పేటీఎం ‘యాప్ పీవోఎస్’ ఉపసంహరణ
న్యూఢిల్లీ: నగదు రహిత చెల్లింపులకు సంబంధించి ఆర్భాటంగా ప్రవేశపెట్టిన యాప్ పీవోఎస్‌ను ఉపసంహరిస్తున్నట్లు మొబైల్ వాలెట్ కంపెనీ పేటీఎం తెలిపింది. కస్టమర్ డేటా, ప్రైవసీపరంగా రిస్కులు ఇందుకు కారణమని వివరించింది. పారుుంట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) టెర్మినల్, కార్డ్ స్వైప్ మెషీన్‌ల అవసరం లేకుండా లావాదేవీలను చిన్న వ్యాపారస్తులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారానే పూర్తి చేసే విధంగా ఈ యాప్‌ను పేటీఎం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం విక్రయానికి సంబంధించిన బిల్లును అమ్మకందారు తన స్మార్ట్‌ఫోన్ ద్వారా జనరేట్ చేస్తారు.
అటు పైన.. సదరు వ్యాపారి స్మార్ట్‌ఫోన్‌లో కస్టమరు తన కార్డు వివరాలు ఎంటర్ చేసిన తర్వాత లావాదేవీ పూర్తవుతుంది. అరుుతే, ఇటీవలే వివిధ బ్యాంకుల ఖాతాదారులకు చెందిన లక్షల కొద్దీ డెబిట్ కార్డులు హ్యాక్ అరుున నేపథ్యంలో ఈ తరహా యాప్‌లో కస్టమర్ల కార్డు వివరాల భద్రతపై పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశారుు. దీంతో యాప్‌ను ’సస్పెండ్’ చేస్తున్నట్లు పేటీఎం తన బ్లాగ్‌లో పేర్కొంది. కానీ తమ యాప్ పూర్తిగా సురక్షితమైనదేనని, రెండంచెల భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగానే రూపొందించినట్లు తెలిపింది.