cash awards
-
విద్యార్థులకు రూ. 20కోట్లు నగదు బహుమతి.. వైరల్ అవుతున్న వీడియో
Robert Hale: అమెరికాకు చెందిన బిలినియర్ 'రాబర్ట్ హేల్స్' 2500 మంది విద్యార్థులకు వారి గ్రాడ్యుయేషన్ రోజున ఒక్కరికి 1000 డాలర్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 20 కోట్లకంటే ఎక్కువే. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం. 'రాబర్ట్ హేల్స్' అమెరికాలో అత్యంత ధనవంతుల జాబితాలో ఒకరు మాత్రమే కాదు, గ్రానైట్ టెలీకమ్యూనికేషన్స్ కో-ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ఐదు బిలియన్ డాలర్స్ సంపద కలిగి ఉన్న ఈయన రూ. 20 కోట్లు ఇవ్వడం పెద్ద గొప్ప కాకపోవచ్చు, కానీ 2500 మంది విద్యార్థులకు ఇవ్వడం చాలా గొప్ప విషయం అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రాబర్ట్ హేల్స్ యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్‌లో విద్యార్థులకు ఈ నగదు బహుమతి అందించారు. 2023 యూమాస్ బోస్టన్ అండర్ గ్రాడ్యుయేట్ క్లాస్ విద్యార్థులు ఆయన పంపిణీ చేసిన గిఫ్ట్స్ క్యూలైన్లో నిలబడి తీసుకున్నారు. అయితే వారికి రెండు ఎన్వలప్ కవర్లను అందించారు. ఒక కవర్ మీద గిఫ్ట్ అని 500 డాలర్స్ ఉన్నాయి. మరో కవర్ మీద గివ్ అని 500 డాలర్స్ ఉంచారు. అంటే తీసుకోవడంలో కంటే ఇవ్వడంలో ఎక్కువ ఆనందం పొందండని తెలిపారు. ఈ కార్యక్రమం షేరింగ్, కేరింగ్, గివింగ్ ప్రాముఖ్యతలను గురించి తెలియజేస్తుంది. (ఇదీ చదవండి: అవమానానికి గుణపాఠం.. తలపాగా రంగుకు తగ్గ రోల్స్ రాయిస్ కొన్న 'రూబిన్ సింగ్') ఈ విధంగా డబ్బులు పంచడం ఇదే మొదటి సారి కాదు, గతంలో కూడా ఇలాంటివి చాలానే చేశారు. 2022లో రాక్స్బరీ కమ్యూనిటీ కళాశాలలో విద్యార్థులకు ఇలాంటి నగదు బహుమతి ఇచ్చారు. ఎదుటి వారికి ఇచ్చే గుణాన్ని విద్యార్ధి దశ నుంచి అలవాటు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవల విద్యార్థులకు నగదు బహుమతి అందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. At @UMassBoston commencement, billionaire commencement speaker Robert Hale just told 2,500 stunned graduates he is giving them each $1,000 — half to keep, he said, and half to give. pic.twitter.com/oCq3XThdoE — sonel cutler (@cutler_sonel) May 25, 2023 -
ట్విటర్ బంపర్ ఆఫర్..! బగ్ గుర్తిస్తే భారీ పారితోషికం..!
