CBI judge
-
సుప్రీం తీర్పుపై అన్నీ సందేహాలే!
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర ప్రత్యేక జడ్జీ బ్రిజ్గోపాల్ హరికిషన్ లోయా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంపై స్వతంత్య్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు గురువారం నాడు నిర్ద్వంద్వంగా కొట్టివేసిన విషయం తెల్సిందే. లోయా మరణించిన రోజున ఆయన పక్కనే ఉన్న నలుగురు జడ్జీలు ఇచ్చిన వాంగ్మూలాన్ని శంకించడం అంటే న్యాయవవస్థను శంకించడమేనని, భారత పౌరుల స్వేచ్ఛకు సంబంధించిన అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నప్పుడు కోర్టుల విలువైన సమయాన్ని ఇలా వృధా చేయడం సమంజసం కాదని, ఈ కేసులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దుర్వినియోగం అయిందంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నాయకత్వంలోని త్రిసభ్య బెంచీ వ్యాఖ్యానించింది. దీపక్ మిశ్రా బెంచీ ఇచ్చిన తీర్పుపై, ఆయన చేసిన వ్యాఖ్యలపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 2014 నవంబర్ 30వ తేదీ అర్ధరాత్రా లేదా ఆ మరుసటి రోజు డిసెంబర్ ఒకటవ తేదీన లోయా మరణించారా ? అన్న విషయంలో స్పష్టత లేదు. గుండెపోటు వచ్చిన లోయాను ముందు డాండే ఆస్పత్రికి తీసుకెళ్లారా లేదా మెడిత్రినా ఆస్పత్రికి తీసుకెళ్లారా అన్న అంశంలో పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన జడ్జీలను అనుమానిస్తే న్యాయవ్యవస్థనే శంకించడమని ధర్మాసనం మాట్లాడింది. ముందురోజే ఈసీజీ తీసినప్పుడు ఆయనకు గుండె బాగుందని, ఆ మరునాడు చనిపోయారని, అసలు ఈసీజేనే తీయలేదని, ఆస్పత్రిలోని ఈసీజీ మిషన్ పనిచేయలేదని, ఆయన ఈసీజీ బాగానే ఉందిగానీ, ఆ తర్వాత ఆయన మెట్లు ఎక్కి ఆస్పత్రి పైఅంతస్తులోకి రావడం వల్ల ఆయనకు గుండె పోటు వచ్చి ఉండవచ్చని... రకరకాలుగా రెండు ఆస్పత్రి వర్గాలు పరస్పర భిన్న కథనాలను వెల్లడించినా అనుమానించకూడదా? భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రధాన నిందితుడిగా ఉన్న సంచలనం సృష్టించిన షొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు విచారణ ముగించి తీర్పును వెల్లడించడమే తరువాయిగా ఉన్నప్పుడు నాగపూర్ పెళ్లికి వెల్లి అక్కడ అనుమానాస్పద పరిస్థితుల్లో లోయా మరణిస్తే అనుమానించకూడదా? ఈ కేసు విచారణ సందర్భంగా ఆయన ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నారని స్నేహితులతోపాటు కుటుంబ సభ్యులు వెల్లడించినప్పుడు కూడా అనుమానించకూడదా? తన కుమారుడికి ఎప్పుడు గుండె జబ్బులేదని, షొహ్రాబుద్ధీన్ ఎన్కౌంటర్ కేసును కొట్టివేస్తే వంద కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఒత్తిళ్లు వచ్చాయంటూ కన్న తండ్రే, సోదరి ఆరోపించినప్పుడు, కారావాన్ మాగజైన్ లోయ అనుమానాస్పద మృతిపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించినప్పుడు అనుమానించకూడదా? లోయా స్థానంలో బదిలీపై వచ్చిన జడ్జీ కేసు పూర్వపరాలను సరిగ్గా పరిశీలించకుండానే వారం రోజుల్లో షొహ్రాబుద్ధీన్ ఎన్కౌంటర్ కేసును కొట్టివేస్తే అనుమానించకూడదా? కేసులో కీలకసాక్ష్యులైన 50 మందిలో కొందరు హత్యకు గురై, మిగతా వారు వారం రోజుల్లోనే ప్రాసిక్యూషన్‌కు ఎదురు తిరిగితే అనుమానించకూడదా? కేసుల దర్యాప్తునకు నెలలు, సంవత్సరాలు తీసుకునే పోలీసులు కారావాన్ మాగజైన్ కథనంపై ఐదు రోజుల్లో దర్యాప్తు ముగించి నలుగురు జడ్జీల నుంచి తీసుకున్న వాంగ్మూలాన్ని మాత్రం విశ్వసించాలా? ప్రశాంత్ భూషణ్ లాంటి సీనియర్ లాయరు ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేస్తే విశ్వసించరా? అది న్యాయవ్యవస్థను శంకించడం, కోర్టు సమయాన్ని వృధా చేయడమా ? ‘మెడికల్ కౌన్సిల్ ఆప్ ఇండియా’ లంచం కేసులో సీనియర్ జడ్జీలపైనే అవినీతి ఆరోపణలు వచ్చినా, నలుగురు సీనియర్ సుప్రీం కోర్టు జడ్జీలు ఎన్నడూలేని విధంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధాన న్యాయమూర్తి ప్రవర్తననే ప్రశ్నించినా న్యాయవ్యవస్థను అనుమానించకూడదా? అసాధ్యమైన కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తీసుకురావాలంటూ, సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని ఆలపించాలంటూ, యోగాను నిర్బంధ విద్యగా ప్రవేశపెట్టాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను విచారించేందుకు సుప్రీం కోర్టు వద్ద సమయం ఉంటుంది. ఆధార్ కార్డులపై కొన్నేళ్లుగా విచారణ కొనసాగించడానికి సమయం ఉంటుంది. లోయా మృతి లాంటి కీలక కేసులో పిటిషన్ విచారించే సమయం ఉండదా? జడ్జీ హరికిషన్ లోయా గుండెపోటుతోనే మరణించి ఉండవచ్చు. ఆయన్ని ఎవరూ హత్యచేసి ఉండకపోవుచ్చు. ఆ విషయాన్ని స్పష్టంగా తేల్చడానికైనా స్వతంత్య్ర దర్యాప్తు అవసరం కదా! అప్పుడు న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత గౌరవం పెరుగుతుందికదా! న్యాయ వ్యవస్థనే ఇలా తీర్పు చెబితే ఇక తామెక్కడికి న్యాయం కోసం వెళ్లగలమంటూ తీర్పు తర్వాత లోయా కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించారంటే అర్థం ఏమిటీ? ‘ఏ కేసులోనైనా న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్లు స్పష్టంగా కనిపించడం ముఖ్యం’ అన్న కీలక సూత్రాన్ని సూక్తిగా బోధించినది కూడా సుప్రీం కోర్టే కదా! -
లోయాది సహజ మరణమే
న్యూఢిల్లీ: సీబీఐ మాజీ న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతిపై స్వతంత్ర విచారణ కోరుతూ వచ్చిన వివిధ పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఆయనది సహాజ మరణమేననీ, న్యాయ వ్యవస్థను అపఖ్యాతి పాల్జేసేందుకే దురుద్దేశంతో ఈ పిటిషన్లను వేశారనీ, దీనిని తీవ్ర చర్యగా పరిగణిస్తున్నామని పేర్కొంది. లోయా మృతికి సంబంధించిన అన్ని పిటిషన్లపై విచారణ ఇక ఈ తీర్పుతో ముగిసినట్లేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్ల వెనుక రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలున్నాయనీ, న్యాయవ్యవస్థపై బురదజల్లాలనే దురుద్దేశంతోనే పిటిషన్లు వేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. లోయా మృతికి దారితీసిన పరిస్థితులపై నలుగురు న్యాయమూర్తులు ఇచ్చిన వాంగ్మూలాలను అనుమానించడానికి కారణం లేదనీ, లోయాది సహాజ మరణమేనని రికార్డులను పరిశీలిస్తే స్పష్టమవుతోందని పేర్కొంది. సీనియర్ న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలైన దుష్యంత్ దవే, ఇందిరా జైసింగ్, ప్రశాంత్ భూషణ్ తదితరులు లోయా మృతిపై స్వతంత్ర విచారణ కోరుతూ పిటిషన్లు వేశారు.