ఆధార్ ఆధారిత చెల్లింపులు | CM Chandrababu Naidu plan in Aadhaar based cashless Payments | Sakshi
Sakshi News home page

ఆధార్ ఆధారిత చెల్లింపులు

Published Fri, Dec 9 2016 1:48 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

ఆధార్ ఆధారిత చెల్లింపులు - Sakshi

ఆధార్ ఆధారిత చెల్లింపులు

 సిఫారసు చేస్తామన్న నగదు రహిత లావాదేవీల అమలు కమిటీ కన్వీనర్ చంద్రబాబు

 సాక్షి, న్యూఢిల్లీ: నగదు రహిత చెల్లింపులను విసృ్తతంగా అమల్లోకి తెచ్చేందుకు వీలుగా ఆధార్ ఆధారిత చెల్లింపులను ప్రోత్సహించే విధానాన్ని సిఫారసు చేయనున్నట్టు నగదు రహిత లావాదేవీల అమలు కమిటీ కన్వీనర్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. కమిటీ కన్వీనర్ హోదాలో గురువారం ఆయన ముంబైలో ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, పలు బ్యాంకుల ఛైర్మన్లు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తదితరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డిజిట ల్ చెల్లింపులకు అందుబాటులో ఉన్న వనరుల పై చర్చించారు. సాయంత్రం ఢిల్లీలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ముంబై సమావేశ వివరాలను తెలియజేశారు.
 
 అనంతరం పనగారియా, అమితాబ్ కాంత్‌తో కలసి నీతి ఆయోగ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నగదు రహిత లావాదేవీల అమ లుకు వీలైనన్ని అవకాశాలను అందుబాటు లోకి తెస్తాం. ఎలాగూ కొంత నగదు అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా నగదు రహిత లావాదేవీల కోసం కార్డుల జారీ, పాస్ (పీఓఎస్) యంత్రాలు అందుబాటులోకి తేవడం, మొబైల్ చెల్లింపులు విసృ్తతంగా అమల్లోకి తేవడం వంటి కార్యక్రమాలను అమలుచేయాల్సి ఉంది. ఇక మరింత సులభతర విధానమైన ఆధార్ ఆధారిత చెల్లింపులను కూడా అందుబాటులోకి తేవాల్సి ఉంది.
 
 అలాగే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (ఒకే మొబైల్ అప్లికేషన్ ద్వారా పలు బ్యాంకు ఖాతాల నిర్వహణకు దోహదపడేది) ఆధారిత, యూఎస్‌ఎస్‌డీ (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా (మొబైల్ ఫోన్ ఆధారిత బ్యాంకింగ్) ఆధారిత చెల్లింపులను కూడా విసృ్తత పరచాలి. యూపీ ఐ, యూఎస్‌ఎస్‌డీ ఆధారిత చెల్లింపుల్లో ఉన్న సాంకేతిక సమస్యలను అధిగమిం చేందు కు బ్యాంకర్లు సిద్ధంగా ఉన్నారు. ఇందు కు అవస రమైన మౌలిక వసతులను సమకూర్చు కోవాల్సి ఉంది.
 
 ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం
 శుక్రవారం కమిటీ సభ్యులమంతా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమవుతాం.. రెండు మూడు రోజుల్లో మధ్యంతర నివేదిక ఇస్తాం. నగదు రహిత లావాదేవీలకు ఆర్థికమంత్రి కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటించడం సంతోషకరం. ప్రపంచవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీల అమలును అధ్యయనం చేయాల్సి ఉంది.  ఈ- చెల్లింపులతో సంబంధం ఉన్న అందరు భాగస్వాములతో చర్చలు జరుపుతాం..’ అని చంద్రబాబు చెప్పారు. మొబైల్ కనెక్టివిటీ, ఇంటర్‌నెట్ సామర్థ్యం లేకపోవడం వంటి సమస్యలను ఆయన అంగీక రించారు. వీటన్నింటికీ పరిష్కారం కనుక్కోవాల్సి ఉందన్నారు. అమితాబ్ కాంత్ మాట్లాడుతూ.. ‘మొబైల్‌లో ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థకు అన్ని బ్యాంకింగ్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. సాఫ్ట్‌వేర్ కూడా ఇప్పటికే అందుబాటులో ఉంది. మైక్రో ఏటీఎంలు, పాస్ మిష న్లు, మొబైల్ పాస్ సౌకర్యాలను మరింత అందుబాటులోకి తేవాల్సి ఉంది..’ అని చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement