chailds
-
కథను మలుపుతిప్పే రోల్స్.. పాపే ప్రాణంగా రానున్న సినిమాలు
కథను కీలక మలుపు తిప్పే ‘కీ’ రోల్స్ దాదాపు ప్రతి సినిమాలోనూ ఉంటాయి. ఈ కీ రోల్స్‌కి ఏజ్‌తో సంబంధం ఉండదు. చిన్నారులు కూడా కథలో పెద్ద మార్పుకు కారణం అవుతుంటారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘బింబిసార’ వంటి సినిమాల్లో చిన్ని పాపలు కథకు ప్రాణంగా నిలిచారు. ఇలా ‘పాపే ప్రాణం’ అంటూ సాగే కథలతో రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. సంరక్షకుడు? ‘పసివాడి ప్రాణం, జగదేకవీరుడు అతిలోక సుందరి, అంజి’... వంటి సినిమాల్లో చిన్నారులతో చిరంజీవి చేసిన అల్లరి సన్నివేశాలు, అదే సమయంలో వారి ప్రాణ రక్షకుడుగా చేసిన సాహసాలు ప్రేక్షకులను అలరించాయి. మళ్లీ వెండితెరపై ఓ పాపకు సంరక్షకుడిగా ఉండే పాత్రలో చిరంజీవి నటించనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్‌ను బట్టి ఇది సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో ఓ పాప కీలక పాత్రలో నటించనుందని, ఈ పాప సంరక్షకుడిగా చిరంజీవి చేసే సాహసాలు అబ్బురపరచేలా ఉంటాయని టాక్. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించి, వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో యూనిట్ ఉందని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... వశిష్ట దర్శకుడిగా పరిచయం అయిన ‘బింబిసార’ చిత్రంలో ఓ పాప సెంట్రల్ క్యారెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. హార్ట్ ఆఫ్ సైంధవ్ శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా.. ఇలా ముచ్చటగా ముగ్గురు హీరోయిన్లు ఉన్నా కూడా హీరో ‘సైంధవ్’ మనసులో తొలి స్థానం చిన్నారి సారాదే. సారా అంటే ‘హార్ట్ ఆఫ్ సైంధవ్’ అన్నమాట. వెంకటేశ్ టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ సైంధవ్ సినిమాకు ‘హిట్’ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. సైంధవ్ హార్ట్ సారా అని చిత్ర యూనిట్ అంటోందంటే కథలో చిన్నారి సారా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని ఊహించవచ్చు. తమిళ నటుడు ఆర్య, హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు చేస్తున్న ‘సైంధవ్’ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. హాయ్ నాన్న తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెలుగులో రూపొందుతున్న మరో చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ ఎమోషనల్ మూవీలో నాని హీరోగా నటిస్తున్నారు. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర కథ ఓ పాప పాత్ర చుట్టూ తిరుగుతుందని, ఈ క్రమంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయని తెలుస్తోంది. ‘హాయ్ నాన్న’ డిసెంబరు 21న రిలీజ్ కానుంది. గరుడ సాహసాలు ‘గరుడ’ సినిమా పోస్టర్ చూశారుగా.. సత్యదేవ్ వీపుపై కూర్చున్న ఓ చిన్నారి ఎంత భయంగా చూస్తుందో కదా! పైగా అది అడవి ప్రాంతం. ఆ చిన్నారి భయాన్ని పోగొట్టి, తనను సురక్షితంగా గరుడ ఎలా రక్షించాడనేది వెండితెర పైనే చూడాలంటోంది యూనిట్. సత్యదేవ్ హీరోగా క్రాంతి బాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గరుడ’. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో సాగే అడ్వంచరస్ మూవీగా ఈ చిత్రం ఉంటుందట. ఈ చిత్రం తొలి భాగం ‘గరుడ: చాప్టర్ 1’ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇలా చిన్నారులు కీలకంగా నిలిచే చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
కోట్లలో ఒకరు... ఈ కోర్ట్ని!
భారతదేశాన్ని సందర్శించడానికి ఎంతోమంది విదేశీయులు వస్తుంటారు. వీరిలో ఎక్కువమంది వచ్చిన పని చూసుకుని వెళ్లేవారే. కానీ న్యూజెర్సీకి చెందిన 34 ఏళ్ల కోర్ట్ని లలోత్రా మాత్రం అలాకాదు. ఓ ప్రాజెక్టు పనిలో భాగంగా ఇండియా వచ్చినప్పుడు ఇక్కడి పరిస్థితులు చూసి చలించిపోయి.. స్వదేశంలో ఉన్న ఆస్తులను విక్రయించి..ఇండియా తిరిగొచ్చి ఏకంగా11 మంది పిల్లలను దత్తత తీసుకుని అమ్మలా లాలిస్తోంది. అది 2010 మన్‌హట్టన్‌లోని ఫ్యాషన్ ఇ¯Œ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డిగ్రీ చదువుతోన్న కోర్ట్ని ఫ్యాబ్రిక్ రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా ఇండియా వచ్చింది. విమానం దిగగానే.. ‘‘రోడ్లమీద సరిగ్గా బట్టలు లేకుండా యాచించే చిన్నచిన్న పిల్లలు! చంకలో పసిబిడ్డల్ని పెట్టుకుని యాచించే తల్లులు! ఒకపక్క చేతిలో ఉన్న పిల్లలు ఏడుస్తున్నా.. డబ్బుల కోసం ఆగి ఉన్న వాహనాల చుట్టూ తిరుగుతున్న తల్లులు..! వంటి హృదయ విదారక çఘటనలు కోర్ట్నికి కనిపించాయి. అంతేగాకుండా ఈశాన్య ఢిల్లీలోని మురికివాడల్లో వలంటీర్‌గా పర్యటించినప్పుడు తల్లిదండ్రులు లేక, ఆదరించే వారు లేక వీధిపాలైన అనేకమంది అనాథ పిల్లలు తారసపడ్డారు. అప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? ఏం చేస్తారు అని అడిగి వారి వివరాలు తెలుసుకుని ‘ఇండియాలో ఇంత పేదరికం ఉందా...’ అనుకుంది. ఇక్కడ సాయం కోసం ఎదురు చూస్తోన్న చిన్నారులు ఎందరో ఉన్నారు అనుకుంటుండగానే.. కొద్దిరోజుల్లో తన విసా కాలపరిమితి ముగియడంతో.. అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ‘తిరిగి ఇండియా వచ్చి ఈ పిల్లలను ఆదుకోవాలి’ అని నిర్ణయించుకుని స్వదేశానికి తిరిగి వెళ్లింది. దత్తత తీసుకున్న అనాథ పిల్లతో... ఆస్తులు అమ్మి.. అమెరికా వెళ్లిన కోర్ట్ని .. తనకున్న ఆస్తులు విక్రయించి 15000 డాలర్లు కూడబెట్టింది. ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, ఇంటికి కావాల్సిన సామాన్లు, పిల్లలకు ఆహారం పెట్టడానికి ఇవి సరిపోతాయనుకుని 2011 మార్చిలో ఇండియా వచ్చింది. రాగానే ఓ స్వచ్ఛంద సంస్థలో చేరి సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. తల్లిదండ్రులు సాయం చేయడంతో.. 2012లో ఒక సొంత ఇంటిని నిర్మించుకుంది. మొదట్లో కోర్ట్నిని తల్లిదండ్రులు వారించినప్పటికీ తరువాత ఆమె మనసెరిగి ఆమెను సేవాకార్యక్రమాల దిశగా ప్రోత్సహించారు. పెళ్లి... పిల్లలు.. కోర్ట్ని 2014లో యోగేష్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏడాదికల్లా వీరికి ‘ఎడి’ పుట్టాడు. తరువాత కోర్ట్ని యోగేష్‌లు కలిసి..ఆలనా పాలన చూసేవారు లేని అనాథ పిల్లలైన.. దీపు, శివ, జై, రోషిత్, పియూష్, రాజు, సైలేష్, శివమ్‌లను దత్తత తీసుకుంది. అలా మొత్తం పదకొండు మందిని అక్కున చేర్చుకున్నారు. తన కొడుకు ఎడితో కలిపి పన్నెండు మంది పిల్లలను అమ్మలా సాకుతోంది కోర్ట్ని. గతేడాది నుంచి ఇప్పటిదాకా కరోనా మహమ్మారి పంజా విసురుతుండడంతో.. కోర్ట్ని రెండు వేలకు పైగా కుటుంబాలకు రేషన్ అందించడమేగాక, ఆకలితో ఉన్నవారికి అన్నంపెట్టి ఆదుకుంది. భర్త యోగేష్ కొడుకు ‘ఎడి’తో కోర్ట్ని లలోత్రా నీలాంటి వాళ్లు వస్తుంటారు..వెళ్తుంటారు.. ‘‘నేను ఇండియా వచ్చినప్పుడు చూసిన కొన్ని సంఘటనలు నన్ను ఎంతో బాధించాయి. అందుకే ఇక్కడ ఉన్న అనాథ పిల్లలకు సాయం చేయాలనుకున్నాను. అయితే వీసా గడువు ముగియడంతో ‘‘తిరిగి ఇండియా వచ్చి ఇక్కడ కొంతమందికి సాయం చేస్తానని చెప్పాను కానీ అప్పుడు నా మాట ఎవరూ నమ్మలేదు. నీలాంటి వాళ్లు వస్తుంటారు వెళుతుంటారు అని అన్నారు. అవేవీ పట్టించుకోకుండా కొంత నగదును సమకూర్చుకుని వచ్చి పదకొండు మందిని దత్తత తీసుకుని పెంచుతున్నాను. కోవిడ్ విజృంభించక ముందు ఇండియాలో కొంతమంది అనాథలను చూశాను. కోవిడ్ వచ్చాక రోజూ వేలమంది పిల్లలు తమవారిని కోల్పోయి నిరాశ్రయులవుతున్నారు. ఇది చాలా బాధాకరం’’‡అని కోర్ట్ని చెప్పింది. ఈ ఏడాది అమెరికా వెళ్లి అమ్మా నాన్నలను కలుద్దాం అనుకున్నాను. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పిల్లలను వదిలి వెళ్లడం ఇష్టంలేక ట్రిప్పును రద్దు చేసుకున్నాను’’ అని కోర్ట్ని తెలిపింది. -
జీజీహెచ్‌లో చిన్నారులకు గుండె ఆపరేషన్లు
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో వచ్చే నెల నుంచి చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో పీపీపీ పద్ధతిలో 300 మందికి గుండె ఆపరేషన్లు, రెండు గుండె మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా చేశామన్నారు. కొత్త సంవత్సరంలో డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే వైద్య బృంద సభ్యులు ఆపరేషన్లు చేస్తారన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవల్లో భాగంగా ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారులకు పుట్టుకతో వచ్చే గుండె రంధ్రాలు, రక్తనాళాల అమరికలో మార్పులకు ఆపరేషన్లు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేసే సౌకర్యం లేదని, తామే మొట్టమొదటి సారిగా ప్రారంభిస్తున్నామన్నారు. ప్రభుత్వంతో పాటు, వసుధ ఫౌండేషన్, నాట్కో సంస్థలు వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు విరాళం అందించాయన్నారు. వాటి సహకారం మరువలేనిదన్నారు. ఈ నెల 31న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆపరేషన్ల ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. -
అంగన్వాడీ పిల్లలకు యూనిఫాం
శిశు, మహిళా సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్ చక్రవర్తి వెల్లడి గుంటూరు వెస్ట్: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లలో సుమారు 11 లక్షల 50 వేల మంది పిల్లలు ఉన్నారని, వారికి యూనిఫాం విధానాన్ని అమలు చేయబోతున్నట్టు శిశు, మహిళా సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్ చక్రవర్తి వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవర్గాల సహకారంతో పిల్లలకు యూనిఫాం అందించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడేళ్లలో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు శిశు, మహిళా సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్ కేఆర్బీహెచ్ఎన్ చక్రవర్తి తెలిపారు. శిశు, మహిళా సంక్షేమశాఖ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 30 వేల కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయన్నారు. 