దేవుడా ఒక్క హత్య చేస్తా.. క్షమించు: తాప్సీ
నిర్భయ హత్యకేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూపై పలువురు ప్రముఖులు మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా అందరికంటే తీవ్రంగా స్పందించినది మాత్రం.. టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ. ఒకే ఒక్క హత్య చేస్తానని, అందుకు దేవుడు తనను క్షమించాలని కోరింది. ముఖేష్ ఇంటర్వ్యూను చదివి తనకు ఒక్కసారిగా మాట పడిపోయిందని, ఈ మనిషిని తాను అంత తేలిగ్గా వదిలిపెట్టేది మాత్రం లేదని స్పష్టం చేసింది. జైలు శిక్ష నిజంగానే ఈ మగాళ్లను మారుస్తుందా అనే అనుమానం తనకు వస్తోందని చెప్పింది. ఆ మార్పు రాకపోతే, ఇంకా వాళ్లు అక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించింది.
http://t.co/FToBmPpNUd I am literally speechless after reading this. God please forgive me one murder, coz I can't let this man go away easy
— taapsee pannu (@taapsee) March 2, 2015
This makes me question does imprisonment really change these men? If it doesn't( which is clearly visible) then y are they still there???
— taapsee pannu (@taapsee) March 2, 2015
మరాఠీ సినిమాలు తీయడంలో బిజీగా ఉన్న రేణు దేశాయ్ కూడా నిర్భయ దోషి ముఖేష్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. 'అత్యాచారంపై మీ అభిప్రాయం ఏమిటి? రేపిస్టు తన ఇంటర్వ్యూలో చెప్పిన అంశంతో మీలో ఎంతమంది రహస్యంగా ఏకీభవిస్తారు? అత్యాచారంలో నిజంగా మహిళల తప్పు ఉంటుందా?' అంటూ సూటిగా ప్రశ్నలు సంధించింది.
What is your opinion on rape? How many of u secretly agree with what the rapist said in his interview?Is rape really a woman's fault?
— renu desai (@renuudesai) March 3, 2015
సినిమాల్లో సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే వెన్నెల కిశోర్ సామాజిక బాధ్యత విషయంలో మాత్రం గట్టిగానే స్పందించాడు. రేపిస్టుకు కుర్చీవేసి కూర్చోబెట్టి.. ఇంటర్వ్యూ చేయడం నిజంగా నమ్మలేకపోతున్నానని, అతడు జైల్లో ఉన్న స్వాతంత్ర్య సమరయోధుడి కంటే ఎక్కువగా గొప్పలు చెప్పుకొంటున్నాడని అన్నారు.
Cant believe that a brutal rapist is being given a chair to sit and being interviewed..he looks more boastful than a freedom fighter in jail
— vennela kishore (@vennelakishore) March 3, 2015
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాటల కంటే భావాలతోనే ఎక్కువగా ముఖేష్ ఉదంతాన్ని ఖండించింది.
http://t.co/eycVAatJW1 - are u frickin kidding me?😡😡😡 arrrrgghhh 😡😡
— Sania Mirza (@MirzaSania) March 2, 2015