కోర్టుల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసేలా, న్యాయవ్యవస్థకు చెడ్డపేరు తెచ్చేలా వీరు ఈ పిటిషన్ల రూపంలో ప్రయత్నం చేస్తున్నారని విమర్శించింది.‘వాణిజ్య వివాదాలను మార్కెట్లో పరిష్కరించుకోవాలి. రాజకీయ విభేదాలను ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి. చట్టాన్ని పరిరక్షించడం న్యాయస్థానాల బాధ్యత’ అని జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో పేర్కొన్నారు. జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు మహారాష్ట్రకు చెందిన వారు కాబట్టి లోయా మృతికేసును బాంబే హైకోర్టులో విచారించిన న్యాయమూర్తులు వారికి తెలిసి ఉంటారనీ, కాబట్టి వారిద్దరూ ఈ కేసును విచారించకూడదని ప్రశాంత్ భూషణ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీన్ని కూడా కోర్టు తీవ్రంగా పరిగణించింది.న్యాయమూర్తులపై అసంబద్ధ ఆరోపణలు చేయడం తగదంది. పిటిషనర్లపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకుందామని తొలుత అనుకున్నామనీ, కానీ తర్వాత వెనక్కు తగ్గామని ధర్మాసనం తెలిపింది. కాగా, సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు ఈ ఏడాది జనవరి 12న మీడియా ముందుకు వచ్చి.. బీహెచ్ లోయా మృతి కేసు సహా పలు సున్నితమైన కేసుల కేటాయింపులో సరైన విధానాన్ని ప్రధాన న్యాయమూర్తి అవలంభించడం లేదంటూ ఆరోపణలు చేయడం తెలిసిందే. దేశ చరిత్రలోనే దుర్దినం: కాంగ్రెస్ జడ్జి లోయా మృతిపై సుప్రీం తీర్పు దేశ చరిత్రలోనే దుర్దినమని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. మృతిపై నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేసింది. సుప్రీంలో ఈ పిటిషన్ల దాఖలు వెనుక రాహుల్ హస్తముందన్న బీజేపీ ఆరోపణల్ని కాంగ్రెస్ ప్రతినిధి సూర్జేవాలా ఖండించారు. ‘ఈరోజు దేశ చరిత్రలోనే అత్యంత దుర్దినం. న్యాయవ్యవస్థపై నమ్మకమున్నవారికి లోయా అనుమానాస్పద మృతి ఘటన తీవ్ర ఆందోళన కలిగించే విషయం. తీర్పు పూర్తిస్థాయి కాపీని ఇంకా చూడలేదు. కానీ న్యాయవ్యవస్థపై నమ్మకమున్నవారికి ఇంకా పలు అనుమానాలు ఉన్నాయి. మృతికి సంబంధించిన నిజాలు ఏదో ఒకరోజు వెలుగులోకి వస్తాయి’ అని అన్నారు. లోయా కేసులో ఇప్పటివరకూ ఎలాంటి విచారణ జరగకపోవడాన్ని గుర్తుచేశారు. మరోవైపు రాహుల్ ట్వీటర్లో స్పందిస్తూ.. ‘భారతీయులు తెలివైనవాళ్లు. బీజేపీ నేతలతో సహా చాలామంది భారతీయులు అమిత్ షాకు సంబంధించిన నిజాలను ఇట్టే అర్థం చేసుకోగలరు.’ అని ట్వీట్ చేశారు. పిల్ వెనుక రాహుల్ హస్తం: బీజేపీ జస్టిస్ లోయా మృతిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వెనుక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అదృశ్య హస్తం ఉందని బీజేపీ ఆరోపించింది. జస్టిస్ లోయాది సహజమరణమేనని తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ తమకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. న్యాయవ్యవస్థను వాడుకుని కాంగ్రెస్ అమిత్ పై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని బీజేపీ ప్రతినిధి సంబిత్ ఆరోపించారు. స్వతంత్ర విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్రపతిని రాహుల్ కలవడం సిగ్గు చేటని ఇది ప్రజాస్వామ్యాన్ని, న్యాయవ్యవస్థని తప్పుదారి పట్టించడమేనని ఆయన అన్నారు. కేంద్రమంత్రి నఖ్వీ సుప్రీం కోర్టు తీర్పుపై స్పందిస్తూ...