cases on
-
అక్రమ కేసులు బనాయిస్తున్నారు
సమస్య పరిష్కారం అయ్యే దాకా నిరవధికంగా మద్యం దుకాణాల బంద్ జిల్లా వైన్స్‌డీలర్స్ అసోసియేషన్ బాధ్యులు ఖమ్మంక్రైం: ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ మహేష్‌బాబు తమ మద్యం దుకాణాలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, ఎంఆర్పీకే మద్యం విక్రయిస్తున్నా, అక్రమంగా తమపై కేసులు పెడుతున్నారని జిల్లా వైన్స్ డీలర్స్ అసోసియేషన్ బాధ్యులు ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం సీక్వెల్ ఫంక్షన్‌హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పదినెలలుగా తాము ఎక్సైజ్ నిబంధనల ప్రకారం మద్యం విక్రయిస్తున్నా, అకారణంగా డీసీ తమ దుకాణాలపైకి ఎక్సైజ్ సిబ్బందిని పంపి.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిన్నచిన్న టెక్నికల్ కేసులు కూడా పెడుతున్నారని వారు ఆరోపించారు. మూడు సంవత్సరాలుగా ఆయన జిల్లాలో అధికారిగా పనిచేశారని, ఎప్పుడూ లేనిది మూడునెలలుగా తమను దారుణమైన వేధింపులకు గురిచేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ విషయమై ఎక్సైజ్‌మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించామని, తమ సమస్యను పరిష్కరించేంత వరకు నిరవధికంగా మద్యం దుకాణాలను బంద్ చేస్తామని, తమకు సంఘీభావంగా శనివారం జిల్లావ్యాప్తంగా బార్ షాపులు కూడా బంద్ చేస్తామని ముందుకు వచ్చారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బాధ్యులు బండి విష్ణువర్ధన్‌రావు, వి.నాగేశ్వరరావు, విజయ్‌కుమార్‌రెడ్డి, రావూరి సైదాబాబు, జి.శ్రీనివాసరెడ్డి, పి.తిరుపతిరావు, బోజెడ్ల రామకృష్ణ, దేవబత్తిని కిషోర్, గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులు బనాయిస్తున్నారు
సమస్య పరిష్కారం అయ్యే దాకా నిరవధికంగా మద్యం దుకాణాల బంద్ జిల్లా వైన్స్‌డీలర్స్ అసోసియేషన్ బాధ్యులు ఖమ్మంక్రైం: ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ మహేష్‌బాబు తమ మద్యం దుకాణాలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, ఎంఆర్పీకే మద్యం విక్రయిస్తున్నా, అక్రమంగా తమపై కేసులు పెడుతున్నారని జిల్లా వైన్స్ డీలర్స్ అసోసియేషన్ బాధ్యులు ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం సీక్వెల్ ఫంక్షన్‌హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పదినెలలుగా తాము ఎక్సైజ్ నిబంధనల ప్రకారం మద్యం విక్రయిస్తున్నా, అకారణంగా డీసీ తమ దుకాణాలపైకి ఎక్సైజ్ సిబ్బందిని పంపి.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిన్నచిన్న టెక్నికల్ కేసులు కూడా పెడుతున్నారని వారు ఆరోపించారు. మూడు సంవత్సరాలుగా ఆయన జిల్లాలో అధికారిగా పనిచేశారని, ఎప్పుడూ లేనిది మూడునెలలుగా తమను దారుణమైన వేధింపులకు గురిచేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ విషయమై ఎక్సైజ్‌మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించామని, తమ సమస్యను పరిష్కరించేంత వరకు నిరవధికంగా మద్యం దుకాణాలను బంద్ చేస్తామని, తమకు సంఘీభావంగా శనివారం జిల్లావ్యాప్తంగా బార్ షాపులు కూడా బంద్ చేస్తామని ముందుకు వచ్చారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బాధ్యులు బండి విష్ణువర్ధన్‌రావు, వి.నాగేశ్వరరావు, విజయ్‌కుమార్‌రెడ్డి, రావూరి సైదాబాబు, జి.శ్రీనివాసరెడ్డి, పి.తిరుపతిరావు, బోజెడ్ల రామకృష్ణ, దేవబత్తిని కిషోర్, గోవిందు తదితరులు పాల్గొన్నారు.