carden serach
-
కార్డెన్ సర్చ్... 20 వాహనాలు స్వాధీనం
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో అదనపు డీసీపీ సంజీవకుమార్, రూరల్ ఏసీపీ ఉషారాణి ఆధ్వర్యంలో సోమవారం వేకువజామున కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, ఒక టవేరా వాహనం, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. రూ.లక్ష రూపాయల విలువచేసే గుట్కా ప్యాకెట్లను, మిఠాయి దుకాణంలో కల్తీ ఆయిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. -
జమ్మికుంటలో కార్డన్ సెర్చ్
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీస్ కమీషనర్ కమల్‌హాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అనుమానం ఉన్న ప్రతి ఇంటినీ జల్లెడ పట్టారు. సరైన పత్రాలు లేని 8 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.