Central Adoption Resource Authority
-
పిల్లలు లేరా.. అయితే ఉందిగా ఒక మార్గం!
నెహ్రూనగర్(గుంటూరు జిల్లా): పండంటి బిడ్డ కోసం పెళ్లయిన దగ్గర నుంచి దంపతులంతా తాపత్రయపడుతుంటారు. అయితే, ప్రస్తుత యాంత్రిక జీవనంలో దాన్ని నోచుకోక ఎంతో మంది ఆవేదనకు గురవుతున్నారు. పిల్లలు పుట్టడం కష్టతరమవుతుంది. కొంత మంది ఎంతో ఖర్చుపెట్టి కృత్రిమంగా పిల్లల్ని కంటున్నారు. మరికొంత మంది అదీ కూడా అవకాశం లేక అల్లాడుతున్నారు. అటువంటి వారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారుల దత్తత కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా అమలు చేస్తున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం. చదవండి: సీతా ఫలంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? 2011 సంవత్సరం నుంచి అందుబాటులోకి దత్తత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2011 నుంచి చిన్నారుల దత్తత కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇందుకోసం కొన్ని నియమ, నిబంధనల్ని ఏర్పాటు చేశాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు 149 మంది చిన్నారుల్ని స్వదేశంలో, ఏడుగురిని ఇతర దేశాల వారికి అధికారులు దత్తత ఇచ్చారు. చిన్నారుల్ని దత్తతకు ఇచ్చేటప్పుడు అన్ని నియమ, నిబంధనలకు లోబడి అర్హత కలిగిన దంపతులకు మాత్రమే అప్పగిస్తారు. ఇలా దరఖాస్తు చేసుకోవాలి దత్తత తీసుకునే దంపతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న www.cara. nic.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ♦వెబ్ సైట్లోకి వెళ్ళి న్యూ రిజి్రస్టేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦బేసిక్ ఇన్ఫార్మేషన్ ఇవ్వాలి( వయస్సు, పెళ్లి తదితర వివరాలు) ♦దంపతుల్లో ఎవరిదో ఒకరి పాన్‌కార్డ్‌తో రిజిస్టర్ అయిన వెంటనే యూజర్ ఐడీ, పాస్ వర్డ్ (మెయిల్‌కి, మొబైల్) వస్తుంది. ♦యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయిన తరువాత తగిన ధ్రువ పత్రాలైన రెసిడెన్స్ సరి్టఫికెట్, బర్త్ సరి్టఫికెట్(10వ తరగతి మార్క్ లిస్ట్, 10లోపు చదివిన వారైతే స్టడీ సర్టిఫికెట్స్), ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఉద్యోగి అయితే జీతం సరి్టఫికెట్, ఇతరులైతే 1.50లక్షకు పైగా పత్రం పొందాల్సి ఉంటుంది), పెళ్లి సరి్టఫికెట్, డాక్టర్ సర్టిఫికెట్ ( ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధులు, ప్రాణాంతకరమైన వ్యాధులుగాని లేవని ఎంబీబీఎస్ రిజిస్టర్డ్ డాక్టర్ నుంచి) తీసుకోవాలి. –దంపతులిద్దరూ కలిసి దిగిన ఫోటోల్ని వెబ్సైట్లో ఆప్‌లోడ్ చేయాలి. ♦తరువాత ఈ వివరాలన్నీ మహిళా, శిశు సంక్షేమ శాఖ లాగిన్లోకి వెళతాయి. ♦ఇచ్చిన వివరాలు సక్రమంగా ఉన్నాయా...లేవా? అని శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రత్యేకంగా కేటాయించిన సిబ్బంది దంపతుల ఇంటికి వెళ్లి విచారణ(హోం స్టడీ) చేపడతారు. ♦అంతా సక్రమంగా ఉంటే ఆ వివరాల్ని ఐసీడీఎస్ పీడీ లాగిన్‌కి వెళుతుంది. ♦అక్కడ నుంచి వారి సీనియార్టీ ప్రకారం చిన్నారుల్ని దత్తత ప్రక్రియ ప్రారంభమవుతుంది. ♦అర్జీదారు కోరుకున్న బిడ్డను రిఫర్ చేస్తూ వారి మొబైల్‌కు సమాచారం అందుతుంది. ఆ సమాచారం మేరకు 48 గంటల్లో కారా వెబ్ సైట్లో లాగిన్ అయి సదరు బిడ్డ నచ్చితే రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. ♦రిజర్వు చేసుకున్న బిడ్డను ఇరవై రోజుల్లోపు పోలికలు సరిపోల్చుకుని బిడ్డ నచ్చినట్లయితే, దత్తత ఏజెన్సీ వద్దకు వెళ్ళి ఆమోదం తెలియజేసి రూ.40వేల డీడీ సమరి్పంచి పొందవచ్చు. ♦బిడ్డను పొందిన వారం రోజుల్లోపు సదరు దత్తత ఏజెన్సీ వారు సమరి్పంచిన ధ్రువపత్రాలన్నింటినీ స్థానిక కుటుంబ న్యాయస్థానంలో సమరి్పంచి కోర్టు ఉత్తర్వుల ప్రతిని అందజేస్తారు. ♦ప్రతిది వారి మెయిల్, మొబైల్‌కి ఆప్ టూ డేట్ కారా వెబ్ సైట్ నుంచి వస్తూ ఉంటుంది. ♦ప్రస్తుతం 2018–19 ఎన్రోల్ చేసుకున్న వారికి సీనియార్టీ ప్రకారం పూర్తి పారదర్శకంగా పిల్లలను దత్తత కింద అప్పగిస్తున్నారు. ♦పిల్లల్ని అప్పగించిన తరువాత కూడా రెండు సంవత్సరాల పాటు దత్తత తీసుకున్న చిన్నారుల్ని శిశు సంక్షేమ శాక అధికారులు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. వయస్సును బట్టి బిడ్డల అప్పగింత ♦తల్లిదండ్రుల వయస్సు 55 సంవత్సరాలు మించకూడదు. ♦తల్లి, తండ్రి వయస్సు ఇద్దరిది కలిపి 90 సంవత్సరాలుగా ఉంటే(తండ్రికి 50, తల్లికి 40 వయస్సు) 0 నుంచి 4 సంవత్సరాల పాప/బాబు దత్తత ఇస్తారు. ఇద్దరి వయస్సు కలిపి 100 సంవత్సరాలు ఉంటే 4 నుంచి 8 సంవత్సరాలలోపు పిల్లల్ని దత్తతకు ఇస్తారు. ♦సింగిల్ పేరెంట్ 45 సంవత్సరాలు కలిగి ఉన్న తండ్రికి మగ బిడ్డను ఇస్తారు. అదే తల్లికి అయితే మగ/ఆడ బిడ్డను దత్తకు ఇస్తారు. పారదర్శకంగా ప్రక్రియ దత్తత ప్రక్రియ అంతా కూడా కారా అనే వెబ్సైట్ ద్వారా పారదర్శకంగా జరుగుతుంది. పిల్లలు కావాలనుకున్న దంపతులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే వారి సీనియార్టీ ప్రకారం 0 నుంచి 18 సంవత్సరాలలోపు వయస్సున్న పిల్లలను దత్తత తీసుకోవచ్చు. జిల్లాలో శిశు గృహాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లల్ని పెంచలేము అనే వారు ఇక్కడ అందజేస్తే వారిని దత్తత ఇస్తారు. – బి. మనోరంజని, పీడీ, ఐసీడీఎస్ గుంటూరు -
కోవిడ్‌తో కన్నవారిని కోల్పోయిన చిన్నారులు
న్యూఢిల్లీ: కోవిడ్–19తో కన్నవారిని వారిని పోగొట్టుకున్న చిన్నారుల పునరావాసం విధానాన్ని కేంద్రం ఖరారు చేసింది. కోవిడ్ మహమ్మారికి బలైపోయిన తల్లిదండ్రుల పిల్లలను దత్తత తీసుకుంటామంటూ పలువురు సామాజిక మాధ్య మాల ద్వారా ముందుకు వస్తున్న నేపథ్యంలో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ (డబ్ల్యూసీడీ) ఈ మేరకు స్పందించింది. ఇలా దత్తత తీసుకోవడం లేదా ప్రోత్సహించడం చట్ట వ్యతిరేకమని పేర్కొంటూ ఈ విషయంలో నిర్దిష్ట విధానాన్ని ప్రకటించింది. ‘కోవిడ్–19కు గురై తల్లి, తండ్రి ఇద్దరూ చనిపోయిన సందర్భాల్లో వారి సంతానాన్ని స్థానిక సిబ్బంది జిల్లా శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎదుట 24 గంటల్లోగా హాజరు పరచాలి. ఆ వెంటనే సీడబ్ల్యూసీలు సదరు చిన్నారిని.. పరిస్థితిని బట్టి సంరక్షకులకు అప్పగించడం లేదా ఇతర సంస్థల్లో పునరావాసం కల్పించేందుకు తగు ఉత్తర్వులు జారీ చేయాలి’అని డబ్ల్యూసీడీ పేర్కొంది. ఆ చిన్నారి భద్రత, వారి ఆసక్తిని పరిగణనలోకి తీసుకుంటూ సాధ్యమైనంత వరకు వారి కుటుంబం, సామాజిక వర్గం వాతావరణంలో ఇమిడేలా జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలంది. బంధువర్గంలోని వారి సంరక్షణలో ఉంచినట్లయితే ఆ చిన్నారి యోగక్షేమాలను సమీక్షిస్తుండాలని కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాలు ఈ అంశాలను వర్చువల్‌గా జిల్లా యంత్రాంగాలకు తెలపాలని సూచించింది. ఎవరైనా చిన్నారి కోవిడ్‌తో తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన సందర్భాల్లో ఆ సమాచారాన్ని చైల్డ్ లైన్ నంబర్ 1098కి ఫోన్ చేసి తెలపవచ్చని పేర్కొంది. అనాథ చిన్నారులను చట్టపరంగా దత్తత తీసుకోదలిచిన వారు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (cara.nic.in)ని సంప్రదించాలని కోరింది. (చదవండి: పాజిటివ్ కేసులు తగ్గుముఖం) -
దత్తతకు చట్టబద్ధత కరువు..
ఆడపిల్లే ఇంటికి దీపం.. ఇంటి మహాలక్ష్మీ.. ఓపిక, సహనం.. సాహసానికి ప్రతిరూపం.. ఎక్కడ చూసినా ఆడవాళ్లదే పై చేయి. రంగం ఏదైనా పురుషులతో సమానంగా పోటీ పడుతున్న సమయంలో అక్కడక్కడా ఆడపిల్లను అంగడిలో సరుకును చేస్తున్న సంఘటనలు కలవరానికి గురిచేస్తున్నాయి. ఆడ పిల్లలు భారం కావద్దని భవిష్యత్‌కు ఆధారం కావాలని ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కొంత మంది డబ్బులకు ఆశపడి అమ్మకానికి, అక్రమ దత్తతలకు ఇస్తున్నారు. దత్తతను ఇస్తున్నట్లు నాన్ జ్యుడీషియల్ పేపర్ల మీద రాసుకుని ఇస్తున్నారు. ఇందుకు ఇటీవల నర్సంపేటలోని లక్నెపల్లిలో జరిగిన సంఘటనే ఉదాహరణ.. సాక్షి, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామానికి చెందిన దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నాలుగో సంతానంలో ఆడపిల్ల పుట్టింది. దీంతో దుగ్గొండి మండలం మహ్మదాపురంకు చెందిన దంపతులకు ఆడపిల్లను దత్తత ఇచ్చారు. ఈ దత్తత తీసుకున్న దంపతులకు వివాహమై 15 సంవత్సరాలవుతోంది. అయినా పిల్లలు పుట్టకపోవడంతో దత్తతను తీసుకుంటున్నామని, దత్తత తీసుకున్న దంపతులు ఆ పాప పేరు మీద ఇల్లు, 0.20గుంటల పొలాన్ని రాసిచ్చారు. దత్తతను ఇచ్చిన వారు ఎక్కడా తమ పాప అని చెప్పవద్దని నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌పేపర్‌పై దత్తత పత్రం రాసుకుని సెప్టెంబర్ 19న దత్తతను తీసుకున్నారు. ఈ దత్తత విషయం ఈ నోట ఆ నోట పడి ఈ నెల 1న జిల్లా చైల్ట్ వైల్ఫేర్ అధికారులకు చేరింది. దీంతో చుట్టు పక్కల వారిని విచారించగా నిజమేనని తెలింది. దత్తత ఇచ్చిన పాపను తీసుకుని శనివారం చైల్డ్ వేల్ఫెర్ కమిటీ ఎదుట హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు 127 మంది దత్తత.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కారా ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2007 నుంచి ఇప్పటివరకు 127 మందిని దంపతులు దత్తత తీసుకున్నారు. అందులో అబ్బాయిలు 30 మంది, అమ్మాయిలు 97 మందిని తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆడ శిశువుల విక్రయాలు సాగుతున్నాయి. శిశు సంక్షేమ శాఖ తనిఖీల్లో బయటకు వస్తున్నాయి. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల సంరక్షణ కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న తల్లితండ్రులు బాలికలమీద అదే వివక్ష కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు బాలికలకు ఉచిత విద్యా అందిస్తున్న సైతం శిశువు అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. దత్తత ఇలా తీసుకోవాలి పిల్లలు లేని దంపతులు తమ బంధువుల పిల్లలను దత్తత తీసుకున్న సైతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం తీసుకోవాలి. అక్రమ దత్తత చట్టరీత్యా నేరం. కేంద్ర ప్రభుత్వం మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్ విధానాన్ని 2014 నుంచి అమలు చేస్తున్నారు. ఠీఠీఠీ.ఛ్చిట్చ. nజీఛి.జీ n లో దరఖాస్తు చేసుకోవాలి. దత్తత విషయంలో దంపతులకు సంబంధించిన ప్రధానమైన మూడు అంశాలను సంతృప్తికరంగా ఉంటేనే బాలల సంరక్షణ కమిటీ అనుమతి మంజూరు చేస్తుంది. దంపతులు ఆరోగ్యం సామాజికపరమైన అంశాలు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంది. సంక్రమిత తదితర వ్యాధులతో అనారోగ్యం కలిగి ఉండడం, ఇతర పోలీసు కేసులు ఉండడం కనీస ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేనట్లయితే దత్తత ఇవ్వరు. దత్తతకు సిద్ధమైన దంపతులు కౌన్సెలింగ్ తర్వాత దరఖాస్తు చేయడం పూర్తయ్యాక చివరి దశలో అంటే ఆరోగ్యం పోలీసులు కేసులు ఆర్థిక పరిస్థితుల ఆధారంగా అనుమతి మంజూరవుతుంది. కన్నవారే కాదంటున్నారు.. తండాల్లో ఎక్కువగా శిశు విక్రయాలు, అక్రమ దత్తతలు జరుగుతున్నాయి. ఒక కుటుంబానికి ఇద్దరు ఆడ పిల్లలుండగా మగ బిడ్డ కోసం వేచి చూడగా మళ్లీ ఆడ పిల్ల పుట్టడటంతో వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్పత్రిలోనే ఆడ పిల్ల పుట్టిందని వద్దు అని కుటుంబసభ్యులు చర్చించుకుని నిర్ణయం తీసుకుంటున్నారు. ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు మళ్లీ ఆడపిల్లనే పుట్టింది వద్దని ఎవరైనా కావాలంటారా అని సమాచారం ఇస్తున్నారు. దీంతో ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది మద్యవర్తిగా వ్యవహరించి ఆ ఆడ శిశువును విక్రయిస్తున్నారు. వివాహమై పిల్లలు లేని వారు ముందుగా ఆసుపత్రి సిబ్బందికి చెప్పి పెడుతున్నారు. ఎవరైనా ఆడపిల్లను ఇస్తే పెంచుకుంటామని పిల్లలు లేని తల్లితండ్రులు చెబుతున్నారు. అక్రమంగా దత్తత తీసుకోవద్దు అక్రమంగా చిన్నారులను దత్తత తీసుకోవద్దు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కారా నిబంధనల ప్రకారం దత్తతను తీసుకోవాలి. అక్రమంగా చిన్నారులను దత్తత తీసుకోవద్దు. విక్రయించినా, కొనుగోలు చేసినా శిక్షార్హులు. ఆడపిల్లలను అక్రమంగా విక్రయించినా, కొనుగోలు చేసినా, బ్రూణ హత్యలు చేసినా, బాల్య వివాహాలు చేసినా చట్టరీత్యా కేసులు నమోదు చేస్తాం. – మహేందర్‌రెడ్డి, జిల్లా బాలల సంరక్షణ అధికారి -
కొత్త జిల్లాల్లో చైల్డ్ కేర్ సెంటర్లు
♦ తుమ్మల నాగేశ్వరరావు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలోనూ చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం సచివాలయంలో సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా) సలహా కమిటీ చైర్మన్ రాంచందర్‌రెడ్డి, సంబంధిత అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రైవేటు చైల్డ్ కేర్ సెంటర్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని అధికారులు పేర్కొనగా మంత్రి పైవిధంగా స్పందించారు. కొత్త జిల్లాల్లో చైల్డ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి సమర్పించినట్లు వివరించారు. ఒకట్రెండు రోజుల్లో వీటికి ఆమోదం లభిస్తుందన్నారు. నవజాత శిశువుల దత్తత విషయంలో ప్రైవేటు చైల్డ్ కేర్ సెంటర్లు అక్రమాలకు పాల్పడుతున్నాయని, దత్తత ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని కారా చైర్మన్ రాంచందర్‌రెడ్డి సూచించగా మంత్రి స్పందిస్తూ పూర్తిస్థాయి విచారణ చేపడతామన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు తీసుకుని అర్హులకు మాత్రమే దత్తత ఇస్తున్నామని అన్నారు. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ సలహా కమిటీ తరహాలోనే స్టేట్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీని(సారా) ఏర్పాటు చేస్తామన్నారు. -
ఒంటరి మహిళ ఒడిలో వరాల మూట
