cell phone theft
-
‘టక్కరి దొంగ’.. ఎవరికీ అర్థం కాకుండా కొట్టేశాడు!
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో టక్కరిదొంగ దొరికాడు. బీసీల కులగణన లెక్కలు తేలాయని, ఎస్సీల వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ఆమోదం లభించిందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబురాల్లో ఉంటే ఓ దొంగ తన చేతివాటానికి పనిచెప్పాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 సెల్ఫోన్లను కార్యకర్తల జేబుల్లోంచి ఎవరికీ అర్థం కాకుండా కొట్టేశాడు. అయినా అతని చౌర్యదాహం తీరలేదేమో ఇంకా ఫోన్లు దొరుకుతాయని ప్రయత్నాలు చేస్తుండగా ఓ ఫొటోగ్రాఫర్ (Photographer) కంటపడటంతో ఆ దొంగ పట్టుబడ్డాడు.మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ (Mahesh Kumar Goud) తన గన్‌మెన్‌ను సన్మానించడంతో వెలుగులోకి వచ్చింది. బాణసంచాలు కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ కార్యకర్తలు బిజీగా ఉన్న సమయంలో సెల్ఫోన్లను కొట్టేస్తున్న ఆ దొంగను ఫొటోగ్రాఫర్ హరీశ్ చొరవతో పట్టుకున్నందుకు తన గన్‌మెన్ దేవరాజ్‌ను శాలువాతో సన్మానించారు. దొంగను హ్యాండిల్ చేసిన విధానాన్ని మహేశ్‌గౌడ్ అభినందించారు.సచివాలయం వద్ద మాజీ సర్పంచ్ల అరెస్ట్ తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ సచివాలయం ఎదుట ఉరితాళ్లతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, నేతలు గుంటి మధుసూదన్‌రెడ్డి, రాంపాక నాగయ్య, కేశబోయిన మల్లయ్య, నెమలి సుభాష్ గౌడ్, మెడబోయిన గణేష్, బొల్లం శారదలను అరెస్టు చేసి కాంచన్‌బాగ్, షాయినాయత్‌గంజ్ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా యాదయ్య గౌడ్ మాట్లా డుతూ 13 నెలలుగా అనేక రూపాల్లో ఉద్యమాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. మాజీ సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నా కనికరం లేదన్నారు.చిరకాల ఆకాంక్ష నెరవేరింది మాదిగల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని, ఎస్సీ వర్గీకరణకు చట్ట బద్దత కల్పించిన రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డికి మాదిగ సంఘాల ఫ్రంట్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదిగ సంఘాల ఫ్రంట్ ప్రతినిధులు, తెలంగాణమాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు జన్ను కనకరాజు మాదిగ తదితరులు మాట్లాడారు.చదవండి: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారురాష్ట్రంలో మొత్తం ఎస్సీ జనాభా 17.43 శాతం ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లు 17శాతం పెంచుతూ మాదిగ జనాభాకు తగినట్లుగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అలాగే దశాబ్దాల కాలంగా మాదిగలు నష్టపోయిన రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. సమావేశంలో లాయర్ మల్లన్న, బొక్కల వెంకటస్వామి పాల్గొన్నారు. -
టార్గెట్ సెల్‌ఫోన్స్!
సాక్షి, సిటీబ్యూరో: అతనో రౌడీషీటర్ నగర పోలీసులు రెండుసార్లు అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు... అయినా పంథా మార్చుకోని అతను మరో ముగ్గురితో కలిసి దృష్టి మళ్లించి సెల్ఫోన్లు తస్కరించడం మొదలెట్టాడు. ఇటీవల కాలంలో మొత్తం ఐదు చోరీలు చేసిన ఈ ముఠాలో ముగ్గురిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం పటుకున్నారు. వీరి నుంచి 11 సెల్ఫోన్లు, ఆటో స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. యాకత్‌పురకు చెందిన మహ్మద్ పర్వేజ్ అలియాస్ ఫర్రు వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. దురలవాట్లకు బానిసైన అతను నేరాలు చేయడం మొదలెట్టాడు. హత్య, హత్యాయత్నం, ఆయుధ చట్టం కింద నమోదైన వాటితో సహా మొత్తం 24 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉండటంతో రెయిన్‌బజార్ పోలీసులు రౌడీషీట్ తెరిచారు. ఇతడి నేరచరిత్రను పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు విభాగం 2015, 2017ల్లో పీడీ యాక్ట్ ప్రయోగించింది. ఈ రెందు సందర్భాల్లోనూ ఏడాది చొప్పున జైల్లో ఉండి బయటకు వచ్చిన ఇతను సైనిక్‌పురికి మకాం మార్చాడు. మురాద్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్, చిలకలగూడ వాసి మహ్మద్ నదీమ్‌లతో పాటు గౌస్‌తో ముఠా కట్టాడు. వీరిలో నేరచరితుడైన ఇమ్రాన్‌పై మూడు కేసులు ఉన్నాయి. పర్వేజ్ పరిచయస్తులైన ఆటో యజమానుల నుంచి వాహనాన్ని అద్దెకు తీసుకునేవాడు. తాను ఆటోడ్రైవర్‌గా నటిస్తూ తన ముగ్గురు అనుచరులను ప్యాసింజర్ల మాదిరిగా వెనుక కూర్చోబెట్టుకుంటాడు. సికింద్రాబాద్ బస్టాండ్, రైల్వేస్టేషన్లతో పాటు మెహదీపట్నం బస్టాండ్లలో మాటు వేసూ ఈ ముఠా ఒంటరి ప్రయాణికుల్ని ఎంపిక చేసుకుని వారు వెళ్లాల్సిన గమ్యాలను చేరుస్తామని ఎర వేసి ఎక్కించుకుంటుంది. ఆటో కాస్త ముందుకు వెళ్లిన తర్వాత ప్రయాణికుడి దృష్టి మళ్లించే నిందితులు అతడి సెల్‌ఫోన్ కాజేస్తారు. ఆపై తమకు వేరే పని ఉందంటూ మార్గమధ్యంలో ఆ ప్రయాణికుడిని దింపేసి.. అతడు సెల్‌ఫోన్ పోయిన విషయం గుర్తించేలోపే వేగంగా ఉడాయిస్తారు. ఈ గ్యాంగ్ ఇటీవల కాలంలో ఇదే తరహాలో మహంకాళి, గోపాలపురం. ఆసిఫ్‌నగర్, బంజారాహిల్స్, రాయదుర్గం ఠాణాల పరిధిలో 11 సెల్ఫోన్లు చోరీ చేశారు. వీటిని అమ్మగా వచ్చిన మొత్తాన్ని అంతా పంచుకుని జల్సాలు చేస్తుంటారు. ఈ తరహా ఫిర్యాదులు వరుసగా అందడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ ఆధారంగా అనుమానితులను గుర్తించారు. ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు బి.పరమేశ్వర్, కేఎస్ రవి, కె.శ్రీకాంత్ తమ బృందాలతో వలపన్నారు. సికింద్రాబాద్‌లోని 31 బస్టాప్ వద్ద గౌస్ సహా మిగిలిన ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును మహంకాళి పోలీసులకు అప్పగించారు. -
మొబైల్‌షాప్‌లో చోరీ - సేల్స్ మెన్ అరెస్టు
పనిచేస్తున్న మొబైల్ షాపునకే కన్నం వేశారు. తాము ఉద్యోగం వెలగబెడుతున్న మొబైల్ షాపులో చోరీకి పాల్పడ్డ ఇద్దరు సేల్స్‌మెన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సౌత్‌జోన్ పరిధిలోని మొఘల్‌పురా పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి నుంచి 80 సెల్ఫోన్లను, రూ.25 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.