CEC group
-
ఇంటర్లో సీఈసీ చేశారా.. ఈ కెరీర్ అవకాశాలు మీకోసమే
దేశంలో కామర్స్ కోర్సులకు మంచి డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ సీఈసీ ఉత్తీర్ణులయ్యాక.. డిగ్రీ స్థాయిలో బీకామ్‌తోపాటు సీఏ, సీఎస్, సీఎంఏ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరుతుంటారు. వాస్తవానికి సీఈసీ విద్యార్థులు కామర్స్ సంబంధ కోర్సులు మాత్రమే కాకుండా.. బీబీఏ, బీఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సుల్లోనూ ప్రవేశం పొందొచ్చు. ఈ నేపథ్యంలో.. ఇంటర్ సీఈసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఉన్నత విద్య కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం.. డిగ్రీ స్థాయి కోర్సులు బీకామ్: సీఈసీ ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన విద్యార్థులు ఎక్కువ మంది చేరే కోర్సు.. బీకామ్. ఈ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. దీన్ని పూర్తిచేసిన అభ్యర్థులు.. ప్రభుత్వ/ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, మల్టీనేషనల్ కంపెనీలు, ప్రైవేట్ బిజినెస్/సంస్థల్లో అవకాశాలు అందుకోవచ్చు. బిజినెస్ అనలిస్టులు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, బిజినెస్ రిస్క్ అడ్వైజర్, ఆపరేషన్స్ మేనేజర్, బిజినెస్ అనలిటిక్స్ ఎగ్జిక్యూటివ్, ఎకనామిస్ట్, మార్కె ట్ అనలిస్ట్, బిజినెస్ ఎకనామిక్ రైటర్, బడ్జెట్ అనలిస్ట్‌గా ఉద్యోగాలు పొందొచ్చు. చదవండి: Andhra Pradesh: పేద విద్యార్థులకు... టాప్ వర్సిటీల్లో సీట్లు బీకామ్ కంప్యూటర్స్: ఇటీవల కాలంలో ఇంటర్ సీఈసీ ఉత్తీర్ణులు ఎక్కువగా చేరుతున్న కోర్సు.. బీకామ్ కంప్యూటర్స్. కార్పొరేట్ రంగంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఉపయోగించేందుకు వీలుగా ఈ కోర్సును రూపొందించారు. ఈకోర్సు విద్యార్థులు కామర్స్తోపాటే కంప్యూటర్ నైపుణ్యం కూడా సొంతం చేసుకుంటారు. బీకామ్ కంప్యూటర్స్ ఉత్తీర్ణులు వివిధ విభాగాల్లో కంప్యూటర్ ప్రోగ్రామర్, యాప్ డెవలపర్ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. పీజీ స్థాయిలో ఎంకామ్ కంప్యూటర్స్‌లో చేరొచ్చు. బీకామ్(హానర్స్): ఇటీవల విద్యార్థులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న కోర్సు.. బీకామ్ హానర్స్. ఇది పలు ప్రభుత్వ/ప్రైవేటు కాలేజీల్లో అందుబాటులో ఉంది. ఇందులో చేరాలంటే..సీఈసీ ఇంటర్మీడియెట్ కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. బీకామ్ హానర్స్‌లో.. అకౌంట్స్ అండ్ ఫైనాన్స్/ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్/ఎకనామిక్స్/బ్యాంకిం గ్ అండ్ ఇన్సూరెన్స్/టాక్సేషన్/మార్కెటింగ్ /హెచ్ఆర్ వంటి స్పెషలైజేషన్లు ఉన్నా యి. బీకామ్ హానర్స్ పూర్తి చేసినవారికి మార్కెటింగ్, ఫైనాన్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, కామ ర్స్, బ్యాంకింగ్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు, రీసెర్చ్ అసోసియేట్స్‌లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బీఏ ఎకనామిక్స్: ఆర్థిక అంశాలపై ఆసక్తి ఉన్న కామర్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న చక్కటి కోర్సు ఇది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్థాయిలో ఎంఈసీ (మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్) సబ్జెక్టులు చదివినవారు మూడేళ్ల బీఏ ఎకనామిక్స్‌లో చేరితే ఉజ్వలంగా రాణించొచ్చు. వీరు బీఏ ఎకనామిక్స్ తర్వాత పీజీ స్థాయిలో ఎంబీఏ ఫైనాన్స్/ఎంఏ ఎకనామిక్స్‌లో చేరి.. అద్భుత అవకాశాలు అందుకునే వీలుంది. వీరికి ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రంగం, ప్రభుత్వ ఎకనామిక్ డిపార్ట్మెంట్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్స్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బీబీఏ): బిజినెస్, మేనేజ్మెంట్ రంగంలో రాణించాలనుకునేవారికి బీబీఏ కోర్సు ఉపయుక్తంగా ఉంటుం ది. ముఖ్యంగా పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో..