cashless Payments
-
భారత్‌కు నెల.. అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
అగ్రరాజ్యం అమెరికా మూడు సంవత్సరాల్లో చేసే నగదు రహిత (క్యాష్ లెస్) లావాదేవీలు.. భారతదేశంలో కేవలం నెల రోజుల్లోనే జరుగుతుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. ఇటీవల నైజీరియాలోని భారతీయ కమ్యూనిటీ ప్రజలతో సంభాషిస్తున్న సందర్భంగా జైశంకర్ ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం భారతదేశంలో పౌరుల జీవనం చాలా సులభతరమైందని, దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ పెరగటమే అనే జైశంకర్ అన్నారు. ఈ రోజుల్లో చాలా తక్కువమంది మాత్రమే నగదు చెల్లించడం లేదా స్వీకరించడం చేస్తున్నారు. ఎక్కువమంది చిన్న వస్తువు కొనే దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్‌లో షాపింగ్ చేసే వరకు ఆన్లైన్లోనే పే చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే డిజిటల్ పేమెంట్ ఎక్కువైంది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థల నుంచి చిరు వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరూ క్యాష్ లెస్ లావాదేవీలను అంగీకరిస్తున్నారని మంత్రి తెలిపారు. అంతే కాకుండా భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా నిలిచిందని, దేశంలో పెట్టుబడులు పెట్టడానైకి కూడా పారిశ్రామిక వేత్తలు సుముఖత చూపిస్తున్నారని వెల్లడించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్లు, మెట్రో, విమానాశ్రయాల నిర్మాణం వేగంగా జరుగుతోందని, కొత్త రైళ్లు.. రైల్వే స్టేషన్స్ వస్తున్నాయని చెబుతూ.. భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విద్యుత్ సదుపాయం, మంచినీటి సరఫరా జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఆధార్ కార్డు రద్దు చేసుకునే అవకాశం - ఎప్పుడు.. ఎలా? ఇండియాలో కరోనా మహమ్మారి అధికంగా విజృంభించిన సమయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు.. వ్యవహరించిన తీరుని ప్రపంచ దేశాలు మాత్రమే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు. ఆ సమయంలో కోవిడ్ వ్యాక్సిన్‌ను విరివిగా తయారు చేసి.. కేవలం దేశ ప్రజలకు మాత్రమే కాకుండా అనేక దేశాలకు ఎగుమతి చేసే భళా భారత్ అనిపించుకుంది. -
ఆన్లైన్ చెల్లింపులపై 0.75% డిస్కౌంట్
బీఎస్ఎన్ఎల్ ప్రకటన సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో బిల్లు చెల్లింపులకు 0.75 శాతం రాయితీ ఇస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ నెలకొల్పాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా క్యాష్‌లెస్ వైపు వినియోగదారులు అడుగేయాలని.. www.portal.bsnl.in, మై బీఎస్ఎన్ఎల్ యాప్ ద్వారా ఆన్లైన్లో బిల్లులు చెల్లించి క్యాష్‌లెస్‌ను ప్రోత్సహించాలని ఓ ప్రకటనలో కోరింది. సర్వీస్ చార్జి మినహా బిల్లు మొత్తానికి రాయితీ వర్తిస్తుందని.. ఈ నెల 22 నుంచి 2017 మార్చి 31 వరకు ల్యాండ్ లైన్, బ్రాడ్ బాండ్, మొబైల్ పోస్ట్ పెయిడ్ బిల్లులు, ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జిలకు డిస్కౌంట్ వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. -
ఆధార్ ఆధారిత చెల్లింపులు
సిఫారసు చేస్తామన్న నగదు రహిత లావాదేవీల అమలు కమిటీ కన్వీనర్ చంద్రబాబు సాక్షి, న్యూఢిల్లీ: నగదు రహిత చెల్లింపులను విసృ్తతంగా అమల్లోకి తెచ్చేందుకు వీలుగా ఆధార్ ఆధారిత చెల్లింపులను ప్రోత్సహించే విధానాన్ని సిఫారసు చేయనున్నట్టు నగదు రహిత లావాదేవీల అమలు కమిటీ కన్వీనర్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. కమిటీ కన్వీనర్ హోదాలో గురువారం ఆయన ముంబైలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, పలు బ్యాంకుల ఛైర్మన్లు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తదితరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డిజిట ల్ చెల్లింపులకు అందుబాటులో ఉన్న వనరుల పై చర్చించారు. సాయంత్రం ఢిల్లీలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ముంబై సమావేశ వివరాలను తెలియజేశారు. అనంతరం పనగారియా, అమితాబ్ కాంత్‌తో కలసి నీతి ఆయోగ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నగదు రహిత లావాదేవీల అమ లుకు వీలైనన్ని అవకాశాలను అందుబాటు లోకి తెస్తాం. ఎలాగూ కొంత నగదు అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా నగదు రహిత లావాదేవీల కోసం కార్డుల జారీ, పాస్ (పీఓఎస్) యంత్రాలు అందుబాటులోకి తేవడం, మొబైల్ చెల్లింపులు విసృ్తతంగా అమల్లోకి తేవడం వంటి కార్యక్రమాలను అమలుచేయాల్సి ఉంది. ఇక మరింత సులభతర విధానమైన ఆధార్ ఆధారిత చెల్లింపులను కూడా అందుబాటులోకి తేవాల్సి ఉంది. అలాగే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (ఒకే మొబైల్ అప్లికేషన్ ద్వారా పలు బ్యాంకు ఖాతాల నిర్వహణకు దోహదపడేది) ఆధారిత, యూఎస్ఎస్డీ (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా (మొబైల్ ఫోన్ ఆధారిత బ్యాంకింగ్) ఆధారిత చెల్లింపులను కూడా విసృ్తత పరచాలి. యూపీ ఐ, యూఎస్ఎస్డీ ఆధారిత చెల్లింపుల్లో ఉన్న సాంకేతిక సమస్యలను అధిగమిం చేందు కు బ్యాంకర్లు సిద్ధంగా ఉన్నారు. ఇందు కు అవస రమైన మౌలిక వసతులను సమకూర్చు కోవాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం శుక్రవారం కమిటీ సభ్యులమంతా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమవుతాం.. రెండు మూడు రోజుల్లో మధ్యంతర నివేదిక ఇస్తాం. నగదు రహిత లావాదేవీలకు ఆర్థికమంత్రి కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటించడం సంతోషకరం. ప్రపంచవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీల అమలును అధ్యయనం చేయాల్సి ఉంది. ఈ- చెల్లింపులతో సంబంధం ఉన్న అందరు భాగస్వాములతో చర్చలు జరుపుతాం..’ అని చంద్రబాబు చెప్పారు. మొబైల్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ సామర్థ్యం లేకపోవడం వంటి సమస్యలను ఆయన అంగీక రించారు. వీటన్నింటికీ పరిష్కారం కనుక్కోవాల్సి ఉందన్నారు. అమితాబ్ కాంత్ మాట్లాడుతూ.. ‘మొబైల్లో ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థకు అన్ని బ్యాంకింగ్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. సాఫ్ట్వేర్ కూడా ఇప్పటికే అందుబాటులో ఉంది. మైక్రో ఏటీఎంలు, పాస్ మిష న్లు, మొబైల్ పాస్ సౌకర్యాలను మరింత అందుబాటులోకి తేవాల్సి ఉంది..’ అని చెప్పారు.