ceramic tiles
-
రీజెన్సీ సెరామిక్స్ రీఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెరామిక్ టైల్స్ మార్కెట్లోకి రీజెన్సీ సెరామిక్స్ రీఎంట్రీ ఇచ్చింది. చెన్నై విపణిలో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్‌ను గురువారం ప్రవేశపెట్టింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని యానాంలో రీజెన్సీ సెరామిక్స్‌కు తయారీ కేంద్రం ఉంది. ఈ ప్లాంటు పునరుద్ధరణకు సంస్థ రూ.70 కోట్లు వెచ్చిస్తోంది. 2023 చివరినాటికి ఈ ఫెసిలిటీలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. అలాగే పలు కంపెనీలతో కాంట్రాక్ట్ తయారీ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రిటైల్‌లో విస్తరించాలన్నది కంపెనీ ఆలోచన. దీర్ఘకాలిక చరిత్ర కలిగిన తమ బ్రాండ్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో మంచి పేరుందని రీజెన్సీ హోల్–టైమ్ డైరెక్టర్, సీఎఫ్‌వో సత్యేంద్ర ప్రసాద్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో రూ.100 కోట్ల ఆదాయం ఆర్జిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రధాన నగరాల్లో షోరూంలను ఏర్పాటు చేస్తామన్నారు. రీజెన్సీ సెరామిక్స్‌ను 1983లో డాక్టర్ జి.ఎన్.నాయుడు స్థాపించారు. కార్మిక సంఘాలు, యాజమాన్యానికి మధ్య తలెత్తిన వివాదం చివరకు రక్తసిక్తం కావడంతో 2012లో ప్లాంటు మూతపడింది. -
ఇక పెయింట్లు, టైల్స్ బౌన్స్‌బ్యాక్!
కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ఇటీవల హౌసింగ్ రంగం జోరందుకుంది. సొంత ఇంటిని సమకూర్చుకోవాలన్న తపనకుతోడు.. కొన్నేళ్ల కనిష్టాలకు చేరిన వడ్డీ రేట్లు హౌసింగ్ రంగానికి బూస్ట్‌నిస్తున్నాయి. మరోపక్క పలు రంగాలు ఆన్లైన్ సేవలవైపు మళ్లడంతో ఐటీ, ఈకామర్స్ తదితర రంగాలు సైతం దూకుడు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై వాణిజ్య సముదాయాలకూ డిమాండ్ పెరగనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ప్రధానంగా పెయింట్లు, సిరామిక్ టైల్స్ రంగాలకు అవకాశాలను పెంచే వీలున్నట్లు చెబుతున్నారు. ముంబై: కరోనా మహమ్మారి పంజా విసరడంతో గత ఆర్థిక సంవత్సరం (2021–22) పెయింట్లు, సిరామిక్ టైల్స్ రంగాలు కుదేలయ్యాయి. దేశవ్యాప్త లాక్డౌన్లు, సొంత ప్రాంతాలకు తరలిపోయిన వలసకూలీలు, నిలిచిపోయిన నిర్మాణం, ఉత్పత్తి తదితరాలు ప్రభావం చూపాయి. వీటికితోడు ముడివ్యయాలు పెరిగిపోయాయి. పెయింట్స్ పరిశ్రమలో ప్రధానంగా ముడిచమురు నుంచి లభించే ఉపఉత్పత్తులు(డెరివేటివ్స్) ముడిసరుకుగా వినియోగితమవుతుంటాయి. గ్యాస్ ధరలు బలపడటంతో సిరామిక్ టైల్స్ తయారీ వ్యయాలు సైతం పెరిగాయి. అయితే పరిశుభ్రత, క్రిమికీటక రక్షణ ఆధారిత ప్రొడక్టులు, వాటర్ ప్రూఫింగ్ తదితరాలను ప్రవేశపెట్టడం ద్వారా పెయింట్ల పరిశ్రమ రికవరీ బాట పట్టింది. సంఘటిత రంగంలోని లిస్టెడ్ కంపెనీలు ఇందుకు దారి చూపాయి. లీడింగ్ సిరామిక్ టైల్స్ కంపెనీలు సైతం పరిశుభ్రత, క్రిమికీటక రక్షణ ప్రొడక్టులను విడుదల చేయడం ద్వారా అమ్మకాలు పెంచుకునే బాట పట్టాయి. వీటికి ఎగుమతి ఆర్డర్లు దన్నునిస్తున్నాయి. అధిక గ్యాస్ ధరలు అసంఘటిత రంగ కంపెనీలకు సవాళ్లు విసరడం వీటికి కలసి వస్తోంది. టైల్స్ తయారీ దిగ్గజాలు ఫాసెట్స్, బాత్రూమ్ ఫిట్టింగ్స్ తదితర విభాగాలలోకి ప్రవేశించడం ద్వారా మరింత బలపడుతున్నాయి. ధరల పెంపు..: మార్జిన్లపై ఒత్తిళ్ల నేపథ్యంలో పలు కంపెనీలు కొంతకాలంగా ఉత్పత్తులకు ధరలు పెంచుతూ వస్తున్నాయి. గతేడాది కొద్ది నెలలపాటు ఉత్పత్తి నిలిచిపోవడం, అమ్మకాలు పడిపోవడంతో ఇటీవల పెంటప్ డిమాండ్ కనిపిస్తోంది. ఫలితంగా అమ్మకాల పరిమాణం పుంజుకోనుంది. అయితే దీర్ఘకాలానికి అందుబాటు ధరల్లో గృహ సముదాయాలపై ప్రభుత్వ విధానాలు, పట్టణీకరణ, పుంజుకుంటున్న గ్రామీణ ఆదాయాలు రియల్టీ రంగ వృద్ధికి దోహదపడనున్నాయి. మరోపక్క పారిశ్రామిక రంగ రికవరీ సైతం పెయింట్స్ పరిశ్రమకు ఆశలు కల్పిస్తోంది. ఆటో రంగం జోరందుకుంటే పెయింట్ పరిశ్రమ మరింత కళకళలాడేందుకు అవకాశముంటుంది. వెరసి రెండేళ్ల మందగమనం తదుపరి పెయింట్ కంపెనీలు భారీ లాభాల రంగులను అద్దుకునే వీలుంది. వృద్ధి అంచనాలు సిరామిక్ టైల్స్ వినియోగం ఊపందుకుంటున్న నేపథ్యంలో 2027కల్లా పరిశ్రమ రెట్టింపునకు జంప్చేయవచ్చని అంచనా. వెరసి లిస్టెడ్ కంపెనీల టర్నోవర్ ఐదారేళ్లలో రెట్టింపయ్యే అవకాశముంది. టైల్స్ పరిశ్రమ విలువ 2019లో 3.7 బిలియన్ డాలర్లు(రూ. 27,500 కోట్లు)గా నమోదైంది. వార్షికంగా 8.6 శాతం వృద్ధి నమోదైతే 2027కల్లా 7.14 బిలియన్ డాలర్ల(రూ. 53,120 కోట్లు)కు చేరుకునే వీలుంది. ఇక పెయింట్ల మార్కెట్ విలువ రూ. 50,000 కోట్లుకాగా.. రెండు, మూడేళ్లపాటు డిమాండ్ కొనసాగవచ్చని అంచనా. దీంతో భారీ సామర్థ్య వినియోగానికి మార్గమేర్పడనుంది. పలు అవకాశాలు పెయింట్స్ పరిశ్రమలో లిస్టెడ్ దిగ్గజాలు ఏషియన్ పెయింట్స్‌సహా, బెర్జర్, కన్సాయ్ నెరోలాక్, ఆక్జో నోబెల్, ఇండిగో పెయింట్స్‌కు పలు అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్ కౌంటర్లపట్ల నిపుణులు ఆశావహంగా స్పందిస్తున్నారు. గత మూడు నెలల్లో ఏషియన్ పెయింట్స్, కన్సాయ్ నెరోలాక్ 13% లాభపడ్డాయి. ఇక సిరామిక్ టైల్స్ విభాగంలో కజారియా, సెరా, హింద్ శానిటరీవేర్, సొమానీ సిరామిక్స్ తదితరాలు పెంటప్ డిమాండ్ నుంచి లబ్ధి పొందనున్నాయి. గత మూడు నెలల్లో కజారియా 25 శాతం జంప్‌చేయగా.. సొమానీ 24 శాతం ఎగసింది. -
హైదరాబాద్‌లో ఓరియంట్బెల్ స్టోర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెరామిక్ టైల్స్ తయారీలో ఉన్న ఓరియంట్బెల్ తాజాగా హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌ను తెరిచింది. సికింద్రాబాద్‌లో 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మహాలక్ష్మి ఎంటర్ప్రైసెస్ దీనిని ఏర్పాటు చేసింది. 2020లో దేశవ్యాప్తంగా 69 ఎక్స్‌పీరియెన్స్ సెంటర్స్‌ను ప్రారంభించామని ఓరియంట్బెల్ టైల్స్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ పినాకి నంది తెలిపారు. 1977లో కంపెనీని స్థాపించారు. -
సిరామిక్ టైల్స్ షేర్లు గెలాప్
ముంబై: కోవిడ్-19 నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో అంచనాలకు అనుగుణమైన ఫలితాలు సాధించడంతో టైల్స్ తయారీ కంపెనీల కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నాయి. దీనికితోడు ఇటీవల ఆర్థిక రికవరీ బలపడటం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయక ప్యాకేజీలు, చౌక వడ్డీ రేట్లు, రియల్టీ రంగ ప్రోత్సాహకాలు వంటి సానుకూల అంశాలు ఈ రంగానికి జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి టైల్స్ తయారీ లిస్టెడ్ కంపెనీల కౌంటర్లకు డిమాండ్ పెరిగినట్లు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో హెచ్చుతగ్గుల మార్కెట్లోనూ సిరామిక్ టైల్స్ కంపెనీల షేర్లు భారీ లాభాలతో దౌడు తీస్తున్నాయి. వివరాలు చూద్దాం.. పథకాల ఎఫెక్ట్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా పట్టణ గృహకల్పనకు రూ. 18,000 కోట్లు అదనంగా కేటాయించారు. తద్వారా నిలిచిపోయిన పలు హౌసింగ్ ప్రాజెక్టులకు నిధులు అందే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. రియల్టీ రంగం పుంజుకుంటే.. స్టీల్, సిమెంట్, టైల్స్ తదితర అనుబంధ విభాగాలకూ డిమాండ్ పుడుతుందని తెలియజేశాయి. మరోపక్క చైనాపై యూఎస్, బ్రెజిల్ తదితర దేశాలు యాంటిడంపింగ్ డ్యూటీ విధించడం టైల్స్ పరిశ్రమకు బూస్ట్‌నిస్తున్నట్లు వివరించారు. చదవండి: (ఐషర్ మోటార్స్- ఐబీ రియల్టీ.. హైజంప్) షేర్ల జోరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో కజారియా సిరామిక్స్ 4.7 శాతం జంప్‌చేసి రూ. 606 వద్ద ట్రేడవుతోంది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. సెరా శానిటరీవేర్ షేరు 7.3 శాతం దూసుకెళ్లి రూ. 2,900 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2,937ను తాకింది. ఇది ఏడాది గరిష్టంకావడం గమనార్హం! ఈ బాటలో సొమానీ సిరామిక్స్ 9.4 శాతం ఎగసి రూ. 253 వద్ద ట్రేడవుతోంది. తద్వారా జనవరి 17న రూ. 252.50 వద్ద సాధించిన ఏడాది గరిష్టాన్ని అధిగమించింది. చదవండి: (చిన్న షేర్ల దన్ను- స్మాల్ క్యాప్ రికార్డ్) -
ఓరియంట్ బెల్- ఫీనిక్స్ మిల్స్.. జూమ్
ప్రసిద్ధ ఇన్వెస్టర్ పొరింజు వెలియత్.. ఈక్విటీ వాటా కొనుగోలు చేసిన వార్తలతో సిరామిక్ టైల్స్ తయారీ కంపెనీ ఓరియంట్ బెల్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోవైపు సింగపూర్ ప్రభుత్వం మైనారిటీ వాటాను సొంతం చేసుకున్నట్లు వెల్లడికావడంతో రియల్టీ సంస్థ ఫీనిక్స్ మిల్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఓరియంట్ బెల్ లిమిటెడ్ కంపెనీలో పొరింజు వెలియత్‌కు చెందిన ఈక్విటీ ఇంటెలిజెన్స్ తాజాగా వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో ఓరియంట్ బెల్ కౌంటర్ జోరందుకుంది. తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 13 శాతం దూసుకెళ్లింది. రూ. 105ను తాకింది. తదుపరి కొంత మందగించింది. ప్రస్తుతం 7 శాతం లాభంతో రూ. 99 వద్ద ట్రేడవుతోంది. షేరుకి రూ. 91.87 ధరలో ఈక్విటీ ఇంటెలిజెన్స్ 80,000 ఓరియంట్ బెల్ షేర్లను కొనుగోలు చేసింది. ఇప్పటికే అంటే.. జూన్‌కల్లా ఓరియంట్ బెల్లో 1.57 శాతం వాటాను ఈక్విటీ ఇంటెలిజెన్స్ కలిగి ఉంది. ఫీనిక్స్ మిల్స్ లిమిటెడ్ క్విప్ ద్వారా రియల్టీ అభివృద్ధి సంస్థ ఫీనిక్స్ మిల్స్‌లో సింగపూర్ ప్రభుత్వం 74.38 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. దీంతో ఫీనిక్స్ మిల్స్‌లో సింగపూర్ ప్రభుత్వ వాటా 4.3 శాతానికి చేరింది. ఈ బాటలో ఐసీఐసీఐ ఎంఎఫ్‌కు 12.39 లక్షల షేర్లు, ఎస్బీఐ ఎంఎఫ్‌కు 12.39 లక్షల షేర్లు, ఏబీ సన్ లైఫ్ ఎంఎఫ్‌కు 5.17 లక్షల షేర్లు చొప్పున ఫీనిక్స్ విక్రయించింది. దీంతో మ్యూచువల్ ఫండ్స్ వాటా తాజాగా 12.61 శాతాన్ని తాకింది. క్విప్‌లో భాగంగా షేరుకి రూ. 605 ధరలో ఫీనిక్స్ 1.81 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేసింది. తద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించింది. క్విప్ తదుపరి ఫీనిక్స్ ఈక్విటీ క్యాపిటల్ రూ. 34.32 కోట్లకు ఎగసింది. ఈ నేపథ్యంలో ఫీనిక్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 6.3 శాతం జంప్‌చేసి రూ. 738ను తాకింది. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 713 వద్ద ట్రేడవుతోంది. -
ఇంటిప్స్
సిరామిక్ టైల్స్ మీద మరకలు పడితే ఆల్కహాల్‌తో రుద్దాలి. కొద్దిగా ఆల్కహాల్ వేసి ఆరిన తర్వాత తుడిస్తే టైల్స్ మెరుస్తాయి. ఇలా చేసేటప్పుడు పిల్లలు ఆ దరిదాపుల్లోకి రాకుండా చూసుకోవాలి. పైప్‌లు, షవర్లు శుభ్రం చేసుకోవడానికి ఫాస్ఫారిక్ యాసిడ్‌ని ఉపయోగించవచ్చు. అయితే గీతలు పడేటట్లు రుద్దకూడదు. షవర్ రంధ్రాలు మూసుకుని పోతే నిమ్మకాయ రసంతో రుద్దాలి.ఉడెన్ ఫర్నిచర్‌పై నెయిల్ పాలిష్ చిందితే దానిని వెంటనే తుడవకుండా పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తరువాత దానిని గట్టి అట్టలాంటి దానితో రుద్ది తీసి వేయాలి. అక్కడ వాక్స్ రాస్తే నెయిల్ పాలిష్ మరక ఉన్నట్టే అనిపించదు. ఫర్నిచర్ పాలిష్ రుద్దినా సరిపోతుంది. -
ల్యాప్‌టాప్ బుక్ చేస్తే ఏం వచ్చిందో తెలుసా?
