Cash Les
-
సిద్దిపేట జిల్లా.. క్యాష్‌లెస్..
- అధికార యంత్రాంగం సిద్ధం కావాలి: సీఎం కేసీఆర్ - నియోజకవర్గంలో ‘క్యాష్‌లెస్ విధానం’పై పాఠాలు నేర్వాలి - మున్ముందు బ్యాంకుల పాత్ర గణనీయంగా పెరుగుతుంది - సంస్థాగతంగా బలోపేతం కావాలి.. పనితీరు మెరుగుపడాలి - సిద్దిపేటలో ప్రతి ఒక్కరికీ డెబిట్ కార్డులు జారీ చేయాలి సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట నియోజక వర్గం తర్వాత సిద్దిపేట జిల్లాను కూడా నగదురహిత లావాదేవీల జిల్లాగా మార్చ నున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఇందుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని ఆదేశించారు. నగదురహిత లావాదేవీల నియోజక వర్గంగా సిద్దిపేటను తీర్చిదిద్దే క్రమంలో అనుభవ పాఠాలు నేర్చుకోవాలని, వాటిద్వారా రాష్ట్రవ్యాప్తంగా తలెత్తే ఇబ్బందులకు పరిష్కారం చూపాలని బ్యాంకర్లకు సూచించారు. సిద్దిపేటను నగదురహిత లావాదేవీల నియోజక వర్గంగా తీర్చిదిద్దే అంశంపై మంగళవా రం ప్రగతిభవన్‌లో బ్యాంకర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకర్ల కృషిని అభినందించారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కేంద్రం తీసుకుంటున్న చర్యలతో బ్యాంకుల పాత్ర పెరుగుతుందని, అందుకు తగ్గట్లు బ్యాంకులు సంస్థాగతంగా బలోపేతం కావాలన్నారు. నగదురహిత లావాదేవీల నిర్వహణ కోసం బ్యాంకుల పనితీరు మెరుగుపడాలని సూచించారు. ‘‘తగిన న్ని స్వైపింగ్ యంత్రాలు అందుబాటు లోకి తేవాలి. సిద్దిపేటలో 4 వేలకు పైగా స్వైపింగ్ యాంత్రాలను సమకూర్చాలి. ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు తెరిచి డెబిట్ కార్డులు జారీ చేయాలి. కార్డుల ద్వారానే కాక మొబైల్ యాప్‌ల ద్వారా కూడా లావాదేవీలను ప్రోత్సహించాలి. బ్యాంకు ఖాతాల నిర్వహణ, కార్డుల వినియోగంపై గ్రామ సభల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలి. మొబైల్ యాప్‌ల ద్వారా లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులను భాగస్వామ్యం చేసుకోవాలి. ముందుగా విద్యార్థులకు అవగాహన కల్పించి వారి ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమం కొనసాగాలి. ఇందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యచరణ రూపొందించాలి. ఆర్టీసీ బస్సుల్లో పూర్తి స్థాయిలో స్వైప్ మిషన్లు పెట్టాలి. చార్జీలు చెల్లించడానికి మొబైల్ యాప్స్‌ను వినియోగించేలా చూడాలి. వ్యాపారులందరికీ ఖాతాలు తెరవాలి’’ అని బ్యాంకర్లకు సీఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు టి.హరీశ్ రావు, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
క్యాష్‌లెస్ ఇలాగేనా ?
-
క్యాష్‌లెస్ ఆసరా!
- లబ్ధిదారులందరికీ ‘రూపే’ కార్డులిప్పించాలని - సెర్ప్ నిర్ణయం ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలను తెరిచేందుకు ప్రత్యేక డ్రైవ్ సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ఆసరా పథకాన్ని ‘క్యాష్‌లెస్’ చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35.96 లక్షలమంది లబ్ధిదారులు ఉండటం, వీరికి ప్రతినెలా రూ.397 కోట్లు పింఛన్లుగా పంపిణీ చేయాల్సి రావడంతో అధికారులు క్యాష్‌లెస్ ఆసరా దిశగా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ నెల పింఛన్ పంపిణీకే నగదు కొరత ఏర్పడినందున, భవిష్యత్తులో నగదు (పింఛన్)పంపిణీకి మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత నెల రోజులుగా పింఛన్ల పంపిణీ జరుగుతున్నప్పటికీ సరిపడా కొత్తనోట్లు లభించక మొత్తం సొమ్ములో రూ.130 కోట్లను సెర్ప్ సిబ్బంది నేటికీ పంపిణీ చేయలేకపోయారు. అధికారిక లెక్కల ప్రకారం వివిధ జిల్లాల్లో 11 కోట్ల మంది లబ్ధిదారులు తమకు అందాల్సిన అక్టోబర్ నెల పింఛన్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఆసరా లబ్ధిదారులకు రూపే కార్డులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35.96 లక్షలమంది లబ్ధిదారుల్లో ప్రస్తుతం బ్యాంకు ఖాతాలు కలిగిన 13.63 లక్షల మందికి ప్రతినెలా పింఛన్ సొమ్మును వారి ఖాతాలకే ప్రభుత్వం జమ చేస్తోంది. మరో 17.81లక్షల మందికి పోస్టాఫీసుల ద్వారా పింఛన్ సొమ్మును అందజేస్తుండగా, ఇంకా గ్రామాల్లోని 4.52 లక్షలమందికి ఎటువంటి ఖాతాలు లేకపోవడంతో పంచాయతీ సిబ్బంది ద్వారా పింఛన్ సొమ్మును చేతికి అందజేస్తున్నారు. అరుుతే, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఖాతాలున్న వారికీ డెబిట్ కార్డులు లేకపోవడంతో వారు కూడా నగదును తీసుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖాతాలు లేని లబ్ధిదారులకు సమీప బ్యాంకు, పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరిపించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులు నిర్ణరుుంచారు. ఆ మేరకు మొత్తం ఆసరా లబ్ధిదారులందరికీ రూపే కార్డులు ఇప్పించి పింఛన్ సొమ్మును కూడా క్యాష్ లెస్ లావాదేవీల్లో వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. ఉపాధిహామీ కూలీలకు ఇదే విధానం ఉపాధిహామీ కూలీలకు కూడా బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల ద్వారానే వేతన సొమ్మును చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఆసరా పింఛన్లు, ఉపాధిహామీ పథకం చెల్లింపులకు నగదు కొరత, క్యాష్‌లెస్ లావాదేవీల కోసం చేపట్టాల్సిన చర్యల గురించి గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకుల, పోస్టాఫీసుల ప్రతినిధులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం సమీక్షించనున్నట్లు తెలిసింది. -
ఔట్పేషెంట్లకూ క్యాష్‌లెస్ సదుపాయం..
ఇప్పటిదాకా ఆస్పత్రిలో అడ్మిట్ అయిన పేషెంట్లకు మాత్రమే క్యాష్‌లెస్ సదుపాయాన్ని కల్పిస్తున్న బీమా కంపెనీలు ఇకపై ఔట్‌పేషెంట్లకు కూడా దీన్ని వర్తింపచేసే ఆలోచనలో ఉన్నాయి. ఇది అమల్లోకి వ చ్చిందంటే.. ఇకపై మీరు ఆస్పత్రిలో ఔట్‌పేషెంటు ట్రీట్మెంట్కి వెళ్లేటపుడు వెంట పర్సు తీసుకెళ్లక్కర్లేదు. చికిత్స ఖర్చులు బీమా కంపెనీ నేరుగా ఆస్పత్రికి చెల్లిస్తుంది. ఇప్పుడు కూడా కొన్ని కంపెనీలు ఇలాంటి సదుపాయం కల్పిస్తున్నా.. అది రీయింబర్స్మెంట్ పద్ధతిలోనే ఉంటోంది. అంటే.. ఖర్చులు పేషెంటు ముందు కట్టేసి.. ఆ తర్వాత క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటోంది.