బెంబేలెత్తిస్తున్న ఎబోలా కేసులు
న్యూఢిల్లీ: పశ్చిమాఫ్రికాను వణికిస్తున్న ఎబోలా వైరస్ వ్యాపిస్తోంది. ఎబోలా కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. డిసెంబర్ మొదటి వారానికి ఎబోలా కేసులు 10 వేలకు చేరే అవకాశముంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసింది.
ఎబోలా వల్ల ముఖ్యంగా పశ్చిమాఫ్రికాలో దాదాపు ఐదు వేలమంది మరణించారు. పశ్చిమాఫ్రికా దేశాల్లోనే ఎబోలా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఎబోలాను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు కూడా దీని బారినపడుతుండటం ఆందోళన కలిగించే విషయం.