ఆన్లైన్లో మంచి ల్యాప్‌టాప్ చూసుకుని, దాని కాన్ఫిగరేషన్ అంతా చెక్ చేసుకుని బుక్ చేసుకుంటే.. తీరా ఇంటికి పార్సిల్ వచ్చిన తర్వాత ఆ బాక్సులో ల్యాప్‌టాప్‌కు బదులు అందమైన మెటల్ ఫ్రేములో అమర్చిన టైల్స్ కనిపిస్తున్నాయి. మధ్యలో ఒక గ్యాంగు జోక్యం వల్లే ఇదంతా జరుగుతోందని ఎట్టకేలకు తేలింది. ఆ గ్యాంగుకు చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఇలా హై ఎండ్ ల్యాప్‌టాప్‌లను వాళ్లు చోరీ చేసి, అమ్మేసుకుంటున్నారు కూడా. ల్యాప్‌టాప్‌లను చోరీ చేసి, వాటి స్థానంలో సిరామిక్ టైల్స్‌ను ఉంచుతున్నారు. వాటి బరువు కూడా ఏమాత్రం తేడా రాకుండా ఉండేందుకు వాటిని మెటల్ ఫ్రేములలో బిగిస్తున్నారు. ఇలాంటి గ్యాంగులు ఇప్పటివరకు 45 ల్యాప్‌టాప్‌లు చోరీ చేయగా, వాటిలో 28 ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆదేశ్ కుమార్ (25), శైలేంద్రకుమార్ (22), సుబోధ్ రాయ్ (34), మిథున్ కుమార్ (22), సనోజ్ కుమార్ (22), జయేష్ పటేల్‌లను అరెస్టు చేసినట్లు డీసీపీ రోమిల్ బానియా చెప్పారు. ఒక కార్గో కంపెనీ యజమాని సందీప్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓఖ్లా ఇండస్ట్రియల్ ఏరియా పోలీసు స్టేషన్లో డిసెంబర్ 18న కేసు నమోదు చేశామని, తమ వాహనంలో తాము డిసెంబర్ 5న 140 ల్యాప్‌టాప్‌లు లోడ్ చేసి, డెలివరీకి పంపామని, తీరా అవి బయటకు వెళ్లేసరికి వాటిలో 38 ల్యాప్‌టాప్‌లు, వాటి చార్జర్లు కనిపించలేదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. లోపలి వాళ్లే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానంతో కల్కాజీ ఏసీపీ అమిత్ గోయల్ దర్యాప్తు చేయగా, డ్రైవర్ ఆదేశ్ కుమార్ మీద మొదట అనుమానం వచ్చింది. అతడిని విచారించగా మిగిలిన గ్యాంగు మొత్తం బయటపడింది. వీళ్లలో జయేష్ పటేల్ పది ల్యాప్‌టాప్‌లు తీసుకుని ముంబై వెళ్లాడని, అతడిని పట్టుకోడానికి గాలింపు జరుగుతోందని డీసీపీ చెప్పారు.