ఎంబీఏ చేయాలనుకునే విద్యార్థులు డిగ్రీ స్థాయిలో బీబీఏ ఎంచుకోవడం మంచిది. మేనేజ్మెంట్ రంగంలో ఉన్నత స్థాయి కెరీర్ కోసం ఎంబీఏ చేయవచ్చు. బీబీఏ ఉత్తీర్ణులయ్యాక కార్పొరేట్ కంపెనీలతోపాటు వివిధ పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందవచ్చు. మార్కెటింగ్, ఫైనాన్స్, సేల్స్, హెచ్ఆర్ మొదలైన విభిన్న విభాగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ముఖ్యంగా సేల్స్ ఎగ్జిక్యూటివ్, రీసెర్చ్ అసిస్టెంట్, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ కన్సల్టెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టం మేనేజర్, ఆర్ అండ్ డీ ఎగ్జిక్యూటివ్, ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పనిచేయవచ్చు. ప్రొఫెషనల్ కోర్సులు చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ): చార్టర్డ్ అకౌంటెన్సీ నిపుణులకు జాబ్ మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ కోర్సులో ప్రధానంగా అకౌంటింగ్, ట్యాక్సేషన్‌పై దృష్టిసారిస్తారు. కామర్స్, అకౌంటెన్సీ, ట్యాక్సేషన్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు.. ఇంటర్మీడియట్ తర్వాత సీఏ కోర్సులో ప్రవేశించవచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఈ కోర్సును అందిస్తోంది. సీఏ కోర్సు ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్.. ఇలా మూడు స్థాయిల్లో ఉంటుంది. చార్టర్డ్ అకౌంటెంట్లకు ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. సీఏ కోర్సు పూర్తి చేసిన తర్వాత డైరెక్ట్ ట్యాక్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్, ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను, వర్క్స్ అకౌంటెన్సీ, ఆడిటింగ్ మొదలైన కార్పొరేట్, ఆర్థిక విభాగాల్లో ఉన్నత స్థాయిలో పనిచేయవచ్చు. సీనియర్ సీఏల వద్ద పనిచేయడం ద్వారా అనుభవం పొందొచ్చు. కంపెనీ సెక్రటరీ: కార్పొరేట్ ప్రపంచంలో ఉజ్వల కెరీర్ కోరుకునే కామర్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో చక్కటి కోర్సు.. కంపెనీ సెక్రటరీ(సీఎస్). ఈ కోర్సును ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) అందిస్తుంది. ఈ కోర్సు పూర్తి చేసినవారికి కార్పొరేట్ రంగం అవకాశాలను అందిస్తుంది. కంపెనీ సెక్రటరీలో.. ఫౌండేషన్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్.. ఇలా మూడు స్థాయిలు ఉంటాయి. సరైన ప్రణాళికతో ముందుకెళితే ఇంటర్మీడియెట్ సీఈసీ తర్వాత మూడేళ్లలోనే సీఎస్ కోర్సును పూర్తిచేసుకోవచ్చు. కోర్సు పూర్తయ్యాక సీఈఓలు, ఎండీలకు సలహాలిచ్చే కంపెనీ సెక్రటరీగా అవకాశాలు దక్కించుకోవచ్చు. దాంతోపాటు అనుభవం, నైపుణ్యాల ఆధారంగా లీగల్ అడ్వైజర్, కార్పొరేట్ పాలసీ మేకర్, కార్పొరేట్ ప్లానర్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ లా: కామర్స్ అభ్యర్థులు ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ల కాలపరిమితి గల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో చేరవచ్చు. జాతీయ స్థాయిలోని ప్రముఖ లా స్కూల్స్ బీఏ ఎల్ఎల్బీ, బీకామ్ ఎల్ఎల్బీ, బీఎస్సీ ఎల్ఎల్బీ వంటి కోర్సులను అందిస్తున్నాయి. వీటిల్లో ఇంటర్మీయెట్ తర్వాత క్లాట్‌లో ర్యాంకు ద్వారా ప్రవేశం లభిస్తుంది. న్యాయ విద్యలో.. కార్పొరేట్ లా, ట్యాక్స్ లా/సివిల్, క్రిమినల్ లా/బిజినెస్ అండ్ లేబర్ లా వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. -
ఆసక్తితో చదివితే ఆశయ సాధన తేలికే!
