ఇక మెషిన్లోనే రూ.2 లక్షల డిపాజిట్
అందుబాటులోకి తెచ్చిన ఎస్బీఐ
హైదరాబాద్: ప్రభుత్వ రంగ ఎస్బీఐ తమ క్యాష్ డిపాజిట్ మెషిన్లలో (సీడీఎం) నగదు డిపాజిట్ పరిమితిని రూ. 2,00,000కు పెంచింది. ప్రస్తుతం ఇది రూ.49,900గా ఉంది. క్యాష్ డిపాజిట్ మెషీన్లు/క్యాష్ పాయింట్లలో ఏటీఎం డెబిట్ కార్డు, ఎస్ఎంఈ ఇన్‌స్టా డిపాజిట్ కార్డ్‌ల ద్వారా తమ అకౌం ట్లలో నగదు జమ చేసుకునే ఖాతాదారులకు ఇది ఉపయోగకరంగా ఉండగలదని ఎస్బీఐ తెలిపింది. అలాగే, ఇకపై ఈ మెషిన్ల ద్వారా కూడా లోన్ అకౌంటు, రికవరింగ్ డిపాజిట్ అకౌంట్లు, పీపీఎఫ్ అకౌంట్లలో నగదు డిపాజిట్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.