chain snachars
-
తూర్పు గోదావరి జిల్లాలో చైన్ స్నాచర్ల హల్ చల్
-
చెన్స్నాచింగ్కు దుండగుల యత్నం
టెక్కలి రూరల్ : మహిళ మెడలో చైన్‌ను దొంగిలించేందుకు దుండగులు ప్రయత్నించిన సంఘటన మండలంలోని చింతలగర్రలో బుధవారం జరిగింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సిగిలిపల్లి నారాయణమ్మ రహదారిపై వెళుతుండగా వెనుక నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి మెడలోని చైన్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించారు. దీంతో అమె కిందకు పడిపోయింది. చైన్ తెంపుకొని పరారయ్యే ప్రయత్నంలో దుండగులు కింద పడిపోయారు. ఈ క్రమంలో చైన్ తుళ్లిపోవడంతో అక్కడి నుంచి పరారయ్యరని తెలిపారు. ఈ ఘటనలో నారాయణమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ వేసవిలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మహిళలు వాపోతున్నారు. రోజూ ఉదయం వాకింగ్‌కు ఇదేమార్గంలో వెళుతుంటామని ఈ ఘటనల వల్ల భయాందోళనకు గురవుతున్నామని ఆందోళన చేస్తున్నారు. ఈ విషయమై టెక్కలి ఎస్ఐ సురేష్‌బాబు వివరణ కోరగా ద్విచక్రవాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. -
దడ పుట్టిస్తున్న దోపిడీలు
కూతురు, అల్లుడితో కలిసి ఉంటుందో వృద్ధురాలు.. ఉదయాన్నే విధులకు వెళ్లిన కూతురు, అల్లుడు వచ్చే వరకు ఇంటి గుమ్మం ముందు కూర్చుని భగవద్గీత చదువుకుంటోంది. ఆమె నగలపై కన్నేశాడో అగంతకుడు. వృద్ధురాలు ఒంటరిగా ఉండటాన్ని చూశాడు. కాలనీలో జన సంచారం కూడా లేదు. ఇదే అదనుగా వృద్ధురాలిపై దాడి చేసి ఇంట్లోకి ఈడ్చుకెళ్లాడు. కేకలు వేయడంతో ఆమె తలను బండకేసి బాది హతమార్చాడు. ఒంటిపై ఉన్న 8 తులాల బంగారు నగలు దోచుకుని ఉడాయించాడు. ఇదంతా చూస్తే ఏదో సినిమా కథలాగే ఉంది కదూ! అయితే ఇది కామారెడ్డి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో జరిగింది. కామారెడ్డి క్రైం: ఈ ఘటన జిల్లా కేంద్రానికి సమీపం లోని దేవునిపల్లి జీపీ పరిధిలో గల సాయిసద్గురు కాలనీలో ఏడాది క్రితం జరిగింది. దీంతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. బంగారు నగల కోసం ఒంటరిగా కనిపించిన వృద్ధురాలిని దారుణంగా చంపడం అప్పట్లో జనాన్ని భయాందోళనలకు గురిచేసింది. చోరీల నివారణ కోసం పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. దోపిడీలు, చోరీల నివార ణ కోసం పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలు అంతం తమాత్రంగానే ఉన్నాయనే విమర్శలు లేకపోలేదు. పోలీసు నిఘా మరింత పెంచాల్సిన అవపసరం ఉంది. ఆభరణాల కోసం భౌతిక దాడులు.. జిల్లాలో చోరీలు, చైన్ స్నాచింగ్‌లతో పాటు ఒంటరిగా కనిపించిన మహిళలపై దుండగులు ఏకంగా భౌతికదాడులకు దిగుతుండటం కలవరపెడుతోంది. దోపిడీలకు పాల్పడేందుకు ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడటం లేదు. మూడు రోజుల క్రితం జిల్లాలోని లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన మహిళ ఏనుగు అనసూయ తన పొలంలో పనులు చేసుకుంటుండగా భార్యాభర్తలమని చెప్పి మాటలు