CB CID inquiry
-
సీబీ సీఐడీకి జయలక్ష్మి సొసైటీ కేసు విచారణ
కాకినాడ రూరల్: కాకినాడ జిల్లాలో సుమారు రూ.520 కోట్ల వరకు డిపాజిటర్లకు కుచ్చుటోపీ పెట్టి బోర్డు తిప్పేసిన ది జయలక్ష్మి మ్యూచువల్లి ఎయిడెడ్ మల్టీ పర్పస్ (ఎంఏఎం) కో–ఆపరేటివ్ సొసైటీ కేసు విచారణ బాధ్యత సీబీ సీఐడీ చేపట్టనుంది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా సర్పవరం జంక్షన్లో ప్రధాన బ్రాంచ్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 29 బ్రాంచ్‌లు కలిగి బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్న ది జయలక్ష్మి ఎంఎఎం కో–ఆపరేటివ్ సొసైటీ ఆకర్షణీయమైన వడ్డీల పేరిట 19,971 మంది నుంచి డిపాజిట్లను సేకరించింది. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు సుమారు రూ.520 కోట్ల వరకు డిపాజిట్ చేసినట్లు తెలిసింది. కాగా, కాలవ్యవధి పూర్తిచేసుకున్న డిపాజిట్‌దారులకు ఆ మొత్తాన్ని చెల్లించకుండా తిప్పుకుంటుండడంతో.. వారు సంస్థ కార్యాలయం ముందు పలుమార్లు ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్ 6వ తేదీ రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి సంస్థ పాలకవర్గం అదృశ్యమయ్యింది. డిపాజిటర్ల ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసు స్టేషన్‌తో పాటు ఆయా బ్రాంచ్‌ల పరిధిలోనూ పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో ఇప్పటి వరకు రూ.230 కోట్ల మేర అవకతవకలు జరిగాయని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు ‘సహకార’ ఉద్యోగులతో విచారణ కమిటీని నియమించింది. వారి విచారణ గడువు జూన్ 22వ తేదీ (60 రోజులు)తో ముగిసినా.. విచారణ ఇంకా పూర్తి కాలేదు. దీంతో మరో రెండు నెలలు గడువు పొడిగించాలని కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే.. చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు పరారీలో ఉండడం, వారిని ఇంతవరకు పోలీసులు అరెస్టు చేయకపోవడంతో డిపాజిట్ దారులు ఆందోళనకు దిగారు. విచారణను సీబీ సిఐడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో డీజీపీ ఆదేశాల మేరకు ‘జయలక్ష్మి’ కేసును పోలీసులు సీబీ సీఐడీకి అప్పగించారు. సర్పవరం జంక్షన్ వద్దనున్న సంస్థ మెయిన్ బ్రాంచ్‌లో స్వాధీనం చేసుకున్న రికార్డులను పోలీసులు విశాఖలోని ఆర్ఐఓ కార్యాలయంలో సీబీ సీఐడీ అధికారులకు అప్పగించారు. -
‘ఇందిరమ్మ’ అవినీతిపై సీబీసీఐడీ విచారణ
డిండి : మండలంలోని నెమిలిపూర్ గ్రామ పంచాయతీలో ఇం దిరమ్మ ఇళ్ల అవినీతిపై గురువారం సీబీసీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ గ్రామంలో మొత్తం 219 ఇళ్లు మంజూరు కాగా 198 పూర్తయ్యాయి. ఇద్దరు ఉద్యోగులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోగా, ఒకే ఇంటిపై ముగ్గురు బిల్లులు తీసుకున్నట్లు విచారణలో తేలిందని సీబీసీఐడీ డీఎస్పీ రామచంద్రుడు తెలి పారు. అలాగే ఒకరు పాత ఇంటిపై బిల్లు తీసుకోగా 27 మంది ఊరిలో లేనివారి పేరుమీద బిల్లు తీసుకున్నట్లు తేలిందన్నారు. విచారణలో సీబీసీఐడీ ఇన్స్పెక్టర్లు తిర్పతిరావు, రాజ న్న, ఎస్ఐ బాసిద్, డిండి ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, గృహ నిర్మాణశాఖ డీఈ బన్సీలాల్, ఐదుగురు ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. ముగిసిన సీబీసీఐడీ విచారణ హాలియా: గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ పథకంలో ఇళ్లనిర్మాణంలో జరిగిన అవినీతిపై చేపట్టిన సీబీసీఐడీ విచారణ గురువారం ముగిసింది. మండలంలోని కొత్తపల్లి, చల్మారెడ్డిగూడెం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఆరు రోజులుగా విచారణ నిర్వహించినట్లు సీబీసీఐడీ డీఎస్పీ రాంచంద్రుడు తెలిపారు. ఆయా గ్రామాలకు సంబంధించిన నివేదికను ఈ నెల 20న ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. -
నకి‘లీలలు’ వెలుగుచూసేనా..?
ఖమ్మం, న్యూస్‌లైన్: నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులపై సీబీసీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. విద్యాశాఖాధికారులు చేసిన విచారణ ఎటూ తేలకపోవడంతో నకిలీలను సీబీసీఐడీ అయినా బట్టబయలు చేస్తుందా అనేది చర్చనీయాంశమైంది. గురువారం వీటికి సంబంధించిన దర్యాప్తును సీబీసీఐడీ డీఎస్పీ సంజీవరావు ప్రారంభించారు. జిల్లాలో ఉన్న ఉపాధ్యాయుల వివరాలను తీసుకున్నారు. యూనివర్సిటీల్లో పరీక్షలు రాసిన ఉపాధ్యాయుల హాల్‌టికెట్ నంబర్లు, మార్కుల జాబితా, యూనివర్సిటీ వివరాలు జిల్లా విద్యాశాఖాధికారుల నుంచి సేకరించారు. డీఈఓ రవీంద్రరనాధ్రెడ్డితో ఈ విషయంపై చర్చించారు. డీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నకిలీ ఇంగ్లిష్ టీచర్ల వ్యవహారంపై తీసుకున్న చర్యలు, ఉన్నతాధికారులకు సమర్పించిన జాబితా, ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలపై స్పందించిన తీరు వివరాలను లిఖిత పూర్వకంగా తీసుకున్నారు. దీంతో నకిలీ ఇంగ్లిష్ టీచర్లలో ఆందోళన మొదలైంది. 2009లో ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల నుంచి తీసుకొచ్చిన సర్టిఫికెట్లను సమర్పించి దొడ్డిదారిన పదోన్నతులు పొందారని, ఒరిజినల్ ఇంగ్లిష్ టీచర్స్ ఫోరం నాయకులు లోక్ అదాలత్‌కు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. లోక్ అదాలత్ విచారణలో భాగంగా కొద్దిరోజుల క్రితం జిల్లాలోని 66 మంది ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ల వివరాలను డీఈఓ కార్యాలయ సిబ్బంది హైదరాబాద్‌లోని ఉన్నత విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించారు. సమాజానికి మార్గదర్శకులుగా ఉండాల్సిన ఉపాధ్యాయులే నకిలీ వ్యవహారంలో భాగస్వాములు కావడంతో మండిపడ్డ ఉన్నతాధికారులు నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు సీబీసీఐడీకి అప్పగించారు. ఆ శాఖాధికారులు ఈ వ్యవహారంపై మొదటినుంచి కూపీ లాగడంతో దొడ్డిదారి వ్యవహారం బట్టబయలు అవుతుందని ‘నకిలీ’లలో ఆందోళన మొదలైంది. ఈ వ్యవహారం బయటపడితే డబ్బుతో పాటు పరువూ పోతుందని, సహచర ఉపాధ్యాయుల ఎదుట తలెత్తుకుని తిరగలేమని పలువురు మథనపడుతున్నారు. నాలుగు సంవత్సరాలుగా వివిధ రకాలుగా విచారణ చేపట్టి ఎటూ తేల్చని ఈ వ్యవహారం సీబీసీఐడీ అధికారుల చేతుల్లోకి రావడంతో వీరైనా నిజానిజాలను నిగ్గుతేల్చి తమకు న్యాయం చేస్తారో.. లేదో అని ఒరిజినల్ ఇంగ్లిష్ టీచర్స్ ఫోరం నాయకులు వేచి చూస్తున్నారు.