chalam
-
ఘోర బస్సు ప్రమాదం...19 మంది దుర్మరణం
Massive Bus Accident In Mexico: సెంట్రల్ మెక్సికోలో యాత్రికులను తీసుకువెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా మరో 32 మందికి గాయలైయ్యాయి. అయితే బస్సు బ్రేకులు కోల్పోయి మెక్సికో రాష్ట్రంలోని ఒక భవనంపైకి దూసుకెళ్లడంతోనే ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ ప్రమాదం మెక్సికో సిటీకి నైరుతి దిశలో ఉన్న జోక్విసింగో టౌన్షిప్లో జరిగిందని రాష్ట్ర అంతర్గత కార్యదర్శి రికార్డో డి లా క్రూజ్ వెల్లడించారు. (చదవండి: ఆ పిల్లాడి కంటే ఈ కుక్క పిల్లే భలే మాట్లాడేస్తోంది!!!) ఈ మేరకు ఆయన ఈ బస్సు పశ్చిమ రాష్ట్రమైన మిచోకాన్ నుండి శతాబ్దాలుగా రోమన్ క్యాథలిక్ యాత్రికులు సందర్శించే ఛల్మా పట్టణానికి వెళ్తోండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని చెప్పారు. అయితే గాయపడిన ప్రయాణికుల పరిస్థితిపై ఎటువంటి తక్షణ సమాచారం లేదన్నారు. పైగా చాలా మంది మెక్సికన్లు డిసెంబర్ 12, వర్జిన్ ఆఫ్ గ్వాడాలుపే రోజు సమీపిస్తున్న కొద్దీ మతపరమైన తీర్థయాత్రలకు వెళ్తుంటారని చెబుతున్నారు. అంతేకాదు వారు తరచుగా ఇరుకైన రోడ్లపై నడవడం, కాలం చెల్లిన బస్సులలో ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే 1521 ఆక్రమణకు ముందు హిస్పానిక్ పూర్వ కాలంలో ఛల్మా ఒక పవిత్ర ప్రదేశం. అంతేకాక స్పానిష్కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత అజ్టెక్ దేవుడికి అంకితం చేయబడిన ఒక గుహలో ఒక శిలువ అద్భుతంగా కనిపించింది. దీంతో అప్పటి నుంచి ఈ ఛల్మా పేరుగాంచిన క్రైస్తవ తీర్థయాత్ర మారింది. అంతేకాదు పెద్ద ఎత్తున భక్తులు భక్తులు చల్మాను దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. (చదవండి: కరోనా కొత్త వేరియంట్.. జర్మనీలో తీవ్రరూపం..రంగంలోకి వైమానిక దళం) -
పురూరవుడి ముక్తికాంత
చలం రమణాచలం చేరింది 1950లో. పురూరవ నాటకం వ్రాసింది 1947లో. చలంలో వేదాంత ధోరణీ, తాత్త్విక చింతన ఈ నాటకం వ్రాసే సమయానికే బలపడిందని ఊహించవచ్చు. ఈ నాటకం ఐహికం నుండి ఆముష్మికానికి వంతెన. మానవ లోకాన్నుండి స్వర్గలోకానికి నిచ్చెన. ఊర్వశి ప్రేమదేవత కాదు ముక్తికాంత. కామి గానిది మోక్షకామి కాడుగదా మానవుడు. పురూరవుడు, సమస్తమూ అనుభవించి కూడా తనకు అర్థం గాని అశాంతి వల్ల, జీవితం మీది ప్రశ్నలతో, అందరాని దానికై అన్వేషణంలో కాలం గడిపే రసికావతంసుడైన రాజు. ముక్తికాంత పరిష్వంగానికి అన్ని అర్హతలున్న మానవుడు. ముక్తి సంపాదనకు మొదటి సోపానం అహంకార నిర్మూలనం. రెండవది భవ బంధ విమోచనం. ఈ రెండిటినీ అతి చాకచక్యంగా నెరవేరుస్తుంది ఊర్వశి. ‘‘నేను నీ చరణారవింద మకరంద మధుపాన మత్తుణ్ణి’’ అని దాసోహమని పాదాలపై పడేంత వరకూ వదలదు. బట్టలతో, హారాలతో అహంకారాన్ని కూడా అక్కడ వదలి రమ్మంటుంది. మొదట తాను సర్వ భూవలయ ఛత్రాధిపతి నంటాడు. ఊర్వశి తాను సర్వ భూవలయ ఛత్రాధిపతి మాణిక్య విరాజిత మకుట భూషిత పాదారవిందను అంటుంది. నమస్కరించమంటుంది. ‘‘నా పాదాలు స్పృశించే అధికారం నీకు కలగాలంటే, నీ అధికారాన్ని చాలా దూరంగా వొదులు నా ముందు’’ అంటుంది. ‘‘స్త్రీ ముందు మోకరించడం నేర్చుకోని నువ్వు ఏం తెలుసుకున్నావు? ఏం జీవించావు?’’ అని అడుగుతుంది. అడుగడుగునా అడ్డు తగిలి గర్వం హరించి పోయేట్లు చేస్తుంది. పురూరవుడు అంటాడు: ‘‘సర్వ శాస్త్రాలకే, ధర్మాలకే నిర్ణయ విధాతను నేను’’. ‘‘ప్రేమించగల యోగ్యతే నీకు వుంటే ఇవేమీ గొప్పగా మాట్లాడవు. నా ప్రేమని గుర్తెరగలేని నీ అహంభావం, నన్ను సంశయించిన నీ జ్ఞానం... నిన్ను ఎడమ కాలితో తన్ని పోలేక, హాస్యమాడుతున్నాను! నీ మీది నా ప్రేమ వల్ల’’ అని అంటుంది. అతని అల్పత్వం అతనికి తెలియజేసి పాదాక్రాంతుణ్ణి చేసుకుంటుంది. ‘‘ఇంక నేనే నీకు, నీ జీవితం నీ కాలం నీ నీతి నీ ఆత్మ ఇంక నేనే. నేనే నీ రక్షణ దైవాన్ని. నా చేతులకి నిన్ను నీవు అప్పగించుకుంటివా, పైనే కాదు, నీ లోపల్నించి మనస్ఫూర్తిగా నాకు వశ్యుడివైనావా నిస్సంకోచంగా, నీ కెన్నటికీ ఏ అపకారం జరగదు. నా అనుగ్రహం అవ్యాజం. నా ప్రియుడు నా ముందేగాని ఏ దేవతల ముందూ శిరస్సు వొంచడానికి వీల్లేదు. నీ సుకృతం నీ కిచ్చింది నన్ను. సుకృతమంటే కార్యాలు కాదు. ఎంతకీ ధర్మకార్యాలూ, భుజదర్పం వీటి సంగతేగాని, నా వంటి లావణ్యం నీకు వొచ్చి తీరవలసిన నీలోని శృంగార ఔన్నత్యం నీకు కనపడదు.’’ ‘‘నా అసలు నిజమైన తేజస్సుని నువ్వు చూడగలిగితేనా? ‘‘ఈ శరీరాల కలయికతో, రక్త సంబంధంతో, నా శక్తి, నా జ్ఞానం, నా స్పష్టత నీలోకి రావాలి. వుత్త కామవాంఛ తీర్చుకోవడమనుకోకు. నీ ఆలింగనం లోకి అపురూప దేహ లావణ్యాన్నే కాదు, గొప్ప సంస్కారాన్ని, ఆధ్యాత్మిక శక్తిని తీసుకుంటున్నావు. నీ ఆత్మ వికసించకపోతే, యీ సృష్టి లీలే అర్థ విహీనం, వ్యర్థం. ’’మరి యిది ముక్తికాంతా పరిష్వంగం కాక మరేమిటి? ఆ అనుభవం అప్రమేయ ఆనందాన్నిచ్చేది కాబట్టే పురూరవుడు మైమరచిన చిత్తంతో, ఆరాధనా భావంతో. ‘‘నా కోసం ఉన్నత ధామాలు విడిచి వొచ్చి, నీతో స్వర్గ రహస్యాన్నే కిందికి తెచ్చి, నాలో నించి భూమికీ, ఆకాశానికీ నేనెక్కడానికై నీ లావణ్య ఇంద్ర ధనుస్సును కట్టావు. నువ్వు కాక నాకీశ్వరు డెవరు?’’ అంటాడు. అవును ఊర్వశే ఈశ్వరుడు. నారాయణుని పాదాల నుండి వచ్చిన గంగ ముక్తి దాయిని అయినప్పుడు, ఊరు సంభూత అయిన ఊర్వశి ముక్తి ప్రదాయిని కాదా? ఊర్వశి చెప్పిన వేదాంతం : ఊర్వశీ పురూరవ సంయోగం ఆత్మ పరమాత్మల సంయోగం. ప్రకృతి పురుషుల సంయోగం. ముక్తికాంతా మానవ సంయోగం. ముక్తి ఎలా సాధ్యమవుతుంది? సాధన చతుష్టయాన్ని అనుష్ఠించాలి. శంకరాచార్యుడు ‘తత్త్వ బోధ’లో ఇలా చెప్పాడు: నిత్యా నిత్య వస్తు వివేక: ఇహాముత్రార్థ ఫల భోగ విరాగ: శమాది షట్క సంపత్తి: ముముక్షుత్వం చేతి ఊర్వశి చెప్తుంది నేను చాలా సత్యం, నీ దాన్ని, నీ జీవితం ఒక్క క్షణం. ఊర్వశితో అనుభవం అనంతం. ‘బ్రహ్మ సత్యం, జగన్మిథ్య’ అని నమ్మడం అవసరం. బ్రహ్మయే ఊర్వశి అనుకుంటే ఆమె సత్యం. ఇక పురూరవుని రాజ్యాధికారం, అంత:పురం స్త్రీలు, ప్రతాపం, యుద్ధాలు, రాజసాలు, పరివారం ఇదంతా అతని బాహ్య జగత్తు. దీనిని మిథ్యగా తలచాలి. అందుకే అడుగడుగునా ఆజ్ఞలు విధించింది ఊర్వశి. తాను అనంత ప్రేమనని పరి పరి చెప్పింది. ఇక రెండవది: ఇహలోక పర లోక భోగముల యందు, కర్మ ఫలముల యందు నైరాశ్యం కలిగి ఉండడం (ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ:) ‘అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’ అనగలగాలి. మనో వాక్కాయ కర్మలా అలాంటి అభిప్రాయాల్ని అలవరచుకోవాలి. ఊర్వశి తాను రక్షణ దైవాన్ననీ, ఇతర వ్యాసంగాల నన్నిటినీ వదలి, తననే ఉపాసించమనీ చెప్పింది. కానీ పురూరవుడికి ఇహలోక విషయాలపై మమకారం చావలేదు. వైరాగ్యం ప్రాప్తించలేదు. అందుకనే చేజిక్కిన దైవం చేజారిపోయింది. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము వీటినే శమాది షట్క సంపత్తి అంటారు. శమమంటే మనో నిగ్రహము. శమదమములు లోపించి, ఊర్వశి వంటి అపురూప లావణ్యవతి, స్వర్గ సౌఖ్యాలు కూర్చే పెన్నిధానాన్ని ఒడిలో పెట్టుకొని అల్పమైన ఇహలోక విషయాలలో వెంపరలాడి ఆనందధామాన్ని ఆవలకు నెట్టాడు పురూరవుడు. తాను ఉద్ధరించేందుకు వచ్చిన దైవాన్నని చెప్తున్నా, ముముక్షుత్వాన్ని మాని, ఐహికమైన అధికారాలు, భయాలు, శోకాలకు బానిస అయాడు. ఇక జగత్తు మిథ్య అని ఊర్వశి ఎలా చెప్పిందో చూద్దాం ‘‘కలకీ జీవితానికీ భేదమేమిటి? మేలుకున్నావు గనుక ఆ కలలోని అనుభవాన్ని కల అంటున్నావు. వాస్తవం కాదని దిగులు పడుతున్నావు. కాని అట్లానే కల లోనే అంతమైనావనుకో. ఆ కల వాస్తవం కాదని, నీకు తెలీదు కదా! వెయ్యేళ్ళు మృణాళినితో జీవించినా, అది ఒకప్పటికి వుత్త జ్ఞాపకం, కలా అయి తీరుతుంది కదా! మరణం తర్వాత ఎక్కడో మేలుకుంటే ఇది కల అనుకోవా మరి! కల తరవాత మేలుకున్నప్పుడు నిద్ర ముందు జీవితాన్ని ఎక్కడ వొదిలావో, మేలుకొని ఆ కొనని అందుకో గలుగుతున్నావు గనుక జీవితం నిజమయింది. నిద్రలో జరిగింది కల, అబద్ధం అయింది. ఎందుకూ? కల జరిగిన తరవాతి కొనని అందుకోలేవు గనక. మళ్ళీ యీ జీవితం కొన అందకుండా ఎక్కడో మేలుకున్న రోజున, యీ జీవితం కల కాదా? జీవితమంటే ప్రతి అడుగుకీ కదలిక. కదలిక అంటే త్యాగం, తోవ పొడగునా వొదలడం. అందులో ప్రేమ జీవితమంటే చాలా వేగమైన కదలిక. క్షణక్షణానికీ తీవ్రమైన పరిత్యాగం. వెనక్కి చూడడం చాలా మూర్ఖం. ముందు అనంత కాల దివ్యానుభవాలు పెట్టుకుని, ఏ విషాదం, ఆనందం కలగనీ, అనంతకాల పరంపరలో ఒక్క ముహూర్తం అనుకుంటూ వుండగా గడచిపోతాము.’’ ఇదీ ఊర్వశి వేదాంతం. అనిత్యమైన ఐశ్వర్యం, అధికారం, అహంకారాలను నమ్ముకుని నిత్యమైన, సత్యమైన ఊర్వశినే సంశయించాడు పురూరవుడు. అల్ప జ్ఞానంతో నీచంగా ఆలోచించాడు. అందుకనే శాశ్వతంగా దూరమయ్యాడు ఆ అలౌకిక అనుభవానికి. మానవులందరూ అంతే. ఊర్వశి పరిష్వంగం వంటి విశ్వాత్మ పరిరంభంలో అప్రమేమానందాన్ని చవిచూచిన వారే. మానుషత్వపు మబ్బులు గమ్మి, స్వర్గానికి దూరమై ఆ విశ్వ ప్రేమికుని విరహంలో అనాదిగా అలమటిస్తున్నారు. విముక్తి ఎప్పుడో, ఆ అనంత, అమందానందంలో లీనమయేది ఎప్పుడో... -పచ్చిపులుసు వెంకటేశ్వర్లు (వివిధ భారతీయ సాహిత్యాలలో ఊర్వశి పాత్ర చిత్రణను తరచిచూస్తూ వ్యాసకర్త ‘ఊర్వశి’ రాశారు. ప్రచురణ: చలం ఫౌండేషన్ ఫోన్: 9951033415) -
చలం నీడ చెప్పిన కథ
చలం ఆధ్యాత్మిక జీవితం గురించి కొత్త నవల వెలువడింది. చలం జీవితంలో జరిగిన అన్ని సంఘటనల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వావిలాల సుబ్బారావు ‘చలం నీడ చెప్పిన కథ’ పేరుతో రాశారు. ఆధ్యాత్మిక సాధన కోసం 20 ఏళ్లుగా అరుణాచలంలోని భగవాన్ రమణ మహర్షి ఆశ్రమంలో నివసిస్తున్న చలాన్ని ఇంటర్వూ్య చేసేందుకు ఆకాశవాణి తరఫున బాలాంత్రపు రజనీకాంతరావు అక్కడికి వెళ్లారు. ఇంటర్వూ్య అయిన తర్వాత రికార్డింగ్ ఆపేసి, కొన్ని ప్రశ్నలు అడిగారు. రజని: సహజ పరిణామం కోరుకునే మీరు వైరాగ్యానికీ, నిస్సంగత్వానికీ దారితీసే రమణ మార్గాన్ని ఎందుకు ఇష్టపడ్డారు? సౌరిస్: రేడియో రికార్డింగు అయిపోయింది గనుక నేను కూడా కూర్చుంటాను. రజని: అయ్యో ఎంత మాట! చలం గారిని చెయ్యి పట్టుకుని నడిపించారు. మిమ్మల్ని చలం అభిమానులు ఎప్పుడూ గౌరవిస్తారు. సౌరిస్: చలాన్ని గాక మరొకర్ని నడిపించి ఉంటే నన్ను పెద్దగా అనుకునేవారు కాదని తెలుసు. రజని: మహర్షి దగ్గరకు మీకంటే నాన్నగారే ముందు వచ్చారు. కానీ మీ ప్రయాణమే ముందుకు సాగింది, ఎందుకని? సౌరిస్: నాన్నలో తర్కించటం, ప్రశ్నించటం ఎక్కువ. అది విజ్ఞాన శాస్త్రానికి ఉపకరించినంతగా ఆధ్యాత్మిక సాధనకు సహకరించదు. ఇందులో విశ్వాసంతో ముందుకు సాగాలి. నాన్న తన అనుభవాలను తానే అనుమానిస్తాడు. ఇది ఆధ్యాత్మికానుభవమా, భ్రాంతిలో పడుతున్నానా అని సందేహించుకుంటాడు. నడక ముందుకు సాగదు, వెనక్కు నెడుతుంది. చలం: అవును. నా జీవితమే ప్రశ్నలతో ప్రారంభమయింది. కాకినాడ జీవితం నుండి మొదలు. విశ్వాసంతోనే ఆగివుంటే తెనాలిలో గాయత్రీ జపాల దగ్గరే ఆగిపోయి వుండేవాణ్ని. రజని: తర్కంతో ప్రశ్నించటం– విశ్వాసంతో ప్రశ్నించకపోవటం–– ఈ రెండు మార్గాలలోనూ మీ ప్రయాణం సాగింది. వాటి లాభనష్టాలు గ్ర