25 వేల కేంద్రాలకు భవనాలు నిర్మించాల్సి ఉండగా, 4 వేల భవనాలు నిర్మాణదశలో ఉన్నట్టు చెప్పారు. రూ.7.50 లక్షల వ్యయంతో ఒక్కొక్క భవనాన్ని నిర్మించనున్నట్టు చెప్పారు. ఇందులో రూ.5 లక్షలు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.50 వేలు, శాఖాపరంగా రూ.2 లక్షలు ఖర్చుచేయనున్నట్టు తెలిపారు. ఇటీవల 6,600 భవనాల నిర్మాణాలకు పరిపాలనపరమైన అనుమతులు లభించాయని, 1500 భవనాల పనులు ప్రారంభించినట్టు తెలిపారు. బోధనా పద్ధతులపై వర్కర్లకు శిక్షణ అంగన్వాడీ సెంటర్ల ద్వారా పిల్లలకు మంచివిద్యను అందించేందుకుగాను ఈనెల 8వ తేదీ నుంచి ఇంగ్లీష్‌తోపాటు బోధనా పద్ధతులపై రాష్ట్రవ్యాప్తంగా వర్కర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. అంగన్వాడీ సెంటర్లలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసి పిల్లల హాజరు నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. యూనియన్లలో చేరమని ఒత్తిడి చేస్తే చర్యలు అంగన్వాడీ కార్యకర్తలను అధికార పార్టీ యూనియన్‌లో చేరమని సూపర్వైజర్లు, సీడీపీఓలు, ఇతర సిబ్బంది ఎవరైనా ఒత్తిడిచేస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. యూనియన్లను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కార్యకర్తలకు ఉంటుందన్నారు. -
అంగన్వాడీ పిల్లలకు యూనిఫాం
శిశు, మహిళా సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్ చక్రవర్తి వెల్లడి గుంటూరు వెస్ట్: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లలో సుమారు 11 లక్షల 50 వేల మంది పిల్లలు ఉన్నారని, వారికి యూనిఫాం విధానాన్ని అమలు చేయబోతున్నట్టు శిశు, మహిళా సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్ చక్రవర్తి వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవర్గాల సహకారంతో పిల్లలకు యూనిఫాం అందించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడేళ్లలో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు శిశు, మహిళా సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్ కేఆర్బీహెచ్ఎన్ చక్రవర్తి తెలిపారు. శిశు, మహిళా సంక్షేమశాఖ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 30 వేల కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయన్నారు. 25 వేల కేంద్రాలకు భవనాలు నిర్మించాల్సి ఉండగా, 4 వేల భవనాలు నిర్మాణదశలో ఉన్నట్టు చెప్పారు. రూ.7.50 లక్షల వ్యయంతో ఒక్కొక్క భవనాన్ని నిర్మించనున్నట్టు చెప్పారు. ఇందులో రూ.5 లక్షలు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.50 వేలు, శాఖాపరంగా రూ.2 లక్షలు ఖర్చుచేయనున్నట్టు తెలిపారు. ఇటీవల 6,600 భవనాల నిర్మాణాలకు పరిపాలనపరమైన అనుమతులు లభించాయని, 1500 భవనాల పనులు ప్రారంభించినట్టు తెలిపారు. బోధనా పద్ధతులపై వర్కర్లకు శిక్షణ అంగన్వాడీ సెంటర్ల ద్వారా పిల్లలకు మంచివిద్యను అందించేందుకుగాను ఈనెల 8వ తేదీ నుంచి ఇంగ్లీష్‌తోపాటు బోధనా పద్ధతులపై రాష్ట్రవ్యాప్తంగా వర్కర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. అంగన్వాడీ సెంటర్లలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసి పిల్లల హాజరు నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. యూనియన్లలో చేరమని ఒత్తిడి చేస్తే చర్యలు అంగన్వాడీ కార్యకర్తలను అధికార పార్టీ యూనియన్‌లో చేరమని సూపర్వైజర్లు, సీడీపీఓలు, ఇతర సిబ్బంది ఎవరైనా ఒత్తిడిచేస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. యూనియన్లను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కార్యకర్తలకు ఉంటుందన్నారు.