ట్విటర్ తన యూజర్లకోసం ఆసక్తికర పోటీను ఏర్పాటు చేసింది, ట్విట్టర్లో యూజర్ల డేటాకు సంబంధించి తాను అందిస్తున్న సెక్యూరిటీపై తనకు తానే ఛాలెంజ్ విసురుకుంది. ట్విటర్లోని లోపాలను గుర్తిస్తే ఏకంగా రెండున్నర లక్షల రూపాయల బహుమతి అందిస్తామని ప్రకటించింది. హ్యాకర్లకు సవాల్ తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథంలో బగ్‌ను గుర్తిస్తే నగదు బహుమతిని అందిస్తామని ట్విటర్ ప్రకటించింది. బగ్ బౌంటీ ప్రోగ్రాంను ప్రవేశపెట్టడం ట్విటర్‌కి ఇదే తొలిసారి. ఈ ఏడాది హ్యాకర్ కన్వెన్షన్ ఈవెంట్‌ను డెఫ్ కాన్ ఏఐ (DEF CON AI) విలేజ్‌లో ఈ పోటీ జరగనుంది. ఈ విషయాన్ని తన బ్లాగ్ పోస్ట్‌లో ట్విటర్ ప్రకటించింది. మెషిన్ లెర్నింగ్ అల్గారిథం మోడళ్లలోని లోపాలను కనుగొనడం చాలా కష్టమని, హ్యాకర్లకు ఇదో సవాల్ అని పేర్కొంది. దాన్ని స్వీకరించి లోపాలను పట్టిస్తే భారీ బహుమతి ముట్టచెబుతామంది. యూజర్ల మేలు కోసమే కంపెనీకి చెందిన ముఖ్యమైన అల్గారిథం, ఇమేజ్ క్రాపింగ్ అల్గారిథంలోని లోపాన్ని గుర్తించడానికి ట్విట్టర్ ఈ పోటీని మేలోనే ప్రకటించింది. అంతేకాకుంగా అందుకు సంబంధించిన కోడ్‌ను యూజర్లకు అందుబాటులో ఉంచింది. యూజర్లను ప్రోత్సహించడం ద్వారా అల్గారిథంలో ఉన్న లోపాలను గుర్తిస్తేనే పరిష్కరించడం సులువు అవుతుందని ట్విటర్ పేర్కొంది. అందుకే యూజర్లను హ్యాకింగ్ నుంచి రక్షించడానికే ఈ పోటీ పెడుతున్నామంది. గోల్డెన్ ఛాన్స్ ఏథికల్ హ్యాకర్లు, రిసెర్చ్ కమ్యూనిటీ డెవలపర్లకు ఈ పోటీ సువర్ణావకాశమని ట్విటర్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పోటీలతో విస్తృత స్థాయిలోని సమస్యలను గుర్తించడంలో సహాయపడుతుందని ట్విటర్ తెలిపింది. భారీ బహుమతి ట్విటర్ బిగ్ బౌంటీ ప్రోగ్రాంలో భాగంగా లోపాలను గుర్తించిన మొదటి, రెండో, మూడో స్థానాల్లో నిలిచిన వ్యక్తులకు వరుసగా $ 3,500 (సుమారు రూ. 2,60,242), $ 1,000 (సుమారు రూ. 74,369), $ 500 (సుమారు రూ. 37,184) నగదు బహుమతులను ట్విటర్ అందించనుంది. ట్విటర్ ఆగస్టు 8న డేఫ్ కాన్ ఏఐ విలేజ్‌లో హోస్ట్ చేస్తోన్న వర్క్ షాప్‌లో విజేతలను ప్రకటించనుంది. ఈ పోటీలో పాల్గొనే ఔత్సాహికులకు 2021 ఆగస్టు 6 వరకు ఎంట్రీలు చేయవచ్చును. -
బాడ్మింటన్ క్రీడాకారులకు నగదు పురస్కారాలు
న్యూఢిల్లీ: బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) మంగళవారం బాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లకు నగదు పురస్కారాలను ప్రకటించింది. అంతర్జాతీయ వేదికల్లో అత్యధిక ప్రతిభ కనబర్చిన వరల్డ్ నెం. 2 సైనానెహ్వాల్, కామన్ వెల్త్ గేమ్స్ లో ఛాంపియన్‌గా నిలిచిన కశ్యప్ ఇద్దరికీ చెరి అయిదు లక్షల రూపాయల బహుమతిని ఇస్తున్నట్టుగా బీఎఐ అధ్యక్షులు అఖిలేష్ దాస్ ప్రకటించారు. గత జనవరిలో లక్నో లో జరిగిన సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో ఈ ఇద్దరు క్రీడాకారులు బంగారు పతకాలు సాధించిన సంగతి తెలసిందే.