Capital Gain Taxes
-
రాబడులపై పన్ను తగ్గింపు..?
ఈక్విటీ మార్కెట్లు ఇటీవల కాలంలో భారీగా పడిపోతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక లాభాలపై వచ్చే రాబడులపై పన్నుల ప్రభావాన్ని తగ్గించాలనే డిమాండ్ పెరుగుతోంది. భారత ప్రభుత్వం దీర్ఘకాలిక మూలధన లాభాల (LTCG) నిర్మాణాన్ని సమీక్షించాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి. రెవెన్యూ ఆందోళనల కారణంగా పూర్తి పన్నును ఉపసంహరించుకోవడం సాధ్యం కానప్పటికీ, దాని నిర్మాణాన్ని సవరించాలని తెలియజేస్తున్నాయి. దానివల్ల భారత మార్కెట్లను మరింత ఆకర్షణీయంగా మార్చాలని ఆశావహం వ్యక్తం చేస్తున్నాయి.స్టాక్ మార్కెట్ పెట్టుబడుల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల లాభాలపై పన్ను విధించే అతికొద్ది మార్కెట్లలో భారత్ ఒకటి. భారీ నష్టాలు, తక్కువ రాబడులు, పన్ను భారాలు భారతీయ ఈక్విటీ మార్కెట్లపై ఆకర్షణను తగ్గిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాంతో ఇన్వెస్టర్లలో అసంతృప్తి పెరుగుతోందని చెబుతున్నారు. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రైమ్ రీసెర్చ్ హెడ్ దేవర్ష్ వకీల్ మాట్లాడుతూ..విదేశీ, భారతీయ పెట్టుబడిదారులకు ఎల్టీసీజీ పన్నులను పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నారు. అయితే, ప్రభుత్వ ఆదాయ అవసరాలను గుర్తించి పన్ను మినహాయింపుల హోల్డింగ్ వ్యవధిని ఏడాది నుంచి రెండు లేదా మూడేళ్లకు పొడిగించాలని ఆయన ప్రతిపాదించారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ)పై ఎల్టీసీజీ పన్నులకు సంబంధించి హీలియోస్ క్యాపిటల్‌కు చెందిన సమీర్ అరోరా స్పందించారు. విదేశీ మార్కెట్లు మరింత అనుకూలమైన పన్ను విధానాలను అనుసరిస్తున్న నేపథ్యంలో భారత్ ఎల్టీసీజీ వంటి పన్ను పద్ధతులను అనుసరించడం విదేశీ పెట్టుబడులను నిరోధించగలవని చెప్పారు.ఇదీ చదవండి: భగ్గుమంటున్న బంగారం ధర! తులం ఎంతంటే..ప్రస్తుత పన్ను విధానం ఇలా..2024 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూలధన లాభాల పన్ను రేట్లలో మార్పులు తీసుకొచ్చారు. లిస్టెడ్ ఈక్విటీ షేర్లపై ఎల్టీసీజీ పన్నును 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ సర్దుబాట్లు పన్ను నిర్మాణాన్ని సరళతరం చేయడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ అవి పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతున్నట్లు కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్టీసీజీ నిర్మాణాన్ని హేతుబద్ధీకరించడం వల్ల ఆదాయ పెరుగుదల, మార్కెట్ పోటీతత్వం మధ్య సమతుల్యత సాధించవచ్చని భావిస్తున్నారు. -
ఫండ్స్ లాభాలపై పన్ను ఉంటుందా.. ఐటీఆర్‌లో కచ్చితంగా చూపాలా?
ఫండ్స్‌లో దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష లోపు ఉంటే పన్ను చెల్లించక్కర్లేదు. అయినా ఈ లాభాన్ని ఆదాయపన్ను రిటర్నుల్లో చూపించాలా? – వివేక్ మీరు పన్ను రిటర్నులను నిబంధనల ప్రకారం దాఖలు చేయాల్సి ఉంటే, అందులో లాభ, నష్టాలను వెల్లడించాలి. స్టాక్స్, లేదా ఈక్విటీ మ్యూచుల్ ఫండ్స్‌లో పెట్టుబడులను ఏడాదికి మించి కొనసాగించినప్పుడు వచ్చేవి దీర్ఘకాల లాభాలు. దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు ఉంటే పన్ను లేదు. అంతకుమించిన లాభంపైనే 10 శాతం పన్ను చెల్లించాలి. వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో మూలధన లాభాల పన్ను వివరాలు ఉంటే, అవి పన్ను రిటర్నుల్లో ముందుగానే నింపి ఉంటాయి. ఒకవేళ మీ ఆదాయం బేసిక్ ఆదాయపన్ను మినహాయింపు పరిధిలోనే ఉంటే, అప్పుడు మీరు రిటర్నులు దాఖలు చేయక్కర్లేదు. పాత పన్ను విధానంలో రూ.2.5 లక్షల వరకు పన్ను లేదు. 60 ఏళ్లు నిండిన వారికి ఇది రూ.3 లక్షలు, 80 ఏళ్లు నిండిన వారికి రూ.5 లక్షలుగా ఉంది. మరింత వివరంగా అర్థం చేసుకునేందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. వార్షిక ఆదాయం రూ.5లక్షల్లోపు ఉంటే సెక్షన్ 87ఏ కింద పన్ను రాయితీ పొందొచ్చు. అప్పుడు పన్ను చెల్లించక్కర్లేదు. ఒకవేళ వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటిందని అనుకుంటే, అప్పుడు రిబేట్ వర్తించదు. అప్పుడు సాధారణ శ్లాబు రేటు ప్రకారం పన్ను వర్తిస్తుంది. అలాగే, పన్ను వర్తించే ఆదాయం ఉంది కనుక రూ.లక్షకు మించిన దీర్ఘకాల మూలధన లాభంపై 10 శాతం చొప్పున పన్ను చెల్లించాలి. ఒకవేళ మీ వార్షిక ఆదాయం బేసిక్ పరిమితి లోపే, రూ.2 లక్షలుగానే ఉందని అనుకుందాం. అప్పుడు దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష మించినప్పుడు.. రూ.50వేల మొత్తాన్ని బేసిక్ పరిమితి కింద మిగిలి ఉంది కనుక చూపించుకోవచ్చు. అన్ని కేసుల్లోనూ దీర్ఘకాల మూలధన లాభాల వివరాలను రిటర్నుల్లో చూపించాల్సిందే. ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్స్‌కు ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణం) ప్రయోజనాన్ని తొలగించారని తెలిసింది. నూతన చట్టం అమలుపై స్పష్టత ఇవ్వగలరా? – గణేశన్ ఈ ఏడాది మార్చి 31 వరకు చేసే పెట్టుబడులకు లాభాల్లో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించే ఇండెక్సేషన్ ప్రయోజనం ఉంటుంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నాన్ ఈక్విటీ ఫండ్స్ పన్ను నిబంధనల్లో మార్పులు చేసింది. ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తొలగించింది. దీంతో ఎంత కాలం పాటు పెట్టుబడులు కొనసాగించారనే దానితో సంబంధం లేకుండా.. డెట్ ఫండ్స్‌లో వచ్చే లాభం ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. వారికి వర్తించే శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ నూతన నిబంధన 2023 ఏప్రిల్ 1 నుంచి చేసే పెట్టుబడులకే అమలవుతుంది. దీనికంటే ముందు చేసే పెట్టుబడులకు ఇండెక్సేషన్ ప్రయోజనం వర్తిస్తుంది. ఇదీ చదవండి: ICICI Pru Gold: అదనపు రాబడికి బంగారం లాంటి పథకం.. -
కెయిర్న్‌కు రూ.30 వేల కోట్ల పెనాల్టీ
క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌పై ఐటీ నోటీసులు న్యూఢిల్లీ: సుమారు రూ. 10,247 కోట్ల క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌ను గడువులోగా చెల్లించనందుకు గాను.. రూ. 30,700 కోట్లు పెనాల్టీగా కట్టాలంటూ బ్రిటీష్ దిగ్గజం కెయిర్న్ ఎనర్జీకి ఆదాయ పన్ను విభాగం తాజాగా నోటీసులు ఇచ్చింది. గత లావాదేవీలకు కూడా వర్తించేలా పన్ను విధించడాన్ని సమర్ధిస్తూ ట్యాక్స్ ట్రిబ్యునల్ ఐటీఏటీ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత.. ఐటీ విభాగం ముందుగా రూ. 10,247 కోట్ల మేర డిమాండ్ నోట్ పంపింది. గడువులోగా పన్ను చెల్లించనందుకు గాను, రిటర్న్స్ ఫైల్ చేయనందుకు గాను జరిమానా ఎందుకు విధించరాదో వివరించాలంటూ మరో షోకాజ్ నోటీసు కూడా పంపింది. జరిమానా విధింపు షోకాజ్ నోటీసుపై వివరణ ఇచ్చేందుకు కెయిర్న్ ఎనర్జీ మరో పది రోజులు గడువు కోరినట్లు ఐటీ విభాగం సీనియర్ అధికారులు తెలిపారు.