ఓ దేశ అభివృద్ధికి శాస్త్ర (science), సాంకేతిక (Technology) అంశాలు అత్యున్నత సోపానాలు.. అదే విధంగా రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, వాణిజ్య శాస్త్ర అంశాలు మెరుగైన సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయి. సీఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశించి, సుస్థిర కెరీర్‌ను సాధించేందుకు ఇంటర్ సీఈసీ తొలిమెట్టు. దీన్ని అత్యుత్తమ మార్కులతో విజయవంతంగా పూర్తిచేసి బంగరు భవితకు బాటలు వేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జూనియర్ ఇంటర్ సీఈసీ ప్రిపరేషన్ ప్రణాళిక.. సివిక్స్ జూనియర్ ఇంటర్ సివిక్స్ పాఠ్య ప్రణాళికలో రాజనీతి శాస్త్ర పరిచయం, రాజ్యం, రాజకీయ భావనలు, ప్రధాన రాజకీయ సిద్ధాంతాలు, హక్కులు-విధులు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం-ప్రభుత్వం, ప్రభుత్వ అంగాలు, ప్రజాభిప్రాయం అంశాలు ఉంటాయి. ప్రశ్నపత్రం-అవగాహన: ఐపీఈ సివిక్స్ ప్రశ్నపత్రం 150 మార్కులకు ఉంటుంది. విద్యార్థులు 100 మార్కులకు సమాధానాలు రాయాలి. ఐదు వ్యాసరూప ప్రశ్నలు ఇస్తారు. వీటిలో మూడింటికి సమాధానాలు రాయాలి. ఐదు మార్కుల ప్రశ్నలు 12 ఇస్తారు. వీటిలో ఎనిమిది ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. రెండు మార్కుల ప్రశ్నలు 20 ఇస్తారు. వీటిలో 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. వ్యాసరూప ప్రశ్నలకు ముఖ్యమైనవి: 1.రాజనీతి శాస్త్ర పరిచయంలోని రాజనీతి శాస్త్ర పరిధి- ప్రాముఖ్యత. 2.రాజకీయ భావనలలోని సార్వభౌమాధికారం-లక్షణాలు-రకాలు; శాసనాధారాలు, రకాలు. 3.ప్రధాన రాజకీయ సిద్ధాంతాలలో మార్క్సిజం ప్రాథమిక సూత్రాలు- విమర్శ గాంధేయ వాద సిద్ధాంత ప్రాథమిక సూత్రాలు. 4.రాజ్యాంగం-ప్రభుత్వంలో ఏక కేంద్ర ప్రభుత్వ, సమాఖ్య, పార్లమెంటరీ, అధ్యక్ష తరహా ప్రభుత్వాల లక్షణాలు, ప్రయోజనాలు, లోపాలు. 5.ప్రభుత్వ అంగాల భాగం నుంచి శాసనసభ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ విధులు. ఐదు మార్కుల ప్రశ్నలకు: 1.రాజనీతి శాస్త్ర పరిచయం నుంచి రాజనీతి శాస్త్రం, ఇతర సాంఘిక శాస్త్రాలతో సంబంధం. చరిత్ర, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్రం, నీతి శాస్త్రం. 2.రాజ్యం నుంచి రాజ్యం లక్షణాల్లో ఏవైనా రెండు లక్షణాలు; జాతీయత; రాజ్యం-సమాజం; రాజ్యం-ప్రభుత్వం; రాజ్యం-సంస్థల మధ్య భేదాలు. 3.రాజకీయ భావనలు నుంచి ఆస్టిన్ ఏకత్వ సార్వభౌమాధికార సిద్ధాంతం; స్వేచ్ఛ రకాలు-పరిరక్షణలు; సమానత్వం-రకాలు; స్వేచ్ఛ, సమానత్వాల మధ్య సంబంధం; న్యాయం-రకాలు. 4.ప్రధాన రాజకీయ సిద్ధాంతాల నుంచి లౌకిక రాజ్యం, సంక్షేమ రాజ్య లక్షణాలు. 5.