్ తొలిసారి రెడ్ ఎలర్ట్ ప్రకటించి, స్కూళ్లకు సెలవులు ఇచ్చేసింది. గత సంవత్సరం తాను ఈబేలో జిప్‌లాక్ చేసిన బ్యాగులో గాలిని అమ్మడం చూశానని, వాళ్లు దాని ధరను 99 సెంట్లుగా పెట్టారని.. అప్పుడే తనకు కూడా గాలిని ఎందుకు ఎగుమతి చేయకూడదన్న ఆలోచన వచ్చిందని వైటాలిటీ ఎయిర్ సహ వ్యవస్థాపకుడు మోజెస్ లామ్ చెప్పారు. తాము అమ్మేదే తాజా గాలి అయినప్పుడు.. దాన్ని ప్యాకింగ్ చేయడానికి మిషన్లు వాడితే ఆయిల్, గ్రీజు అంటుకుంటాయి కాబట్టి చేతులతోనే ప్యాక్ చేస్తున్నామని ఆయన అన్నారు. అందుకే దీనికి ఎక్కువ సమయం పడుతోందట. ముందుగా గాలి సేకరించి, అందులోంచి ప్రమాదకరమైన కణాలను తీసేయాల్సి ఉంటుంది.