తమ పార్టీ అధినాయకత్వాన్ని దెబ్బతీయాలని కాంగ్రెస్ చేసిన కుటిల యత్నాలను సుప్రీం కోర్టు తీర్పు తిప్పి కొట్టిందని..ఇప్పటికైనా ఆపార్టీ ఇటువంటి ప్రయత్నాలు మానుకుని తమకు క్షమాపణలు చెప్పాలన్నారు. రాజకీయ ప్రయోజనాలకోసం న్యాయవ్యవస్థను ఎవరూ తప్పుదోవ పట్టించలేరని సుప్రీం తీర్పు రుజువు చేసిందని హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ ట్వీట్‌చేశారు. చివరి ఆశ కూడా పోయింది: లోయా కుటుంబసభ్యులు ముంబై: స్వతంత్ర విచారణను సుప్రీంకోర్టు తిరస్కరించడంపై లోయా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై లోయా మామ శ్రీనివాస్ మాట్లాడారు. ‘తీర్పు మా అంచనాలకు తగ్గట్లుగా లేదు. అనుమానాలకు సమాధానాలు దొరకలేదు. ఈ కేసులో మేం ఇక ఎవ్వరిపైనా ఎలాంటి ఆశలు పెట్టుకోలేం. ఈ కేసులో ప్రతీ అంశాన్ని వాళ్లు మేనేజ్ చేసినట్లు కన్పిస్తోంది. మీడియా, ప్రతిపక్షాలు ఆందోళనలు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండేట్లు లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వాస్తవం వెలుగులోకి వస్తుందన్న ఒకే ఒక్క నమ్మకం కూడా సుప్రీం తీర్పుతో పోయింది. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇంకా మాట్లాడటానికేం మిగల్లేదు’ అని లోయా సోదరి అనురాధ వాపోయారు. కాగా, తీర్పు అనంతరం లోయా కుమారుడు అనూజ్ అందుబాటులో లేకుండా పోయారు. నేపథ్యమిదీ.. గుజరాత్లో 2005లో సోహ్రబుద్దీన్ షేక్, అతని భార్య కౌసÆŠ, వారి సన్నిహితుడు తులసీరామ్ ప్రజాపతిని పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేసి చంపేసిన కేసులో ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు, నాటి గుజరాత్ హోం మంత్రి అమిత్ షా గతంలో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బ్రిజ్గోపాల్ హరికిషన్ లోయా 2014 డిసెంబర్ 1న మృతి చెందగా, ఆ తర్వాత ఆయన స్థానంలో వచ్చిన జడ్జి గోసావి అమిత్‌ను నిర్దోషిగా ప్రకటించారు. లోయా మృతి, తదనంతరం జరిగిన ఘటనలు 2014, డిసెంబర్ 1: నాగ్‌పూర్‌లో సహచరుడి కూతురి పెళ్లికి వెళ్లిన లోయా అక్కడే గుండెపోటుతో మృతిచెందారు. 2018 జనవరి 11: లోయా మృతిపై స్వతంత్ర విచారణ జరిపేందుకు ఆదేశాలివ్వాలంటూ వచ్చిన 2 పిటిషన్లను స్వీకరించిన సుప్రీంకోర్టు జనవరి 12: లోయా మృతి తీవ్ర అంశమనీ, దీనిపై స్పందన తెలపాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం జనవరి 22: పిటిషన్లలో పేర్కొన్నవి తీవ్ర అంశాలంటూ లోయా మృతిపై బాంబే హైకోర్టులో ఉన్న రెండు కేసులను తన వద్దకే తెప్పించుకున్న సుప్రీంకోర్టు ఫిబ్రవరి 12: లోయా మరణించినప్పుడు ఆయన పక్కన ఉన్న నలుగురు న్యాయమూర్తుల వాంగ్మూలాలను బట్టి ఆయనది సహజమరణమేనని సుప్రీంకోర్టుకు తెలిపిన మహారాష్ట్ర ప్రభుత్వం మార్చి 8: కేసు వేసిన వారినే గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నారనీ, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమీ అడగడం లేదంటూ న్యాయమూర్తులపై సీనియర్ న్యాయవాది ఆరోపణలు. ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు మార్చి 16: లోయా మృతిపై విచారణ కోరుతూ వచ్చిన పిటిషన్లపై తీర్పును రిజర్వ్‌లో పెట్టిన సుప్రీంకోర్టు. ఏప్రిల్ 19: పిటిషన్లను తిరస్కరిస్తూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు -
‘బరువు తగ్గాలా....సీబీఐకి ఫోన్ చేయండి’
న్యూఢిల్లీ : బరువు తగ్గడానికి మనలో చాలామంది చాలా రకాల ప్రయత్నాలే చేస్తుంటారు. జిమ్‌కి వెళ్లడం, వర్కవుట్లు చేయడం, ఆయసం వచ్చేలా పరుగులు పెట్టడం ఇవన్నీ బరువు తగ్గే ప్రక్రియలో భాగంగా ఎంచుకుంటుంటారు. అయితే ఈ ఆపసోపాలేమీ పడక్కర్లేదట. బరువు తగ్గాలనుకునే వారందరికి సులువైన ఉపాయం చెప్తా అంటున్నారు కార్తీ చిదంబరం. అది ఏంటో ఆయన మాటల్లోనే విందాం...‘బరువు తగ్గాలనుకునే వారు జిమ్‌కు వెళ్లి కష్టపడక్కర్లేదు. కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. సీబీఐ కస్టడీలో ఉంటూ వారి కాంటీన్ తిండి తింటే చాలు. వెంటనే బరువు తగ్గిపోతారు. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న నేను చాలా తక్కువ తింటున్నాను. ఫలితంగా చాలా బరువు కోల్పోయాను. ఇప్పుడు నేను కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఎందుకంటే పాత బట్టలన్ని లూజ్ అయిపోయాయి'' అని తెలిపారు. 12 రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్న కార్తీ చిదంబరాన్ని సోమవారం న్యూఢిల్లీలోని తీహార్ జైలుకు పంపించారు. ఈ సందర్భంగా తన భద్రత దృష్ట్యా తీహార్ జైలులో తనకు ప్రత్యేక గదిని, బాత్రూమ్ని కేటాయించాలని కోర్టును అభ్యర్థించారు. అయితే సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి సునీల్ రాణా ఈ అభ్యర్థనను తిరస్కరించారు. జైలు అధికారులే కార్తీ భద్రతకు హామీ ఇవ్వాలని ఆదేశించారు. తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని, ఒకవేళ కోర్టు ఆదేశిస్తే ఇంటి నుంచి వచ్చే ఆహారాన్ని అనుమతిస్తామని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఐఎన్ఎక్స్ కేసులో కార్తీ చిదంబరం నిందితుడిగా ఉన్నారు. తన తండ్రి పి. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ముఖర్జీల ఐఎన్ఎక్స్ మీడియా కంపెనీకి రూ.305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు క్లియరెన్స్ ఇప్పించడం కోసం వారి వద్ద నుంచి రూ. 3 కోట్లకు పైగా ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇంద్రాణి ముఖర్జీ స్టేట్మెంట్ను కూడా సీబీఐ రికార్డు చేసింది. ప్రస్తుతం ఐఎన్ఎక్స్ మీడియా హౌజ్‌కు సహవ్యవస్థాపకులైన ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ ముఖర్జీలు కూడా కుమార్తె షీనా బోరాను హత్య కేసులో జైలులో ఉన్నారు. పీటర్ ముఖర్జీని ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కస్టడీకి తీసుకోనున్నామని సీబీఐ తెలిపింది. గత నెల 28న కార్తి చిదంబరాన్ని చెన్నై ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఆ నలుగురు జడ్జీలు చెప్పినా నమ్మరా?