హక్కులు-విధులు నుంచి పౌర హక్కులు-రాజకీయ హక్కులు, రాజకీయ విధులు, హక్కులు-విధుల మధ్య సంబంధం. 6.ప్రజాస్వామ్యం నుంచి ప్రజాస్వామ్య ప్రయోజనాలు-లోపాలు; ప్రజాస్వామ్య విజయానికి కావాల్సిన పరిస్థితులు, ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులు. 7.రాజ్యాంగం-ప్రభుత్వం నుంచి లిఖిత- అలిఖిత, దృఢ- అదృఢ రాజ్యాంగాల ప్రయోజనాలు, లోపాలు. 8.ప్రభుత్వ అంగాల నుంచి ఏకసభ- ద్విసభా విధానాలు; కార్యనిర్వాహక వర్గం రకాలు; న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి, న్యాయ సమీక్ష. 9.ప్రజాభిప్రాయం నుంచి ప్రజాభిప్రాయ సాధనాలు. రెండు మార్కుల ప్రశ్నలకు: ప్రతి పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాసరూప సమాధానాల్లోని కొన్ని అంశాలపై రెండు మార్కుల ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. విద్యార్థులు తప్పనిసరిగా నిర్వచనాలను చదివి, గుర్తుపెట్టుకోవాలి. సూచనలు: రెండు మార్కుల ప్రశ్నలు 15 మాత్రమే రాయాల్సి ఉన్నా, అధికంగా మరో రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. పరీక్ష రాసే విషయంలో సమయ పాలన కీలకం. వ్యాసరూప ప్రశ్నకు 20-30 నిమిషాలు; ఐదు మార్కుల ప్రశ్నకు 10-20 నిమిషాలు; 2 మార్కుల ప్రశ్నకు 5 నిమిషాలు కేటాయించాలి. దీనికి అనుగుణంగా విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. చివర్లో 15 నిమిషాలను పునఃపరిశీలనకు కేటాయించాలి. ఏవైనా అంశాలు మర్చిపోతే వాటిని రాయాలి. సాధ్యమైనంత వరకు 100 మార్కులకు సమాధానాలు రాయాలి. అవసరమైన చోట ఉదాహరణలు రాయాలి. కామర్స్ పదో తరగతి పూర్తిచేసి ఇంటర్మీడియెట్ మొదటి ఏడాది సీఈసీలో చేరిన విద్యార్థులకు వాణిజ్య శాస్త్రం (కామర్స్) ఓ కొత్త సబ్జెక్టుగా ఎదురవుతుంది. అందువల్ల దీనిపై ఆసక్తి పెంచుకొని పాఠ్యాంశాలపై లోతైన అవగాహన పెం పొందించుకోవడం అవసరం. వాణిజ్య శాస్త్రానికి బీకాం, సీపీటీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్, ఎంబీఏ వంటి కోర్సులతో సంబంధం ఉంది. అందువల్ల ఇంటర్ సీఈసీని విజయవంతంగా పూర్తిచేసిన వారు తర్వాత వివిధ ఉన్నత కోర్సుల్లో చేరి చక్కని కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. వాణిజ్య శాస్త్రం ప్రశ్నపత్రం రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్-1 వాణిజ్య శాస్త్రానికి 50 మార్కులు; పార్ట్-2 వ్యాపారగణక శాస్త్రానికి 50 మార్కులు ఉంటాయి. పార్ట్- 1 పాఠ్య ప్రణాళిక: యూనిట్ 1: వ్యాపారం, భావనలు; యూనిట్ 2: వ్యాపార సంస్థల స్వరూప, స్వభావాలు; యూనిట్ 3: వ్యవస్థాపన-వ్యవస్థాపకుడు; యూనిట్ 4: వ్యాపార విత్తం-మూలాధారాలు; యూనిట్ 5: ప్రభుత్వ, ప్రైవేటు బహుళ జాతీయ సంస్థలు. పార్ట్- 2 పాఠ్య ప్రణాళిక: యూనిట్ 1: విషయ పరిచయం; యూనిట్ 2: సహాయక పుస్తకాలు; యూనిట్ 3: బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ; యూనిట్ 4: అంకణా తప్పుల సవరణ; యూనిట్ 5: ముగింపు లెక్కలు. పార్ట్- 1 ప్రశ్నపత్రం విభాగం మార్కులు సమయం సెక్షన్-ఏ 10 x 2 = 20 35 నిమిషాలు సెక్షన్-బీ 4 x 5 = 20 35 నిమిషాలు సెక్షన్-సీ 5 x 2 = 10 20 నిమిషాలు విద్యార్థులు 50 మార్కులకు సమాధానాలు రాయాలి. సెక్షన్-ఏలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి సమాధానానికి పది మార్కులు. 2, 3, 4 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. సెక్షన్-బీలో ఆరు లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి. వీటిలో నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి సమాధానానికి ఐదు మార్కులు. అన్ని యూనిట్ల నుంచి లఘు సమాధాన ప్రశ్నలు వస్తాయి. సెక్షన్-సీలో ఎనిమిది అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులు ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి సమాధానానికి 2 మార్కులు. అన్ని యూనిట్ల నుంచి అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. పార్ట్-2 ప్రశ్నపత్రం విభాగం మార్కులు సమయం సెక్షన్-డీ 1 x 20 = 20 30 నిమిషాలు సెక్షన్-ఈ 1 x 10 = 10 20 నిమిషాలు సెక్షన్-ఎఫ్ 2 x 5 = 10 20 నిమిషాలు సెక్షన్-జీ 5 x 2 = 10 20 నిమిషాలు సెక్షన్-డీ నుంచి సెక్షన్-జీ వరకు అకౌంట్స్‌కు సంబంధించి ప్రశ్నలు వస్తాయి. అందువల్ల సమయ పాలన అలవరచుకోవడం చాలా అవసరం. వ్యాపార వ్యవహారాలు నమోదు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని, ప్రశ్నపత్రంలో ఇచ్చిన నగదు మొత్తాలను సరిచూసుకొని రాయాలి. లేకుంటే ఓ చిన్న పొరపాటు వల్ల చాలా సమయం వృథా అవుతుంది. సెక్షన్-డీలో 20 మార్కుల ప్రశ్నకు ముగింపు లెక్కలు చేసేటప్పుడు వ్యవహారాల నమోదుతో పాటు సర్దుబాట్లను కూడా పరిగణనలోకి తీసుకొని, ఖాతాల నిల్వలను సరిగా తేల్చాలి. ఆస్తులు, అప్పుల పట్టీతో ఆస్తు లు, అప్పులను సరైన విధానంలో నమోదు చేయాలి. అకౌంట్స్‌లో ఎలాంటి కొట్టివేతలు లేకుండా సరైన పద్ధతిలో సమాధానాలు రాస్తే పూర్తి మార్కులు పొందేందుకు అవకాశముంటుంది. అవసరమైన చోట తప్పనిసరిగా స్కేలు, పెన్సిల్లను ఉపయోగించాలి. పార్ట్-1 విభాగంలో థియరీ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు స్పష్టంగా ఉండాలి. ముఖ్యమైన అంశాలను అండర్లైన్ చేయాలి. చివరగా ప్రతి సమాధానాన్ని పునఃపరిశీలించుకోవాలి. అర్థశాస్త్రం (ఎకనామిక్స్) అర్థశాస్త్రంలో అధిక మార్కులు సాధించాలంటే విద్యార్థులు ముందుగా ఆర్థిక భావనలను అర్థం చేసుకోవాలి. ఆర్థిక భావనలు, ఆర్థిక సూత్రాలకు