సెల్వన్ సేవలు నిల్
13 రోజుల నుంచి అందని సిగ్నల్స్
వినియోగదారుల ఆగ్రహం
బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి తళాలు
కార్యాలయం ఎదుట ఆందోళన
అంబేద్కర్ కూడలిలో రాస్తారోకో
పెదబయలు, న్యూస్‌లైన్ :సెల్ పని చేయదు.. విల్ మోగదు.. ల్యాండ్‌లైన్ పలకదు.. 13 రో జులుగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నా బీఎస్ఎన్ఎల్ అధికారులు స్పందించకపోవడంతో వినియోగదారులు శనివారం రోడ్డెక్కారు. సెల్ సిగ్నల్స్ అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది జాడ లేకపోవడంతో మండిపడ్డారు. స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాల యానికి తాళాలు వేశారు. కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అనంతరం స్థానిక అంబేద్కర్ జంక్షన్లో గంటపాటు రాస్తారోకో చేశారు.
అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. 13 రోజుల నుంచి సిగ్నల్ లేకపోయినా అధికారులు స్పందించకపోవడం దారుణమని, ఫోన్లు చేసుకోవాలంటే పాడేరు వరకు వెళ్లాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని చేయాలన్న, అధికారుల నుంచి సమాచారం ఉండడం లేదని ఉద్యోగు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు వారాల నుంచి ఫోన్ చే యడానికి పాడేరు వెళ్తున్నామని తెలిపారు. స్థానిక సెల్‌టవర్‌కు సంబంధించి టె క్నికల్ సిబ్బంది, జేఈఈ, ఇతర అధికారుల ప ర్యవేక్షణ లోపం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిం దన్నారు. దీనికి తోడు విద్యుత్ కోతలు విసుగు తెప్పిస్తున్నాయని ఆగ్ర హం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వినియోగదారులు హెచ్చరించారు.
బీఎస్ఎన్ఎల్, విద్యుత్ శాఖ అధికారులపై ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేస్తామని సీపీఎం నాయకుడు బొండా సన్నిబాబు, స్థానికులు దడియా రాంబాబు, ఎం. పోతురాజు, లక్ష్మీనారాయణ, వర్తకులు తెలిపారు.