సర్వే జీవితం.. మనిషిని ఒంటరిగా ఉంచదు. ఉదయాన్నే సూర్యుడొచ్చి లేపుతాడు. రాత్రవగానే నక్షత్రాలు పలకరిస్తాయి. పక్షుల పరవశ రాగాలొచ్చి వాలిపోతాయి. పూల పరిమళాలు మెత్తగా హత్తుకుంటాయి. ఇవి మాత్రమే కాదు.. అనాథ బాలల నవ్వులూ ఉన్నాయి! ఆ నవ్వులకు ఒడిపడుతున్న వారిలో ఇప్పుడు మహిళలదే ముందడుగు. ‘ఒంటరి మహిళ ఈ సమాజంలో బతకడమే కష్టం.’ ఇటీవల సమాజంలో వస్తున్న మార్పులను చూస్తే ఈ అభిప్రాయం మెల్లమెల్లగా దూరమవుతోందనిపిస్తోంది. ఒంటరి మహిళ తాను జీవించడంతోపాటు మరో అనాథ బిడ్డను దత్తు తీసుకొని ఆ బిడ్డకు తల్లిలా ప్రేమను పంచుతోంది. మంచి భవిష్యత్తును ఇవ్వగలదని నిరూపిస్తోంది. సమాజంలో వస్తున్న మార్పులకు ఇదో మంచి సూచిక. ఇటీవల భారత ప్రభుత్వ దత్తత గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. రెండేళ్ల క్రితం అంటే 2015 ఆగస్టు నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా దత్తత కోరే తల్లిదండ్రుల వివరాల నమోదు తప్పనిసరి చేశారు. దీంట్లో భాగంగా 412 మంది ఒంటరి మహిళలు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీకి,, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ శాఖవారికి తమ వివరాలను పొందుపరుస్తూ నమోదు చేసుకున్నారు. 2015లో 75 మంది ఒంటరి మహిళలు పిల్లలను దత్తత తీసుకోగా వీరి సంఖ్య కిందటేడాది అంటే 2016లో 93కి పెరిగింది. భారతదేశం మొత్తం మీద 2015 – 2016 సంవత్సరంలో 2,903 మంది పిల్లలు దత్తత వెళ్లారు. 2011 జనాభా గణన సంఖ్యను పరిశీలిస్తే ఒంటరిగా ఉండే మహిళలు (పెళ్లికానివారు, వితంతువులు, విడాకులు తీసుకున్నవారు) 71 లక్షల పైచిలుకు ఉన్నారు. సమాజంలో ఎదుగుదల, ఒత్తిడి పరిగణనలోకి తీసుకుంటే ఇటీవల వీరిలో ఎంతో అవగాహన, ఆత్మవిశ్వాసం పెరిగినట్టుగా అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో అవగాహన కల్గి ఉండే ఒంటరి మహిళల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మగువలే ముందడుగు.. ఒంటరి మహిళలతో పోల్చితే ఒంటరి మగవారు పిల్లలను దత్తత తీసుకోవడంలో వెనుకబడే ఉన్నారు. 2015–2016లో ఒంటరి మగవారు దత్తత కోసం తమ పేర్లను నమోదుచేసుకున్నవారి సంఖ్య 25 ఉండగా కేవలం ఐదుగురు పిల్లలను మాత్రమే దత్తత స్వీకరించారు. దత్తత నమోదు పట్టికలో ఒంటరిగా ఉండే మహిళలు లేదా మగవారికీ కొత్త గైడ్‌లైన్స్‌ను రూపొందించారు. అయితే, ఒంటరిగా ఉండే మగవారు అమ్మాయిలను దత్తత తీసుకునే సౌలభ్యం లేదు. 55 ఏళ్లు వస్తే ఒంటరి మగవాడు దత్తత తీసుకునే అర్హతనూ కోల్పోతాడు. వివక్షకు వీడ్కోలు ‘‘ఒంటరి మహిళ పిల్లలను దత్తత తీసుకోవడానికి సాంఘిక వైఖరిలో వస్తున్న మార్పులు సహకరిస్తున్నాయి. అదేవిధంగా పారదర్శక విధానాలూ ఇందుకు సహాయపడుతున్నాయి’’ అంటున్నారు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ సెక్రటరీ కొలొనెల్ దీపక్ కుమార్. మాతృహక్కు అర్హత ప్రమాణాలను నెరవేర్చితే సమాజంలో వివక్ష తగ్గిపోతోందని, అయితే, ఒంటరి మహిళలకు దత్తత ఇవ్వడానికి దత్తతసంస్థలు ఇంకా అంత సుముఖంగా లేవని స్త్రీ, శిశు సంక్షేమ శాఖాధికారులంటున్నారు. అయినప్పటికీ నిరాకరణ... అక్టోబర్ 2015 నుంచి ఒంటరి మహిళకు బిడ్డను దత్తత ఇవ్వడానికి మదర్ థెరిస్సా మిషనరీస్ స్వచ్ఛంద సంస్థలు నిరాకరిస్తున్నాయి. కొత్త స్వీకరణ మార్గదర్శకాలను పాటించడానికి వీరు నిరాకరిస్తున్నారు. సైద్ధాంతిక కారణాల వలన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ఆధ్వర్యంలోని అనాథ శరణాలయాల్లో ఈ దత్తత స్వీకరణను నిలిపివేసింది. అయినప్పటికీ దేశం మొత్తమ్మీద 2016–2017 (మార్చి వరకు) పిల్లల దత్తతు సంఖ్య 2,671గా ఉంది. సర్వే ప్రకార ంగా దేశం మొత్తం మీద చూస్తే వివిధ స్వచ్ఛంద సంస్థలలో 50 వేలకు పైగా అనాథలు ఉన్నారు. వీరి నుంచి కూడా డేటా సేకరిస్తే దత్తత సంఖ్యలో మార్పు ఉండవచ్చు. చట్టబద్ధత లేని దత్తత... సమస్యే... చట్టబద్ధంగా దత్తత తీసుకునే తల్లితండ్రుల నమోదు సంఖ్య 14,000 మంది ఉన్నారు. దత్తతు ఇచ్చే పిల్లల సంఖ్య మాత్రం 1,800 మంది ఉన్నారు. చాలా స్వచ్ఛంద సంస్థలు అనాథ పిల్లల పూర్తి వివరాలను నమోదు చేయడం లేదు. ఈ విషయమే ప్రస్తావిస్తూ స్త్రీ శిశు శాఖా మంత్రి మనేకా గాంధీ ఇటీవల యూనియన్ హెల్త్ మినిస్టర్‌కు కొన్ని సూచనలు ఇచ్చారు. యోగ్యతలేని నర్సింగ్‌హోమ్‌లు, ఆసుపత్రులలో పిల్లల పేర్లు, తల్లిదండ్రుల పేరు నమోదు చేయరని, ఇక్కడి నుంచే దత్తత కార్యక్రమాలు అనధికారికంగా జరుగుతుంటాయని తెలియజేసేవారు. ఇలాంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చట్టసమ్మతికాని దత్తత ఎప్పటికైనా సమస్యలకు కారణమే అవుతుందని, దీనిపట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. – ఎన్.ఆర్ -
మారు తల్లిదండ్రులకూ చట్టబద్ధ సంబంధం
న్యూఢిల్లీ: మారు తల్లిదండ్రులకు, దత్తత తీసుకునే పిల్లలకు ‘చట్టబద్ధమైన సంబంధం’ ఉండేలా దత్తతకు సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. బంధువుల పిల్లలనూ దత్తత తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ నిబంధనలు ఈనెల 16 నుంచి అమల్లోకి వస్తాయి. ‘ఇప్పటిదాకా దేశంలో మారు తల్లి/తండ్రికి, మారు పిల్లలకు మధ్య చట్టబద్దంగా ఎలాంటి సంబంధం లేదు. మారు తల్లిడండ్రుల ఆస్తులపై వారికి ఎలాంటి హక్కు లేదు. అదీగాక వృద్ధాప్యంలో మారు తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత కూడా తప్పనిసరి కాదు. ఇలాంటి చాలా అంశాలను పరిష్కరించాల్సి ఉంది’అని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ దత్తత వనరుల సంస్థ (కారా) సీఈఓ లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ చెప్పారు. ఇంతకుముందు అనాధలు/తల్లిదండ్రులు వదిలిపెట్టిన పిల్లలనే దత్తతకు అనుమతించేవారు.