'మై డార్లింగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు' | B-Town stars extend their wishes to SRK on 50th birthday | Sakshi
Sakshi News home page

'మై డార్లింగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు'

Published Mon, Nov 2 2015 1:46 PM | Last Updated on Sun, Sep 3 2017 11:54 AM

'మై డార్లింగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు'

'మై డార్లింగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు'

ముంబై: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ 50వ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తాను దర్శకుడిగా మారడానికి షారూఖ్ కారణమని కరణ్ జోహార్ తెలిపాడు. షారూఖ్ కు రుణపడివుంటానని అంటూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. షారూఖ్ దిగ్గజ నటుడని కితాబిచ్చాడు.

'మై డార్లింగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని దర్శకురాలు ఫరాఖాన్ ట్వీట్ చేసింది. కింగ్ ఖాన్ ను ఆత్మీయంగా ముద్దుపెట్టుకుంటున్న ఫోటోను పోస్ట్ చేసింది. తన ఫస్ట్ హీరో అని, అతడంటే తనకెంతో గౌరవమని ప్రీతిజింతా తెలిపింది. షారూఖ్ మంచి మనిషి అని, అతడు కోప్పడడం తానెప్పుడూ చూడలేదని నటుడు బొమన్ ఇరానీ పేర్కొన్నాడు.

షారూఖ్ తనకు అన్నలాంటి వాడని సోనూ సూద్ అన్నాడు. ప్రేమ, శాంతి, సౌఖ్యాలతో షారూఖ్ విలసిల్లాలని అనుపమ్ ఖేర్ ఆకాంక్షించారు. షారూఖ్ ఆయురారోగ్యాలతో విలసిల్లాలని, అభిమానుల అలరిస్తూ ఉండాలని గాయకుడు సోనూ నిగమ్ కోరుకున్నారు. సోఫీ చౌదరి, వివేక్ ఒబరాయ్ తదితరులు షారూఖ్ ఖాన్ ను జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement