టీడీపీ నేతలు మారణహోమం సృష్టిస్తున్నారు | TDP leaders carnage | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలు మారణహోమం సృష్టిస్తున్నారు

Published Fri, Dec 4 2015 2:16 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

టీడీపీ నేతలు మారణహోమం సృష్టిస్తున్నారు - Sakshi

టీడీపీ నేతలు మారణహోమం సృష్టిస్తున్నారు

 తణుకు :  జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్పడుతున్న దాడులు, దౌర్జన్యాలు మారణహోమాన్ని తలపింపజేస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. ఉండ్రాజవరం మండలం మోర్తలో వైఎస్సార్ సీపీ నేత ఆలపాటి నరేంద్రప్రసాద్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేయటంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేంద్రప్రసాద్, ఆయన తండ్రి బాలకృష్ణను సుబ్బారాయుడు పరామర్శించారు.
 
  ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో ప్రశాంతంగా ఉండే జిల్లాలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యాలు, దాడులకు దిగుతుండటంతో జిల్లా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. మోర్తలో నరేంద్రప్రసాద్ దాడికి పాల్పడిన తీరు చూస్తే అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం తలెత్తుతోందన్నారు. దాడికి తెగబడి కనీసం 108 వాహనం గ్రామంలోకి రాకుండా అడ్డుకోవడం దారుణమన్నారు.
 
  దాడులు చేస్తూనే తిరిగి కేసులు నమోదు చేయిస్తుండటం అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు. నరేంద్రప్రసాద్‌పై అన్యాయంగా బనాయించిన కేసులు ఎత్తేసి ఆయన కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడపాటి చంద్రమౌళిరెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కర్రి కాశీరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్టు నాగేశ్వరరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వెలగల సాయిబాబారెడ్డి, మోర్త సర్పంచ్ తాడిగడప రమేష్, సొసైటీ ఉపాధ్యక్షులు చిటికెన శ్రీను, ఎంపీటీసీ సభ్యులు బూరుగుపల్లి సుబ్బారావు పాల్గొన్నారు.
 
 జిల్లాలో టీడీపీ నాయకుల రౌడీరుుజం
  నరేంద్రప్రసాద్, ఆయన తండ్రి బాలకృష్ణను వైఎస్సార్ సీపీ  రాష్ట్ర కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు గురువారం పరామర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేస్తూ అధికార బలంతో బాధితులపై కేసులు బనాయిస్తున్నారన్నారు. జిల్లాలో రౌడీయిజానికి పాల్పడుతున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు కూడా అడ్డుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల రామసతీష్, నాయకులు కారుమంచి మిత్ర తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement