డిండి : మండలంలోని నెమిలిపూర్ గ్రామ పంచాయతీలో ఇం దిరమ్మ ఇళ్ల అవినీతిపై గురువారం సీబీసీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ గ్రామంలో మొత్తం 219 ఇళ్లు మంజూరు కాగా 198 పూర్తయ్యాయి. ఇద్దరు ఉద్యోగులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోగా, ఒకే ఇంటిపై ముగ్గురు బిల్లులు తీసుకున్నట్లు విచారణలో తేలిందని సీబీసీఐడీ డీఎస్పీ రామచంద్రుడు తెలి పారు. అలాగే ఒకరు పాత ఇంటిపై బిల్లు తీసుకోగా 27 మంది ఊరిలో లేనివారి పేరుమీద బిల్లు తీసుకున్నట్లు తేలిందన్నారు. విచారణలో సీబీసీఐడీ ఇన్‌స్పెక్టర్లు తిర్పతిరావు, రాజ న్న, ఎస్‌ఐ బాసిద్, డిండి ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు, గృహ నిర్మాణశాఖ డీఈ బన్సీలాల్, ఐదుగురు ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.
ముగిసిన సీబీసీఐడీ విచారణ
హాలియా: గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ పథకంలో ఇళ్లనిర్మాణంలో జరిగిన అవినీతిపై చేపట్టిన సీబీసీఐడీ విచారణ గురువారం ముగిసింది. మండలంలోని కొత్తపల్లి, చల్మారెడ్డిగూడెం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఆరు రోజులుగా విచారణ నిర్వహించినట్లు సీబీసీఐడీ డీఎస్పీ రాంచంద్రుడు తెలిపారు. ఆయా గ్రామాలకు సంబంధించిన నివేదికను ఈ నెల 20న ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు ఆయన చెప్పారు.
‘ఇందిరమ్మ’ అవినీతిపై సీబీసీఐడీ విచారణ
Published Fri, Aug 15 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM
Advertisement