Carnage
-
Israel-Hamas war: గాజాపై దాడులు... 42 మంది దుర్మరణం
ఖాన్ యూనిస్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. షతీ శరణార్థుల శిబిరం, పొరుగునున్న తుఫాపై శుక్ర, శనివారాల్లో జరిగిన దాడుల్లో కనీసం 42 మంది దుర్మరణం పాలైనట్టు పాలస్తీనా మీడియా విభాగం పేర్కొంది. ‘‘యుద్ధం మొదలైన నాటినుంచి గాజాలో మృతుల సంఖ్య 37,500 దాటింది. దాదాపు లక్ష మంది దాకా గాయపడ్డారు’’ అని వివరించింది. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు పశ్చిమ రఫాలోకి మరింతగా చొచ్చుకొస్తున్నాయి. పైనుంచి యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు, గత అక్టోబర్ నుంచి నిరంతరాయంగా జరుగుతున్న దాడుల దెబ్బకు గాజాలో ఆరోగ్య వ్యవస్థ నేలమట్టమైపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్త ప్రకటించింది. ‘‘ఇప్పటిదాకా కనీసం 9,300 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ బందీలుగా పట్టుకుంది. వారితో అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తోంది’’ అని పాలస్తీనా శనివారం ఆరోపించింది. -
ఆయుధాలను నిషేధించాలన్న బైడెన్... కుదరదు అని చెప్పేసిన రిపబ్లికన్లు
Biden asked How Much More Carnage: టెక్సాస్ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో జరిగిన మారణహోమం మరువుక మునుపే సెయింట్ ఫ్రాన్సిస్ ఆసుపత్రిలో ఒక దుండగుడు కాల్పులు జరిపి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంకా ఇలాంటి ఎన్ని మారణహోమాలను చూడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన అమెరికాలో తుపాకీలను నిషేధించాలంటూ పిలుపు నివ్వడమే కాకుండా ఈ తుపాకీ హింస పై తగిన చర్యలు తీసుకోవాలని అమెరికా చట్ట సభ సభ్యులను కోరారు. అంతేకాదు కఠినతరమైన తుపాకీ చట్టాలను తీసుకువచ్చే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు కూడా. ఐతే అందుకు రిపబ్లికన్ సెనెటర్లలోని మెజారిటీ సభ్యలు నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో బైడైన్ యూఎస్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక కాల్పులను చూస్తున్నప్పటికీ ఈ చట్టాలకు మద్దతు ఇవ్వడానికి ముందకు రాలేకపోతున్నారంటే మీకు మనస్సాక్షి అనేదే లేదంటూ ఆక్రోశించారు. కనీసం పాఠశాలల్లో, ఆసుపత్రులలో హింసాత్మక చర్యలు జరగకుండా ఉండేలా ఆయుధాలను కొనుగోలు చేసే వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని చట్టసభ సభ్యులను కోరారు. గత రెండు దశాబ్దాలుగా విధులు నిర్వర్తిస్తూ చనిపోతున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది కంటే చిన్నారులే ఈ తుపాకీలకు బలవుతున్నారని ఆవేదనగా చెప్పారు. ఆయుధాలను సురక్షింతంగా ఉంచడం తప్పనిసరి చేస్తూ...హింసాత్మక నేరాలు జరుగతున్నప్పుడు ఆ తుపాకీలను రూపొందించిన తయారీదారులను సైతం ఈ నేరాలకు బాద్యులుగా చేసి చర్యలు తీసుకోవాలని చట్టసభ సభ్యులను కోరారు. అంతేకాదు ప్రొటెక్టింగ్ అవర్ కిడ్స్ యాక్ట్"ను ఆమోదించాలని, తుపాకీలను కొనుగోలు చేసే వయసు కూడా పెంచాలని నొక్కిచెప్పారు. ఐతే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆత్మరక్షణ కోసం తుపాకీలు వాడకాన్ని అనుమతించాలని, స్కూళ్లలల్లో ఇలాంటి హింసాత్మక కాల్పుల జరగకుండా గట్టి భద్రత కోసం కృషి చేయాలని చెబుతుండటం గమనార్హం. (చదవండి: అఫ్గన్ గడ్డపై భారత బృందం.. తాలిబన్ల విన్నపాలు) -
Russia-Ukraine war: మారియుపోల్‌లో మారణహోమం?
కీవ్: మారియుపోల్‌లో కొత్తగా అనేక మట్టిగుట్టలు ఉపగ్రహ చిత్రాల్లో కనిపించాయి. ఇవి రష్యన్ల దమనకాండకు నిదర్శనాలని, వారు జరిపిన నరమేధానికి ఆనవాళ్లని ఉక్రెయిన్ ఆరోపించింది. మరోవైపు డోన్బాస్ ప్రాంత నగరాలపై రష్యా దాడులు ముమ్మరం చేసింది. దీంతో అక్కడ నుంచి పౌరులను తరలించే యత్నాలు సఫలం కాలేదని అధికారులు చెప్పారు. గురువారం మారియుపోల్ తమ స్వాధీనమైందని, స్టీల్‌ప్లాంట్ ప్రాంతాన్ని దిగ్భంధనం చేయాలని తన సేనలు ఆదేశించానని పుతిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే! తదనంతరం ఆ నగరం శాటిలైట్ ఫొటోలను మాక్సర్ టెక్ సంస్థ విడుదల చేసింది. ఈ ఫొటోల్లో నగరం సమీపంలో 200పైగా సమాధులు కనిపించాయి. ఇక్కడ దాదాపు 9వేలమంది పౌరులను రష్యన్లు సమాధి చేశారని ఉక్రెయిన్ స్థానిక అధికారులు ఆరోపించారు. ఈ చిత్రాలపై రష్యా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. యుద్ధం రెండో దశకు చేరిందని మాత్రం శుక్రవారం ప్రకటించింది. గతంలో బుచాలో రష్యా మారణకాండ జరిపిందనేందుకు ఆధారాలు లభించిన నేపథ్యంలో మారియుపోల్‌లో కూడా అదే జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు వైపు ఫోకస్ పూర్తి స్థాయి యుద్ధానికి బదులు రష్యా ఈ దఫా తూర్పు వైపు నగరాలను ఎంచుకొని దాడులు చేస్తోంది. తమపై రాత్రంతా బాంబింగ్ జరిగిందని స్లోవ్యాన్స్క్ మేయర్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన బస్సుల్లో పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని కోరారు. రుబిజనె నగరంలో తరలింపునకు రష్యా దాడులు అడ్డంకిగా మారాయని లుహాన్స్క్ గవర్నర్ తెలిపారు. ఖార్కివ్ నగరంపై కూడా రాత్రంతా బాంబింగ్ జరిగింది. డోన్బాస్ ప్రాంతంపై పట్టు సాధించాలన్న రష్యా యత్నాలను ఉక్రెయిన్ సైన్యం ప్రతిఘటిస్తోందని యూఎస్ తెలిపింది. కానీ తాము చాలావరకు తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌పై పట్టు సాధించామని రష్యా మిలటరీ తెలిపింది. మారియుపోల్ స్టీల్‌ప్లాంట్‌లో మిగిలిన ఉక్రెయిన్ సైనికులు లొంగిపోతే ప్రాణభిక్ష పెడతామని పుతిన్ మరోమారు ప్రకటించారు. అయితే నగరంలో రష్యా సేనలకు బాగా నష్టం వాటిల్లిందని, అందువల్ల తూర్పు వైపు మోహరింపులు అనుకున్నట్లు జరగలేదని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. భయానక చిత్రం పౌరులపై రష్యా అకృత్యాలు హారర్ కథను తలపిస్తున్నాయని ఐరాస మానవహక్కుల కమిషనర్ మికేల్ బాలెట్ విమర్శించారు. యుద్ధంలో 5,264మంది పౌరులకు గాయాలయ్యాయని, వారిలో 2,345 మంది చనిపోయారని అన్నారు. అంతర్జాతీయ మానవీయ చట్టాలను రష్యా ఉల్లంఘించడమే గాక తుంగలో తొక్కిందని ఆరోపించారు. ఆస్పత్రులు, పాఠశాలలు, నివాస సముదాయాలపై రష్యా బాంబింగ్, ఫైరింగ్ చేసి పలువురిని పొట్టనబెట్టుకుంటోందన్నారు. ఇందుకు సంబంధించి తమ కార్యాలయం ఆధారాలు కూడా సమీకరించిందన్నారు. సరైన వైద్య సాయం అందక మరో 3వేల మంది మరణించారని చెప్పారు. రష్యా సైనికుల లైంగిక నేరాలపై 75కు పైగా ఆరోపణలు వచ్చాయని ఆమె తెలిపారు. మరికొన్ని వివరాలు ► కొత్తగా 80 కోట్ల డాలర్ల మిలటరీ సాయాన్ని ప్రకటించినందుకు అమెరికాకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యాపై పోరు కోసం పాశ్చాత్య దేశాలు ఆయుధ సాయాన్ని వేగవంతం చేయాలని కోరారు. ► యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్, మెటా సీఈఓ జుకర్‌బర్గ్ సహా 27 మంది ప్రముఖ అమెరికన్లు తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యాపై ఆంక్షలకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ► శాంతి చర్చలు ఆగేందుకు ఉక్రెయినే కారణమని రష్యా విమర్శించింది. తమ ప్రతిపాదనలకు బదులివ్వలేదని రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ చెప్పారు. ‘‘చర్చలు అవసరం లేనట్లుంది. వారి కర్మకు వారే బాధ్యులు’’ అన్నారు. ఉక్రెయిన్ బృందం చీఫ్‌తో పలుమార్లు చర్చించానని రష్యా ప్రతినిధి మెడిన్‌స్కై శుక్రవారం తెలిపారు. -
ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం
కీవ్: ఉక్రెయిన్‌పై దాడులను బుధవారం రష్యా మరింత ఉధృతం చేసింది. దేశంలోని రెండో పెద్ద నగరం ఖర్కీవ్‌పై బాంబులు, క్షిపణులతో మరింతగా విరుచుకుపడింది. పలు జనసమ్మర్ధ ప్రాంతాలపై విచక్షణారహితంగా దాడులకు దిగింది. ఉత్తర ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్‌లోనూ దాడులు మారణహోమం సృష్టిస్తున్నాయి. ఇక రాజధాని కీవ్ స్వాధీనమే లక్ష్యంగా మంగళవారం బయల్దేరిన 64 కిలోమీటర్ల పొడవైన భారీ రష్యా సైనిక కాన్వాయ్ నగరాన్ని అన్నివైపుల నుంచీ వ్యూహాత్మకంగా చుట్టుముడుతోంది. సైనిక స్థావరాలతో పాటు నివాసాలు, ఆవాస సముదాయాలు, మౌలిక వ్యవస్థలపై భారీగా బాంబు దాడులకు, క్షిపణి ప్రయోగాలకు దిగుతుండటంతో రోజంతా నగరం పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. దక్షిణాదిన తీర ప్రాంత నగరం మారిపోల్‌లోనూ ఇదే పరిస్థితి! పలు నగరాలు రష్యా అధీనంలోకి వెళ్లాయని వార్తలు వస్తున్నాయి. దాడుల భయంతో దేశవ్యాప్తంగా బంకర్లలో, పార్కింగ్ స్థలాల్లో, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్న వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వణికించే చలిలో కనీస రక్షణ ఏర్పాట్లు కూడా లేకపోవడంతో వారంతా గజగజ వణుకుతున్నారు. తిండీతిప్పలకూ గతి లేక అల్లాడిపోతున్నారు. ఇప్పటికే 2000 మందికి పైగా అమాయకులు యుద్ధానికి బలైనట్టు ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం ప్రకటించింది. ఉక్రెయిన్ నగరాలపై రష్యా వాయు, భూతల దాడులు భారీగా పెరిగాయని ఇంగ్లండ్ రక్షణ శాఖ పేర్కొంది. వలస బాట పట్టిన ఉక్రేనియన్ల సంఖ్య 9 లక్షలు దాటిందని ఐరాస వలసల ఏజెన్సీ పేర్కొంది. త్వరలో 10 లక్షలు దాటేస్తుందని ఆందోళన వెలిబుచ్చింది. మంటల్లో ఖర్కీవ్ రష్యా దాడుల ధాటికి ఖర్కీవ్ నిప్పుల కుంపటిలా మారుతోంది. నగరంలోని ప్రాంతీయ పోలీసు, నిఘా విభాగాల ప్రధాన కార్యాలయాలపై రష్యా దళాలు బుధవారం భారీగా బాంబుల వర్షం కురిపించాయి. ఇందులో కనీసం నలుగురు మరణించినట్టు సమాచారం. ఐదంతస్తుల పోలీసు విభాగం భవనం పై కప్పు దాడుల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. భవన శిథిలాలు పక్క వీధుల దాకా చెల్లాచెదురుగా పడ్డాయి. వీటికి సంబంధించిన వీడియో ఫుటేజీని పోలీసు విభాగం విడుదల చేసింది. వీటితో పాటు బుధవారం కూడా పలు నివాసాలు, ఆవాస సముదాయాలపై పెద్దపెట్టున బాంబులు, క్షిపణులు విరుచుకుపడ్డాయని సమాచారం. చెర్నిహివ్‌లో ఒక ఆస్పత్రిపై రెండు క్రూయిజ్ మిసైళ్లతో దాడి జరిగిందని నగర మేయర్ తెలిపారు. ప్రధాన భవనం పూర్తిగా దెబ్బ తినడంతో పాటు భారీగా ప్రాణ నష్టం జరిగిందని వెల్లడించారు. దాడుల తీవ్రత వల్ల గాయపడ్డ వారిని కనీసం తరలించే పరిస్థితి కూడా లేదని మారిపోల్ మేయర్ వాపోయారు. హోలోకాస్ట్ స్మారకం ధ్వంసం ఖర్కీవ్‌లో టీవీ టవర్‌పై మంగళవారం జరిగిన దాడిలో రెండో ప్రపంచయుద్ధం నాటి హోలోకాస్ట్ స్మారకం కూడా బాగా దెబ్బతిందని ఉక్రెయిన్ పేర్కొంది. 1941లో ఇక్కడ హిట్లర్ నాజీ సేనలు 33 వేల మందికి పైగా యూదులను రెండు రోజుల పాటు చిత్రహింసలు పెట్టి చంపాయి. దానికి గుర్తుగా నిర్మించిన స్మారకం రష్యా దాడిలో దెబ్బ తిన్నది. హసిడిక్ యూదులకు ప్రముఖ యాత్రా స్థలమైన ఉమన్ నగరంపై కూడా బాంబుల వర్షం కురిసింది. చివరికి యాత్రా స్థలాలను, చారిత్రక కట్టడాలను కూడా లక్ష్యంగా చేసుకుంటూ రష్యా నానాటికీ దిగజారి ప్రవర్తిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ దుయ్యబట్టారు. దాని తీరు మానవత్వానికే మాయని మచ్చ అని ఫేస్బుక్ పోస్టులో మండిపడ్డారు. ‘‘ఉక్రెయిన్ చరిత్రను, దాంతోపాటు మా ప్రజలందరినీ పూర్తిగా తుడిచిపెట్టేయాలని సైన్యాలకు మాస్కో నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. అందుకే ఇంతటి నైచ్యానికి ఒడిగడుతున్నారు’’ అని ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండించాలని, తమకు అన్నివిధాలా సాయం రావాలని ప్రపంచ దేశాలన్నింటికీ మరోసారి విజ్ఞప్తి చేశారు. 498 మంది మరణించారు: రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఇప్పటిదాకా 498 మంది రష్యా సైనికులు మరణించారని ఆ దేశం ప్రకటించింది. 1,597 మంది గాయపడ్డారని రక్షణ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనషెంకోవ్ వెల్లడించారు. తమకు భారీగా ప్రాణ నష్టం జరిగిందన్న వార్తలను కొట్టిపారేశారు. 2,870 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులను హతమార్చామన్నారు. 3,700 మందికి పైగా గాయపడ్డారని, 572 మంది యుద్ధ ఖైదీలుగా దొరికారని చెప్పారు. ఈ యుద్ధంలో తమ సైనికులు మరణించారని రష్యా అంగీకరించడం ఇదే తొలిసారి. మాల్డోవా మీదా దాడి? మిన్స్క్: ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన మాల్డోవాపై కూడా దాడికి రష్యా ప్రణాళిక వేస్తోందని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో అన్నారు. ఆ దేశ సెక్యూరిటీ కౌన్సిల్ భేటీలో ఆయన ఈ మేరకు చెప్పారు. సంబంధిత వీడియోను బెలారస్ ప్రభుత్వమే ఆన్లైన్లో పెట్టింది. దక్షిణ ఉక్రెయిన్‌లోని రేపు పట్టణమైన ఒడెసా గుండా మాల్డోవాపైకి రష్యా దండెత్తుతుందని లుకషెంకో చెప్పుకొచ్చారు. దీనిపై యూరప్ దేశాలు మరింత మండిపడుతున్నాయి. -
రెచ్చగొడితేనే ‘మారణ హోమాలు’
సాక్షి, న్యూఢిల్లీ : ‘బంగ్లాదేశ్ వలసదారులు చెద పురుగులు. వందకోట్ల మంది చొరబాటుదారులు దేశంలోకి ప్రవేశించారు. వారంతా చెదపురుగుల్లా దేశాన్ని తింటున్నారు. ఢిల్లీలో అక్రమ వలసదారుల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా, లేదా? వారిని బయటకు విసిరి పడేయాలా, వద్దా?’ అంటూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల ఢిల్లీ, రాజస్థాన్‌లో జరిగిన పలు పార్టీ ర్యాలీల్లో ఆవేశంగా మాట్లాడారు. భారత దేశంలో నేటి జనాభా దాదాపు 127 కోట్లు. వారిలో వంద కోట్ల మంది వలసదారులే అయితే మిగతా 27 కోట్ల మంది మాత్రమే అసలైన భారతీయులా? రోహింగ్యాల సమస్యకు అదే కారణం... ఆ విషయాన్ని పక్కన పెడితే ఓ జాతిని ఇతర జాతీయులపైకి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. అలా రెచ్చగొట్టిన పర్యవసానంగానే నేడు రోహింగ్యా ముస్లింల సంక్షోభ సమస్య అటు మయన్మార్‌ను, ఇటు భారత్, బంగ్లాదేశ్‌లను వేధిస్తోంది. బౌద్ధ జాతీయవాద ఉద్యమానికి చెందిన బౌద్ధ మత గురువు ఆషిన్ విరత్తు, రోహింగ్య