Cashless payment
-
Digital Payments: నెట్ లేకున్నా పేమెంట్ ఎలా చేస్తారో తెలుసా?
టీ కొట్టు, హోటల్, రెస్టారెంట్, కిరాణ షాప్, మార్ట్లు, మెడికల్ షాప్, దుస్తుల షోరూం, క్యాబ్‌లు ఇలా ఏ సేవల్ని ఉపయోగించుకున్నా .. పది రూపాయలలోపు నుంచి వేల రూపాయల దాకా డిజిటల్ చెల్లింపులకే మొగ్గుచూపుతున్నాం. ఇక కార్డుల స్వైపింగ్ సంగతి సరేసరి. ఇంటర్నెట్ లేదంటే వైఫై సౌకర్యం ద్వారా ఈ చెల్లింపులు చేస్తున్నాం కదా. క్యాష్‌లెస్ ట్రాన్జాక్షన్స్ను ప్రొత్సహించడం కోసం కేంద్రం అమలు చేస్తున్న ప్రణాళికే ఇదంతా. మరి అసలు ఇంటర్నెట్తో సంబంధం లేకుండా డిజిటల్ చెల్లింపులు జరిపితే ఎలా ఉంటుంది!? ఇంటర్నెట్ లేకున్నా, ఆఫ్‌లైన్ ద్వారానే డిజిటల్ చెల్లింపులు జరిపే పద్ధతిని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మొదలుపెట్టింది. 2020 సెప్టెంబరు నుంచి ఈ ఏడాది జూన్ వరకు ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్ రిటైల్ డిజిటల్ పేమెంట్ పద్దతిని అమలు చేసి పరిశీలించింది కూడా. ఈ ఫలితాలు సంతృప్తికరంగా రావడంతో ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు ఆర్బీఐ ప్రయత్నాలు షురూ చేసింది. చెల్లింపులు ఎలాగంటే.. ఆఫ్‌లైన్ లావాదేవీలను వినియోగించుకోవాలనుకునే వారికి బ్యాంకులు లేదా ఫిన్‌టెక్ సంస్థలు ప్రత్యేక కార్డు లేదంటే టోకెన్లు ఇస్తాయి. ఒకరకంగా ఇవి డెబిట్ కార్డులాంటివే. నిర్ణీత మొత్తంలో చెల్లించాలని అనుకున్నప్పుడు.. ఈ కార్డును వాడుకోవచ్చు. పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) తరహాలో ఉండే ప్రత్యేక యంత్రాల ద్వారా చెల్లింపును పూర్తి చేయొచ్చు. మామూలుగా అయితే పీవోఎస్ యంత్రానికీ నెట్ అవసరం. కానీ, ఈ ప్రత్యేక పీవోఎస్ మెషిన్‌కు చెల్లింపుల టైంలో ఇంటర్నెట్తో పని లేదు. ఓటీపీ లేదంటే ఎస్ఎంఎస్ కన్ఫర్మేషన్ ద్వారా చెల్లింపు చేయొచ్చు. కాకపోతే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చినప్పుడు వ్యాపారి ఈ యంత్రాన్ని అనుసంధానిస్తే, ఆయా చెల్లింపులన్నీ ఒకేసారి ప్రాసెస్ అవుతాయి. అంతేకాదు.. వాయిస్ బేస్డ్ చెల్లింపులనూ ఈ పద్ధతిలో చేసే వీలుంటుంది. ఐవీఆర్ ద్వారా సూచనలు ఇచ్చి కూడా చెల్లింపులను పూర్తి చేయొచ్చు. అయితే వాలెట్లు, కార్డులు, మొబైల్ డివైస్‌లు, యూపీఐ పేమెంట్స్(ఫోన్ పే, గూగుల్ పే..)తోనూ ఈ తరహా చెల్లింపులు సాధ్యమవుతుందని చెప్తున్నారు క్యాష్‌ప్రీ పేమెంట్స్ కో ఫౌండర్ రీజు దత్తా. అసలు కారణం.. నెట్వర్క్ సరిగ్గా లేకపోతే డిజిటల్ చెల్లింపులు ఆలస్యం కావడమే కాదు.. ఒక్కోసారి బ్యాంకు ఖాతాలో నగదు కట్ అయినా, వ్యాపారికి చేరడం లేదు. ఈ విషయంలో వివాదాలు తప్పడం లేదు. దీనికి పరిష్కారంగా ఈ ఆఫ్‌లైన్ విధానం తీసుకురాబోతున్నారు. వాళ్లను దృష్టిలో పెట్టుకునే.. ఆన్లైన్ డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ.. గ్రామీణ ప్రాంతాల్లో, నిరక్షరాస్యులకు, వయసు పైబడిన వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఈ ఆఫ్‌లైన్ చెల్లింపుల ప్రక్రియ ద్వారా వాళ్లకు ఊరట లభించనుంది. అంతేకాదు ఫిన్‌టెక్ సంస్థలకు ప్రత్యేకంగా కార్డులు జారీ చేయడంతో పాటు, యంత్రాలను తయారు చేయడం, వాటిని ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండని గ్రామీణ ప్రాంతాలకు.. కొండ ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాల్లో అందించేందుకు వీలు ఉంటుంది. ఎన్ఎఫ్సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) కార్డుల వాడకం కోసం ప్రత్యేక ఏర్పాట్లూ ఫిన్‌టెక్ సంస్థలకు సరికొత్త వ్యాపారావకాశాలను సృష్టించే వీలుంది. జాగ్రత్త అవసరమే.. ఆన్లైన్ పేమెంట్స్ వల్ల సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. అలాంటప్పుడు ఆఫ్‌లైన్ కార్డులతో ఆ రిస్క్ తక్కువ. అయినప్పటికీ మరింత అప్రమత్తత అవసరమని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే, చెల్లింపులకు జియోట్యాగింగ్ చేయడంలాంటి వాటివల్ల వీటికి అడ్డుకట్ట వేసే వీలుందని అంటున్నారు. సాధ్యమేనా? ఇదేం కొత్త విధానం కాదు. ఇంటర్నెట్ అవసరం లేకుండా నగదు బదిలీ సేవలు దాదాపు దశాబ్దం కిందే ఉండేవి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ విధానాన్ని ప్రవేశ పెట్టింది. స్మార్ట్ ఫోన్లు అంతగా వాడకంలో లేనిటైంలో అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీసెస్ డేటా (యూఎస్ఎస్డీ)తో పనిచేసే *99H కు ఫోన్ చేయడం ద్వారా, సంక్షిప్త సందేశాల రూపంలో (ఎస్ఎంఎస్) బ్యాంకు లావాదేవీలను నిర్వహించే వీలును తీసుకొచ్చింది. యూఎస్ఎస్డీ ద్వారా బ్యాంకు ఖాతా నిల్వ తెలుసుకోవడం, నగదు బదిలీ చేయడం నిర్వహించుకోవచ్చు. ఇందుకు నెట్ అవసరం లేదు. కాబట్టి, ఆఫ్‌లైన్‌లో నగదు చెల్లింపు లావాదేవీలు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. చిన్నమొత్తం చెల్లింపులను సులభంగా, ఎలాంటి అంతరాయం లేకుండా చేసేందుకు వీలు కల్పిస్తుందంటున్నారు. 2020 సెప్టెంబరు నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఆర్బీఐ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ఆఫ్‌లైన్ డిజిటల్ పేమెంట్ ఇన్షియేటివ్‌లో మొత్తం 2.41 లక్షల లావాదేవీల ద్వారా రూ.1.16 కోట్ల నగదు బదిలీ జరిగింది. చదవండి: కార్డు చెల్లింపులు.. కొత్త రూల్స్ గుర్తున్నాయా?.. ఇవే! -
నగదు రహిత చెల్లింపులపై రేపు నివేదిక: సీఎం
సాక్షి, అమరావతి: నగదు రహిత చెల్లింపులపై ఈ నెల 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మధ్యంతర నివేదిక ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆర్థికశాఖ ఉన్నతాధికారు లు, బ్యాంకర్లతో సమావేశమై నివేదికపై ఆయన చర్చించారు. సీఎంల కమిటీ ఈ నివేదికను మంగళవారం ప్రధానికి ఇవ్వనుందని తెలిపి సోమవారం మధ్యాహ్నంలోగా డిజిటల్ లావాదేవీలపై నివేదిక ఇవ్వాలని బ్యాంకర్లను సీఎం కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం 41 శాతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో దీన్ని 60 శాతానికి తీసుకెళ్లాలని చెప్పారు. విజయవాడ చేరుకున్న చంద్రబాబు ఇదిలా ఉండగా దావోస్ పర్యటన ముగించుకుని శనివారం అర్ధరాత్రి సీఎం చంద్రబాబు విజయవాడ చేరుకున్నారు. డిజిటల్ లావాదేవీలపై ముఖ్యమంత్రుల కమిటీ నివేదికను కేంద్రానికి ఇచ్చేందుకుగాను సోమవారం సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. -
పెట్రోల్ బంకుల్లో ‘డిజిటల్’ జోరు!