కలిపిన దుండగులు ఆమెను చితకబాది మెడలోని గొలుసు లాక్కుని ఉడాయించిన విషయం తెలిసిందే. గత మార్చి 9న దేవునిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న కాలనీలో నివాసం ఉండే ఓ మహిళపై ఇదే తరహాలో ఇద్దరు దుండగులు దాడి చేశారు. రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లో ఉండే వైద్య కల్పన మార్కెట్లో కూరగాయలు కొనుక్కుని సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటికే ఆమెను గమనిస్తున్న దుండగులు ఇంటిముందే దాడి చేశారు. ఆమెను, అడ్డొచ్చిన ఆమె భర్తను చితకబాది కల్పన మెడలోంచి 3 తులాల గొలుసు దోచుకుని పరారయ్యారు. ఈ దాడిలో భార్యాభర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇలాంటి సంఘటనలు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇతర రాష్ట్రాల మూఠాల పనే.. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న చోరీలను పరిశీలిస్తే ఇక్కడి ప్రాంతానికి చెందిన పాతనేరస్తులతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాలకు చెందిన దుండగుల ముఠాలు సైతం తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లుగా గతంలో రుజువైంది. బీహార్, మహారాష్ట్ర, హర్యానా, కర్నాటక రాష్ట్రాలకు చెందిన ముఠాలు గతంలో జిల్లాలో భారీ దోపిడీలకు పాల్పడి పట్టుబడ్డాయి. ఇటీవలే జిల్లా కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాల చోరీ చేసిన ముఠా కర్ణాటక రాష్ట్రంలోని బాల్కి ప్రాంతానికి చెందినది. ప్రతి వేసవిలో మహారాష్ట్ర ముఠాలు చోరీల్లో ఆరితేరి ఉమ్మడి జిల్లాను టార్గెట్ చేయడం చూస్తూనే ఉన్నాం. దుండగులను గుర్తించడంతో పాటు చోరీల నివారణ కోసం చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు వేసవిలో చోరీలు, దోపిడీల నివారణ కోసం పోలీస్‌శాఖ మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. తాళం వేసి వెళితే అంతే సంగతి.. పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటూ ఇళ్లకు తాళం వేసి వెళితే ఇక అంతే సంగతి. తాళం వేసి ఉన్న ఇండ్లకు గ్యారెంటీ లేకుండా పోయింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వేసవి ప్రారంభం నుంచే వరుస చోరీలు వెలుగుచూస్తున్నాయి. పగలు గస్తీ తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తూ పోలీసుల కళ్లుగప్పి రాత్రివేళలో దుండగులు తమ పని కానిస్తున్నారు. ప్రతి రెండు రోజులకో ఘటన వెలుగు చూస్తూనే ఉంది. చోరీల నివారణ కోసం ప్రతిఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా పోలీసులు గ్రామాలు, కాలనీల్లో సమావేశాలు పెడుతూ అవగాహన కల్పిస్తున్నారు. అన్నిచోట్లా పూర్తిస్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటు జరగాలంటే అది ఇప్పట్లో జరిగేపని కాదు. ఈ నేపథ్యంలో చోరీల నివారణకు పోలీసుశాఖ మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలి. లక్ష్మీదేవునిపల్లి వద్ద జరిగిన దోపిడీ ఘటనలో అనుమానితులు(ఫైల్) -
తాళిబొట్టు కోసం యముణ్ణి వెంటాడినట్టు వెంటాడింది!
