కేంద్రం నిధుల్నిపెంచండి: వైఎస్సీర్సీపీ ఎంపీ రేణుక
వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. అభివృద్ధిలో వెనుకబడ్డ కర్నూలు జిల్లాకు కేంద్రం ప్రకటించిన రూ.50 కోట్లు సరిపోవని, నిధులు ఇంకా పెంచాలని మంత్రిని కోరారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, వ్యవసాయ శాఖ మంత్రులు బీరేంద్ర సింగ్, కటారియాలను కూడా కలిసిన రేణుక.. కర్నూలు జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించి రైతన్నలను ఆదుకోవాలని విన్నవించారు.