cerupalli Sitaramulu
-
ఆద్యంతం నాటకీయం..
► సీపీఎంలో ఆరని చిచ్చు ► బహిష్కృత, పార్టీ నేతల మధ్య వాగ్వాదం ► రంగంలోకి రాష్ట్ర కమిటీ సభ్యులు హన్మకొండ చౌరస్తా : నిత్యం పేదల జపం చేసే ఎర్రచొక్కాల కుమ్మలాటలు ఆద్యంతం నాటకీయతను తలపిస్తున్నాయి. బహిష్కృత, పార్టీ నేతల మధ్య ఘర్షణ ఆఫీసులో కుర్చీలను పగలగొట్టడం వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆది వారం ఇరువర్గాలు నిరసనలనుకాస్త డోస్ పెం చాయి. బహిషృత నేతలు పార్టీ ఆఫీసు ప్రధాన గేటుకు తాళం వేసి అక్కడే గేటు ఎదుట బైఠాయించగా, మిగిలిన నేతలు పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రంగంలోకి రాష్ట్ర కమిటీ మూడు రోజులుగా వరంగల్ అర్బన్ జిల్లా సీపీఎం కమిటీలో జరుగుతున్న కుమ్ములాటలను చ ల్లార్చేందుకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నేతలు రంగంలోకి దిగారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జి కార్యదర్శి జి.నాగయ్య, జి.రాములు, వెంకట్ రాంనగర్‌లోని పార్టీ కార్యాలయానికి సాయంత్రం చేరుకున్నారు. ఆఫీసులోకి నేతలు వెళ్తుండగా అప్పటికే గేటుకు తాళం వేసి, కార్యకర్తలు బహిష్కరణలను ఎత్తివేయాలని నినాదాలు చేస్తూ వారిని అడ్డుకున్నారు. దీంతో ఆఫీసుకు కొద్ది దూరంలో బహిష్కృత నేతలు దుబ్బ శ్రీని వాస్, కారు ఉపేందర్, పల్లం రవి, కొప్పుల శ్రీని వాస్‌తో నాగయ్య బృందం మాట్లాడే ప్రయత్నం చేశారు. ముందుగా గేటుకు తాళం తీసి కార్యకర్తలను పంపించాలని సూచిం చారు. అందుకు శ్రీనివాస్ తమ కార్యకర్తలనే కాదు అందరినీ పం పించాలని చెప్పడంతో వారు ఒప్పుకోలేదు.ఈ సమస్యను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్తామని గేటుకు తాళం తీసి కార్యకర్తలను పంపించాలని మరోసారి చెప్పడంతో వారు ససేమిరా అన్నారు. ఘటన దురదృష్టకరం పార్టీ కార్యాలయం ఎదుట సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి. నాగయ్య మీడియాతో మా ట్లాడారు. సీపీఎం వరంగల్ చరిత్రలో ఎన్నడూ లేని సంఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టక రం, సమస్య త్వరలోనే పరిష్కారం అయ్యేలా రాష్ట్ర కమిటీ, అవసరమైతే కేంద్ర కమిటీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానన్నారు. పార్టీ ఆఫీసులోకి కొన్ని అరాచకశక్తులు చేరి ద్వంసం చేయడం భాదాకరమన్నారు. ఇప్పటిౖMðనా పలువురు పద్దతులను మా ర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
అసెంబ్లీలో సామాజిక అంశాలపై చర్చించాలి
నకిరేకల్ : ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సామాజిక అంశాలను విస్మరించి చర్చ కొనసాగించడం ఎంత వరకు సమంజసమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు ప్రశ్నించారు. నకిరేకల్‌లోని నర్రా రాఘవరెడ్డి స్మారక భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధిఫై సుదీర్ఘంగా చర్చ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతాంగం పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ఎద్దేవా చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో ఇటీవల కాలం నుంచి తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన మహాజన పాదయాత్రలో వందలాది గ్రామాల మీదుగా 2వేల కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగిందని తెలిపారు. ఈ పాదయాత్రలో ప్రజలు తమ సమస్యలపై ఆవేదన, ఆందోళనలను వెలిబుచ్చారన్నారు. పెద్దనోట్ల రద్దుతో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమావేశంలో సీపీఎం నాయకులు బోళ్ల నర్సింహారెడ్డి, కందాళ ప్రమీళ, బచ్చుపల్లి నర్సింహారావు, వంటెపాక వెంకటేశ్వర్లు, సాకుంట్ల నర్సింహ, ఎస్కే అమీర్‌పాషా, ఏర్పుల తాజేశ్వర్, లఘుశెట్టి శ్రీను, కనుకుంట్ల సుదీర్‌రెడ్డి, తీగల వెంకన్న, ఆర్. ఇందిర, దుర్గం మేగాత్ర, కందుకూరి రాంబాబు తదితరులు ఉన్నారు. -
మండలాల వారీగా ప్రణాళికతోనే అభివృద్ధి
స్పష్టం చేసిన సీపీఎం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాభివద్ధికి అవస రమైన విధానాలతో పాటు, ఆయా ప్రణాళికల అమల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సీపీఎం సూచించింది. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధా నాలతో రాష్ట్ర సమగ్రాభివద్ది సాధ్యం కాదని ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తన విధానాలను మార్చుకోవాల్సిన అవస రం ఉందని సూచించింది. రాష్ట్రంలోని మండలాల వారీగా ప్రణాళికలను రూపొం దించి వాటిని సక్రమంగా అమలు చేయడం ద్వారానే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేసింది. పార్టీపరంగా రూపొందిం చిన ‘ప్రత్యామ్నాయ అభివద్ధి-కార్యాచరణ ప్రణాళిక- చర్చాపత్రం’ను సోమవారం ఎంబీ భవన్లో పార్టీ నాయకులు చెరుపల్లి సీతారాములు, బి.వెంకట్, జి.నాగయ్య, జ్యోతి విడుదల చేశారు. పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘మహాజనపాదయాత్ర’ నేప థ్యంలో విడుదల చేసిన ఈ చర్చాపత్రంపై వివిధ రంగాల నిపుణులు, మేధావులు, సామాజికవేత్తలు చర్చించి, మరిన్ని సూచన లు, సలహాలు తెలియజేస్తే వాటిని తుది కార్యాచరణ ప్రణాళికలో పొందుపరచ నున్నట్లు జి.నాగయ్య తెలిపారు. -
సర్వాయి జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలి
-మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు సుందరయ్య విజ్ఞాన కేంద్రం(హైదరాబాద్‌సిటీ) సర్వాయి సర్ధార్ పాపన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం, తెలంగాణ సాంసృ్కతిక కేంద్రం, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటి, బీసీ సబ్ ప్లాన్ సంయుక్త ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. పాపన్న చరిత్రను నేటి తరానికి అందించటంతో పాటు, ఆయన విగ్రహాలను గోల్కొండ కోట, ట్యాంక్ బండ్, ఇతర అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.గీతా కార్మికుల అభివృద్దికోసం నూతన కల్లు విధానాన్ని అమలు చేయాలని, గీత ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు మాటూరి బాలరాజ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.