‘‘నాకు తాళిమాల చాలా విలువైంది. దానిని లాక్కుపోతే చూస్తూ ఎలా ఉండను? దండ లేకుండా ఇంటికి వెళ్లేది లేదు’’ అనుకున్నాను. అందుకే వెంబడించాను. కేరళలోని కొల్లం జిల్లా, తెవలక్కార పట్టణం. సౌమ్య 28 ఏళ్ల యువతి. చక్కగా చురుగ్గా ఉంటుంది. భర్త టైలర్. ఇద్దరు పిల్లలు. శోభన ఐదవ తరగతి, సోనా మూడవ తరగతి. గడచిన వారం వరకు ఆమెను అందరూ ఓ సాధారణమైన సేల్స్గాళ్, ఇద్దరు బిడ్డల తల్లిగానే గుర్తించారు. ఇప్పుడామె కొల్లం జిల్లాలోనే సెలబ్రిటీ. సినిమా తారల కంటే ఎక్కువ క్రేజ్ ఆమెకిప్పుడు. కన్నుగీటి ఓవర్‌నైట్ సెలబ్రిటీ అయిన ప్రియాప్రకాశ్ వారియర్ కంటే ఈ వారియరే ఇప్పుడు అక్కడ ఫేమస్. సీన్ అంతగా మలుపు తిరగడానికి ఆమె ఏం చేసింది? సినిమా షూటింగ్‌ను తలపిస్తూ చేజ్ చేసింది. చైన్ స్నాచర్స్‌ను ఒడిసి పట్టుకుని చాచి కొట్టింది. తన తాళిమాల(మంగళసూత్రం)ను తెచ్చుకుంది. ఉద్యోగం నుంచి సాయంత్రం తన స్కూటీ మీద ఇంటికి వస్తున్నప్పుడు సౌమ్యను ఒక బైక్ వెంబడించింది. బైక్ మీద ఇద్దరు యువకులు ఆమె పక్కగా బండిని పోనిస్తూ ఆమె మెడలోని తాళిబొట్టు దండను లాక్కున్నారు. క్షణకాలం పాటు ఆగిపోయిన సౌమ్య వెంటనే తేరుకుంది. దారిన పోయే వారికి ఏం జరిగిందో తెలిసేలా ‘దొంగ... దొంగ... పట్టుకోండి’ అని అరుస్తూ స్కూటీ మీద గొలుసు దొంగలను వెంబడించింది. ‘దాదాపుగా మూడున్నర కిలోమీటర్ల దూరం వెంబడించి వారి బైక్ ను ఓవర్టేక్ చేసి వారి ఎదురుగా వచ్చింది. ఆ వేగంలో ఆమె స్కూటీ బైక్‌ను ఢీకొడుతూ ఆగింది. పరుగున వచ్చిన వారు, ఏం జరుగుతుందో తెలియకపోయినా సరే అరుపులతో గుమిగూడిన వారు బైక్ నడుపుతున్న యువకుడిని ఒడిసి పట్టుకున్నారు. సౌమ్య అతడి ముఖం మీద పిడిగుద్దులు గుద్దింది. చైన్ ఉన్న వాడు మాత్రం తప్పించుకుని పారిపోయాడు. ఈ లోపు కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు కూడా రంగంలో దిగారు. పారిపోతున్న దొంగను నిమిషాల్లోనే పట్టుకున్నారు. సౌమ్య దండ సౌమ్యకు చేరింది. కథ సుఖాంతం. ‘‘మెడలోని దండను వాళ్లు లాక్కుపోతే వెంబడించడానికి అంత ధైర్యం ఎలా వచ్చింది? అంత దూరం బండి మీద దొంగలను పట్టుకోవడానికి వెళ్లడమంటే చిన్న విషయం కాదు. నువ్వు చేసింది ఎంతటి సాహసమో తెలుసా?’’ అని ప్రశంసాపూర్వకంగా అడిగిన వాళ్లకు ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ‘‘నాకు తాళిమాల చాలా విలువైంది. దానిని లాక్కుపోతే చూస్తూ ఎలా ఉండను? దండ లేకుండా ఇంటికి వెళ్లేది లేదు’’ అనుకున్నాను. అందుకే వెంబడించాను. ఎలాగైనా వాళ్లను పట్టుకుని దండతోనే ఇంటికి వెళ్లాలనే కసితో వెంబడించాను. అందుకే భయం వేయలేదు’’ అంటోంది. ‘అమ్మాయిలంటే ఇలా ఉండాలి’ అని కేరళలో తల్లిదండ్రులు తమ పిల్లలకు సౌమ్యను రోల్‌మోడల్‌గా చూపిస్తున్నారు ఇప్పుడు. కేరళకే కాదు, సౌమ్య మొత్తం దేశానికే మోడల్ ఉమన్. – మంజీర -
చదివేది ఎంసీఏ.. చేసేది చైన్‌స్నాచింగ్