న్యూఢిల్లీ: నగదురహిత చెల్లింపులకు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంక్‌లు సన్నద్ధమయ్యాయి. డెబిట్, క్రెడిట్ కార్డులే కాకుండా ఈ వాలెట్లు, మొబైల్ వాలెట్లలతో కార్యకలాపాలు జరిపేందుకు తగిన మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేసుకున్నాయి. సుమారు 4,800 పెట్రోలు బంక్‌లు పీఓఎస్ యంత్రాల ద్వారా రోజూ కార్డుకు రూ.2 వేల చొప్పన నగదును ప్రజలకు అందిస్తున్నాయి. గత రెండు వారాల్లో ఇలా రూ.65 కోట్లు సరఫరా చేశాయి. నెల రోజుల పాటు సుమారు 53 వేల పెట్రోలు బంక్‌ల వద్ద డిజిటల్ చెల్లింపులపై నిర్వహించే అవగాహన కార్యక్రమాలను శనివారం ప్రారంభించినట్లు పెట్రోలియం మంత్రి ధర్మేంద ప్రధాన్ చెప్పారు. పెట్రోల్ బంక్‌ల వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక కియోస్కోలు ఇంధనం కొనుగోలుకే కాకుండా ఎలక్ట్రానిక్ చెల్లింపులకూ పనిచేస్తాయి. త్వరలో ఇది ఎల్పీజీ పంపిణీ సంస్థలు, సీఎన్జీ బంకుల్లో అమల్లోకి వస్తుంది. ఇప్పటికే ప్రధాన పట్టణాల్లోని మూడింట రెండొంతుల ఔట్లెట్లలో డిజిటల్ చెల్లింపుల వసతులు అందుబాటులోకి వచ్చాయ మంత్రి చెప్పారు. క్యూలో నిలబడి ప్రభుత్వ ఉద్యోగి మృతి హూగ్లి: పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లిలో నగదు కోసం ఏటీఎం వద్ద లైన్లో నిల్చొన్న ప్రభుత్వ ఉద్యోగి శనివారం ఉదయం చనిపోయాడు. కల్లోల్ రాయ్‌చౌధరి(56) అనే ప్రభుత్వ ఉద్యోగి కూచ్ బెహార్‌లోని తన కార్యాలయం నుంచి కోల్‌కతాలో ఉన్న ఇంటికి వెళ్తుండగా నగదు కోసం హూగ్లిలో ఆగాడు. స్టేషన్ రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎం వద్ద నిల్చున్న 20 నిమిషాల తరువాత కుప్పకూలిపోయాడు. ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాకపోవడంతో సుమారు 30 నిమిషాలు అలాగే ఉండిపోయాడు. తరువాత అక్కడి సెక్యూరిటీ గార్డు పిలిపించిన డాక్టర్... అతడు అప్పటికే చనిపోయాడాని నిర్ధరించాడు. ముంబై టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ ముంబై, శివారు ప్రాంతాల్లోని బ్యాంకులు, ఏటీఎం వద్ద క్యూ లైన్లు శనివారం ఏ మాత్రం తగ్గలేదు. వారాంతం కావడం, రద్దీ ఎక్కువగా ఉండడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని బ్యాంకులు ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని ప్రజలకు అందజేయగా, పెద్ద సంఖ్యలో ఏటీఎంలు తెరుచుకోలేదు. ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ వే, సియోన్-పాన్వెల్ హైవేపై టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయారుు. ప్లాజాల వద్ద డిజిటల్ ద్వారా చెల్లింపులకు ఏర్పాట్లు చేసినా ఇబ్బందులు తప్పకపోవడంతో.. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. -
పేటీఎం ‘యాప్ పీవోఎస్’ ఉపసంహరణ
న్యూఢిల్లీ: నగదు రహిత చెల్లింపులకు సంబంధించి ఆర్భాటంగా ప్రవేశపెట్టిన యాప్ పీవోఎస్‌ను ఉపసంహరిస్తున్నట్లు మొబైల్ వాలెట్ కంపెనీ పేటీఎం తెలిపింది. కస్టమర్ డేటా, ప్రైవసీపరంగా రిస్కులు ఇందుకు కారణమని వివరించింది. పారుుంట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) టెర్మినల్, కార్డ్ స్వైప్ మెషీన్ల అవసరం లేకుండా లావాదేవీలను చిన్న వ్యాపారస్తులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారానే పూర్తి చేసే విధంగా ఈ యాప్‌ను పేటీఎం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం విక్రయానికి సంబంధించిన బిల్లును అమ్మకందారు తన స్మార్ట్‌ఫోన్ ద్వారా జనరేట్ చేస్తారు. అటు పైన.. సదరు వ్యాపారి స్మార్ట్‌ఫోన్‌లో కస్టమరు తన కార్డు వివరాలు ఎంటర్ చేసిన తర్వాత లావాదేవీ పూర్తవుతుంది. అరుుతే, ఇటీవలే వివిధ బ్యాంకుల ఖాతాదారులకు చెందిన లక్షల కొద్దీ డెబిట్ కార్డులు హ్యాక్ అరుున నేపథ్యంలో ఈ తరహా యాప్‌లో కస్టమర్ల కార్డు వివరాల భద్రతపై పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశారుు. దీంతో యాప్‌ను ’సస్పెండ్’ చేస్తున్నట్లు పేటీఎం తన బ్లాగ్‌లో పేర్కొంది. కానీ తమ యాప్ పూర్తిగా సురక్షితమైనదేనని, రెండంచెల భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగానే రూపొందించినట్లు తెలిపింది.