సంబంధించిన నిర్వచనాలు, పట్టికలు, రేఖా పటాలు, ప్రమేయాలు, ప్రాముఖ్యత తదితర అంశాలపై దృష్టిసారించాలి. ప్రతిరోజూ వీటిని విశ్లేషించుకుంటూ చదవాలి. పాఠ్యాంశాలు: యూనిట్ 1: ఉపోద్ఘాతం; యూనిట్ 2: వినియోగ సిద్ధాంతం; యూనిట్ 3: డిమాండ్ వ్యాకోచత్వం; యూనిట్ 4: ఉదాసీనతా వక్రరేఖలు; యూనిట్ 5: ఉత్పత్తి సిద్ధాంతం; యూనిట్ 6: విలువ సిద్ధాంతం; యూనిట్ 7: పంపిణీ సిద్ధాంతం; యూనిట్ 8: జాతీయాదాయం; యూనిట్ 9: స్థూల ఆర్థిక అంశాలు; యూనిట్ 10: ద్రవ్యం, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం. ప్రశ్నపత్రంపై అవగాహన: అర్థశాస్త్రం ప్రశ్నపత్రంలో సెక్షన్-ఏలో ఐదు ప్రశ్నలు ఇస్తారు. వీటిలో మూడింటికి సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు పది మార్కులు. సెక్షన్-బీలోని 12 ప్రశ్నల్లో ఎనిమిది ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు ఐదు మార్కులుంటాయి. సెక్షన్-సీలోని 20 ప్రశ్నల్లో 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. పాఠ్యాంశాలు-ప్రాధాన్యం: యూనిట్- 1: ఓ ఐదు మార్కుల ప్రశ్న, మూడు రెండు మార్కుల ప్రశ్నలు వస్తాయి. యూనిట్- 2: ఓ 10 మార్కుల ప్రశ్న, రెండు ఐదు మార్కుల ప్రశ్నలు, రెండు మార్కుల ప్రశ్నలు కనీసం రెండు వస్తాయి. యూనిట్- 3: ఐదు మార్కులు(1); రెండు మార్కుల ప్రశ్నలు రెండు నుంచి మూడు వరకు వస్తాయి. యూనిట్- 4: 5 మార్కుల ప్రశ్న (1); రెండు మార్కుల ప్రశ్నలు (2). యూనిట్- 5: 10 మార్కుల ప్రశ్న (1); 5 మార్కుల ప్రశ్నలు (2); రెండు మార్కుల ప్రశ్నలు (3). యూనిట్- 6: 10 మార్కుల ప్రశ్న (1); 5 మార్కుల ప్రశ్నలు (2); రెండు మార్కుల ప్రశ్నలు (3). యూనిట్- 7: 5 మార్కుల ప్రశ్న (1); రెండు మార్కుల ప్రశ్నలు (3). యూనిట్- 8: 10 మార్కుల ప్రశ్న (1); 5 మార్కుల ప్రశ్న (1); రెండు మార్కుల ప్రశ్నలు ఒకటి లేదా రెండు వస్తాయి. యూనిట్- 9: 10 మార్కుల ప్రశ్న (1); 5 మార్కుల ప్రశ్నలు (2); రెండు మార్కుల ప్రశ్నలు రెండు వరకు వస్తాయి. యూనిట్- 10: 5 మార్కుల ప్రశ్నలు (2); 2 మార్కుల ప్రశ్నలు (3). సూచనలు: అర్థశాస్త్రంలో అధిక మార్కులు సాధించాలంటే, ముందుగా రెండు మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. తర్వాత ఐదు మార్కుల ప్రశ్నలకు, తర్వాత 10 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు సమయ పాలన పాటించడం కీలకం. పది మార్కుల ప్రశ్నకు 20 నిమిషాలు, ఐదు మార్కుల ప్రశ్నకు 10 నిమిషాలు కేటాయించాలి. చివర్లో రాసిన సమాధానాలను ఒకసారి సరిచూసుకోవాలి. prepared by K. Janardhan Reddy (Economics) Kuruhuri Ramesh (Commerce) G.W. Stevenson (Civics) Royal Educational Institutes, Hyderabad.