CBI clean sheet
-
ఆ ఆరోపణలపై సీబీఐతో విచారణ చేసే దమ్ముందా..?
హైదరాబాద్ : బీజేపీ సర్కార్‌పై వచ్చిన ఆరోపణలపై సీబీఐతో విచారణ చేసే దమ్ముందా..? అని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ..అమిత్ షా కుమారుడు అజయ్ షా, రాపెల్, విజయ్ మాల్యా, అదాని, ముకేష్ అంబానీ తదితరుల ఆరోపణలపై సీబీఐ విచారణకు అదేశించాలని బీజేపీని కోరారు. సీబీఐ విచారణకు అదేశించి... మీ పాలన పారదర్శకంగా ఉందని నిరూపించుకోండని హితవు పలికారు. మోదీ ప్రధానిగా ఉండి ఎన్నికల నియమావళిని పాటించలేదని, గుజరాత్ ఎన్నికల్లో మోదీ సెంటిమెంట్‌తో ప్రజలను రెచ్చగొట్టి ఓట్లేయించుకున్నారని ఆరోపించారు. ఆరేళ్ల క్రితం 2జీ స్కామ్ పై యూపీఏ పై ఆరోపణలు వచ్చాయని, ముఖ్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు 2జీ ద్వారా రూ. లక్షా 75 వేల కోట్ల నష్టం జరిగిందని ఆరోపించారు. దీని పై కాంగ్రెస్ పార్టీ సీబీఐ విచారణకు ఆదేశించిందని తెలిపారు. ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజా, కనిమౌళిలకు సీబీఐ కోర్టు క్లీన్చిట్ ఇచ్చిందని, కోర్టు జడ్జిమెంటును తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. సర్కార్ పైసా కేసీఆర్ డబ్బాగా తెలుగు ప్రపంచ మహాసభలు జరిగాయని షబ్బీర్ అలీ విమర్శించారు. -
అమిత్ షాకు సీబీఐ క్లీన్చిట్
ఇషత్ ్రజహాన్ ఎన్కౌంటర్ కేసులో ఊరట అహ్మదాబాద్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సన్నిహితుడు, గుజరాత్ మాజీ హోం మంత్రి అమిత్ షాకు ఊరట. 2004లో సంచలనం సృష్టించిన ఇషత్ ్రజహాన్ ఎన్కౌంటర్ కేసులో షాకు సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. ‘‘ఆ ఉదంతంలో షా పాత్రను నిరూపించేందుకు తగినన్ని సాక్ష్యాధారాల్లేవు. అందుకే ఆయనపై చార్జిషీట్ దాఖలు చేయలేదు. ఎఫ్ఐఆర్లో కూడా ఆయన పేరు చేర్చలేదు’’ అని సీబీఐ ఇన్స్పెక్టర్ విశ్వాస్‌కుమార్ మీనా బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ కేసులో షాతో పాటు అప్పటి అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్ కౌశిక్‌లపై నేరాభియోగాలు మోపాలంటూ ఆ ఎన్కౌంటర్లో ఇషత్‌త్రో పాటు మరణించిన జావెద్ షేక్ అలియాస్ ప్రాణేశ్ పిళ్లై తండ్రి గోపీనాథ్ పిళ్లై పెట్టుకున్న అర్జీని కూడా కొట్టేయాల్సిందిగా కోరారు. 2004 జూన్ 15న జరిగిన ముంబైకి చెందిన కాలేజీ విద్యార్థిని ఇషత్ ్రజహాన్ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. ఆమెతో పాటు ప్రాణేశ్ పిళ్లై, అమ్జదలీ అక్బరలీ రాణా, జీషన్ జోహర్లను కూడా గుజరాత్ పోలీసులు కాల్చి చంపారు. వారంతా లష్కరే తోయిబా ఉగ్రవాదులని, మోడీని చంపేందుకు కుట్ర పన్నారని వాదించారు. కానీ అది నిజం కాదని, వారిది బూటకపు ఎన్కౌంటరని 2013లో సీబీఐ తేల్చడమే గాక ఏడుగురు గుజరాత్ పోలీసు అధికారులపై అభియోగాలు నమోదు చేసింది. -
నేను క్లీన్.. మరి నువ్వో..!
* కేసీఆర్‌ను ప్రశ్నించిన పొన్నాల * సీబీఐ నాకు క్లీన్చిట్ ఇచ్చింది * నీపై ఉన్న కేసుల సంగతేంటి? సాక్షి, హైదరాబాద్: సీబీఐ, లోకాయుక్త సంస్థలు తనకు క్లీన్చిట్ ఇచ్చాయని, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఉన్న ఆరోపణలకు ఏ సంస్థ క్లీన్చిట్ ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఆయనపై ఇప్పటికీ అక్రమ పాస్‌పోర్టులు, మనుషుల అక్రమ రవాణా కేసులున్నాయని గుర్తు చేశారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న కేసీఆర్ ముందుగా ఆయనపై ఉన్న ఆరోపణలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఒకసారి దేవత, మరోసారి బలిదేవత అంటూ కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు నీచ, నికృష్టమైనవని విమర్శించారు. మోసానికి, వంచనకు, అవకాశవాదానికి ఆయన ప్రతిరూపమని విమర్శించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న కేసీఆర్ ఆ తర్వాత మహాకూటమితో జతకట్టారని, 2009లో ఫలితాలు రాకముందే బీజేపీ పంచన చేరిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. యూపీఏ ప్రభుత్వం 2009లో తెలంగాణను ప్రకటిస్తే అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు... కేసీఆర్ కు గురువేనన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీతో పనైపోవడంతో.. ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకమైన మూడో కూటమికి మద్దతిస్తానని కేసీఆర్ కొత్త పల్లవి ఎత్తుకున్నారని పొన్నాల మండిపడ్డారు. మూడో కూటమిలో ఉన్న సీపీఎం, టీఎంసీ, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలు పార్లమెంట్లో తెలంగాణ బిల్లును వ్యతిరేకించిన విషయాన్ని కేసీఆర్ మరిచిపోయాడన్నారు. సీమాంధ్ర ఉద్యోగులంతా వెళ్లిపోవాల్సిందేనని, ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘ఉద్యోగులకు ఆప్షన్ విషయాన్ని కమలనాథన్ కమిటీ పరిశీలిస్తోంది. ఈ విషయంలో తెలంగాణ ఉద్యోగుల అభిప్రాయమే కాంగ్రెస్ అభిప్రాయం. ఇందులో మరొక దానికి తావులేదు’అని పొన్నాల పేర్కొన్నారు. కొప్పులతో కాంగ్రెస్‌కు నష్టం: మానవతారాయ్ ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చుతున్నారని ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకుడు, ఓయూ జేఏసీ నేత మానవతారాయ్ ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడే తనలాంటి వారికి టికెట్ రాకుండా రాజు అడ్డుకున్నారన్నారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పరిస్థితి, అభ్యర్థుల గురించి సోనియా, రాహుల్‌కు కొప్పుల తప్పుడు సమాచారమిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రాకు చెందిన కొప్పులకు గాంధీభవన్‌లో పనేముందని ప్రశ్నించారు. జైపూర్ డిక్లరేషన్‌కు భిన్నంగా టికెట్ల కేటాయింపు జరిగిందని, సోనియా దృష్టికి తీసుకెళతానని మానవతారాయ్ చెప్పారు.