Celekt Mobiles
-
సెలెక్ట్ మొబైల్స్ ‘గ్రాండ్ వాలంటైన్స్ డే ఆఫర్స్’
హైదరాబాద్: ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మొబైల్ రిటైల్ కంపెనీ సెలెక్ట్ మొబైల్స్ గ్రాండ్ వాలంటైన్స్ డే ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 13, 14 తేదీల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ సీఎండీ వై గురు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోని అన్ని సెలెక్ట్ మొబైల్ షోరూమ్‌లలో ఈ ఆఫర్లు లభ్యమవుతాయని పేర్కొన్నారు. రూ.25,500 విలువ చేసే శాంసంగ్ ఏ6 కేవలం రూ.8,999లకు, రూ.8,999 విలువ చేసే 4జీ మొబైల్ రూ.3,999లకు, రూ.6,999 విలువ చేసే స్మార్ట్‌ఫోన్ రూ.3,999లకు వంటి రకరకాల ఆఫర్లున్నాయని తెలిపారు. -
ప్రతి మొబైల్‌పై బహుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ సెలెక్ట్ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటుడు జూనియర్ ఎన్టీయార్ నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తారని సెలెక్ట్ ఫౌండర్ వై.గురు శుక్రవారమిక్కడ తెలిపారు. కంపెనీ డైరెక్టర్ మురళి రేతినేనితో కలసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జూలై 20న తెలంగాణలో 30 స్టోర్లు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ‘2019 జూలై నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో 200 ఔట్లెట్లు అందుబాటులోకి రానున్నాయి. 2,500 మందికి ఉపాధి లభిస్తుంది. ఆ తర్వాతి రెండేళ్లలో మరో 500ల కేంద్రాలు తెరుస్తాం. మొత్తం 10,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. మూడేళ్లలో టర్నోవర్ రూ.2,500 కోట్లు ఆశిస్తున్నాం’ అని వెల్లడించారు. ఒక్కో స్టోర్‌కు కంపెనీ రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు వ్యయం చేస్తోంది. ఎక్స్‌పీరియెన్స్ జోన్లో.. వర్చువల్ సేల్స్ అసిస్టెన్స్‌తో కూడిన ప్రత్యేక ఎక్స్‌పీరియెన్స్ జోన్ సెలెక్ట్ స్టోర్లలో ఆకర్షణగా నిలుస్తోంది. ఒకేసారి ఎనమిది స్మార్ట్ఫోన్ల ఫీచర్లను జోన్లో ఉన్న భారీ టచ్ స్క్రీన్‌పై పోల్చుకోవచ్చు. డిస్ప్లేలో ఉన్న మొబైల్స్ నుంచి తీసిన ఫోటోలు ఒక్క స్వైప్‌తో టచ్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. భారత్‌లో తొలిసారిగా దీనిని ప్రవేశపెట్టారు. ఈ టెక్నాలజీని అమలు చేయడమే కంపెనీ విజయంగా భావిస్తున్నట్టు మురళి రేతినేని తెలిపారు. ఆన్లైన్ కస్టమర్లనూ ఆఫ్‌లైన్ వైపు వచ్చేలా చేస్తోందన్నారు. 1,000 చదరపు అడుగులపైగా విస్తీర్ణం ఉన్న స్టోర్లలోనే దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఎక్స్‌పీరియెన్స్ జోన్ తననూ ఆకట్టుకుందని తారక్ వ్యాఖ్యానించారు. తగ్గిన ఆన్లైన్ సేల్స్.. దక్షిణాదిన, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆన్లైన్ సేల్స్ తగ్గుతున్నాయి. వ్యవస్థీకృత రిటైల్ చైన్లు ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని గురు తెలిపారు. ‘మొబైల్స్ అమ్మకాల్లో దేశవ్యాప్తంగా వ్యవస్థీకృత రంగం వాటా 13 శాతమే. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఏకంగా 50 శాతముంది. దక్షిణాది 25 శాతం కైవసం చేసుకుంది’ అని పేర్కొన్నారు. ఇక పాపులర్ గ్యాడ్జెట్స్ విక్రయంపైనా ఫోకస్ చేస్తున్నా మని గురు తెలిపారు. ప్రతి మొబైల్‌పై ఖచ్చితమైన బహుమతి అందిస్తున్నట్టు చెప్పారు. ‘ధర విషయంలో ఆన్‌లైన్‌కు పోటీ ఇస్తున్నాం. రూ.3,000ల ఫోన్‌కూ ఈఎంఐ ఆఫర్ చేస్తున్నాం. విక్రయాల్లో ఈ ఎంఐ వాటా 50 శాతం ఉంది’ అని వివరించారు. -
ఆ విషయంలో గొడవలు వస్తుంటాయి: ఎన్టీఆర్
‘బిగ్‌బాస్ షోను నాని బాగా రక్తి కట్టిస్తున్నాడు. ప్రతివారం పిట్ట కథలతో ఆకట్టుకుంటున్నాడు. ముందు చెప్పినట్లుగానే ఈసారి మరికాస్త మసాలా యాడ్ చేస్తూ తనదైన శైలిలో అదరగొడుతున్నాడం’టూ నానిపై ప్రశంసలు కురిపించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అంతేకాక బిగ్‌బాస్ లాంటి భారీ ప్రాజెక్ట్‌కు ఎవరూ చేసినా బాగానే ఉంటుందన్నారు. మొబైల్ రిటైల్ ఇండస్ట్రీలోకి కొత్తగా ప్రవేశించిన ‘సెలెక్ట్’ తన బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్‌ను నియమించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మొబైల్ స్టోర్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే వీటిలో భాగం అయ్యాను. నా మొదటి ఫోన్ జగదీష్ మార్కెట్లో కొన్నాను. ఇప్పటికి ఫోన్లో గేమ్‌లే ఎక్కువగా ఆడుతుంటాను. మొదట్లో ఐ ఫోన్ ఎలా వాడాలో అర్థం అయ్యేది కాదు. కానీ మా అబ్బాయి అభయ్‌రామ్ ఇప్పడే నా ఐఫోన్‌నే కాక వాడి నానమ్మ ఐఫోన్ కూడా వాడుతున్నాడు. అయితే అభయ్కు ఫోన్‌ను మాత్రం గిఫ్ట్‌గా ఇవ్వను. నాకు, నా భార్యకు ఫోటోలు దిగే దగ్గరే ఎక్కువగా గొడవలు వస్తుంటాయి’ అని తెలిపారు. గతంలో నవరత్న, మలబార్ గోల్డ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా చేసిన తారక్ మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడం మాత్రం ఇదే ప్రథమం. -
రామ్ చరణ్, అల్లు అర్జున్ క్లబ్‌లోకి ఎన్టీఆర్
మొబైల్ రిటైల్ ఇండస్ట్రీలోకి కొత్తగా ప్రవేశించిన ప్రముఖ మొబైల్ సంస్థ సెలెక్ట్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్‌ను నియమించుకుంది. ప్రముఖ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్టు ఈ కంపెనీ చెప్పింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని జూలై 13న మూడు గంటలకు హైటెక్ సిటీలోని ఐటీసీ కోహెనుర్లో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మీడియాను, సన్నిహిత వర్గాలను సెలెక్ట్ మొబైల్స్ ఆహ్వానిస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్ ఈ బ్రాండ్ కోసం షూట్ కూడా చేయనున్నారని తెలిసింది. ఎన్టీఆర్‌ను సెలెక్ట్ మొబైల్స్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడంతో, రామ్ చరణ్, అల్లు అర్జున్ క్లబ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయారు. రామ్ చరణ్ హ్యాపీ మొబైల్స్‌కు, అల్లు అర్జున్ లాట్ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తిరుపతి, హైదరాబాద్‌లో స్టోర్లను ఏర్పాటు చేసిన సెలెక్ట్ మొబైల్స్ తన కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించింది. తొలుత దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో 500 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఈ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలోనే చెప్పింది. ఆ అనంతరం ఉత్తర భారత్‌పై ఫోకస్ చేయనున్నట్టు పేర్కొంది. ఎక్కువ మంది వినియోగదారులు ఫోన్లను ఫిజికల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి ఇష్టపడతారని ఈ కంపెనీ చెబుతోంది.