అగ్రరాజ్యం అమెరికా మూడు సంవత్సరాల్లో చేసే నగదు రహిత (క్యాష్ లెస్) లావాదేవీలు.. భారతదేశంలో కేవలం నెల రోజుల్లోనే జరుగుతుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. ఇటీవల నైజీరియాలోని భారతీయ కమ్యూనిటీ ప్రజలతో సంభాషిస్తున్న సందర్భంగా జైశంకర్ ఈ ప్రకటన చేశారు.
ప్రస్తుతం భారతదేశంలో పౌరుల జీవనం చాలా సులభతరమైందని, దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ పెరగటమే అనే జైశంకర్ అన్నారు. ఈ రోజుల్లో చాలా తక్కువమంది మాత్రమే నగదు చెల్లించడం లేదా స్వీకరించడం చేస్తున్నారు. ఎక్కువమంది చిన్న వస్తువు కొనే దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్‌లో షాపింగ్ చేసే వరకు ఆన్‌లైన్‌లోనే పే చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే డిజిటల్ పేమెంట్ ఎక్కువైంది.
పెద్ద పెద్ద వ్యాపార సంస్థల నుంచి చిరు వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరూ క్యాష్ లెస్ లావాదేవీలను అంగీకరిస్తున్నారని మంత్రి తెలిపారు. అంతే కాకుండా భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా నిలిచిందని, దేశంలో పెట్టుబడులు పెట్టడానైకి కూడా పారిశ్రామిక వేత్తలు సుముఖత చూపిస్తున్నారని వెల్లడించారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్లు, మెట్రో, విమానాశ్రయాల నిర్మాణం వేగంగా జరుగుతోందని, కొత్త రైళ్లు.. రైల్వే స్టేషన్స్ వస్తున్నాయని చెబుతూ.. భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విద్యుత్ సదుపాయం, మంచినీటి సరఫరా జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఆధార్ కార్డు రద్దు చేసుకునే అవకాశం - ఎప్పుడు.. ఎలా?
ఇండియాలో కరోనా మహమ్మారి అధికంగా విజృంభించిన సమయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు.. వ్యవహరించిన తీరుని ప్రపంచ దేశాలు మాత్రమే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు. ఆ సమయంలో కోవిడ్ వ్యాక్సిన్‌ను విరివిగా తయారు చేసి.. కేవలం దేశ ప్రజలకు మాత్రమే కాకుండా అనేక దేశాలకు ఎగుమతి చేసే భళా భారత్ అనిపించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment