Chairman elections
-
నేడు మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నికలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మూడు మున్సిపాలిటీలకు చైర్మన్లు, మూడు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లతోపాటు నాలుగు మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ పదవులకు సోమవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశాలకు హాజరై డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు.తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లలో ఒక్కో డిప్యూటీ మేయర్, ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులతోపాటు ఏలూరు జిల్లా నూజివీడు, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లో ఒక్కో వైస్ చైర్మన్, నెలూర్లు జిల్లా బుచి్చరెడ్డిపాలెం మున్సిపాలిటీలో రెండు వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. -
20న నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఎన్నిక
జిల్లా కలెక్టర్‌కు ఎన్నికల సంఘం ఆదేశం సాక్షి, హైదరాబాద్: నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికను ఈ నెల 20వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తీవ్ర గందరగోళాల మధ్య ఇక్కడి ఎన్నిక రెండు సార్లు వాయిదా పడటంతో ఈసారైనా ఎన్నిక సజావుగా పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం.. జిల్లా అధికారులకు మరికొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఎన్నిక జరిపేందుకు ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలోకి కోరమ్‌కు సరిపడినంత మంది సభ్యులు ఒక్కసారి హాజరై.. తరువాత వారు ఏ కారణంతో బయటకు వెళ్లినా కోరం ఉన్నట్టే భావించి ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్‌కు స్పష్టంచేసింది. ఇందుకోసం సభ్యుల నుంచి సంతకాల సేకరణ అవసరం లేదని పేర్కొంది. గతంలో ఎన్నికల సంఘం చేసిన సూచనకు అనుగుణంగా మొదటి నుంచి ఎన్నిక ప్రక్రియ వీడియో ద్వారా చిత్రీకరిస్తూ.. సమావేశ మందిరంలోకి వచ్చిన సభ్యుడిని వీడియో చిత్రీకరించాలని నిర్దేశించింది. అలాగే.. సభ్యులు పార్టీల వారీగా కూర్చోవటానికి బారికేడ్ల ద్వారా వేరుగా కంపార్టుమెంట్లు ఏర్పాటు చేయాలని.. కంపార్టుమెంటుకు ఒక అధికారిని నియమించి సభ్యుల సంఖ్యను నిర్ధారించుకోవాలని సూచించింది. ఎన్నికపై పూర్తివివరాలివ్వండి: హైకోర్టు ఆదేశం నెల్లూరు జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ నాయకులు చేస్తున్న గొడవలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యులపై పోలీసుల వేధింపుల నేపథ్యంలో, ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం ఎన్నికల అధికారులను, హోంశాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిమిత్తం ఈ నెల 20న జరిగే సమావేశాన్ని పరి శీలించేందుకు ఓ న్యాయాధికారిని పరిశీలకునిగా నియమిం చాలని కోరుతూ వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులు బి.అనిల్‌కుమార్ రెడ్డి, మరో 22 మంది హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ రమేష్ రంగనాథన్ విచారించారు. అధికార పార్టీ ఒత్తిళ్లు తట్టుకోలేక పిటిషనర్లు దూరప్రాంతాలకు వెళితే, పోలీసులు వారి కుటుంబ సభ్యులను బెదిరించి తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. -
మూడు ముక్కలాట!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ రాజకీయం రసకందాయంలో పడింది. పరిషత్ పగ్గాలు చేపట్టేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎత్తుకుపైఎత్తులు వేస్తుండగా, కలిసివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు టీడీపీ వ్యూహం రూపొందిస్తోంది. శనివారం జరిగే జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మల్లగుల్లాలు పడుతున్న మూడు పార్టీలు.. మేజిక్ ఫిగర్‌ను సమీకరించేందుకు రాయ‘బేరాలు’ నడుపుతున్నాయి. అత్యధిక జెడ్పీటీసీలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ ఎన్నికను ప్రతిష్టాత్మంగా భావిస్తోంది. టీఆర్ఎస్ ప్రలోభాలకు గురిచేస్తున్నదని భావించిన సీఎల్పీ నేత జానారెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. సుదీర్ఘవిరామం తర్వాత మెరుగైన ఫలితాలు సాధించినందున ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశాన్ని జారవిడుచుకోరాదని భావిస్తున్నారు. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థి టీడీపీ మద్దతు కూడగట్టడం ద్వారా టీఆర్ఎస్ను నిలువరించే దిశగా పావులు కదుపుతున్నారు. మరోవైపు రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ మాత్రం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలోని ఒక చీలికవర్గం తమకు అనుకూలంగా వ్యవహరిస్తుందనే ధీమాతో ఉంది. ఇప్పటికే ఒక ఎమ్మెల్యేలతో బేరం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతుండగా, తాజాగా తెలంగాణలో పార్టీ కీలక నేతగా వ్యవహరిస్తున్న మరో నాయకుడు.. మంత్రి మహేందర్‌రెడ్డితో సుదీర్ఘ విందు రాజకీయం నెరపడం చూస్తే టీఆర్ఎస్కే టీడీపీ మద్దతు ఇవ్వవచ్చనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇదే నేత ఒకవైపు జానారెడ్డితో చర్చలు జరుపుతునే ఇంకోవైపు మహేందర్‌తో రాయబేరాలు సాగించడం టీడీపీలోనూ కలకలం సృష్టిస్తోంది. నేడు నిర్ణయం నువ్వా- నేనా అన్నట్లు పోటాపోటీ సీట్లు సాధించిన టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు జెడ్పీ గద్దెక్కాలంటే టీడీపీ మద్దతు తప్పనిసరి. ఏడు జెడ్పీటీసీలు గె లుచుకున్న ఆ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీదే విజయం. ఈ నేపథ్యంలో కీలకంగా మారిన టీడీపీ తమ నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించనుంది. పార్టీ అధినేత చంద్రబాబు జిల్లా నేతలతో చర్చించి తుది నిర్ణయా న్ని ఖరారు చేయనున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ను ప్రధాన ప్రత్యర్థిగా పరిగణించాలని, ఆ పార్టీ జెడ్పీ వశం చేసుకోకుండా ఇతరులతో చేతులు కలపాలని ఇప్పటికే తేల్చిచెప్పారు. తద్వారా పరోక్షంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ పరిణామం టీఆర్ఎస్ నేతలతో లోపాయికారిగా మిలాఖ త్ అయిన జిల్లానేతలకు మింగుడు పడడంలేదు. ఐదేళ్లు అధికారంలో ఉండే టీఆర్ఎస్తో ఘర్షణ వైఖరి కొనితెచ్చుకోవడంకన్నా, కలిసిసాగడమే మేలనే అభిప్రాయాన్ని ఈ నేతలు వినిపిస్తున్నారు. వీరి వాదనకు చంద్రబాబు ఎలా స్పందిస్తారో నేడు తేలనుంది. ఇదిలావుండగా, తమ పార్టీ సభ్యులపై వలవేసిన టీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కూడా అదే సూత్రాన్ని పాటిస్తోంది. గులాబీ శిబిరంలో కుంపటి రాజేసేందుకు ప్యాకేజీలను ప్రకటించింది. ఒక్కో సభ్యుడికి అరకోటి ఇస్తామని ప్రకటించడం ద్వారా టీఆర్ఎస్లో చీలిక తెచ్చే దిశగా పావులు కదిపింది. ఇప్పటికే ఈ ఆఫర్లను ప్రకటించిన కాంగ్రెస్.. ఐదుగురు జెడ్పీటీసీలకు వల వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏదీఎమైనా మరో 24 గంటల్లో సస్పెన్స్‌కు తెరపడే జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆయా పార్టీలు అనుసరించే వైఖరిపై మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది. -
నేడు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు