CDR
-
కేరాఫ్ కాంట్రవర్సీ
ఒక్కసారి మనం కాంట్రవర్సీలో కాలు పెడితే చాలు తర్వాత అక్కర్లేని కాంట్రవర్సీలన్నీ వచ్చి చుట్టుకుంటాయి అని చెప్పటానికి కంగనా రనౌత్ ఓ ఉదాహరణ. విషయం ఏంటంటే.. సీడీఆర్ (కాల్ డీటైల్ రికార్డ్) వివాదం. ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్. బాలీవుడ్ సెలబ్రిటీ లాయర్ రిజ్వాన్ సిద్ధికీ చట్ట వ్యతిరేకంగా తన క్లైయింట్స్‌కు సీడీఆర్‌లు అందిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. నటుడు నవాజుద్దిన్ సిద్ధికీ భార్య కాల్ డేటాను అక్రమ మార్గాల్లో సంపాదించారని లాయర్ రిజ్వాన్‌ను అదుపులోకి తీసుకున్నారు థానే పోలీసులు. తీగ లాగితే డొంక కదిలినట్టు ఇప్పుడీ కేసు కంగనా కాలుకి కూడా చుట్టుకుంది. ఈ సీడీఆర్ వివాదంలో కంగనా కూడా ఉన్నారంటూ ఆరోపించారు థానే పోలీసులు. ‘‘కంగనా–హృతిక్ రోషన్ ప్రేమ వ్యవహారం కేసు విషయం ఇంకా నడుస్తున్న విషయం తెలిసిందే. 2016లో లాయర్ రిజ్వాన్‌కు కంగనా హృతిక్ రోషన్ నంబర్‌ను ఇచ్చినట్టు మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. దాని వెనకాల అసలు కారణం ఏంటో తెలియాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు థానే పోలీసులు. దానికి కంగనా సిస్టర్ రంగోలీ స్పందిస్తూ – ‘‘ఏదైనా కోర్ట్ నోటీసుకి రెస్పాండ్ అయినప్పుడు మా డీటైల్స్ అన్నీ లాయర్‌కు సమర్పిస్తాం. వాటిని ఆధారం చేసుకొని మేము చట్టాన్ని అతిక్రమిస్తున్నాం అని ఊహించేసుకొని వాటి ద్వారా స్టేట్మెంట్స్ పాస్ చేయడం ఒక ఆర్టిస్ట్‌ని తక్కువ చేయడమే అవుతుంది. అది తప్పు. పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిపాక ఆరోపణలు చేస్తే బావుంటుంది’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
సీడీఆర్ ప్రక్రియ సమీక్షపై కేంద్రం దృష్టి!
ఎన్పీఏల పరిష్కారానికి కసరత్తు న్యూఢిల్లీ: మొండి బాకాయిల (ఎన్పీఏ)ల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిన కేంద్రం– ఈ దిశలో కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ (సీడీఆర్) ప్రక్రియను సమీక్షించాలని యోచిస్తున్నట్లు సమాచారం. 2001లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సీడీఆర్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. మూడంచలుగా పనిచేసే ఈ వ్యవస్థను మరింత పటిష్టంగా మలచడంపై కేంద్రం దృష్టి సారించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రత్యేకించి ఒత్తిడిలో ఉన్న కార్పొరేట్ రుణ సమస్యల పరిష్కారం లక్ష్యంగా సీడీఆర్ వ్యవస్థ సమీక్షకు కేంద్రం శ్రీకారం చుడుతున్నట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. బ్యాంకుల్లో మొండి బకాయిలు పేరుకుపోవడం పెద్ద సవాలుగా మారిందని, ’అత్యంత భారీ కార్పొరేట్లే’ ఈ సమస్యకు మూలకారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 2016 డిసెంబర్ 31వతేదీ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు రూ.6,06,911 కోట్లుకు చేరాయి. ఒత్తిడిలో ఉన్న రుణ పరిమాణం (పునర్వ్యవస్థీకరించిన రుణాలు, స్థూల ఎన్పీఏలు) మొత్తం రూ. 9.64 లక్షల కోట్లుగా ఉంది. సెప్టెంబర్ నాటికి ఈ మొత్తం రూ.8,97,000 కోట్లు. అంటే నాలుగు నెలలు గడిచే సరికే ఈ పరిమాణం దాదాపు 7.5 శాతం పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. -
అసెట్స్ అమ్మకంపై చర్చలు జరుగుతున్నాయ్..
♦ బ్యాంకర్లతో రెండు సార్లు సమావేశమయ్యాం ♦ ల్యాంకో ఇన్ఫ్రా వివరణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ (సీడీఆర్) స్కీము కింద కొన్ని ఆస్తులను విక్రయించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ల్యాంకో ఇన్ఫ్రా వెల్లడించింది. ఇందుకు సంబంధించి రుణ దాతలు, కన్సల్టెంట్లతో చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. గ్రూప్‌లో భాగమైన విద్యుత్ విభాగంలో ఓపీజీ పవర్ 51 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో ల్యాంకో ఇన్ఫ్రా బుధవారం ఈ మేరకు వివరణిచ్చింది. ‘సీడీఆర్ స్కీము, రుణదాతలు గతంలో ఆమోదించిన ఇతరత్రా నిధుల సమీకరణ ప్రతిపాదనలకు అనుగుణంగా కొన్ని ఆస్తులను విక్రయించే విషయంపై రుణదాతలు, కన్సల్టెంట్లతో చర్చలు జరుపుతున్నాం. ఇందులో భాగంగానే విద్యుత్ పోర్ట్‌ఫోలియోకు సంబంధించి హోల్డింగ్ స్థాయిలో లేదా స్పెషల్ పర్పస్ వెహికల్ స్థాయిలో గానీ వ్యూహాత్మక భాగస్వామిని తెచ్చే విషయంపైనా చర్చిస్తున్నాం’ అని సంస్థ తెలిపింది. వివిధ ప్రతిపాదనలపై బ్యాంకర్లతో ఈ నెలలో రెండు సార్లు సమావేశమైనట్లు పేర్కొంది. దాదాపు రూ. 40,000 కోట్ల పైచిలుకు రుణాల భారంతో కుంగిపోయిన ల్యాంకో ఇన్ఫ్రాను బ్యాంకులు తమ చే తుల్లోకి తీసుకోనున్నట్లు, విద్యుత్ వ్యాపారాన్ని విడగొట్టి అందులో 51 శాతం వాటాలను ఓపీజీ పవర్ సంస్థకు విక్రయించాలని యోచిస్తున్నట్లు వార్తా కథనాలు వచ్చాయి. బుధవారం బీఎస్ఈలో కంపెనీ షేరు సుమారు అయిదున్నర శాతం పెరిగి రూ. 5.35 వద్ద ముగిసింది. -
సీడీఆర్ నుంచిబయటపడ్డ ఎన్సీఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు రంగ సంస్థ ఎన్సీఎల్ ఎట్టకేలకు కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ (సీడీఆర్) ప్యాకేజి పరిధి నుంచి బైటపడింది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్సీడీ) జారీ ద్వారా పిరమల్ ఎంటర్ప్రైజెస్ నుంచి సమీకరించిన రూ. 325 కోట్ల నిధుల్లో సుమారు రూ. 125 కోట్లను రుణబకాయిల చెల్లింపు కింద బ్యాంకర్లకు ఇచ్చినట్లు సంస్థ పేర్కొంది. మిగతా మొత్తాన్ని సిమెంటు ప్లాంట్ల విస్తరణ కోసం వినియోగించనున్నట్లు ఎన్సీఎల్ వివరించింది. నాగార్జున బ్రాండ్ సిమెంటు తయారీ సంస్థ ఎన్సీఎల్ సుమారు రూ.122 కోట్ల రుణబకాయిలకు సంబంధించి 2013లో సీడీఆర్ మార్గాన్ని ఎంచుకుంది. -
అప్పుల ఊబిలో... కార్పొరేట్ ఇండియా!
భారీ రుణాల్లో 250 పైచిలుకు సంస్థలు - భారం తగ్గించుకునేందుకు రూ. 7 లక్షల కోట్లు కావాలి - ఇండియా రేటింగ్స్ నివేదిక ముంబై: దేశీయంగా భారీగా అప్పులు తీసుకున్న టాప్ 500 కంపెనీల్లో సగభాగం పైగా సంస్థలు గట్టెక్కాలంటే ఏకంగా రూ. 7 లక్షల కోట్లు అవసరమవుతాయని ఇండియా రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. భారాన్ని తగ్గించుకునేందుకు వాటాల విక్రయం బాట పడితే 262 సంస్థలు కనీసం రూ. 7,04,300 కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుందని, బైటపడేందుకు మూడేళ్లు అవసరమవుతుందని వివరించింది. అయితే, ఇంత పెద్ద మొత్తాన్ని వాటాల విక్రయం ద్వారా సమకూర్చుకోవడం అంత సులువు కాకపోవచ్చని ఇండియా రేటింగ్స్ సీనియర్ డెరైక్టర్ (ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం) దీప్ ఎన్ ముఖర్జీ నివేదికలో పేర్కొన్నారు. 2007-08, 2013-14 మధ్యకాలంలో ఈ మొత్తంలో సుమారు సగభాగం ఈ 500 కంపెనీల్లోకి వచ్చేసిందని వివరించారు. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా ఉండి, ఈ కంపెనీలు తమ రుణభారాన్ని ఒక మోస్తరు స్థాయికి తగ్గించుకోవాలంటే ఈ ప్రక్రియకు కనీసం మూడేళ్లు పట్టేస్తుందని తెలిపారు. అయితే, రుణాలు ఇప్పుడున్న స్థాయిలోనే ఉండాలని, పెరగకూడదని పేర్కొన్నారు. ఒకవేళ వృద్ధి అత్యంత స్వల్పంగా ఉన్న పక్షంలో ఈ ప్రక్రియకు అయిదారేళ్లు పట్టేస్తుందన్నారు. సీడీఆర్లో 96 కంపెనీలు.. దాదాపు 96 కంపెనీలు ఇప్పటికే కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ (సీడీఆర్) ప్రక్రియలో ఉండటమో లేదా నిరర్థక ఆస్తుల జాబితాకి ఎక్కడమో జరిగిందని ఇండియా రేటింగ్స్ వివరించింది. ఇవి తమ రుణాలను ఒక మోస్తరు స్థాయికి తగ్గించుకునేందుకు 5-10 సంవత్సరాలు పడుతుందని తెలిపింది. ఈ 96 కంపెనీల్లో 62 సంస్థలు మనుగడ సాగించాలంటే కనీసం రూ. 2,41,000 కోట్లు అవసరమవుతాయి. ఈ జాబితాలోని చాలామటుకు కంపెనీల మార్కెట్ విలువ కన్నా కూడా ఇది అధికం. కొత్త ఈక్విటీ అయినా ఆయా కంపెనీల ప్రమోటర్లు మారితేనే వస్తుందని, లేకపోతే మరింత కాలం అప్పుల భారం మోయాల్సి వస్తుందని ఇండియా రేటింగ్స్ వివరించింది. దన్నుగా నిల్చే మాతృసంస్థలు గానీ ఇతరత్రా వనరులు గానీ లేకపోవడం వల్ల 96 కంపెనీల జాబితాలోని 87 సంస్థల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని హెచ్చరించింది. ఇక, ఈ 87 సంస్థల్లో 71 కార్పొరేట్లు మరింత సంక్షోభంలోకి జారకుండా ఉండాలంటే రాబోయే ఆరు నుంచి పన్నెండు నెలల్లో వాటాల విక్రయం ద్వారా కనీసం రూ. 89,200 కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుందని వివరించింది. అలా జరగని పక్షంలో అవి ఒక మోస్తరుగా కోలుకోవడానికి అయిదు నుంచి ఎనిమిదేళ్లు పడుతుందని నివేదికలో ముఖర్జీ వివరించారు. తక్షణమే ప్రమాదం లేని 317 కార్పొరేట్లలో 128 సంస్థలకు సుమారు రూ. 3.7 లక్షల కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. -
మా ఆవిడ ఒకప్పుడు విపరీతంగా ఖర్చు చేసేది...
మా ఆవిడకు సౌందర్య స్పృహ కాస్త ఎక్కువ. దీంతో విపరీతంగా ఖర్చు చేసేది. మార్కెట్లోకి ఏ కొత్త వస్తువు వచ్చినా కొనాల్సిందే. కొన్న వస్తువుల గురించి గంటల కొద్దీ తన ఫ్రెండ్స్‌తో మాట్లాడేది. ఇల్లు గడవడానికి పూర్తిగా నా జీతం డబ్బులే ఆధారం. వేరే ఆదాయ వనరులేవీ లేవు. ఇదేమీ గ్రహించకుండా తన ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు చేసి నా చేతి చమురు వదిలించేది. ఆమె డబ్బు అడగ్గానే- ‘‘ఎందుకు? ఏమిటి?’’ అని అడిగే సాహసం చేయలేకపోయేవాడిని. ఒకసారి ఇలా అడిగిన పాపానికి పెద్ద గొడవ అయింది. అందుకే ఆమె ఎంత డబ్బు అడిగినా కిమ్మనకుండా ఇచ్చేవాడిని. ఆమె ఖర్చుల పుణ్యమా అని నేను అప్పులు కూడా చేయడం ప్రారంభించాను. ఒకరోజు మా ఆవిడతో సున్నితంగా చెప్పాను - ‘‘నువ్వు చాలా అందంగా ఉంటావు. ఈ అనసవరపు ఖర్చు ఎందుకు చెప్పు?’’ అని. ‘‘నువ్వు రోజూ తినడం ఎందుకు? వారానికి ఒక్కరోజు తింటే సరిపోతుంది కదా. చాలా డబ్బులు మిగులుతాయి’’ అన్నది వ్యంగ్యంగా. సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు అర్థం కాలేదు. మరోవైపు ఆమె ఖర్చుల పుణ్యమా అని నా అప్పుల జాబితా అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఓపిక పట్టే శక్తిని పూర్తిగా కోల్పోయాను. ఒకరోజు మాత్రం పెద్ద ఎత్తున మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వారం రోజుల పాటు మా మధ్య మాటలు లేవు. హోటల్లోనే తినేవాడిని. పరిస్థితి విషమిస్తోందని తెలిసి, నా ఫ్రెండ్ మా ఇద్దరినీ తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. అక్కడికి విడివిడిగా వెళ్లాం. విందు తరువాత మా ఇద్దరిని దగ్గర కూర్చోబెట్టుకొని డబ్బు విలువ గురించి చెప్పాడు. విచ్చలవిడిగా ఖర్చు చేస్తే డబ్బు లేనప్పుడు ఎలా ఇబ్బంది పడాల్సి వస్తుందో తన సొంత అనుభవాల్లో నుంచి చెప్పాడు. అప్పటి నుంచి ఆమెలో పూర్తిగా మార్పు వచ్చింది. ఇప్పుడు మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తోంది. అనవర ఖర్చులు తగ్గించి పొదుపు చేయడం నేర్చుకుంది! - సిడిఆర్, విశాఖపట్టణం