ధర్మవరం అర్బన్: ఉన్నత చదువులు చదివిన ఇద్దరు యువకులు చెడువ్యసనాలకు బానిసయ్యారు. జల్సాలకు అవసరమైన డబ్బు కోసం చైన్‌స్నాచర్లుగా మారారు. బాధితుల బంధువుల చేతికి చిక్కి.. కటకటాలపాలయ్యారు. ఇద్దరు చైన్స్నాచర్లను ధర్మవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం సాయంత్రం పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ హరినాథ్ మీడియాకు వెల్లడించారు. అనంతపురానికి చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి, ఖాజామోద్దీన్‌లు ఓ ప్రైవేటు కళాశాలలో ఎంసీఏ చదువుతున్నారు. జల్సాలకు అలవాటుపడ్డ యువకులు కళాశాలకు వెళ్లకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా రూ.2 లక్షలు విలువ చేసే ద్విచక్రవాహనంలో అక్టోబర్ 21న ధర్మవరం వచ్చారు. పట్టణంలో వెళుతున్న రేగాటిపల్లి గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే వివాహిత మెడలో బంగారు తాళిబొట్టు, గొలుసును లాక్కెళ్లారు. అప్రమత్తమైన బాధితురాలు బంధువులకు సమాచారం చేరవేసింది. బైక్‌పై దూసుకెళుతున్న ఆ యువకులను కేతిరెడ్డి కాలనీ సమీపంలో బాధితురాలు బంధువులు పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చైన్ స్నాచర్లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారని సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ జయానాయక్, హెడ్‌కానిస్టేబుల్ డోనాసింగ్, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, షాకీర్‌హుస్సేన్, ప్రసాద్, శ్రీరాములు పాల్గొన్నారు. -
శెభాష్.. పోలీస్
చైన్‌స్నాచర్ శివ గ్యాంగ్ చోరీ సొత్తు స్వాధీనం 181 మంది బాధిత మహిళలకు మంగళసూత్రాలు అందజేత హైదరాబాద్: దోపిడీ దొంగల ఆటకట్టించడమే కాదు.. వాళ్లు దోచుకున్న సొమ్మును బాధితులకు అందజేసి హైదరాబాద్ పోలీసులు అందరిచేత శెభాష్ అనిపించుకున్నారు. వరుస దొంగతనాలతో నగరాన్ని హడలెత్తించిన మోస్ట్ వాంటెడ్ చైన్‌స్నాచర్ శివ గ్యాంగ్ నుంచి రికవరీ చేసిన సొమ్మును గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బృందం బాధితులకు అందజేసింది. 181 మంది మహిళలకు మంగళసూత్రాలు తిరిగి ఇచ్చింది. ఈ సందర్భంగా బాధిత మహిళలు పోలీసులను అభినందించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఇత ర ఫర్నీచర్‌ను కోర్టు అనుమతితో విక్రయించి మిగతా బాధితులకు న్యాయం చేస్తామని సీవీ ఆనంద్ తెలిపారు. శివ గ్యాంగ్ నుంచి సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు భారీగా సొత్తు రికవరీ చేశారు. రూ. కోటి విలువైన 3.75 కిలోల బంగారు నగలు, రూ. 4.5 లక్షల నగదు, రెండు కార్లు, బైక్, ఫర్నీచర్‌ను నుంచి స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పరిధిలో శివ గ్యాంగ్ రెండేళ్లలో 511 స్నాచింగ్‌లకు పాల్పడింది. రికవరీ కోసం రెండు నెలలు కష్టపడి.. ఆగస్టు 14న శంషాబాద్ ప్రాంతంలో పోలీసు కాల్పుల్లో స్నాచర్ శివ (35) మృతి చెందడంతో ఈ గ్యాంగ్ దొంగతనాలు వెలుగు చూశాయి. వీరు తాకట్టుపెట్టిన బంగారాన్ని ముత్తూట్, శ్రీరామ్‌సిటీ యూనియన్ ఫైనాన్స్ కంపెనీల నుంచి రికవరీ చేసేందుకు పోలీసులు రెండు నెలలు కష్టపడ్డారు. చోరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టుకున్న రెండు ఫైనాన్స్ కంపెనీలు ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు మనీలాండరింగ్‌కు పాల్పడ్డాయి. ఈ కంపెనీల మేనేజర్లను సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కంపెనీలో పనిచేస్తున్న మరో ఇద్దరు మాజీ పోలీసుఅధికారులనూ నిందితుల జాబితాలో చేర్చారు.