ఔట్‌పేషెంట్లకూ క్యాష్‌లెస్ సదుపాయం..
ఇప్పటిదాకా ఆస్పత్రిలో అడ్మిట్ అయిన పేషెంట్లకు మాత్రమే క్యాష్‌లెస్ సదుపాయాన్ని కల్పిస్తున్న బీమా కంపెనీలు ఇకపై ఔట్‌పేషెంట్లకు కూడా దీన్ని వర్తింపచేసే ఆలోచనలో ఉన్నాయి. ఇది అమల్లోకి వ చ్చిందంటే.. ఇకపై మీరు ఆస్పత్రిలో ఔట్‌పేషెంటు ట్రీట్‌మెంట్‌కి వెళ్లేటపుడు వెంట పర్సు తీసుకెళ్లక్కర్లేదు.
చికిత్స ఖర్చులు బీమా కంపెనీ నేరుగా ఆస్పత్రికి చెల్లిస్తుంది. ఇప్పుడు కూడా కొన్ని కంపెనీలు ఇలాంటి సదుపాయం కల్పిస్తున్నా.. అది రీయింబర్స్‌మెంట్ పద్ధతిలోనే ఉంటోంది. అంటే.. ఖర్చులు పేషెంటు ముందు కట్టేసి.. ఆ తర్వాత క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటోంది.