తెలుగు సినీ చరిత్రలో మోహన్ బాబు ప్రత్యేకమైన నటుడు. విలన్ తరహా పాత్రలతో కెరీర్ ప్రారంభించిన ఇతడు.. ఆ తర్వాత హీరోగా మారాడు. కొన్నాళ్లకు క్యారెక్టర్ ఆర్టస్టుగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యూనివర్సిటీ రన్ చేస్తున్నారు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కుల వ్యవస్థపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: 'వ్యూహం'టీజర్: కల్యాణ్‌కు బాబు వెన్నుపోటు.. వాడికంత సీన్‌లేదు!)
చెప్పుతో కొడతానన్నా
'అప్పట్లో కులాలు ఉన్నా సరే అందరూ ఆప్యాయంగా పిలుచుకునేవారు. అక్క, అత్త, మామ, అల్లుడు పిలుపులతో కలిసిమెలిసి ఉండేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కులం పేరుతో దూషిస్తున్నారు. అసలు కులాలను ఎవరు కనిపెట్టారు. చిన్నతనంలో నాతోటి వాడిని అంటరానివాడంటే చెప్పుతో కొడతానన్నాను. ఇప్పుడు కులం పిచ్చి మరీ ఎక్కువైంది. ఇది నాశనానికి దారి తీస్తుంది. అందుకే నాకు కులాలంటే అసహ్యం' అని మోహన్‌బాబు చెప్పుకొచ్చారు.
100 మొక్కలు నాటి
అలానే 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని మోహన్‌బాబు తన యూనివర్సిటీలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాడు. సమీప గ్రామస్థులతో 100 మొక్కలు నాటి తన వంతు బాధ్యత నెరవేర్చాడు. తన ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులు, జన్మభూమిని, ఆప్తులు, ఆత్మీయులైన తన గ్రామస్తులని ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటానని ఈ సందర్భంగా మోహన్‌బాబు చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: టాయిలెట్స్ శుభ్రం చేసేవాడిని.. సల్మాన్ కామెంట్స్ వైరల్!)
Comments
Please login to add a commentAdd a comment