Caste Reservations
-
కులాలంటే నాకు అసహ్యం: నటుడు మోహన్‌బాబు
తెలుగు సినీ చరిత్రలో మోహన్ బాబు ప్రత్యేకమైన నటుడు. విలన్ తరహా పాత్రలతో కెరీర్ ప్రారంభించిన ఇతడు.. ఆ తర్వాత హీరోగా మారాడు. కొన్నాళ్లకు క్యారెక్టర్ ఆర్టస్టుగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యూనివర్సిటీ రన్ చేస్తున్నారు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కుల వ్యవస్థపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: 'వ్యూహం'టీజర్: కల్యాణ్‌కు బాబు వెన్నుపోటు.. వాడికంత సీన్లేదు!) చెప్పుతో కొడతానన్నా 'అప్పట్లో కులాలు ఉన్నా సరే అందరూ ఆప్యాయంగా పిలుచుకునేవారు. అక్క, అత్త, మామ, అల్లుడు పిలుపులతో కలిసిమెలిసి ఉండేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కులం పేరుతో దూషిస్తున్నారు. అసలు కులాలను ఎవరు కనిపెట్టారు. చిన్నతనంలో నాతోటి వాడిని అంటరానివాడంటే చెప్పుతో కొడతానన్నాను. ఇప్పుడు కులం పిచ్చి మరీ ఎక్కువైంది. ఇది నాశనానికి దారి తీస్తుంది. అందుకే నాకు కులాలంటే అసహ్యం' అని మోహన్‌బాబు చెప్పుకొచ్చారు. 100 మొక్కలు నాటి అలానే 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని మోహన్‌బాబు తన యూనివర్సిటీలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాడు. సమీప గ్రామస్థులతో 100 మొక్కలు నాటి తన వంతు బాధ్యత నెరవేర్చాడు. తన ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులు, జన్మభూమిని, ఆప్తులు, ఆత్మీయులైన తన గ్రామస్తులని ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటానని ఈ సందర్భంగా మోహన్‌బాబు చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: టాయిలెట్స్ శుభ్రం చేసేవాడిని.. సల్మాన్ కామెంట్స్ వైరల్!) -
'26 కులాలకు రిజర్వేషన్ తొలిగింపు..విద్యార్థులకు తీవ్ర నష్టం'
ఢిల్లీ: ఏపీకి చెందిన 26 బీసీ కులాలకు తెలంగాణలో రిజర్వేషన్ పునరుద్ధరణపై బీసీ సంఘాల నేతలు, విద్యార్థులు జాతీయ బీసీ కమిషన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బీసీ కులాల పోరాట కమిటీ అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ..'తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే 26 కులాలకు రిజర్వేషన్ తొలగించింది. 6 దశాబ్దాలుగా ఈ కులాలవారు తెలంగాణలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకుని జీవిస్తున్నారు. గౌడ కులంలో శెట్టిబలిజ ఉపకులంగా ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో శెట్టిబలిజలకు రిజర్వేషన్ లేకుండా పోయింది. తెలంగాణలో స్థిరపడ్డవారంతా భవన నిర్మాణ కార్మికులుగా, వడ్రంగి, టైలరింగ్ వంటి స్కిల్డ్, అన్‌స్కిల్డ్ పనులు చేసుకుంటున్నారు. గత 6ఏళ్లుగా రిజర్వేషన్లు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు' అని పేర్కొన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో వేసిన కేసులో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం లేదని, జాతీయ బీసీ కమిషన్ నివేదిక కోరినా సమర్పించడం లేదని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ కోల్పోయిన 26 కులాలకు వెంటనే రిజర్వేషన్ పునరుద్ధరించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను కోరారు. -
ఈబీసీ రిజర్వేషన్లపై పిల్ ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసింది ఎవరు ? ఎందుకు ? వారి ఉద్దేశం ఏమిటీ? పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి అనుబంధ విద్యార్థి సంఘమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కి ఢిల్లీ యూనివర్శిటీ ఎన్నికల్లో ప్రతి ఏటా మద్దతిస్తున్న ‘యూత్ ఫర్ ఈక్వాలిటీ’ సంఘం ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేయడం గమనార్హం. ఉన్నత చదువుల్లో కూడా ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ 2006–07లో జరిగిన ఆందోళన నుంచి ఈ సంఘం పుట్టుకొచ్చింది. కులాల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం మంచిదే అయినప్పటికీ రిజర్వేషన్లు యాభై శాతానికి మించరాదన్న సుప్రీం కోర్టు ఆంక్షలు ఉల్లంఘిస్తున్న కారణంగా ఈ రిజర్వేషన్ల వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలకు 22.5 శాతం, ఓబీసీలకు 27 శాతం కలిపి మొత్తం 49. 5 శాతం రిజర్వేషన్లు ఇప్పటికే ఉన్న విషయం తెల్సిందే. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలనుకుంటే 27 శాతం ఉన్న ఓబీసీ రిజర్వేషన్లలోనే వీరికి రిజర్వేషన్లు కల్పించాలన్నది ‘యూత్ ఫర్ ఈక్వాలిటీ’ వాదన. అంటే ఓబీసీ రిజర్వేషన్లను 17 శాతానికి కుదించడం సంఘం ఉద్దేశం. ఈ రిజర్వేషన్లు ఎన్నికల సమయంలో తీసుకరావడం అంటే రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది పాలకపక్ష బీజేపీ ఆలోచన అని కూడా సంఘం విమర్శించింది. ఉన్నత వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో భాగంగా ‘యూత్ ఫర్ ఈక్వాలిటీ’ సంఘం పుట్టుకరాగా ఏయిమ్స్‌లో ఆర్థోపేడిక్ సర్జన్‌గా పనిచేస్తున్న కౌశల్ కాంత్ మిశ్రా అధ్యక్షతన ఇది ఏర్పాటయింది. ఆయన అంతకుముందు కాన్పూర్ విద్యార్థిగా ఉన్నప్పుడే 1993లో కులాల ప్రాతిపదిక రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని లేవదీశారు. -
మాదే కులం?
