carams
-
ముగిసిన జిల్లా స్థాయి క్యారమ్స్ పోటీలు
దేవరకొండ దేవరకొండలో ఈ నెల 27న ప్రారంభమైన జిల్లా స్థాయి క్యారమ్స్ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మొదటి బహుమతి యూసూఫ్, షరీఫ్, శ్యామ్సన్లు గెలుపొందగా, రెండవ బహుమతి ఇలియాస్, ముజీబ్‌లు కైవసం చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ షటిల్ ఇండోర్ స్టేడియానికి స్థలాన్ని కేటాయించేందుకు కషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్వీటీ, తాళ్ల శ్రీధర్‌గౌడ్, కష్ణకిషోర్, తాళ్ళ సురేష్, చంద్రయ్య, భాస్కర్, బాబా, కష్ణమూర్తి, నర్సింహ్మ, ఐజాక్, రమేష్, వరికుప్పల సురేష్, శేఖర్, గిరి ఉన్నారు. -
స్టేట్ క్యారమ్స్ టోర్నీలో హరిప్రియ ప్రతిభ
కవిటి: గుంటూరు జిల్లా చిలకలూరిపేట సీఆర్క్లబ్ హాల్లో గత నెల 28 నుంచి 29 వరకు నిర్వహించిన స్టేట్ సీనియర్ క్యారమ్స్ ర్యాంకింగ్ టోర్నీలో జగతి గ్రామానికి చెందిన లమ్మత హరిప్రియ ఫస్ట్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన క్రీడాకారిణులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఫస్ట్ ర్యాంక్‌ను సాధించినట్టు రాష్ట్ర క్యారమ్స్ సంఘం ఉపాధ్యక్షుడు పూడి నేతాజీ చెప్పారు. అనంతరం జూలై 30, 31వ తేదీల్లో అదే సీఆర్ క్లబ్లో జరిగిన సౌత్‌జోన్ పోటీల్లో రెండో ర్యాంక్ సాధించినట్టు తెలిపారు. ఆమెకు రాష్ట్ర క్యారమ్స్ సంఘం గౌరవాధ్యక్షుడు శంకరరావు బహుమతిని అందించారు. హరిప్రియ సాధించిన విజయం పట్ల ఒలింపిక్ సంఘం రాష్ట్రఉపాధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర క్యారమ్స్ సంఘం ఉపాధ్యక్షుడు పూడి నేతాజీ అభినందనలు తెలిపారు. -
28నుంచి రాష్ట్ర క్యారమ్ టోర్నీ
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంకింగ్ క్యారమ్‌టోర్నమెంట్ ఈనెల 28,29వ తేదీల్లో జరగనుండగా విశాఖ జిల్లా నుంచి ర్యాకింగ్ ఆటగాళ్ళు పాల్గొనున్నారు. గుంటూర్ జిల్లా చిలకలూరిపేటలో పురుషుల,మహిళా విభాగాల్లో జరిగే ఈ టోర్నిలో రాష్ట్ర క్యారమ్ జట్టును ఎంపిక చేయనున్నామని ఆంధ్ర స్టేట్ క్యారమ్ సంఘం కార్యదర్శి నీరజ్‌కుమార్ తెలిపారు. రాష్ట్ర జట్టుగా ఆరుగురేసి క్రీడాకారుల్ని మెన్,వుమెన్ కాటగిరిల్లో ఎంపిక చేయనుండగా వారంతా ఈనెల 30,31వ తేదీల్లో జరిగే సౌత్‌జోన్ అహ్వాన ప్రై జ్‌మనీ టోర్నిలో పాల్గొనున్నారన్నారు. స్టేట్ టోర్నిలో విజేతలు పదిహేనువేలు, సౌత్‌జోన్ టోర్నిలో విజేతలకు 30వేల నగదు ప్రోత్సాహాకాల్ని అందుకోనున్నారు.