ముస్లింలను చీడ పురుగులు, పిచ్చి కుక్కలని పదే పదే పిలవడం వల్ల, మనం బలహీనులమైతే రేపు మనదేశమంతా ముస్లింలే ఉంటారంటూ మయన్మార్ హిందువులను రెచ్చ గొట్టిన ఫలితంగా ఆ దేశంలో హింసాకాండ ప్రజ్వరిల్లింది. ఇరువర్గాలకు చెందిన వారు వేల సంఖ్యలో మరణించారు. చివరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని లక్షలాది మంది రోహింగ్య ముస్లింలు బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి, దాదాపు లక్ష మంది భారత్ సరిహద్దుల్లోకి ప్రవేశించారు. ఇటీవల కొంత మంది దేశాధినేతలు ఇలాంటి అమానుష, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లనే గ్రీస్, ఇజ్రాయెల్, అమెరికా, హంగరి, ఉక్రెయిన్, నైజీరియా దేశాల్లో అల్లర్లు చెలరేగి వేలాది మంది మరణించారు. ఓ జాతి మరో జాతి పట్ల మానవతా దృక్పథాన్ని ప్రదర్శించకుండా అమానవీయంగా వ్యవహరించడంతో దార్వన్, కాంబోడియాల్లో జాతుల సంఘర్షణలు భగ్గుమన్నాయి. బాల్కన్ యుద్ధాలు అందుకే జరిగాయి. అలాగే రువాండలోని తుత్సీలను దూహించడం వల్ల వాళ్లకు, హుతూస్కు మధ్య జాతి సంఘర్షణలు చెలరేగుతున్నాయి. 1994లో తుత్సీలను బొద్దింకలంటూ రువాండ రేడియో విమర్శించడం జాతి వైషమ్యాలకు బీజం వేసిందని ‘డేంజరస్ స్పీచ్ ప్రాజెక్ట్’ను ఏర్పాటు చేసిన సుసాన్ బెనేష్ తెలిపారు. 15 లక్షల మంది మృతి.. ఆర్మేనియా మారణకాండ అందుకే జరిగింది. ‘అర్మేనియన్లు టర్కీలోని ముస్లిం సొసైటీకి సోకిన ఇన్ఫెక్షన్. ఆశ్రయమిచ్చిన దేశ ప్రజల ఎముకల మూలుగులను తొలుచుకుతింటున్న పరాన్నభుక్కులు’ అని ఓ వర్గం వారు రెచ్చగొట్టడంతో ఇరువర్గాల మధ్య ఈ మారణ హోమం చెలరేగింది. 2015, ఏప్రిల్ నెలలో ప్రారంభమై రెండేళ్లపాటు కొనసాగిన ఈ మారణ హోమంలో 15 లక్షల మంది ప్రజలు మరణించారు. మారణ హోమం సందర్భంగా దొంగతనాలు, దోపిడీలే కాకుండా విచ్ఛల విడిగా మహిళలపై అత్యాచారాలు కొనసాగాయి. ఎన్నికలు ముగిసే వరకు అమిత్‌షా తీరు అదేనా..? ఇలాంటి మారణహోమాలు ఒక్కసారి చేసే ప్రసంగాల వల్ల తలెత్తుతాయన్నద కాదు. పదే పదే రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్ల జరుగుతాయి. అమిత్ షా తీరు చూస్తుంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలు ముగిసే వరకు ఇలాగే మాట్లాడేటట్లు కనిపిస్తున్నారు. బాబ్రీ మసీదు విధ్వంసానికి ఒక్క రోజు ముందు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మాట్లాడుతూ ‘లెవలింగ్ ది గ్రౌండ్’ అంటూ ఆవేశంగా ఇచ్చిన ప్రసంగం ఒక వర్గాన్ని ఎంతో రెచ్చగొట్టింది. -
సాఫ్ట్వేర్ కా పరేషాన్ !
-
భారత ఐటీలో బ్లడ్‌బాత్? కంపెనీల పరిస్థితి
న్యూఢిల్లీ: అమెరికా టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ , దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో ఇటీవల భారీగాఉద్యోగులపై ఉద్వాసన పలుకుతున్నాయనే వార్తలు ఉద్యోగలను కలవరపరిచింది. ముఖ్యంగా అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులకు తోడు, దేశీయంగా ఐటీ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)రంగంఎదుర్కొంటున్నసవాళ్లు వేలమంది ఉద్యోగుల భవిష్యత్‌పై పలు ప్రశ్నల్ని లేవనెత్తింది. ఐటీ దిగ్గజ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కేప్జెమినిల్లో ఉద్యోగమంటే యువతకు యమ క్రేజ్. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 9.3 శాతం వాటాతో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉన్నమనదేశంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న రంగం ఐటీ . దేశంలో 40 లక్షలమందికి ప్రత్యక్షజీవనోపాధిగానూ, మరో 20 లక్షల మంది పరోక్షంగానో ఈ రంగం ఉపాధిని కల్పిస్తుంది. ప్రపంచ ఐటీ రంగానికి 57 శాతం ఔట్సోర్సింగ్ భారత్ ఐటీ రంగం నుంచే జరుగుతుంది. ఒక్క 2016 సంవత్సరంలో ఐటీకంపెనీల రెవెన్యూ 14,300 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. కాగ్నిజెంట్ మొదలు... విప్రో వరకూ..! గత మార్చి 20న కాగ్నిజెంట్ కాగ్నిజెంట్ తన ఉద్యోగుల్లో 6వేల మందిపై వేటు వేయనున్నట్లు ప్రకటించింది. అటు దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్, ఫ్రెంచ ఐటీ మేజర్ కాప్ జెమిని ఉద్యోగాల్లో కోత విధించకుండా రక్షణాత్మక ధోరణి అవలంబించాయి. ఈ ఏడాది తొలి 9నెలల్లో కేవలం 5వేల మందిని మాత్రమే కొత్త ఉద్యోగులను నియమించుకుంది. ఇన్ఫోసిస్ ప్రక్రియతో ఐటీరంగంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపకపోయినా, పరోక్షంగా ఆందోళన కలిగించే విషయని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. మరో సాఫ్ట్వేర్ దిగ్గజం విప్రో కూడా ఉద్యోగాల ఉద్వాసన విషయంలో కాగ్నిజెంట్‌నే అనుసరించనుంది. వార్షిక పనితీరు ప్రక్రియం అనంతరం సుమారు 600 నుంచి 2,000 మందిని ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. క్యాప్ జెమినీ శిక్షణ డిజిటల్ , క్లౌడ్ లో కొత్త నైపుణ్యాలలో సుమారు లక్షమంది ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు, ఫ్యూచర్‌కు తమ ఉద్యోగులను రడీ చేయడమే లక్ష్యమని ఫ్రాన్స్‌కుచెందిన ఐటి సేవల సంస్థ క్యాప్ జెమిని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్విన్ యార్డీ ఒక వార్తా సంస్థతో చెప్పారు. దాదాపు 60 వేలమందికి శిక్షణ పూర్తి అయిందని, డిజిటల్ టెక్నాలజీల వాడకంలో నైపుణ్యంలో లేని మధ్య మరియు సీనియర్ స్థాయిలలో అత్యధిక ఉద్యోగాలు నష్టపోయే ప్రమాదముందని క్యాప్ జెమినీ ఇండియా అధిపతి శ్రీనివాస్ కందుల ఇటీవల హెచ్చరించడం గమనార్హం. ఆటోమేషన్నే అసలు కారణమా..? వ్యయాలను తగ్గించుకోవడానికి కంపెనీలు ఆటోమేషన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఈ ఐటీరంగంలో పని చేసే లక్షలాది మంది భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. దిగ్గజ ఐటీ కంపెనీలు డిజిటైజేషన్, ఆటోమేషన్‌పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఖర్చును తగ్గించుకోవడానికి ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నాయి. ఆటోమేషన్ వల్ల ఈ ఏడాదిలో ఐటీ ఉద్యోగాల నియామకాలు 40 శాతం తగ్గవచ్చని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమం వల్లే: నాస్కాం ప్రెసిడెంట్: ఆర్.చంద్రశేఖర్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమం మెదలైంది. స్థానికులకు ఉపాధి కల్పన, పాలసీల రూపకల్పన ద్వారా దేశ ఆర్థికాభివృద్ధిని మెరగుపచాలన్నది ఈ ఉద్యమం ముఖ్యలక్షణం. ఈ ఉద్యమాన్ని ఒక్కోదేశం ఒక్కో రకంగా చేస్తోంది. ‘‘అమెరికా హెచ్1బీ వీసా నిబంధనలు మార్పు, ఆస్ట్రేలియా, సింగపూర్ వర్క్ వీసాల పాలసీని రద్దు’’ ఇవన్నీ అందులో బాగమే. అందువల్ల ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించడం, కొత్త నియామకాలను నిలిపివేయడం, తగ్గించుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయని నాస్కాం ప్రెసిడెంట్ ఆర్. చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. -
ఈ మారణహోమం ఆగదా?
ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా రహదారుల నెత్తుటి దాహం నానాటికీ పెరుగుతూనే ఉన్నదని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ నాలుగురోజుల క్రితం విడుదల చేసిన రోడ్డు ప్రమాదాల నివేదిక-2015లో ఎన్నో దిగ్భ్రాంతికర అంశాలున్నాయి. దేశంలో గంటకు సగటున 17 మంది...రోజుకు 400మంది పౌరులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. రోజుకు 1,374 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదమృతుల్లో 51 శాతంమంది 15-34 ఏళ్లలోపువారు. అధిక శాతం(77.1శాతం) ప్రమాదాలకు డ్రైవర్ల పొరపాట్లే కారణమవుతున్నాయి. 2014లో 4,89,000 ప్రమాదాలు జరిగి 1,39,671మంది పౌరులు మరణిస్తే... నిరుడు ప్రమాదాల సంఖ్య 5,01,423 చేరుకుని 1,46,133మంది ప్రాణాలు పోగొ ట్టుకున్నారు. నిరుడు జరిగిన ప్రమాదాల్లో గాయపడినవారి సంఖ్య 5,00,279కి చేరింది. రహదారుల నిర్మాణంలోని ఇంజనీరింగ్ లోపాలవల్ల ప్రమాదాలు జరుగు తున్నాయని ఈ నివేదిక తొలిసారి ఎత్తిచూపింది. ఎన్డీఏ సర్కారును ఒకందుకు మెచ్చుకోవాలి. గత ప్రభుత్వాల మాదిరి రోడ్డు ప్రమాదాల తీవ్రతను దాచడానికి ప్రయత్నించడం లేదు. పైగా ప్రధాని నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్య క్రమంలో నిరుడు దీన్ని ప్రస్తావించారు. ఈ సమస్య తీవ్రతను ప్రభుత్వాలతోపాటు ప్రజలకు కూడా అవగాహన కలిగించేందుకు ప్రయత్నించారు. గడ్కరీ కూడా ఒకటికి పదిసార్లు రోడ్డు ప్రమాదాల గురించి చెబుతూనే ఉన్నారు. అయినా ఎంతో కీలకమైన రహదారి భద్రత బిల్లు ఇంతవరకూ పార్లమెంటు ముందుకు రాలేదు. ఎన్డీఏ సర్కారు ఏర్పడిన కొద్ది రోజులకే కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే న్యూఢిల్లీలో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు త్వరలోనే సమగ్రమైన బిల్లు తీసుకొస్తామని గడ్కరీ ప్రకటించారు. రెండేళ్లు పూర్తయినా అదింకా సాకారం కాలేదు. 2014లో సుప్రీంకోర్టు సైతం ఈ సమస్యపై దృష్టిసారించి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చి కూడా దాదాపు ఏడాద వుతోంది. అయినా సమస్య తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అనుకోకుండా, యాదృచ్ఛికంగా జరిగేవాటిని ప్రమాదాలంటారు. చాలా రోడ్డు ప్రమాదాలు ఆ కోవలోకి రావు. మన రోడ్లు సరిగా లేవని తెలిసినా సరే ఏటా లక్షలాది వాహనాలు కొత్తగా రోడ్లపైకి వస్తుంటాయి. వాటికి బ్యాంకులు ఉదారంగా రుణాలు మంజూరు చేస్తాయి. మన రోడ్లు ఇంత భారీ సంఖ్యలో వాహనాలను భరించేంత విశాలమైనవని కాదని అర్ధమవుతున్నా ప్రభుత్వాలు పరిమితి విధించా లనుకోవు. ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండటం వల్ల పౌరులు గంటల తరబడి రోడ్లపై పడిగాపులు పడుతున్నారని...దాన్ని మెరుగుపరిస్తే చాలామంది వాహనాల జోలికి వెళ్లరని తెలిసినా ఆ పనికి పూనుకోవు. ఫలానాచోట రోడ్డు సరిగా లేదని...ఫలానా మలుపు దగ్గర హెచ్చరిక బోర్డు లేదని...ఫలానాచోట రోడ్డు గుంతలు పడి ఉన్నదని అధికారులకు తెలుసు. అయినా దాన్ని సరిచేయడానికి ప్రయత్నించరు. వాహనాల వేగం ఎక్కువగా ఉంటున్న ప్రాంతాల గురించి ఫిర్యాదులందినా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయరు. జాతీయ రహదారుల్లో వాహ నాలు పరిమితికి మించిన వేగంతో వెళ్తాయని, మద్యం సేవించి వాహనాలు నడిపే ధోరణి ఎక్కువగా ఉన్నదని తెలిసినా నిరంతర గస్తీ, సీసీ టీవీ కెమెరాలు, స్పీడ్గన్లు ఏర్పాటు చేయరు. జాతీయ రహదారులపై సాగుతున్న మద్యం విక్రయాలను నియంత్రించడమే సాధ్యం కావడం లేదు. విచక్షణారహితంగా డ్రైవింగ్ లెసైన్స్‌ల మంజూరు...తప్పు వెల్లడైనా వాటిని రద్దు చేయడానికి పూనుకోక పోవడం మన దగ్గర అతి సహజం. అవినీతే అందుకు కారణం. వాహనాల సైజు, వాటి వేగం గతంతో పోలిస్తే హెచ్చాయి. అనుమతులిచ్చేవారికి ఈ సంగతి పట్టదు. ఇన్ని లోపాలున్నా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న పాలకులున్నచోట రోడ్డు ప్రమాదాలను ప్రమాదాలుగానే భావించాలా...