న్యూఢిల్లీ : సీబీఐ జడ్జి బీహెచ్ లోయా మరణించిన రోజున అతనితో ఉన్న నలుగురు న్యాయమూర్తులు.. అది సహజ మరణమేనని చెప్పారని, వారి వాంగ్మూలాల్ని సందేహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. లోయా కేసులో మహారాష్ట్ర తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. ‘లోయాది సహజ మరణమేనంటూ నలుగురు జడ్జీలు(కులకర్ణి, బార్దే, మోదక్, ఆర్ఆర్ రతి) ఇచ్చిన వాంగ్మూలాలు నమ్మదగినవి. 2014 నవంబర్ 29 – డిసెంబర్ 1 మధ్య వారు లోయాతోనే ఉన్నారు. వాంగ్మూలాలపై ఆ నలుగురి సంతకాలు ఉన్నాయి. అలాంటప్పుడు అవి నమ్మదగినవి కావా?’ అని రోహత్గీ ప్రశ్నించారు. ఒకవేళ ఆ వాంగ్మూలాల్ని మీరు(కోర్టు) తిరస్కరించాలనుకుంటే.. వారిని సహకుట్రదారులుగా ప్రాథమికంగా అంగీకరిస్తున్నట్లేనని అన్నారు. -
ఇది చాలా ప్రమాదకరమైన అంశం : సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ న్యాయమూర్తి బ్రిజ్గోపాల్ హర్కిషన్ లోయా మృతి కేసుపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇది ఎంతో ప్రమాదకరమైన అంశమని ధర్మాసనం పేర్కొంది. నిజాయితీపరుడైన ఓ న్యాయమూర్తి చనిపోతే నిర్లక్ష్యం వహించటం సమాజానికి తప్పుడు సంకేతాలు అందిస్తుందని తెలిపింది. ‘‘లోయా మృతి చుట్టూ అల్లుకున్న అనుమానాలు నివృత్తి అయితేనే సాధారణ పౌరుడిలో న్యాయవ్యవస్ధ సామర్థ్యం, నిజాయితీల పట్ల విశ్వాసం పునరుద్ధరింపబడుతుంది’’ అని వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి పత్రాలను, నివేదికలను సోమవారం తమకు సమర్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బెంచ్ ఆదేశించింది. వివాదాస్పద సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో వాదనలు వింటున్న లోయా.. సరిగ్గా తీర్పు వెలువరించటానికి కొద్దిరోజుల ముందు మృతి చెందారు. అయితే ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మహారాష్ట్రకు చెందిన ‘బీఆర్ లోనే’ అనే పాత్రికేయుడు పిటిషన్ దాఖలు చేశారు. షోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో బీజేపీ చీఫ్ అమిత్ షాతోపాటు పలువురు నేతలు, పోలీస్ అధికారుల పేర్లు కూడా వినిపించాయి. అసలేం జరిగింది... 2014 డిసెంబర్ 1న సహచర జడ్జి కుమార్తె వివాహం కోసం నాగ్‌పూర్‌కు ఆయన వెళ్లారు. ఆ సమయంలో ఆయన వెంట మరో ఇద్దరు జడ్జిలు కూడా ఉన్నారు. ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన బస చేయగా.. ఆ రాత్రి గుండెపోటుతో ఆయన మృతి చెందారు. వైద్యులు ఆయనది సహజమరణమేనని దృవీకరించినప్పటికీ.. దుస్తులపై రక్తపు మరకలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పైగా తమకు తెలీకుండానే అంత్యక్రియలు చేశారని.. మొబైల్ ఫోన్ కూడా వారం తర్వాత తమకు అందించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. లోయా సోదరి డాక్టర్ అనురాథా బియాని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో కొందరు లోయాకు 100 కోట్ల రూపాయల లంచం ఇవ్వ చూపారని, కానీ, నిజాయితీపరుడైన లోయా తిరస్కరించారని ఆమె పేర్కొన్నారు. -
నాకు ముడుపులిస్తామన్నారు: జడ్జి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణం కేసులో ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితులకు అనుకూలంగా ఉండాలంటూ కొంతమంది న్యాయవాదులు తనను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నిందితుడి తరపు న్యాయవాది తనను సంప్రదించాడని, తీర్పు అనుకూలంగా ఇస్తే ముడుపులు ఇస్తామన్నారని ఆయన తెలిపారు. ఇలాంటి మభ్యపెట్టే మాటలు మరోసారి నాదృష్టికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న.. జడ్జి వ్యాఖ్యలతో ఖంగుతిన్న న్యాయవాది, కోర్టు హాలులోనే క్షమాపణలు కోరారు. అయితే ఆ న్యాయవాది పేరుని మాత్రం జడ్జి బయటికి చెప్పలేదు.