ఆన్‌లైన్ చెల్లింపులపై 0.75% డిస్కౌంట్
బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లింపులకు 0.75 శాతం రాయితీ ఇస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ నెలకొల్పాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా క్యాష్‌లెస్ వైపు వినియోగదారులు అడుగేయాలని.. www.portal.bsnl.in, మై బీఎస్‌ఎన్‌ఎల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించి క్యాష్‌లెస్‌ను ప్రోత్సహించాలని ఓ ప్రకటనలో కోరింది.
సర్వీస్ చార్జి మినహా బిల్లు మొత్తానికి రాయితీ వర్తిస్తుందని.. ఈ నెల 22 నుంచి 2017 మార్చి 31 వరకు ల్యాండ్ లైన్, బ్రాడ్ బాండ్, మొబైల్ పోస్ట్ పెయిడ్ బిల్లులు, ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జిలకు డిస్కౌంట్ వర్తిస్తుందని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది.