CCTV footages
-
పోలీసులకు మా ఆదేశాలంటే గౌరవం లేదు
కోర్టు ఎప్పుడు సీసీటీవీ ఫుటేజీ కావాలని అడిగినా, ఆ వెంటనే అది మిస్టీరియస్‌గా మాయమైపోతోంది. కాలిపోయిందని మీరు చెబుతున్నారు.. నిజంగా కాలిపోయిందో, ఇంకేమైనా జరిగిందో ఎవరికి తెలుసు? ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సీసీ టీవీలు సజావుగా పని చేస్తున్నాయా? లేదా? అన్న విషయాన్ని ప్రతి వారం సంబంధిత స్టేషన్‌హౌజ్ ఆఫీసర్ల నుంచి నివేదికలు తెప్పించుకుని రూఢీ చేసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేస్తాం. లేకపోతే ప్రతి సీసీ టీవీ ఫుటేజీ మాయమవుతూనే ఉంటుంది. కోతుల వల్ల సీసీ టీవీ కాలిపోయిందంటే మేం నమ్మాలా? తప్పులను సమర్ధించుకోవద్దు. – హైకోర్టు ధర్మాసనం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసులకు న్యాయస్థానాలు ఇచ్చే ఆదేశాలపై ఏ మాత్రం గౌరవం ఉండటం లేదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అక్రమ నిర్బంధాల విషయంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సంబంధిత పోలీస్‌స్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీని తమ ముందుంచాలని ఆదేశాలు ఇచ్చినప్పుడే, ఆ సీసీ టీవీ పుటేజీ మాయమవుతోందని తెలిపింది. ఇది చాలా మిస్టీరియస్‌గా మాయమవుతోందని, పోలీసులు చెబుతున్న కారణాలు ఎంత మాత్రం నమ్మశక్యంగా లేవని చెప్పింది. సీసీ టీవీ ఫుటేజీలు మాయమైపోతుంటే ఐజీ, ఎస్పీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సీసీ టీవీలు సజావుగా పని చేస్తున్నాయా? లేదా? అన్న విషయాన్ని ప్రతి వారం సంబంధిత స్టేషన్‌హౌజ్ ఆఫీసర్ల నుంచి నివేదికలు తెప్పించుకుని రూఢీ చేసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. కోతుల కారణంగా సీసీ టీవీ ఎస్ఎంపీఎస్లోని సర్క్యూట్ కాలిపోయిన కారణంగా సీసీ టీవీ ఫుటేజీని కోర్టు ముందుంచలేక పోతున్నామన్న పోలీసుల వాదనను హైకోర్టు మరోసారి తప్పు పట్టింది. సర్క్యూట్ కాలిపోవడం చేత సీసీ టీవీ ఫుటేజీ రికవరీ చేయడం సాధ్యం కాదంటూ సౌత్రిక టెక్నాలజీస్ ఇచ్చిన నివేదికపై అనుమానాలున్నాయని హైకోర్టు తెలిపింది. ఆ నివేదికలోని సంతకాలు, సీలు తేడాగా ఉన్నాయంది. ఈ నేపథ్యంలో కాలిపోయిన సీసీ టీవీ పరికరాలను తామే స్వయంగా పరిశీలిస్తామని తెలిపింది. ఆ పరికరాలను తదుపరి విచారణ సమయంలో తమ ముందుంచాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా, సీసీ టీవీ కాలిపోయిందని.. అందువల్ల ఫుటేజీ లేదంటూ అఫిడవిట్ దాఖలు చేసిన పల్నాడు జిల్లా మాచవరం పోలీస్‌స్టేషన్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)పై జిల్లా ఎస్పీ తీసుకున్న చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎస్పీ చర్యలు ఏ మాత్రం సంతృప్తికరంగా లేవంది. ఇంక్రిమెంట్లో కోత సరిపోదని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. తన సోదరుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారో తెలియచేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ కాటారి నాగరాజును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.సోదరుడి అక్రమ నిర్బంధంపై సీసీటీవీ ఫుటేజీ కోరుతూ పిటిషన్...తన సోదరుడు కటారి గోపిరాజును పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరు పరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కటారు నాగరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన సోదరుడిని నవంబర్ 3న అక్రమంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 7వ తేదీనే అరెస్ట్ చేశామంటూ అబద్ధం చెబుతున్నారని, ఈ నేపథ్యంలో మాచవరం పోలీస్‌స్టేషన్‌లో నవంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు సీసీ టీవీకి సంబంధించిన ఫుటేజీని కోర్టుకు సమర్పించేలా ఆదేశాలివ్వాలంటూ కూడా ఆయన ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. నాగరాజు పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం.. నవంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు సీసీ టీవీ ఫుటేజీని పెన్ డ్రైవ్‌లో ఉంచి సంబంధిత మేజిస్ట్రేట్ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా స్పష్టం చేసింది. అయితే సీసీ టీవీ కాలిపోయిందని, అందువల్ల ఆ ఫుటేజీని ఇవ్వలేమంటూ మాచవరం పీఎస్ స్టేషన్‌హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) అఫిడవిట్ వేశారు. దీనిపై మండిపడ్డ హైకోర్టు, పోలీసులు ఏవో కుంటిసాకులు చెబుతూ ఆ ఫుటేజీలను తమ ముందుంచడం లేదని తప్పు పట్టింది. ఇలాంటి తమాషాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎస్‌హెచ్‌వోపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.కోతుల వల్ల కాలిపోయింది.. తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని పిటిషనర్ నిర్ణయించుకున్నారని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, పిటిషనర్‌కు ఏ మైనా హాని ఉందా? అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అనంతరం పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణు తేజ స్పందిస్తూ, కోతుల వల్ల వైర్లలో సమస్యలు వచ్చి సర్క్యూట్ కాలిపోయిందన్నారు. సీసీ టీవీ కెమెరాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు మాచరం ఎస్‌హెచ్‌వోపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకున్నారని, ఏడాది పాటు ఇంక్రిమెంట్లో కోత విధించారని తెలిపారు. ఎస్‌ఎంపీఎస్ సర్క్యూట్ కాలిపోయిందని, ఇది బయటకు కనిపించదని, అందువల్ల ఫుటేజీని రికవరీ చేయడం సాధ్య పడలేదని వివరించారు. కోర్టు ఉత్తర్వులంటే తమకు గౌరవం ఉందన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, పోలీసులకు కోర్టు ఆదేశాలంటే ఏ మాత్రం గౌరవం లేదని వ్యాఖ్యానించింది. కోర్టు ఎప్పుడు సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వాలని అడిగినా, ఆ వెంటనే ఆ ఫుటేజీ మిస్టీరియస్‌గా మాయమైపోతోందని తెలిపింది. కాలిపోయిందని మీరు చెబుతున్నారు.. నిజంగా కాలిపోయిందో, ఇంకేమైనా జరిగిందో ఎవరికి తెలుసంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. కోతుల వల్ల సీసీ టీవీ సర్క్యూట్ కాలిపోయిందంటే మేం నమ్మలా? అంటూ ప్రశ్నించింది. తప్పులను సమర్థించుకోవద్దని వ్యాఖ్యానించింది. కాలిపోయిన సీసీ టీవీని తామే స్వయంగా చూస్తామని, అందుకు సంబంధించిన అన్ని పరకరాలను తమ ముందుంచాలని ఎస్పీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. -
సన్ సిటీ క్రాకర్ షాపులో అగ్నిప్రమాదం ఘటనలో మరో కోణం
-
కస్టోడియల్ మరణంపై సీసీటీవీ ఫుటేజీ అందజేయండి
సాక్షి, హైదరాబాద్: కస్టోడియల్ మరణం చోటుచేసుకున్న హైదరా బాద్ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లోని జూలై 7వ తేదీ నాటి సీసీటీవీ ఫుటేజీని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ ఫుటేజీని చాంబర్‌లోగానీ, లేదా వీలైతే కోర్టుహాల్‌లోగానీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.. ఎన్నిచోట్ల పనిచేస్తున్నాయి.. ఎన్నిచోట్ల పనిచేయడంలేదు.. లాంటి వివరాలతో నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో భవన నిర్మాణకార్మికుడు గత నెల 7న అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. బిహార్‌కు చెందిన నితీశ్ నానక్‌రాంగూడలో భవన నిర్మాణకార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడి భద్రతాసిబ్బంది, కార్మికులు రెండువర్గాలుగా విడిపోయి దాడులకు దిగారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నితీశ్‌ని అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. పత్రికల్లో వచ్చిన నితీశ్ మృతి వార్తపై న్యాయవాది రాపోలు భాస్కర్ స్పందించి కస్టోడియల్ మరణంపై న్యాయ విచారణ జరపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. 15 రోజులు గడువు కావాలి.. ‘మద్యం సేవించేందుకు అర్థరాత్రి భవన నిర్మాణకార్మికులు బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. ఈ వివాదంలో నితీశ్‌ను పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లిన పోలీసులు మూడు రోజులపాటు లాకప్‌లో ఉంచి విచారణ చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన నితీశ్‌ను ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. పోలీసుల చిత్రహింసల వల్లే అతడు చనిపోయా డని పత్రికల్లో వచ్చింది. అయితే ఆయన గుండెపోటుతోనే చని పోయాడని పోలీసులు పేర్కొంటున్నారు’అని న్యాయవాది లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను సుమోటో రిట్ పిటిషన్‌గా హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం గురువా రం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ రామచందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఉన్నాయని, ఫుటేజీ సమర్పిస్తామని చెప్పారు. దీనికి 15 రోజుల గడువు కావాలని కోరారు. గుండెపోటు కారణంగానే బాధితుడు మృతి చెందాడన్నారు. సీసీటీవీ ఫుటేజీని సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం ఆ ఫుటేజీని సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. -
అనుమానాల నివృత్తికే సీసీ ఫుటేజీ పరిశీలన: ప్రకాశ్‌రాజ్
బంజారాహిల్స్(హైదరాబాద్): మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన ప్రకాశ్‌రాజ్ ఆరోపించడమే కాకుండా సోమవారం ‘మా’ఎన్నికల పోలింగ్ సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసుల సమక్షంలో పరిశీలించారు. ఈ మేరకు తన ప్యానెల్ సభ్యులైన శ్రీకాంత్, బెనర్జీ, తనీష్‌తో కలిసి ఉదయం జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు చేరుకొని బంజారాహిల్స్ ఏసీపీ ఎం.సుదర్శన్, ఇన్స్పెక్టర్ రాజ శేఖర్‌రెడ్డి, సెక్టార్ ఎస్ఐ శివశంకర్‌తో కలిసి ఫుటేజీని వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాకున్న అనుమానాలు నివృత్తి చేసుకోవడం కోసమే పోలింగ్ సెంటర్లో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించామన్నారు. ఎన్నికల అధికారి వద్ద మరో ఏడు కెమెరాలకు సంబంధించిన ఫుటేజీ ఉందని, దాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. తమకు కేవలం ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌తోనే ఇబ్బందులున్నాయని ఆరోపించారు. -
మార్షల్స్‌పై దాడి వీడియోలు విడుదల చేసిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: నిన్న రాజ్యసభలో పెనుదుమారమే చెలరేగింది. పెగాసస్ నిఘా, కొత్త వ్యవసాయ సాగు చట్టాలపై చర్చించాలంటూ ఆందోళన చేపట్టిన విపక్ష సభ్యులపై కేంద్రం బయటి వ్యక్తులను తీసుకువచ్చి.. దాడి చేయించిందంటూ ప్రతిపక్ష సభ్యులు ఆరోపణలు చేశారు. విపక్షాల ఆరోపణలకు కేంద్రం ధీటుగా బదులిచ్చింది. బుధవారం నాటి రగడకు సంబంధించిన వీడియోని విడుదల చేసింది. దీనిలో విపక్ష నేతలు మార్షల్స్‌పై దాడి చేస్తున్న దృశ్యాలున్నాయి. దారుణమైన విషయం ఏంటంటే.. మహిళా మార్షల్స్‌పై విపక్ష సభ్యులు దాడి చేయడం వీడియోలో చూడవచ్చు. రాజ్యసభలో విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తనపై కేంద్ర మంత్రులు మండిపడ్డారు. తమ ప్రవర్తనకు చింతిస్తూ విపక్ష సభ్యులు తక్షణమే క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార, క్రీడా శాఖమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘ప్రజలు తమ సమస్యల గురించి పార్లమెంటులో చర్చిస్తారని ఎదురుచూస్తారు.. కానీ ఈ పార్లమెంట్ సమావేశాలలో విపక్షాలు అరాచకం సృష్టించాయి. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు… దేశంలోని వ్యక్తులు, పన్ను చెల్లింపుదారుల డబ్బు వృధా అవుతున్నా దాని గురించి పట్టించుకోలేదు. నిన్న రాజ్యసభలో జరిగిన సంఘటన ఖండించదగినది. మొసలి కన్నీళ్లు కార్చే బదులు, వారు తమ ప్రవర్తన పట్ల క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. విపక్ష సభ్యుల ప్రవర్తన దారుణం: ప్రహ్లాద్ జోషి పార్లమెంటులో విపక్ష సభ్యుల ప్రవర్తన దారుణం అన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. నిన్నటి రగడపై విపక్ష సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేశామని రాహుల్ అంటున్నారు.. పార్లమెంటులో ఏం జరిగిందో అందరూ చూశారు. సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చైర్మన్‌ను కోరతాం అన్నారు ప్రహ్లాద్ జోషి. రాజ్యసభలో విపక్షాల రగడ.. బుధవారం రాజ్యసభలో ప్రతిపక్షాలు నిరసన తెలుపుతూ చైర్మన్ వెల్‌లోకి వెళ్లిన సందర్భంగా వారిని కంట్రోల్ చేసేందుకు మార్షల్స్ లోపలికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలకు, మార్షల్స్‌కు మధ్య తోపులాట జరిగింది. అయితే మగ మార్షల్స్ తమపై చేయిచేసుకున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మహిళా ఎంపీలు ఆరోపిస్తున్నారు. పార్లమెంట్లో ఎంపీలపై దాడి చేయడం ఇదే తొలిసారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలపై దాడి చేయడానికి బయటి వాళ్లను సభలోకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని రాహుల్ అన్నారు. -
డీమోనిటైజేషన్ నాటి సీసీటీవీ రికార్డులు జాగ్రత్త
ముంబై: డీమోనిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు) సమయంలో బ్యాంకుల శాఖలు, కరెన్సీ చెస్ట్‌ల్లోని సీసీటీవీ రికార్డులను జాగ్రత్తగా పదిలపరచాలంటూ ఆర్బీఐ కోరింది. ఆ సమయంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు సహకరించేందుకు ఈ ఆదేశాలు జారీ చేసింది. 2016 నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లోని సీసీటీవీ రికార్డులను జాగ్రత్తపరచాలని కోరింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు 2016 నవంబర్ 8న ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే. నల్లధనం గుర్తింపు, నకిలీ నోట్ల ఏరివేత లక్ష్యాలతో నాడు ఆ కార్యక్రమాన్ని చేపట్టినట్టు కేంద్రం ప్రకటించుకుంది. ఇందులో భాగంగా రద్దు చేసిన పెద్ద నోట్లను బ్యాంకు శాఖల్లో మార్చుకునేందుకు అదే ఏడాది డిసెంబర్ 30 వరకు అవకాశం ఇచ్చింది. దాంతో బ్యాంకు శాఖల వద్ద భారీ క్యూలు చూశాము. రద్దు చేసే నాటికి రూ.500, రూ.1,000 నోట్ల రూపంలో వ్యవస్థలో రూ.15.41 లక్షల కోట్లు చలామణిలో ఉంటే, బ్యాంకుల్లోకి రూ.15.31 లక్షల కోట్లు వచ్చాయి. పెద్ద ఎత్తున నల్లధనాన్ని కలిగిన వారు సైతం అక్రమ మార్గాల్లో తెల్లధనంగా (సక్రమమైనదిగా) మార్చుకున్నారనే విమర్శలున్నాయి. దీనిపైనే దర్యాప్తు ఏజెన్సీలు విచారణ చేపట్టాయి. దర్యాప్తునకు సహకరించేందుకు వీలుగా సీసీటీవీ రికార్డులను జాగ్రత్తగా ఉంచాలని గతంలోనూ ఆర్బీఐ కోరింది. ఇప్పుడు మరో విడత సీసీటీవీ రికార్డులను నిర్వీర్యం చేయరాదంటూ ఆర్బీఐ తాజాగా బ్యాంకులను ఆదేశించింది. -
సీసీటీవీ సాక్షిగా బయటపడ్డ తండ్రి ఘాతుకం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రే తన కొడుకును కిరాతకంగా హతమార్చాడు. సుత్తితో బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. వీర్రాజు అనే వ్యక్తి గతంలో సీమేన్‌గా పనిచేశాడు. ప్రస్తుతం అతడి కుటుంబం పెందుర్తి శివారు చిన్నముసిడివాడ లో నివాసం ఉంటోంది. వీర్రాజుకు కుమారుడు జలరాజు ఉన్నాడు. అతడు సీమెన్‌గా పని చేస్తున్నాడు. కాగా తండ్రితో కలిసి ఉంటున్న జలరాజు ఇటీవల చిన్నముసిడివాడలో సొంతంగా ఇల్లు నిర్మాణం చేపట్టాడు.(రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి) ఈ నేపథ్యంలో అతని ముగ్గురు చెల్లెళ్లకు కొంత డబ్బు ఇవ్వాల్సిందిగా తండ్రి వీర్రాజు అతడికి సూచించాడు. ఇందుకు అంగీకరించిన జలరాజు.. తనకు కొంత గడువు ఇవ్వాలని తండ్రిని కోరాడు. ఈ విషయంపై గతకొంత కాలంగా తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం జలరాజు ఇంటి ముందర పని చేస్తుండగా వెనకనుంచి వచ్చిన వీర్రాజు వచ్చి సుత్తితో కొడుకు తలపై విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో తీవ్రగాయాలపాలైన జలరాజును కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. కాగా కన్నకొడుకునే తండ్రి హత్య చేయడం వెనుక గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెస్ట్ ఏసీపీ స్వరూప రాణి తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో నేరం స్పష్టంగా కనిపిస్తోందని. హత్యానేరం కింద వీర్రాజుపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.(నర్సు ఆత్మహత్య) -
పట్టపగలే రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
బెంగళూరు : పోలీసులు బందోబస్తు విధుల్లో తలమునకలై ఉండగా.. దొంగలు తమ పని తాము చేసుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో ఒకే రోజు వేర్వేరు చోట్ల చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వివరాలు... దివంగత బీజేపీ క్రేంద మంత్రి అనంథ్ కుమార్ అంత్యక్రియల నిమిత్తం బెంగళూరు వెస్ట్ డివిజన్ పోలీసులు మంగళవారం ఆయన నివాసం వద్ద బందోబస్తు విధులు నిర్వహణలో మునిగిపోయారు. ఇదే అదునుగా భావించిన దొంగలు పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఈ క్రమంలో బెంగళూరు వెస్ట్ డివిజన్లోని రాజరాజేశ్వరినగర్, గిరినగర్ ప్రాంతాల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెల్లారు. దొంగలను అడ్డుకునేందుకు ప్రతిఘటించిన మహిళలను నెట్టివేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దొంగలందరూ బైక్‌ల మీద వచ్చారని.. మొహం కనిపించకుండా కవర్ చేసుకున్నట్లు బాధితులు తెలిపారు. చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసలు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా చైన్ స్నాచర్స్‌ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. -
పోలీసులు చెప్పినందుకే..
చెన్నై: తమిళనాడు సీఎం దివంగత జయలలితకు చికిత్స సందర్భంగా ఆసుపత్రి కారిడార్లలో సీసీటీవీలను పోలీసుల సూచన మేరకే ఆపేశామని అపోలో ఆసుపత్రి ఆర్ముగస్వామి కమిషన్‌కు తెలిపింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ సత్యమూర్తి ఆదేశాల మేరకే ఇలా చేశామని అపోలో గ్రూప్ న్యాయవాది కమిషన్‌ముందు అఫిడవిట్ ఇచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు జయలలితను గది నుంచి బయటకు తీసుకొచ్చిన సమయంలో కారిడార్లలో సీసీటీవీలను ఆపేయడంతో పాటు మెట్లదారిని మూసివేసేవారమని ఆమె తెలిపారు. లిఫ్ట్ ద్వారా ఆమెను వేరే అంతస్తులోకి తరలించాల్సి వస్తే మిగతా లిఫ్టులను నిలిపివేసేవాళ్లమన్నారు. జయలలిత చికిత్స గదిలోకి వెళ్లిపోగానే సీసీటీవీలను ఆన్ చేసేవాళ్లమని అపోలో గ్రూప్ న్యాయవాది పేర్కొన్నారు. -
వెనుక నుంచి వచ్చి.. గొంతు నులిమి : వైరల్
-
రెండు రోజుల పసిబిడ్డను చర్చిలో వదిలి వెళ్లారు
-
ప్రాణాలు పోయినా పర్వాలేదు
సాక్షి, చెన్నై : చెయిన్ స్నాచర్లు రాను రాను రెచ్చిపోతున్నారు. ప్రాణాలు పోయిన ఫర్వాలేదనుకుని ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఆదివారం ఒక్కరోజే చెన్నై నగర పరిధిలోనే రెండు ఘటనలు చోటు చేసుకోగా.. ఆ వీడియోలు వాట్సాప్‌లలో చక్కర్లు కొడుతుండటం స్థానికుల్లో భయాందోళలకు గురిచేస్తోంది. అరుమ్‌బాక్కమ్ జరిగిన షాకింగ్ ఘటనలో బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు మహిళ(52) మెడలోని గొలుసు లాక్కునేందుకు యత్నించారు. అయితే అది ఎంతకు రాకపోవటంతో ఆమె కిందపడిపోయింది ఈ క్రమంలో ఆమెను 50 మీటర్లపాటు అలాగే ముందుకు లాక్కునిపోయారు. బాధితురాలిని ఓల్డ్ వాషర్‌మెన్‌పేట్‌కు చెందిన మేనకగా గుర్తించారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగానే గాయపడినట్లు సమాచారం. మరో ఘటనలో కున్రతూర్‌కు చెందిన 57 ఏళ్ల జయశ్రీ తన భర్తతో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ దొంగ ఆమెపై పడి ఏడు తులాల బంగారు గోలుసును లాక్కునిపోయాడు. బైక్‌పై వచ్చిన ఇద్దరు ముందుగా వారిపై ఓ కన్నేశారు. తర్వాత వారిలో ఒకడు ఆమె వద్దకు వెళ్లి గొలుసు లాగాడు. ఈ క్రమంలో ఆమె కిందపడి గాయపడగా.. దొంగను పట్టుకునేందుకు భర్త చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. మహిళలు, ముఖ్యంగా వృద్ధులు బయటకు వెళ్లేప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. -
ప్రాణాలు పోయినా పర్వాలేదు
-
వేణుగోపాలా.. ఎక్కడున్నావయ్యా?!
కామారెడ్డి క్రైం: పురాతన ఆలయ గర్భగుడిలో ఉత్సవ మూర్తులుగా కొలువుదీరిన వేణుగోపాలస్వామి(శ్రీకృష్ణుడు), రుక్మిణి, సత్యభామల పంచలోహ విగ్రహాలు, అందులోనూ 700 ఏళ్లనాటి ఘన చరిత్రగల దేవతామూర్తుల ప్రతిమలు, జనావాసాల మధ్య ఆలయం. నాలుగు ద్వారాలు దాటిన తర్వాతగానీ గర్భగుడిలోనికి ప్రవేశం. నాలుగు నిమిషాల్లోనే దోపిడీ జరిగిపోయింది. శనివారం సాయంత్రం కాలనీలో అందరూ ఉండగానే ఏ మాత్రం అనుమానం రాకుండా సుమారు 75 కిలోల బరువు గల పంచలోహ విగ్రహాలను అపహరించుకుపోయిన కేసు ప్రస్తుతం జిల్లా పోలీసులకు సవాల్‌గా మారింది. ఇద్దరు దుండుగులు విగ్రహాలను చోరీ చేసి ఉడాయించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైంది. వారి ముఖాలు స్పష్టంగా కనిపించక, ఆలయం నుంచి బయటకు వచ్చాక కొద్ది దూరం తర్వాత ఏ దారిగుండా పారిపోయారో, ఎక్కడకు పోయారో తెలుసుకోవడంలో అడ్డంకులు పోలీసు అధికారులకు నిద్రపట్టనీయడం లేదు. ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకుని పరిశోధనకు 10 బృందాలను ఏర్పాటు చేసి విచారిస్తున్నారు. వేణుగోపాలస్వామి జాడ కోసం పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సీసీ ఫుటేజీలో ఇద్దరు దుండగులు... సంఘటన జరిగిన ఆలయాన్ని ఎస్పీ శ్వేత, డీఎస్పీ ప్రసన్నరాణి, పట్టణ పోలీసులు సందర్శించి విచారణ ప్రారంభించారు. వీధి చివరలో ఉన్న సీసీ పుటేజీ పరిశీలించగా దుండగులు ఇద్దరు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. సాయంత్రం 6.55 గంటలకు తెలుపు రంగు షర్టు వ్యక్తి, ఆ తర్వాత నీలిరంగు షర్ట్ వ్యక్తి లోనికి వెళ్లారు. 6.59 గంటలకు ఇద్దరూ సంచులతో బయటకు వచ్చారు. కొద్ది దూరంలో ఉన్న బీసీ బాయ్స్ హాస్టల్ గల్లీలోకి వెళ్లిపోయారు. అక్కడ నుంచి ఎటు వెళ్లారు, ముఠాలో ఎవరైనా ఉన్నారా అనే విషయాలు తెలుసుకు నే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పట్టణంలోని అన్ని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. 4 నిమిషాల్లోనే దోచేశారు.. దుండగులు కేవలం 4 నిమిషాల్లోనే దేవతా మూర్తుల పంచలోహ విగ్రహాలను దోచుకువెళ్లారు. ప్రధాన అర్చకుడు ధర్మకర్తల కుటుంబీకులు పక్కనే ఉంటారు. ఉద యం స్వామివారికి పూజలు, అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించాక ఆలయ గర్భగుడికి తాళం వేసి వెళ్లినట్లు తెలిపారు. ఆ తర్వాత అందరూ మండపంలో నుంచి స్వామివారిని దర్శించుకుని వెళ్తుంటారు. సాయంత్రం ఆలయంలో ఎవరూ లేకపోవడంతో తాళాన్ని శబ్ధం రాకుండా పగులగొట్టినట్లు ఆనవాళ్లున్నా యి. ప్రధాన దేవతల విగ్రహాల ముందు ఉత్సవ మూర్తులను పీటముడుల నుంచి తొలగించుకుని ఉడాయించారు. పంచలోహ విగ్రహాలే టార్గెట్.. 700 ఏళ్ల చరిత్ర కలిగిన వైష్ణవ దేవాలయంగా పెద్దబజార్‌లోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం పేరుగాంచింది. కాకతీయుల కాలంనాటిది. దోమకొండ సంస్థానాధీశులు నిర్మించిన కిష్టమ్మగుడిలో ప్రస్తుతం చోరీ అయిన పంచలోహ విగ్రహాలు ఉండేవట. 200 ఏళ్ల క్రితం వాటిని కంజర్ల వంశీయులు వచ్చి వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఘన చరిత్ర ఉన్న పంచలోహ విగ్రహాలు ఇక్కడ ఉన్నట్లు చాలా మందికి తెలియదు. చోరీ తీరును చూస్తే కేవలం పంచలోహ విగ్రహాలను మాత్రమే టార్గెట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆలయంలో దేవతల కిరీటాలు, శంకు చక్రాలు, పాత్రలు ఎన్నో ఉన్నా దేన్నీ ముట్టుకోలేదు. ఎంతో కాలంగా వాటిని కాజేసేందుకు బాగా తెలిసిన వారే కుట్రలు పన్ని పథకం ప్రకారం చోరీ చేసినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చోరీలు గతంలో హైదరాబాద్, ఆంధ్రా ప్రాంతాల్లో వెలుగుచూసినట్లు పోలీసులు చెబుతున్నారు. పంచలోహ విగ్రహాలను చోరీ చేసి ఏం చేస్తారు, ఎక్కడ విక్రయిస్తారు? అనే కోణంలో విచారిస్తున్నారు. విగ్రహాల విలువ రూ.కోటిపైగా ఉంటుందని ఆలయ ధర్మకర్తల కుటుంబీకులు చెబుతున్నారు. అన్ని కోణాల్లో విచారణ... సంచలనం సృష్టించిన పంచలోహ విగ్రహాల చోరీ కేసును చేధించేందుకు జిల్లా పోలీసులు అన్నీ కోణాల్లోనూ విచారిస్తున్నారు. ఎస్పీ శ్వేత ఆధ్వర్యంలో కేసు పరిశీలన, తనిఖీల నిమిత్తం పది బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఆలయాల్లో చోరీలకు పాల్పడిన పాత నేరస్తులను, ఇదే తరహాలో చోరీ చేసే వారి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. సీసీ కెమెరాల్లో ఇద్దరు వ్యక్తులు కనిపించినా మొత్తం వ్యవహారంలో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత రాలేదు. నిందితులను తప్పకుండా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. -
పట్టపగలే దారుణ హత్యలు
మీరట్ : ఉత్తర ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలిని, ఆమె కొడుకును కొందరు దుండగులు కిరాతకంగా కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మొత్తం సీసీ ఫుటేజీలో నిక్షిప్తం కాగా, ప్రస్తుతం ఆ వీడియో మీడియా ఛానెళ్లలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్లితే... ప్రతాప్పూర్ శివార్లలోని సోర్ఖా గ్రామంలో నిచాట్టర్ కౌర్ అనే వృద్ధురాలు, తన కొడుకు బల్విందర్తో నివసిస్తోంది. బుధవారం ఉదయం కొందరు వ్యక్తులు తుపాకులతో వారుంటున్న ఇంటికొచ్చారు. ఆ సమయంలో బయటే ఉన్న బల్విందర్ను వారు కాల్చి చంపారు. అటుపై కాస్త ముందుకు వెళ్లగానే ఆరు బయట మంచంపై నిచాట్టర్ వారికి కనిపించింది. దీంతో కాల్పులకు తెగబడ్డారు. ఆ సమయంలో పక్కనే ఉన్న మరో వృద్ధురాలిని వారు బెదిరించటంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత నిచాట్టర్ పై మరిన్ని రౌండ్ల కాల్పులు జరిపారు. మంచంపై రక్తపు మడుగుతో ఆ వృద్ధురాలు అలాగే కుప్పకూలిపోయింది. అయితే ఆమెను చంపిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ ఫుటేజీలో నమోదు కాగా.. ఆ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలతోనే ఈ హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. గ్రామస్థుల కథనం... నిచాట్టర్ భర్త నరేంద్రను 2016 సంవత్సరంలో కొందరు ఆగంతకులు చంపేశారు. అందుకు నిచాట్టర్, ఆమె కొడుకు బల్విందర్లే సాక్ష్యం. ఈ కేసులో మాలే, మంగు మరికొందరు దోషులుగా తేలారు. మంగూ ఇప్పటికే శిక్షను అనుభవిస్తుండగా.. మిగతా వాళ్లు పరారీలో ఉన్నారు. కాగా, ఘటనకు కొద్దిరోజుల ముందే వీరిని చంపేస్తామని గ్రామస్థుల సమక్షంలోనే నిందితులు ప్రకటించారంట. దీంతో నరేంద్ర హత్య కేసు నిందితులే ఈ పని చేయించి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు. భయానకంగా ఉన్న ఈ సీసీ ఫుటేజీ దృశ్యాలు మీ కోసం... -
నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం!
జైపూర్: గత ఎనిమిది రోజుల్లో జైపూర్‌లో జరిగిన రెండు అత్యాచార ఘటనలు కలకలం సృష్టించాయి. మూడన్నర ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైన ఘటన మరవకముందే మరో చిన్నారి కీచకుడి చేతిలో అత్యాచారానికి గురైంది. ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వికలాంగురాలైన తల్లితో పాటు మూడేళ్ల బాలిక సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రి ప్రాంగణంలో నిద్రపోతోంది. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆకస్మాత్తుగా వచ్చి నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. మరుసటి రోజు ఉదయం తీవ్ర రక్తస్రావంతో ఆ బాలిక ఏడ్చుకుంటూ కనిపించడంతో వెంటనే అక్కడి స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. జూన్ 11న అదే ప్రాంతంలోని ట్రాన్స్‌పోర్టు నగర్లో మూడున్నర ఏళ్ల బాలిక అత్యాచారం కేసులో జూన్ 15న ఆటో రిక్షా డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.