వీరంతా బుడగజంగాలోళ్లు.. ఒకప్పుడు ఊరూరా తిరిగి యాచించే వారు.. ఇప్పుడు బిందెలు, ఆట బొమ్మలు తదితరాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి వీరికి పిల్లలను చదివించుకోవాలన్నా.. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా కుల ధ్రువీకరణ పత్రమడుగుతున్నారు. ఆ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారులు, పాలకులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. వారి కులమేదో తేల్చకుండా ఏళ్ల తరబడి నాన్చుతున్నారు. కర్నూలు, ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణ శివారులోని సద్దాం కాలనీ వెనుక వైపున 30 సంవత్సరాల నుంచి 200 బుడగ జంగాల కుటుంబాలు నివాసముంటున్నాయి.వీరు పిల్లలను స్థానిక స్కూళ్లలో చదివించుకుంటున్నారు. కొందరు చదువులో మంచి ప్రతిభ సైతం కనబరుస్తున్నారు. అయినా, వీరికి స్కాలర్షిప్, హాస్టల్ వసతి, ఉచిత పుస్తకాలు అందని పరిస్థితి నెలకొంది. అవి పొందాలంటే కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకురావాలని విద్యాసంస్థల నిర్వాహకులు తెగేసి చెబుతున్నారు. బుడగ జంగాలకు చెందిన తాము ఎస్సీ కేటగిరీ కిందకు వస్తామని తహసీల్దార్ కార్యాలయాలకెళ్లి దరఖాస్తు చేసుకుంటే వారు పట్టించుకోవడం లేదు. గెజిట్‌లో జిల్లాలో ఎక్కడా బుడగజంగాల కులమే లేదని, దీంతో మీరు ఎస్సీ కాదని తిరస్కరిస్తున్నారు. కనీసం బీసీ కుల ధ్రువీకరణ పత్రాలైనా ఇవ్వమంటే అందుకు అంగీకరించడం లేదు. దిక్కుతోచని పరిస్థితిలో తల్లిదండ్రులు తమ పిల్లల చదువును మధ్యలో ఆపివేసి పనులకు తీసుకెళ్తున్నారు. వైఎస్సార్ మరణంతో ఇబ్బందులు రాష్ట్రంలోని కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బుడగజంగాల కులస్తులు అత్యధికంగా నివసిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 60 వేల మంది దాకా ఉన్నారు. వీరందరినీ ఎస్సీలుగా గుర్తిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి జీఓ జారీ చేశారు. అప్పటికప్పుడు ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేశారు. ఆయన మరణానంతరం బుడజంగాలు కేవలం తెలంగాణలో మాత్రమే ఉన్నారని, ఏపీలో ఎక్కడా లేరని ప్రభుత్వం అనాలోచితంగా జీఓ నంబర్ 44 విడుదల చేసింది. అప్పటి నుంచి అధికారులు వీరికి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీని నిలిపి వేశారు. అయితే, తమదేకులమో తేల్చమని గత కొన్నేళ్లుగా వారు ప్రభుత్వకార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. బాబు కమిషన్ ఏమైందో ? నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్రంలోని బుడజంగాల నాయకులు ప్రతిపక్ష నేత వైఎస్జగన్ మోహన్‌రెడ్డిని కలుసుకుని కలిసి తమ సమస్య వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో నంద్యాలలో వారికున్న 5 వేలకు పైగా ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పడుతాయోనని ఉలిక్కిపడ్డ చంద్రబాబునాయుడు అప్పటికప్పుడు కుల నిర్ధారణకు కమిషన్ వేస్తానన్నారు. అంతేకాదు వారం పదిరోజుల్లో ఆ కమిషన్ పూర్తి నివేదిక ఇస్తుందని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పటికీ ఏడాది గడిచినా అతీగతీ లేదు. -
బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్