Celebrities Tweets
-
ఓటమితోనే... గెలిచేది, నేర్చేది!
షారుక్ ట్వీట్‌కు సచిన్ స్పందన న్యూఢిల్లీ: ఒకరేమో వెండితెర వేల్పు! మరొకరు క్రికెట్ దేవుడు! ఎవరికి వారే సాటి. విభిన్న చిత్రాలతో షారుక్ ఖాన్ బాలీవుడ్‌కు బాద్షా అయితే... సంచలన బ్యాటింగ్‌తో సచిన్ క్రికెట్లో పరుగుల మెషీన్ అయ్యాడు. ఈ హేమాహేమీలు అప్పట్లో పెప్సీ యాడ్‌లో కలిసి నటించడం... ఇద్దరి స్టార్ల అభిమానుల్ని అదేస్థాయిలో అలరించిన సంగతి తెలిసిందే! ఇప్పుడు కొత్తగా ట్వీట్లతోనూ ఒకరికొకరు తమ హృదయ స్పందనను తెలియజేసుకున్నారు. దీనికి ట్విట్టర్ వేదికైంది. ఈ సెలబ్రిటీల ట్వీట్లు ఇరు వర్గాల అభిమానుల్ని ఉత్సాహపరిచేలా ఉన్నాయి. క్రికెట్ లెజెండ్ సచిన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సచిన్– ఎ బిలియన్ డ్రీమ్స్’. చ్చే నెల 26న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో షారుక్... మాస్టర్ బ్లాస్టర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ‘నేను బలంగా నమ్ముతున్నా... నీవు బాగా ఆడినపుడు నా సినిమా బాగా ఆడింది. అదే నీవు విఫలమైనపుడు నా సినిమా ఫెయిలైంది. నీ శతకోటి అభిమానుల్లో నేను ఒకడ్ని. నీ బయోపిక్చర్కు ఆల్ ద బెస్ట్ సచిన్’ అని ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన సచిన్ ‘జీవితంలో ఓటమే లేకుంటే గెలుపనేదే ఉండదు... నేర్చుకునేదీ ఉండదు. శతకోటి అభిమానుల్లాగే నీ మాటలు నా మనసును తాకాయ్..! లవ్ యూ షారుక్’ అని పోస్ట్ చేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ అభినేత్రి మాధురి దీక్షిత్, శ్రేయా ఘోషల్‌లు కూడా సచిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
'మై డార్లింగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు'
ముంబై: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ 50వ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తాను దర్శకుడిగా మారడానికి షారూఖ్ కారణమని కరణ్ జోహార్ తెలిపాడు. షారూఖ్ కు రుణపడివుంటానని అంటూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. షారూఖ్ దిగ్గజ నటుడని కితాబిచ్చాడు. 'మై డార్లింగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని దర్శకురాలు ఫరాఖాన్ ట్వీట్ చేసింది. కింగ్ ఖాన్ ను ఆత్మీయంగా ముద్దుపెట్టుకుంటున్న ఫోటోను పోస్ట్ చేసింది. తన ఫస్ట్ హీరో అని, అతడంటే తనకెంతో గౌరవమని ప్రీతిజింతా తెలిపింది. షారూఖ్ మంచి మనిషి అని, అతడు కోప్పడడం తానెప్పుడూ చూడలేదని నటుడు బొమన్ ఇరానీ పేర్కొన్నాడు. షారూఖ్ తనకు అన్నలాంటి వాడని సోనూ సూద్ అన్నాడు. ప్రేమ, శాంతి, సౌఖ్యాలతో షారూఖ్ విలసిల్లాలని అనుపమ్ ఖేర్ ఆకాంక్షించారు. షారూఖ్ ఆయురారోగ్యాలతో విలసిల్లాలని, అభిమానుల అలరిస్తూ ఉండాలని గాయకుడు సోనూ నిగమ్ కోరుకున్నారు. సోఫీ చౌదరి, వివేక్ ఒబరాయ్ తదితరులు షారూఖ్ ఖాన్ ను జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. -
దేవుడా ఒక్క హత్య చేస్తా.. క్షమించు: తాప్సీ
నిర్భయ హత్యకేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూపై పలువురు ప్రముఖులు మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా అందరికంటే తీవ్రంగా స్పందించినది మాత్రం.. టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ. ఒకే ఒక్క హత్య చేస్తానని, అందుకు దేవుడు తనను క్షమించాలని కోరింది. ముఖేష్ ఇంటర్వ్యూను చదివి తనకు ఒక్కసారిగా మాట పడిపోయిందని, ఈ మనిషిని తాను అంత తేలిగ్గా వదిలిపెట్టేది మాత్రం లేదని స్పష్టం చేసింది. జైలు శిక్ష నిజంగానే ఈ మగాళ్లను మారుస్తుందా అనే అనుమానం తనకు వస్తోందని చెప్పింది. ఆ మార్పు రాకపోతే, ఇంకా వాళ్లు అక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించింది. http://t.co/FToBmPpNUd I am literally speechless after reading this. God please forgive me one murder, coz I can't let this man go away easy — taapsee pannu (@taapsee) March 2, 2015 This makes me question does imprisonment really change these men? If it doesn't( which is clearly visible) then y are they still there??? — taapsee pannu (@taapsee) March 2, 2015 మరాఠీ సినిమాలు తీయడంలో బిజీగా ఉన్న రేణు దేశాయ్ కూడా నిర్భయ దోషి ముఖేష్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. 'అత్యాచారంపై మీ అభిప్రాయం ఏమిటి? రేపిస్టు తన ఇంటర్వ్యూలో చెప్పిన అంశంతో మీలో ఎంతమంది రహస్యంగా ఏకీభవిస్తారు? అత్యాచారంలో నిజంగా మహిళల తప్పు ఉంటుందా?' అంటూ సూటిగా ప్రశ్నలు సంధించింది. What is your opinion on rape? How many of u secretly agree with what the rapist said in his interview?Is rape really a woman's fault? — renu desai (@renuudesai) March 3, 2015 సినిమాల్లో సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే వెన్నెల కిశోర్ సామాజిక బాధ్యత విషయంలో మాత్రం గట్టిగానే స్పందించాడు. రేపిస్టుకు కుర్చీవేసి కూర్చోబెట్టి.. ఇంటర్వ్యూ చేయడం నిజంగా నమ్మలేకపోతున్నానని, అతడు జైల్లో ఉన్న స్వాతంత్ర్య సమరయోధుడి కంటే ఎక్కువగా గొప్పలు చెప్పుకొంటున్నాడని అన్నారు. Cant believe that a brutal rapist is being given a chair to sit and being interviewed..he looks more boastful than a freedom fighter in jail — vennela kishore (@vennelakishore) March 3, 2015 టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాటల కంటే భావాలతోనే ఎక్కువగా ముఖేష్ ఉదంతాన్ని ఖండించింది. http://t.co/eycVAatJW1 - are u frickin kidding me?😡😡😡 arrrrgghhh 😡😡 — Sania Mirza (@MirzaSania) March 2, 2015