ఉద్దేశపూర్వకంగా సాగుతున్న హత్యలనుకోవాలా? అడుగడుగునా మన ప్రభుత్వాలు చూపుతున్న అలసత్వాన్ని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదిక నిశితంగా విమర్శించింది. ఏవో రెండు, మూడు రాష్ట్రాలు మినహా మిగిలినచోట్ల రహదారి భద్రతా విధానమే లేదని వెల్లడించింది. ఈ విషయంలో ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాల గురించి ఇక చెప్పనవసరమే లేదు. అందుకు సంబంధించిన విధానమే రాష్ట్ర ప్రభుత్వాల వద్ద లేదని కమిటీ తెలిపింది. ప్రమాదాలు జరిగినప్పుడు సాయపడేవారికి పోలీసుల వేధింపులు లేకుండా చూస్తామని, ఆస్పత్రులు సైతం నగదు రహిత చికిత్సను వెనువెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ‘మన్ కీ బాత్’లో నరేంద్ర మోదీ చెప్పినా ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. పోలీసులు తమనే అనుమానితులుగా చూస్తున్నారంటూ ఫిర్యాదు చేస్తున్నవారి సంఖ్య తక్కువేమీ కాదు. రోడ్డు ప్రమాదాలతో పోలిస్తే ఉగ్రవాదుల మారణకాండలో చనిపోతున్నవారి సంఖ్య చాలా తక్కువ. ఉగ్రవాద బెడద నివారణకు మన ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకున్నాయి. పటిష్టమైన నిఘా, ఎక్కడికక్కడ సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు వగైరాలన్నీ అందులో భాగం. అందువల్లే ఆ సమస్య చాలావరకూ అదుపులో ఉంది. కానీ రోడ్డు ప్రమాదాలు ఉగ్రవాద బెడదను మించిపోయాయి. భూగోళం మొత్తం మీద ఉగ్రవాద దాడుల్లో రోజూ మరణిస్తున్నవారి సంఖ్యతో పోలిస్తే... మన దేశంలో ప్రమాదాల బారినపడి ఒక రోజులో చనిపోతున్నవారు కనీసం పది రెట్లు ఎక్కువ. ఏదైనా ఒకచోట ఉగ్రవాద దాడి జరిగితే మీడియా మొత్తం ఆ ఘటనకు ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. అందులో ఎంతమంది మరణిం చారన్న దానితో నిమిత్తం లేదు. కానీ మృతుల సంఖ్య ఎక్కువున్నప్పుడు మాత్రమే ప్రమాదాల వార్తలు అందరికీ తెలుస్తాయి. ప్రమాద కారకులు డబ్బు, పలుకుబడి ఉన్నవారై... బాధితులు నిరుపేద కుటుంబాలవారైతే అవి అరకొరగానే వెల్లడవుతాయి. ఇప్పటికైనా మన ప్రభుత్వాలు నిర్లక్ష్యం విడనాడాలి. ప్రమాదాల నివార ణకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అందుకు దారితీసిన పరిస్థితులేమిటో విచారించి, కారకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే రోడ్లపైకి వెళ్లినవారు భద్రంగా ఇళ్లకు చేరగలుగుతారు. రోడ్డు భద్రత అనేది యాధృచ్చికం కాదు. అది మేధోపరమైన చర్యల సామూహిక ప్రయత్నం. - జార్జ్ మిచెల్ ఇంగ్లీషు గాయకుడు, రచయిత -
టీడీపీ నేతలు మారణహోమం సృష్టిస్తున్నారు
తణుకు : జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్పడుతున్న దాడులు, దౌర్జన్యాలు మారణహోమాన్ని తలపింపజేస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. ఉండ్రాజవరం మండలం మోర్తలో వైఎస్సార్ సీపీ నేత ఆలపాటి నరేంద్రప్రసాద్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేయటంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేంద్రప్రసాద్, ఆయన తండ్రి బాలకృష్ణను సుబ్బారాయుడు పరామర్శించారు. ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో ప్రశాంతంగా ఉండే జిల్లాలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యాలు, దాడులకు దిగుతుండటంతో జిల్లా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. మోర్తలో నరేంద్రప్రసాద్ దాడికి పాల్పడిన తీరు చూస్తే అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం తలెత్తుతోందన్నారు. దాడికి తెగబడి కనీసం 108 వాహనం గ్రామంలోకి రాకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. దాడులు చేస్తూనే తిరిగి కేసులు నమోదు చేయిస్తుండటం అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు. నరేంద్రప్రసాద్‌పై అన్యాయంగా బనాయించిన కేసులు ఎత్తేసి ఆయన కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడపాటి చంద్రమౌళిరెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కర్రి కాశీరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్టు నాగేశ్వరరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వెలగల సాయిబాబారెడ్డి, మోర్త సర్పంచ్ తాడిగడప రమేష్, సొసైటీ ఉపాధ్యక్షులు చిటికెన శ్రీను, ఎంపీటీసీ సభ్యులు బూరుగుపల్లి సుబ్బారావు పాల్గొన్నారు. జిల్లాలో టీడీపీ నాయకుల రౌడీరుుజం నరేంద్రప్రసాద్, ఆయన తండ్రి బాలకృష్ణను వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు గురువారం పరామర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేస్తూ అధికార బలంతో బాధితులపై కేసులు బనాయిస్తున్నారన్నారు. జిల్లాలో రౌడీయిజానికి పాల్పడుతున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు కూడా అడ్డుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల రామసతీష్, నాయకులు కారుమంచి మిత్ర తదితరులు ఉన్నారు.