హించారు. ఇప్పుడు మాకేది సూచిస్తారు? చలం: ఇందులో లాభనష్టాలు, బేరసారాలు ఏమీ లేవు. అది ఒక మనోధర్మం. ప్రతివాడిలోను రెండు ఉంటాయి. ప్రేమలో తర్కించటాలు, ప్రశ్నించటాలు వస్తే అనుభవం పోతుంది. ఇప్పుడు నా ప్రయత్నమంతా నిరంతర శాంతి ప్రేమలను పొందటం, ఏ అనుభవానికయినా తర్క పరిశీలన శత్రువే. (పే.205, 206) చలానికి తన అనుభవమే గీటురాయి, విశ్వాసం కాదు. చలం మొదటిసారి 1936లో తన మిత్రుడు చింతా దీక్షితులు సలహాతో రమణ మహర్షిని దర్శించాడు. కానీ నమ్మకం కలగలేదు. ఇక్కడి నుంచి ఈ నవల మొదలై 1975లో జల్లెళ్లమూడి అమ్మ స్వయంగా రమణాశ్రమం వచ్చి చలాన్ని ఆశీర్వదించి వెళ్లిపోయేదాక సాగుతుంది. స్త్రీలకు లైంగిక స్వేచ్ఛ ఉండాలని విస్తృతంగా రాసిన చలం 1950లో అకస్మాత్తుగా రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్లిపోవడం చలం అభిమానులకు మింగుడు పడలేదు. ఈ నవల అటువంటి అనుమానాలను పటాపంచలు చేస్తుంది. చాలామంది అనుకునేదేమంటే, చలం తన పూర్వ విశ్వాసాలను త్యజించి, ఆధ్యాత్మికవాదిగా మారిపోయి, పరస్పర విరుద్ధ జీవితం భగవాన్ చెంత గడిపాడని. కానీ అది నిజం కాదని ఈ నవల చదివితే తెలుస్తుంది. అయితే చలం రమణాశ్రమంలో ఏం చేశాడు? టాగోర్ గీతాంజలిని చక్కగా అనువదించాడు. అన్నిటికంటే మంచి అనువాదంగా అది పేరు పొందింది. భగవద్గీతను సరళంగా అనువదించాడు. బైబిల్‌ను తెలుగులోకి అనువదించాడు. సుధ పేరుతో తన జీవితానుభవాలను కవిత్వీకరించాడు. మద్రాస్ వెళ్లి అనార్కలి సినిమాకు రచన చేశాడు. తన జీవిత కథను డిక్టేట్ చేశాడు. శ్రీశ్రీ చలాన్ని మహర్షి అని పిలిచేవాడు. తనకు మద్రాసులో మనశ్శాంతి లేనప్పుడల్లా చలం వద్దకు వచ్చి రీచార్జి అయి పోయేవాడు. చలం మిత్రులు అనేక మంది– చింతా దీక్షితులు, చిన్నారావు, బీవీ నర్సింహారావు, కే.సభా, సినీనటుడు నాగయ్య చలాన్ని కలిసి ఆధ్యాత్మిక సంభాషణలు సాగించి వెళ్లి పోయేవారు. ఈ నవల చదివిన తర్వాత చలం కడపటి జీవితంపై నాకుండిన సందేహాలన్నీ పటాపంచలు అయ్యాయి. - కర్ర ఎల్లారెడ్డి -
చలం చూపిన ముక్తి మార్గం
సిద్ధులూ, బైరాగులూ, సన్యాసులూ, వీళ్లందరి దగ్గిరా మహత్తరమైన మూలికలుంటాయనీ, కటాక్షం కలిగినప్పుడు భక్తులకూ, తదితరులకూ, వాటిని అవ్యాజంగా యిస్తారనీ అందరికీ నమ్మకమైన విషయమే! నా తలనెప్పి బాధ కూడా పోగొట్టుకోడానికని అట్లా ఏదన్నా లభ్యమౌతుందేమోనని ఆశపడి, బూడిద పూసుకున్న ప్రతివాడి వెనకా తిరుగుతున్నాను రామేశ్వరంలో. వాళ్ల భాష నాకు రాకపోవడం గట్టి చిక్కొచ్చింది. వొచ్చిరాని అరవంలో ఒక బోసిమునిని తల చూపి మందిమ్మని అడిగేటప్పటికి, ‘‘ముసలి యోగిని, నాకో కాలనాయిమ్మ’’ని వెంటపడ్డాడు. ఇంకోడు తన వొంటి బూడిద నా తలకి రాసి, పావలా డబ్బులు లాగాడు. అరవ సన్యాసులు, మలయాళ యతులు, పంజాబు బైరాగులు, బెంగాలీ జోగులు, అందరూ వున్నారుగాని, ఒక తెనుగు బూడిదవాడెవడూ కనిపించలేదు, అర్థమయ్యేట్టు నా బాధ చెప్పుకోవాలంటే. ఇంక మా వూరికి తిరిగిపోదామనుకుంటో, గంధమాధనం చూసి మరీ పోదామని బైలుదేరాను. బైలుదేరేప్పటికే నాలుగున్నర దాటింది. మెల్లిగా యిసికలో కాళ్లీడ్చుకుంటో పోగాపోగా గంధమాధన శిఖర దర్శన మయ్యేప్పటికే సూర్యుడు కుంకుతున్నాడు. ఈ పర్రలన్నీ రాముడూ తమ్ముడూ యెట్లా తిరిగారా, వాళ్లకి ఏం తోచిందా, అన్ని రోజులు యిద్దరూ ఏం మాట్టాడుకుంటున్నారా, అనుకున్నాను. ఒక ఆడది వుంటే, యెన్ని కబుర్లన్నా వొస్తాయి. కాలం తెలీకండా గడిచిపోతుంది. కాని యిద్దరు మొగాళ్లు– అందులో అన్నతమ్ములు– వాళ్లని తలుచుకుంటే జాలేసింది. కవికేం? మూడు నెలలు చాలా సుఖంగా సంచరించారు, అని ఒక పద్యంలో మూడు నెలల కాలం అర నిమిషంలో కొట్టేస్తాడు. దోవలో, ముళ్లు రాళ్లు, పాములు, యివి కవి కంటికి కనిపించవు. ఎక్కడ పడుకున్నారు? ఏం తిన్నారు? అని ఆలోచనే అక్కర్లేదు. ఆకులు తిని సుఖంగా బతికారని సులభంగా అంటాడు ఒక కందపద్యంలో. ఏ ఆకులు, అవి రుచి యెట్లా వున్నాయి, నోరు పొక్కి యెంత యేడ్చారు, జీర్ణమెట్లా ఐనాయి, అర్నెల్లు తిన్న తరువాత ఆ మనుషులు గుర్తుపట్టేట్టు వున్నారా, ఆ సంగతి యేమీ మాట్టాడడు కవి. పోనీ ఆర్నెల్లు కాదు, ఆరు రోజులు నువ్వు ఆ అడివి ఆకులు తినివుండు ఆనందంగా అని ఆ కవిని నట్టడివిలో వొదిలితే తెలుస్తుంది ఆ రాతలేమిటో. ఆ పర్వతాన్ని హనుమంతుడు తొక్కాడుగావును ఇప్పుడు వుత్తగుట్ట. దానిమీద వున్న గుడి మీద, గుడిమీద వున్న డాబా మీద ఎక్కాను. ఆ పర్వతం మీదనించి రాముడు మొదట చూశాట్ట లంకని. లంక కోసం వెతికాను గాని కనపళ్లేదు. కాని దృశ్యం మాత్రం అతి గంభీరమైనది. రాముడంతటి చక్రవర్తి చూడతగినది. ఆ గుట్టమీద రామలక్ష్మణులు ఆజానుబాహులు నుంచుని, మూడు వేపుల సముద్రాలనూ, ఆ యిసిక పర్వతాలనూ, ఆ పెద్ద సమప్రదేశాలనూ, పరిశీలించడం తలుచుకున్నాను. అట్లా ధ్యానంలో పడ్డాను. మెల్లిగా చీకట్లు కమ్మాయి. చంద్రుడు బలం తెచ్చుకుంటున్నాడు. సముద్రం మీద పక్షులు గట్లకు వొస్తో అరుస్తున్నాయి. స్పష్టంగా కనబడే చెట్లూ కొండలూ, చీకట్లో దాక్కుంటున్నాయి. వెనకాల యెవరో ‘‘జయ్ శీతారామ్’’ అన్నారు. మొదట వాల్మీకి వొచ్చాడనుకున్నా– బాగా బలిసిన పెద్ద శరీరము వాడు, పెద్ద గడ్డము, రుద్రాక్షలూ, కమండలము కలవాడొకడు వొచ్చి మంటపం దగ్గిరగా కూచున్నాడు. ఆయన ముఖం స్పష్టంగా కనపడకపోయినా, ఆయన తప్పక నా బాధ మాన్పగలడనిపించింది. సమీపానికి వెళ్లి కూచున్నాను. ‘‘ఏ వూరు అబ్బాయీ’’ అని గోదావరి జిల్లా తెలుగులో పలకరించాడు. నా ఘోష చెప్పుకున్నాను. అంతా కళ్లుమూసుక విన్నాడు. ఆనాటితో నా బాధ గట్టెక్కిందనే ధైర్యం యెక్కువైపోయింది. ‘‘ఈ తలనొప్పి వొక్కటేనా నీ బాధ?’’ ‘‘ఇంకేం లేదు– అదే నా ప్రాణం తీసేస్తోంది.’’ ‘‘తలనొప్పి కుదురుస్తాననుకో. ఇంక బాధలుండవా? తరవాత?’’ ‘‘వుండకేం? మానవజన్మ మెత్తింతరవాత వుండకండా వుంటాయా? అప్పుడు చూసుకుంటాను వాటి సంగతి.’’ ‘‘అవును. మానవ జన్మమే బాధ– ఒకటిపోతే ఇంకోటి, ఒకటి లేకపోతే యింకోటి, అసలు బాధ లేని వుపాయం, కనిపెట్టాలిగా–’’ ‘‘అసలు బాధలేని వుపాయం ఏముంది– చావు తప్ప.’’ ‘‘చస్తే బాధలు పోతాయా? పోతే అందరూ చత్తురు, కాని వొకటే సాధనం– ముక్తి.’’ యోగుల చిట్కాలలో నమ్మకమున్నా, వాళ్ల మహిమల్లో మంత్రాలలో నమ్మకం లేదు నాకు. అందులో ముక్తి, స్వర్గం అంటే, ముసలమ్మ కబుర్ల లాగుంటాయి నాకు. ‘‘ముక్తి అంటే–’’ ‘‘ముక్తి అంటే– జన్మ రాహిత్యం.’’ ‘‘ఈ తలనొప్పులతో, యీ బాధలతో, దారిద్య్రంతో అన్నిటితోటీ కూడా జీవితమంటే నాకు చాలా మధురంగా వుంది. జీవితం లేకుండా శూన్యం తలుచుకుంటేనే నాకు భయం కలుగుతుంది, నాకు జన్మరాహిత్యం వొద్దు.’’ నవ్వాడు– పెద్ద వుపన్యాసానికి తయారవుతున్నట్టు కాళ్లూ, వెన్నూ సద్దుకున్నాడు. నా తలనొప్పి కుదురుతుందనే ఆశలు అడుగంటుతున్నాయి. పైగా అర్ధరాత్రి దాకా, యీ వేదాంతోపన్యాసం పట్టుకుందే, వొదిలించుకోటం యెట్లా? ‘‘నీకు జన్మరాహిత్యం వొద్దుగాని, ఏం కావాలి?’’ ‘‘ధనము, కీర్తి, ఆరోగ్యం, అధికారం.’’ ‘‘ఇవన్నీ యెందుకు నీకు?’’ ‘‘వాటివల్ల నాకు ఆనందం.’’ ‘‘కనక నీకు కావలసింది, ఆనందం– వీటన్నిట్లోనూ కావాలి? ఒకటే సూత్రం వుంది– ఆనందం– తిండిలో, నిద్రలో, అధికారంలో, అన్నిటిలోనూ ఆనందమే ప్రధానం– కాని కొన్ని చిన్ని ఆనందాలు, కొన్ని గొప్పవీ, కొన్ని క్షణినులూ, కొన్ని దీర్ఘాలూ– కాని అన్నిటిలోనూ కలిసి మిశ్రమములై బాధలు వున్నాయి. అనంతమై, అత్యున్నతమై, బాధరహితమైన ఆనందాన్ని ముక్తి అంటాము– కడుపు నొప్పీ వెగటూ లేని తిండీ– భయము లేని కీర్తీ, అధికారమూ, అలసట లేని మైధునమూ, విసుగు లేని రాగమూ– యివన్నీ కలిసి యింతే కాదు, నీ మనసుకు అందని అనేక కోట్ల సౌఖ్యాలు ఏకమైన ఆనందం ముక్తి.’’ ‘‘ముక్తి ఆనందమా? ముక్తి అంటే జన్మరాహిత్యం కాదూ?’’ ‘‘అవును. జన్మరాహిత్య మెప్పుడవుతుంది? పరమాత్మలో ఐక్యమైనప్పుడు. ఆ ఐక్యం కావడమే, నిరంతర అవ్యయానందం ఆ లోకంలో కూడా. ‘ఆనందం అంటే ఐక్యం.’– దుడ్డుతో, పువ్వు వాసనతో, రంగుల కాంతితో, ఐక్యం కావడం ఆనందం. వీటికన్నిటికీ కారణమైన పరమాత్మతో ఐక్యం కావడం ముక్తి. జీవాత్మా, పరమాత్మా సంయోగం.’’ ‘‘యెట్లా అది పొందడం?’’ ‘‘అసాధ్యం. ఎట్లా పిల్లవాడికి స్త్రీవాంఛ అసంభవమో అట్లానే మీరందరూ పిల్లలు– యీ విద్యలో– ఆ యౌవనం పదేళ్లలో వొస్తుంది. ఈ యౌవనం పది యుగాల్లో కూడా రాదు.’’ ‘‘ఐతే ఎందుకీ ఉపన్యాసం?’’ అన్నాను వొళ్లు మండి. ‘‘తొరగా ఎదగమని చెపుతున్నాను.’’ ‘‘ఎట్లా?’’ ‘‘ముందు రాబోయే మహదానందం అనేక రూపాల మీకు ధ్వనిస్తోనే వుంది. ఈ పరమాత్మకీ జీవాత్మకీ సంయోగంలో వుండే మాధుర్యం– జీవాత్మకీ, జీవాత్మకీ సంయోగంలో కనపడుతోంది. అదే ప్రేమ. ఆ ఆత్మలు నివసించే దేహాల సంయోగంలో వుంది ఆ మాధుర్యం. తలుచుకో– ప్రతి నరమూ, ప్రతి అవయవమూ, ఆవేశంతో వొణికిపోతూవుంటే, మనసూ ప్రాణమూ ఏకాగ్రమై, ఐక్యమైపోయే సమయంలోని ఆనందం– అదే ముక్తి. కోర్కెలు, తలపులు, భావనలు, అన్ని యింకో వ్యక్తితో ఐక్యమైన ప్రేమని తలుచుకో. అదే ముక్తి. అది కొన్ని నిమిషాలే లభ్యమౌతుంది జీవులకి, కాని పరమాత్మలో ఆ అనుభవం అనంతమౌతుంది. అన్ని అనుభవాలలోకీ శ్రేష్టమూ, అప్రమేయమూ, సంయోగం– అది సృష్టికర్త చెందే అనుభవము– ఇంకో నూతన ప్రాణిని కల్పించే ఆనందం–’’ ‘‘ముక్తి సాధన అదేనా?’’ ‘‘సందేహం లేకండా. ఆత్మవికాసమే ముక్తి మార్గం. యోగం, జ్ఞానం, కర్మ, భక్తి అన్నీ కూడా ఆత్మవికాసానికి సాధనాలు. ఈ ప్రపంచంతో ఎంత ఐక్యమైతే అంత ఆత్మవికాసం కలుగుతుంది. ప్రపంచమంటే సృష్టి. సృష్టి శరీరాల ఐక్యం వల్ల కలుగుతోంది. ముక్తి అంటే ఐక్యం. ముక్తి వల్ల సృష్టి కల్గుతోంది. సృష్టి మళ్లీ ముక్తి పొందుతోంది. ఈ నదులు, పర్వతాలు, వృక్షాలు, జంతువులు, మనుషులు, అందరూ నీవే అనే ఐక్యభావం రావాలి. ఈ భావం ప్రతివాడికి సంయోగంలోని రెండు నిమిషాలలోనూ తోస్తోంది. అవునా? కనక ఆ కార్యంలో ప్రతి వ్యక్తీ ముక్తిని రుచి చూస్తున్నాడు. ఆత్మ వికాసానికి ముఖ్య సాధనం సంయోగం, ఏ వ్యక్తి ఆ జాతి వ్యక్తితో ఎంతమందితో, ఎన్ని విధాల సంయోగం పొందుతాడో అంత ముక్తికి సన్నిహితుడౌతాడు. ‘‘మరి పాపమంటారు?’’ ‘‘అంటారు– పాపమేమిటి? ఆత్మవికాసమే, ముక్తి పాపం యీ మూర్ఖులకి. వాళ్లకి ఆనందం తెలుసా? వృక్షాలకు తెలుసు. కీటకాలకు అంతకన్న ఆనందం తెలుసు. జంతువులకి యింకా కొంత. మనుషులకి అధికానందముంది దాంటో. అందులో రసికులూ, ఆత్మ ఔన్నత్యం కలిగినవాళ్లూ, పరిపక్వం చెందినవాళ్లూ, ఇంకా అతీతమైన ఉన్నతావస్థను పొందుతారు. క్షుద్రులకు ఆ ఆకర్షణే వుండదు. పశుప్రాయులు వాళ్లకి ఆత్మవికాసం లేదు. ఒక్క వ్యక్తి అనుభవంతో– ఏం జంతువైతేనేం– దాంతో తృప్తి పడతారు– ఆత్మ యెప్పుడూ ముక్తికోసం బాధపడుతుంది. పరమాత్మ పిలుపు విని రెక్కలు కొట్టుకుని విజృంభించడానికి ప్రయత్నిస్తుంది. ఈశ్వరుడు సౌందర్యమూర్తి, సౌందర్యమంతా ఈశ్వరుడు. సౌందర్యమే ఆనందం. సుందర తేజం, సుందర ధ్వని, సుందర రసన– సౌందర్యాన్ని గుర్తించి అన్వేషించి వాంఛించనివాడు అధముడు. సౌందర్యంతో– వివిధ రూపాలు, వివిధములైన మార్పులు పొందే, సౌందర్యాన్ని అనుభవించడంలోనే ఆనందం– ఇంతకన్న ఆనందదాయకమైనది ఆ ముక్తి మాత్రమే! ఎంత రసికుడో, యెంత సౌందర్యోపాసకుడో, అంత యీశ్వర ప్రియుడు– ఎంత అనుభవాన్ని వాంఛిస్తాడో, ఎంత సంయోగాన్ని పొందుతాడో అంత ఈశ్వరుణ్ణి ప్రేమిస్తాడు. ఎన్ని విధాలైన సౌందర్యంతో యెంత మంది వ్యక్తులతో ఐక్యమౌతాడో, యెంతమంది స్త్రీలను ప్రేమించి కామిస్తాడో, అంత ఆత్మవికాసం పొందుతాడు.’’ దిగ్భ్రమ చెంది కళ్లు తెరిచాను. యోగి అంతర్థానమైనాడు నా తలనొప్పితో సహా. నా చుట్టూ ప్రపంచమంతా వెన్నెట్లో ముకురించుకుని పడుకుంది. నా హృదయంలో నూతన జ్ఞాన జ్యోతి వుదయించింది. చలం (18 మే 1894– 4 మే 1979) కథ ‘ముక్తిమార్గం’ ఇది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒకే ఒక్క పేరు చెప్పవలసివస్తే, ఆయన ఒక్క పేరే చెప్పవలసినంతటి రచయిత చలం. కథలు, నవలలు, నాటకాలు, మ్యూజింగ్స్, లేఖలు, ఇట్లా అన్నింటా ప్రతి వాక్యమూ సాహిత్యంగా బతికినవాడు. పురూరవ, మైదానం, జీవితాదర్శం, అమీనా ఆయన రచనల్లో కొన్ని. -
చలం చందనం
చలం అంత్యక్రియలకు సంబంధించిన ఈ విశేషాలు పురాణం సుబ్రహ్మణ్య శర్మ 1982లో రాసిన ‘అరుణాచలంలో చలం’ పుస్తకంలో ఉన్నాయి. 1979లో చలానికి 84–85 ఏళ్ల వయసులో ఆరోగ్యం క్షీణించింది. నా చావువార్తను బయటి ప్రపంచానికి తెలియనివ్వొద్దు, నాకీ పాడేగీడె కట్టి తీసుకెళ్లద్దు, నా శవం దగ్గర భజనలూ అవీ చేయొద్దు, నేనీ ఈజీ చైర్లో ఎట్లావున్నానో అట్లా సైలెంటుగా తీసుకెళ్లండి అని కూతురు సౌరిస్కు సూచించారు చలం. ఎవరికీ చెప్పొద్దనడం ధర్మం కాదని సౌరిస్ అప్పుడే ఆ మాట కొట్టేసింది. చనిపోయిన తర్వాత రమణాశ్రమంలో కొందరు పాడె కడతామనీ, మేము మోసుకెళ్తామనీ అడిగినప్పటికీ సౌరిస్ ఒప్పుకోలేదు. ఈజీ చైర్లోనే పట్టుకెళ్లారు. మీద బట్ట కప్పలేదు. స్నానం చేయించి తెల్లటి బుష్ షర్టూ, తెల్లటి లుంగీ కట్టారు. పూవులు ఆయన వద్దనలేదు కాబట్టి బుట్టల కొద్దీ తెచ్చారు. సుధ నుంచీ, వాల్మీకి రామాయణం నుంచీ శ్లోకాలను పద్యాలను గానం చేశారు. తిరువణ్ణామలై రమణస్థాన్కు ముప్పాతిక మైళ్ల దూరంలో ఉన్న అరుణగిరి కొండలు, యమలింగాల దేవాలయం నడుమ సామూహిక మార్నింగ్ వాక్‌లా అంత్యక్రియలు జరిగాయి. చలానికి చాలా ప్రియమైన చెల్లెలి పిల్లల్లో ఒకరు వక్కలంక నరసింహారావు చితికి నిప్పు పెట్టారు మంచి గంధపు చెక్కతో. సౌరిస్– ‘‘మీ ప్రేమ కొద్దీ మీరు వేసుకోండి చితిమీద’’ అని అందరికీ చందనపు చెక్కలు యిప్పించింది. అంతా గంధపు చెక్కలను చితిమీద వేసారు. ఈ చందనపు చెక్కల గురించి ఓ కథ వుంది. చలం చనిపోవడానికి ‘ఏడాది ఆర్నెల్ల క్రితం’ చలాన్ని చూడ్డానికి రాయలసీమ నుంచి ఒక ఆసామీ వచ్చాడు. ఆయన వస్తూ ఓ చందనపు చెక్కను తెచ్చి ‘‘ఇది మీకోసం తెచ్చానండీ’’ అని చలానికి బహూకరించాడు. ఆయన రచయిత కాడు, పెద్ద భక్తుడు కాదు. చలం గురించి విని ఓమారు చూసి పోదామని వచ్చాడు. ఉత్తి చేతులతో రావడం ఎందుకని చందనపు కర్ర తెచ్చి సమర్పించుకున్నాడు ప్రేమతో. ‘‘ఈశ్వరుడు నాకు అంత్యకాలం వచ్చిందని చందనం పంపించాడు’’ అని చలం చమత్కరించాడట. ఆ చందనం నిజంగా అలానే ఉపయోగపడింది. -
వేదన వాదన
‘యామయ్యా జడ్జీగారూ నాకు శిక్ష వేసేముందు నేను చెప్పే సంగతులు యోచించుకోండి! నాకు మల్లేనే మీకూ నవరుచులున్నాయి; నా మాదిరిదే మీ శరీరమూ; రక్తమూ, మాంసమూ– ఇనుము కాదు. నాలోనూ అందరిలోనూ వున్న ఆత్మే మీలోనూ ప్రకాశిస్తోంది. ఎంత రాయి చేసుకున్నా హృదయం మీలోనూ కొట్టుకుంటోంది. దోషాన్ని తూచి శిక్షలు తయారు చేసి నా మొహాన పారేసే మెషీను కాదు కదా! మీరు వినండి...నేను చెప్పేదంతా విని, న్యాయమని తోస్తే విడిచిపెట్టండి. వొదిలి పెట్టటానికి స్వతంత్రం లేదా? యీ ఉద్యోగం మానుకోండి ధైర్యం వుంటే. ధైర్యం లేక నిర్దోషిని శిక్షిస్తారా? కానీండి. నేను నిర్దోషిని. దోషినని నాతో వాదించి రుజువు చెయ్యి. ఆ ప్లీడరుని వూరుకోమను. వాళ్లకీ నిజంతో పనిలేదు, ఫీజుతో తప్ప. నా నేరం నేనే ఒప్పుకుంటున్నాను. సాక్షులతో పని లేదు; నీకు మెదడు వుంది. నాకూ వుంది. ఇద్దరం కలిసి యోచిద్దాము. అవును, బిడ్డ పుట్టకుండా నేను గర్భం తీసేసుకున్నాను. అదెట్లా నేరమో చెప్పు? పుస్తకాల్లో తప్పని రాసివుంది; అలా తప్పనకు, పుస్తకాలు పురాతనాలు. ఆ రాసినవాళ్లు దుర్మార్గులు. బుద్ధిహీనులు. వాళ్ల మాట ప్రకారమే నడుచుకుంటే, మనకి వేరే మెదళ్లెందుకు? తెలివెందుకు? పుస్తకంలో అక్షరాలకి లొంగిపోతావా? నేను తిరగబడ్డాను. లోబడ్డావా, నువ్వు నాకంటె పిరికివాడివి– స్వతంత్ర యోచనలేని వాడివి– దోషివి– నీకేం అర్హత వుంటుంది నన్ను శిక్షించడానికి? వినుమరి– నేను మొదట చేసింది తప్పంటావా? ఆ పనిచేస్తే శిక్ష లేదు, మీ పుస్తకాల ప్రకారమే ఆ పనే తప్పంటావా? అది నువ్వు చేస్తున్న పనే భర్తలేనిది చెయ్యడం తప్పంటావా? భర్తవుండి కడుపు వచ్చినా, కడుపు తీసుకోడం నేరమేగా? అదిగాక కడుపు రాకుండా ఏం చేసినా తప్పులేదూ? వొస్తే మొదటినించీ అంతా తప్పా! కడుపురావడం నా తప్పుకాదు కదా! పెళ్లానికి పిల్లలు పుట్టకపోతే అది ఆమెది తప్పుగా చూసే మీరు, నాకు కడుపురావడం తప్పంటారా? గర్భం కలిగిం తరవాత యెందుకు తీసేసుకున్నావంటారు? నాకు అనేక కారణాలున్నాయి. నన్ను పోషించేవాడు వొదిలేస్తాడు ఎట్లా బతకను? నాకింకేమీ కష్టంపని చేసుకుని బతకడం చేతకాదు. కూలి చేసుకోరాదా? వంట చేసుకోరాదా అని సులభంగా అంటారు. అందమైన కూలిదాన్నిగాని, వంటదాన్నిగాని బతకనిస్తారా మొగాళ్లు? ఇక్కడ వున్న వాళ్లందరూ అట్లాంటి మహానుభావులే. కోట్లూ, తలగుడ్డలూ పెట్టుకుని వెకిలి నవ్వులు కార్చుకుంటో, మీసాలు మెలేస్తో నావంత అతి తీవ్రంగా చూస్తో కూచుంటే సరా? మీ సంగతి ఎవరికి తెలీదు? మొగాళ్లు బలవంతం చేస్తే నీ నీతి ఏమయిందంటావు? తమకి లోబడకపోతే తమ పెళ్లాలతో సాడీలు చెప్పి పనిలోంచి తీసేయిస్తారు. ముందు మొగుళ్ల మీదనే సాడీలు చెప్పితే మొగుళ్లతో పోట్టాడినా, చివరికి ఆడవాళ్లూ నన్నే పొమ్మంటారు మర్యాదగా! నేనూ బతకాలి. ఎందుకు లోబడ్డావని అందరూ తిట్టేవాళ్లే! మీ భార్యల్ని అట్లా గదుల్లో దాచుకోకండా, కానీ లేకండా, నాకు మల్లే, వీధుల్లో పారెయ్యండి. వితంతువులు కాగానే ఏ బంధువుల ఇళ్లల్లోనో చాకిరీలకి చేర్తారే? అభిమానమున్నదాన్ని గనక ఆ నీచత్వం కన్న ఈ స్వతంత్రమే నయమనుకున్నాను. స్వతంత్రంగా సంపాదించమనండి ఓ దమ్మిడి మీ భార్యల్ని, తెలుస్తుంది. ఆ కులుకు, ఆ పాతివ్రత్యం అన్నీ యామవుతాయో! రెండు రోజులు యింట్లోంచి వెళ్లి బైట బతికి రమ్మందురూ తెలుస్తుంది సంగతి! ఆ సంగతి పోనీండి. గర్భం రాగానే ఆయన నన్ను వదిలేశాడు, ఆకలెక్కువయింది, ఒంట్లో బాగాలేదు, మందులు కావాలి. ఏం చెయ్యను? మీ గుమ్మాల్లోకి వస్తే తరుముతారు. అవునా? పతివ్రతలు మీ భార్యలు. గుమ్మాలు కడుక్కుంటారు. మైలపడ్డామని నా నీడ తాకినచోట పేణ్ణీళ్లు చల్లి శుద్ధి చేస్తారు. బిడ్డని కంటాననుకోండి. దాన్ని నువ్వు పెంచుతావయ్యా? పోనీ దాని పోషణకి కర్చు యిస్తావా? శరణాలయాలున్నాయి. కాని నీతియుక్తంగా కన్న పిల్లలని తల్లిదండ్రులు చస్తే తీసుకుంటారట. ఆ శరణాలయాలు పెట్టినవాళ్లు నీతియుక్తంగా పుట్టారేమో అసలు! వెధవ ముండాకొడుకని అందరూ యేడిపిస్తే ఎవరు ఓదారుస్తారు? నీ పిల్లలతో ఆడుకోనిస్తావా? నన్ను పోషించడమే మా ఆయనకి ఇంత కష్టంగా వుంది. రోజుకి మూడుసార్లు పొమ్మంటాడు. నేనైతే మాడి చస్తాను. వాణ్ణి ఎట్టా చంపుకోను? వాడి బాధ చూడలేక వాణ్ణి ఏ బావిలోనో తోసి నేను వురకాలి. పేపర్లో చదువుతారు. ఒక స్త్రీ పిల్లాణ్ణి చంపి తాను చచ్చిందని. దీనికేం పుట్టిందని తిట్టుకుంటారు. పేపరు మడిచి దీపమార్పి పడుకుంటారు. మరి ఆ ‘లా’ని యేర్పరచిన వాళ్లు మీరో మీ తాతలో, నాకు వెలి రాకుండా నా బిడ్డకి అమర్యాద రాకుండా కాపాడుతారా? ఆ సంగతి మీకేమీ తెలీదు. మీకు తెలిసినదల్లా నన్ను కైదులో పారెయ్యడమే. అవును నాకు వేరు గతిలేక ఆ దిక్కుమాలిన పిల్లకి ప్రాణమిచ్చి ఏడిపించడానికి కాఠిన్యం తక్కువై, తల్లిని గనక యీ పని చేశాను. మీ అభ్యంతరమేమిటి? మొదటిది– ప్రాణం తీశానన్నారు. అది నాలో భాగమా వేరే ప్రాణమా? నాలో భాగం అయితే దాన్ని తీసేసుకుంటే మీకేం? నాకో కురుపు లేస్తే కోసేసుకోనూ? నా చెయ్యి కోసేసుకుంటా మీకేం? వేరే ప్రాణమా? నాది కాదా? అయితే నాలోపల దాన్నెవరు ప్రవేశించమన్నారు. నా అనుజ్ఞ లేంది? లోపల ప్రవేశించి నన్ను బాధించమన్నదెవరు? మీ అనుజ్ఞ లేకుండా మీ యింటోకి ఎవరన్నా వస్తే మీరేం చేస్తారు? అట్లానే నేనూ బైటికి తరిమేశాను. చస్తే నేనేం చెయ్యను? నేను రప్పించానా? లేదు. నాకు బిడ్డ పుట్టాలని యే మాత్రమూ లేదు. నాలోకి వచ్చి నా ఆరోగ్యం, నా సౌందర్యం చెడగొట్టి, నా మానం తీసేస్తే బాగానే వుంది? నేనెందుకు దాన్ని కాపాడాలి? దాని కోసమా? అవును మీ కోసములాగే వుంది. మీరందరూ దాన్ని తిట్టి వెక్కిరించి మీ పతివ్రతల్ని మీ పిల్లల పవిత్రపు పుటకల్నీ సమర్థించుకునేందుకు. నా యిష్టం వచ్చిన మందు నేను మింగుతాను. దాన్ని చావమన్నదెవరు? మీ పొట్టలో పాములు చేర్తే అవి చావడానికి బాగానే మందులు తాగుతారే? దాని కసలు ప్రాణమున్నదని మీకెట్లా తెలుసును? భూమిమీద పడంది వూపిరన్నా పీలవదు. ప్రాణమున్నదని నీకేం తెలుసు? నువ్వెప్పుడన్నా కడుపుతో వున్నావా? జడ్జీ నీకేం తెలుసు? పుట్టిన బిడ్డ తిండి లేక మాడి చస్తే నీ ప్రాణం సుఖంగా వుంటుందా? నీ కళ్లు చల్లగా వుంటాయా? మరి ప్రాణం తీసిన వాళ్లకి వురిశిక్ష కదా! అది వెయ్యరేం నాకు? అంటే పూర్తి ప్రాణం కాదన్నమాట. అర ప్రాణం, పావు ప్రాణం వుంటుందా? అర ఆత్మ, పావు ఆత్మ వుంటాయా? నిండు ఆత్మలు మీకున్నాయా? వుంటే నన్నెందుకిట్లా యేడిపిస్తారు? మిమ్మల్ని చంపినా తప్పులేదు అయితే! కోడిగుడ్డుకి ఎన్నో వంతు ప్రాణం? గొర్రెకి వాటి ఆత్మ వుందా లేదా! అట్లా చూస్తావేం? నీకేం తెలుసునని కూచున్నావు నన్ను శిక్షిస్తానంటో... నా ఆరోగ్యం చెడిపోతుందంటారా? కాఫీ హోటల్లో చెడ తినే వారినీ, పసి భార్యలకోసం మందులు తినే ముసలివాళ్లనీ దండించరేం? నలభై యేళ్లకే మూలశంకలూ, అతి మూత్రాలూ తెచ్చుకునే జడ్జీలని దండించరేం? దిక్కుమాలినదాన్ని నేను దొరికానా? నా ఆరోగ్యం పోతే ఎవడికేం? నా ప్రాణం పోతే ఎవడికేం? దుర్మార్గంలో పడి యెట్లా చచ్చిందోనని నన్ను చూసుకు సంతోషంతో కడుపు నింపుకుంటారు మీ భార్యలు. దీన్ని చంపినందుకు లోకంలో మనుషులు తక్కువవుతారంటారా మీరందరూ? పుణ్యాత్ములు మీరున్నారు చాలదూ? కనకుండా వున్న ప్రతి ఆడదాన్నీ శిక్షించండి, వితంతువులందర్నీ కనిపించండి బలవంతంగా! మీ జనసంఖ్య పెరగడానికి యింకో జీవాన్ని నన్ను మోయమనడానికి మీరెవరు? సృష్టి సాగదంటారా? నాకేం? నీకు సృష్టి సాగిస్తానని పూచీకత్తు నిచ్చానా? అసలు నన్ను కనవద్దని సంఘం అజ్ఞాపించిందిగా. ‘లా’ కనమంటోంది. కంటే సంఘం, కనకపోతే ‘లా’ శిక్షిస్తాయి. మరి సంఘమేగా ‘లా’ని ఏర్పరిచింది. సృష్టి నాలో యింకో జీవాన్ని పెట్టింది. దాన్ని తీసుకునే శక్తిని యిచ్చింది. మధ్య మీకెందుకు? ఏమంటావు, నన్ను వొదులుతావా? నీ వుద్యోగం పోతుందని భయమా? నీ వుద్యోగం కోసం నన్ను నిర్దోషిని శిక్షిస్తావా? ఇదేనా నీతి, యిదేనా పుణ్యం, చెప్పు జవాబు? మహారచయిత చలం (19 మే 1894 – 4 మే 1979) కథ ‘ఆర్గ్యుమెంటు’ పూర్తిపాఠం ఇది. చలం జయంతి, వర్ధంతి ఇదే నెలలో. -
మళ్లీ గెలిపిస్తే.. మొత్తం ఊడ్చేస్తారు
‘హుద్‌హుద్ సృష్టించిన బీభత్సం కంటే నవ్యాంధ్రలోని ఏకైక మహానగరం విశాఖపట్టణానికి ఈ ఐదేళ్లలో భూబకాసురులు కోలుకోలేనంత నష్టం చేకూర్చారు. ఉత్తరాంధ్రను పూర్తిగా దగాచేశారు. మళ్ళీ ఈ పాలకులే వస్తే ఇక్కడి వనరులు మొత్తాన్ని ఊడ్చేస్తారు. దేశ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా సహజ, ఇంధన వనరుల్ని.. సంపదలను నిలువునా దోచేశారు.’ ‘రాష్ట్రంలో ప్రాథమిక రంగాలైన విద్య, వైద్య వ్యవస్థల్ని నాశనం చేశారు. పసుపు కుంకుమ పేరిట సరిగ్గా ఎన్నికలకు ముందు బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేయడమేంటి...? ఇది ఎన్నికల తాయిలం కాదా? ఒకవేళ మహిళలకు ఆర్ధిక సాయం చేయాలనుకుంటే ఐదేళ్ళ నుంచి ఎందుకు చేయలేదు? ఐటీకి ఆద్యులమని చెప్పుకుంటున్న వాళ్లే డేటా చౌర్యానికి కూడా ఆద్యులని చెప్పుకోవాలి. ఎంత దౌర్భాగ్యమంటే చివరికి నా ఓటు కూడా తొలగించారు’ అని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) మాజీ ఇన్చార్జ్ చైర్మన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ ఫర్ సోషల్ జస్టిస్ చైర్మన్ కేఎస్ చలం ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం సుదీర్ఘ కోస్తాతీరమున్న నవ్యాంధ్ర సన్ రైజ్ స్టేట్‌గా మారుతుందని అనుకున్నాం.. కానీ ఏపీని పాలకులు ‘సన్’ రైజ్ స్టేట్‌గా మార్చేశారని ఆయన సాక్షితో వ్యాఖ్యానించారు. సాక్షి :విశాఖ కేంద్రంగా జరిగిన భూకుంభకోణంపై మీ విశ్లేషణ? చలం: అంత భూ దోపిడీ చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. రూ.లక్ష కోట్ల భూ కుంభకోణమని పత్రికలే రాశాయి. సమైక్య రాష్ట్రం విడిపోగానే ఏపీలో ఏకైక మహానగరంగా ఉన్న విశాఖపై పడి దోచుకున్నారు. ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు భూములుగా మార్చేసి అమ్మేసుకున్నారంటే.. అసలు నేరస్తులు ఎవరో అందరికీ తెలుసు. అందుకే ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నివేదిక ఏమైంది... ఆ సిట్ ఎవరిని విచారించింది? ఎవరిపై చర్యలు తీసుకుంది? నాకు తెలిసి భూ కుంభకోణాలతో వచ్చిన డబ్బునే ఈ ఎన్నికల్లో వెదజల్లనున్నారు. ఇక్కడి డబ్బునే ఇటీవల తెలంగాణ ఎన్నికలకు, ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు ఖర్చు పెట్టారు. సాక్షి : ఉత్తరాంధ్రకు ఐదేళ్ల కాలంలో ఏం ఒరిగింది? చలం:ఐదేళ్ల కాలంలో ఉత్తరాంధ్రకు ఏ మేలు జరగలేదు. విభజన చట్టం మేరకు రావాల్సిన ప్రాజెక్టులేమీ రాలేదు. చివరికి ఇక్కడి వనరులనే దోచిపెట్టారు. ఐటీ అభివృద్ధి కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ఐటీ సెజ్ పేరిట నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన అటవీ భూములను ప్రైవేటు కంపెనీలకు నామమాత్ర ధరకు కట్టబెట్టేశారు. సర్కారు చివరి రోజుల్లో ఆదాని కంపెనీకి వేల కోట్ల విలువైన 200 ఎకరాల భూమిని దోచిపెట్టేశారు. ఇది చాలా అన్యాయం.. ఇంత భూ దోపిడీ భారతదేశంలో ఎక్కడా జరిగి ఉండదు. సీఆర్జెడ్లోకి వచ్చే భూములనూ అడ్డగోలుగా ధారాదత్తం చేశారు. ఇక కేంద్రపాలకులు రైల్వే జోన్ ఇచ్చిన తీరు చూస్తే ఎవరికైనా ఆగ్రహం వస్తుంది? సాక్షి : విచ్చలవిడి మైనింగ్ అనుమతులపై మీరేమంటారు? చలం: మన్యంలోని గనులను పాలకులు ఆదాయమార్గంగా మార్చుకున్నారు. అనధికారికంగా విచ్చలవిడిగా తవ్వేశారు. ఇప్పటికే బ్లూ గ్రానైట్ మన్యంలో దొరకడం లేదు. విశాఖ జిల్లాలో నాకు తెలిసి ఈ మధ్యకాలంలోనే 25 వేల ఎకరాల కొండ భూములు దోచేశారు. ఇక పీపీపీ( పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్) పేరిట విలువైన భూముల్ని కార్పొరేటు కంపెనీలకు కట్టబెట్టారు. రైతుల నుంచి ఏపీఐఐసీ భూములు తీసుకుని కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశాక, ఆ తర్వాత వాటిని అతి తక్కువ ధరకు ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారు. సాక్షి :ప్రభుత్వం చెప్పుకుంటున్న నదుల అనుసంధానం గురించి మీరేమంటారు? చలం: నదుల అనుసంధానమా.. ఎక్కడ జరిగింది? ఉత్తరాంధ్ర నీటినే పట్టిసీమకు తరలిస్తున్నారు. ఉత్తరాంధ్రలో 16 నదులున్నాయి. ప్రధానంగా ఎగువ ప్రాంతంలోని సీలేరు, శబరి నుంచి వచ్చే మిగులు జలాలతోనే గోదావరి నిండుతోంది. ఆ నీటినే పట్టిసీమలోకి ఎత్తిపోస్తున్నారు. సీలేరు, శబరి, ఉపనదుల నీటిని ఈ ప్రాంతంలో వినియోగించిన తర్వాతే మిగిలిన జలాలను తరలించే పరిస్థితి రావాలి. ఉత్తరాంధ్రలో పది లక్షల ఎకరాలకు పూర్తిస్థాయిలో నీటిని అందించలేకపోతున్నారు. సాక్షి : ఈ ఐదేళ్ళలో వలసలు పెరిగాయా.. తగ్గాయా? చలం: నవ్యాంధ్ర వచ్చిన తర్వాతే వలసలు పెరిగాయని సర్వే చెబుతోంది. విచ్చలవిడి కాలుష్య కారక పరిశ్రమల వల్ల తీరంలో మత్స్యసంపద తగ్గిపోవడంతో సుమారు 18 లక్షల మంది ప్రజలు వలస వెళ్తున్నారు. సాక్షి :రాష్ట్ర ఆదాయం పెరిగిందని సర్కారు చెప్పుకుంటోంది... గతంలో ప్లానింగ్ బోర్డు సభ్యుడిగా, ప్రస్తుతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ ఫర్ సోషల్ జస్టిస్ చైర్మన్‌గా ఉన్న మీరు ఎలా విశ్లేషిస్తారు? చలం: రాష్ట్రం ఏ రంగంలోనూ అభివృద్ధి చెందలేదు. రాష్ట్ర ఆదాయాన్ని లెక్కించే విధానం మారడం, అమరావతితో రియల్ ఎస్టేట్ రంగం ముందుకెళ్లడం వల్ల వృద్ధి రేటు పెరిగిందని చూపిస్తున్నారు. ఏ రంగంలో వృద్ధి చెందామో పాలకులు బహిరంగంగా లెక్కలతో చెప్పగలరా? సాక్షి :ఇతర రాష్ట్రాలు అసూయ పడేలా రాష్ట్రం అభివృద్ధి చెందిందని బాబు చెబుతున్నారు? చలం: ఇతర రాష్ట్రాలా... అంతెందుకు... మన పక్క రాష్ట్రం ఒడిశా కంటే మనం వెనుకపడి ఉన్నాం. అక్షరాస్యతలో మన కంటే ఒడిశా ముందుంది.. అదొక్కటే కాదు చాలారంగాల్లో వెనుకబడి ఉన్నాం. సాక్షి :ప్రస్తుత విద్యారంగం పరిస్థితులపై మీ విశ్లేషణ? చలం:రాష్ట్రంలో విద్యారంగమంటే ప్రభుత్వం కేవలం నారాయణ, చైతన్య కాలేజీలనే చూపిస్తోంది. ఓ రకంగా వాళ్ళకు తాకట్టు పెట్టేసింది. ఇంతకంటే దౌర్భాగ్యం లేదు. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా సర్కారు స్కూళ్లు, హాస్టళ్లు మూతపడుతున్నాయి. ప్రాథమిక రంగాలైన విద్య, వైద్య వ్యవస్థలను నాశనం చేశారు. శ్రీకాకుళంలో వైఎస్సార్ ఏర్పాటు చేసిన అంబేడ్కర్ యూనివర్సిటీని పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు యూజీసీ గుర్తింపు లేదు. శ్రీకాకుళంలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అదీ లేదు. ఇక అతిపెద్ద ఆంధ్ర వర్సిటీని కులాల కుంపటిగా మార్చేశారు. సాక్షి : టీడీపీ సర్కారు ప్రచారాలపై? చలం: ఉత్తరాంధ్రకైతే గోరంత కూడా చేయలేదనే నేనంటాను. ఇక ప్రచారమంటారా దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. జన్మభూమిని టీడీపీ ప్రచార కార్యక్రమంలా మార్చేశారు. సాక్షి : సీఎం తనకు నలభై ఏళ్ల సీనియారిటీ ఉందని చెప్పుకుంటారు కదా. ఆ సీనియారిటీ ఏం పనికొచ్చిందని భావిస్తున్నారు.. చలం:దేశంలోనే సీనియర్ నాయకుడు అని చెప్పుకునేందుకు ఆయనకు ఏమాత్రం అర్హత లేదు. హుద్ హుద్ వల్ల నష్టపోయిన విశాఖకే ప్రభుత్వం ఏమీ చేయలేదు. విశాఖలో దాదాపు చెట్లన్నీ కూలిపోయినా... రైల్వేస్టేషన్ ఏరియాలోని ఓ మర్రిచెట్టు ఆకుకూడా రాలకుండా బతికిందని, దాన్ని కాపాడాలని నేను స్వయంగా లేఖ రాశాను. దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. విభజన తర్వాత తీరప్రాంతం ఎక్కువున్న ఏపీ సన్‌రైజ్ స్టేట్ అవుతుందని భావించాం. కానీ ‘సన్’రైజ్ స్టేట్ అయింది. సాక్షి : విజన్ 2020తో రాష్ట్రం ఏమైనా వృద్ధి సాధించిందా? చలం: అస్సలు లేదు. విజన్ 2020ని ఆర్భాటంగా ప్రకటించిన సర్కారు ఏ నాడైనా సమీక్షించిందా.. లేదే.. సాక్షి : వైఎస్ హయాంపై... ఒక్క మాట! చలం:వైఎస్సార్ హఠాన్మరణంతోనే అభివృద్ధి ఆగిపోయిందని నేను భావిస్తాను. ప్రజల ప్ర‘గతి’ తప్పింది. ఇది ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిన మాటే. సాక్షి :యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా చేసిన మీరు ఎంతో మంది ఐఏఎస్‌లకు శిక్షణ ఇచ్చారు కదా... ఇప్పుడు ఐఎఎస్‌లు ఎలా ఉంటున్నారు.. చలం: ఇప్పుడు చాలామంది ఐఎఎస్‌లలో నిబద్ధత, నిజాయితీ ఎక్కడుంది?. అధికార పార్టీ నేతలకు సేవకులుగా చేస్తున్నారు. చాలామంది సివిల్ సర్వెంట్లు ఏళ్ల తరబడి ఒక్క చోటే తిష్ట వేస్తున్నారు. సాక్షి : డేటా చౌర్యంపై... చలం: ఐటీకి ఆద్యులం మేమే అని చెప్పుకుంటున్న వాళ్ళే డేటా చౌర్యానికి కూడా ఆద్యులని చెప్పుకోవాలి. ఎంత దౌర్భాగ్యమంటే చివరికి నా ఓటు కూడా తొలగించేశారు. ఆంధ్రవిశ్వవిద్యాలయానికి చెందిన చాలా మంది మాజీ ప్రొఫెసర్లు మా ఓట్లు కూడా గల్లంతయ్యాయని నాతో చెబుతున్నారు. విద్యావంతుల ఓట్లే ఇలా గల్లంతయ్యే పరిస్థితి బహుశా దేశంలో ఎక్కడా ఉండి ఉండదు. సాక్షి : అమరావతి రాజధానిపై... చలం: ఇక మార్చడానికి వీల్లేదు కాబట్టి రాజధాని గురించి కొత్తగా చెప్పుకునేదేమీ లేదు. కొన్ని సామాజికవర్గాల ప్రాబల్యం కోసం అమరావతిని ఎంచుకున్నారు. కనీసం ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసినా బాగుండేది. కనీసం విశాఖను రెండో రాజధానిగా ప్రకటించి హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేస్తే బాగుండేది. సాక్షి : రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పాలనపై మీ విశ్లేషణ ఏంటి? చలం: ఈ పాలన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పసుపు కుంకుమ పేరిట సరిగ్గా ఎన్నికలకు ముందు బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ చేయడం ఏంటి...? ఇది ఎన్నికల తాయిలం. ఒకవేళ మహిళలకు సాయం చేయాలనుకుంటే ఐదేళ్ల నుంచి ఎందుకు చేయలేదు.. చివరిలో ఇలా చేయడమేంటో నాకు అర్థం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా అంతే... -
కోరేది ఏమీ లేదు ప్రేమ తప్ప
1972లో వచ్చిన చలం ఆత్మకథలో ‘ఇది చలం సొంత అభిరుచుల విషయం. ఇది అతని జీవిత కథకి అనవసరం. యిష్టమున్నవాళ్ళు చదవండి’ పేరుతో రాసినదాన్లోంచి కొంత భాగం ఇక్కడ. నాకు ఈ లోకానికి సంబంధించిన ఆశలు, అభిరుచులు చాలా తక్కువ. అందుకనే నాకు డబ్బు అవసరం వుండేది కాదు. ఏ కొంచెం వున్నప్పటికినీ దాంతోనే గడుపుకునేవాణ్ని. వాంఛలు నాకు చాలా స్వల్పం. మా తిండి, మా బట్ట తప్ప అంతకంటే పెద్ద పెద్ద ఇబ్బందులు జన్మలో ఎప్పుడూ వుండేవి కావు. రంగనాయకమ్మ గారు, మా పిల్లలు అందరూ అట్లాంటి వాళ్ళే. ఎంతసేపటికి మేము వాస్తవంలో కన్న కలలలోనే బతికేవాళ్లం. కలలు అంటే అవి ఏవో పెద్ద పెద్దవి కావు. మా అవసరాలు అని చెప్పుకోవాలి. మేము చాలా హాయిగా తిరగాలి. మేము ఒకళ్ళ నొకళ్ళం ప్రేమించుకోవాలి. మమ్మల్ని ప్రేమించేవాళ్ళు మా దగ్గరికి రావాలి. ఇట్టానే వుండేవి మా కోర్కెలు. జీవితమంతా అంతే. నా ఆశయం– నాకే ఆరోగ్యం వుంటే కట్టుకున్న బట్ట తప్ప ఇంకేమి లేకండా వూరినించి వూరికి తిరగాలని. నా ప్రియురాళ్ళు, నాకొచ్చిన స్త్రీలు, అట్లాంటివాళ్లే తటస్తించారు. వాళ్ళు ఎట్లాంటివాళ్ళయినా, నా దగ్గరికి రాగానే అట్లానే అయిపోయేవాళ్ళు. మొదట్లో కంప్లయింట్ చేసేవారు. ఎప్పుడు ఇంట్లో నిలవనియ్యవేం? రోడ్లంబడి, కాలవలంబడి, లాక్కుపోతుంటావేం? అని. నేను అనుకుంటాను. ఈ జీవితంలో అనారోగ్యం వల్ల నాకా భాగ్యం లభించకపోయినా, పరలోకంలోనన్నా ఈ శరీరం లేనప్పుడైనా (లేని) చెయ్యి చెయ్యి పట్టుకుని ఏ చీకూ చింతా లేకండా నవ్వుతో, ఏదీ అక్కర లేకండా, ఏ విధమైనది బైటనించి అవసరం లేకుండా (లేని) నడుములు పట్టుకుని అట్లా తేలిపోతే మేం వుండాలి. నిశ్చయంగా నాకు తెలుసు, ఈ లోకమే కాకండా అనేక లోకాలు ఉన్నాయని, ఎవరు వాంఛించే లోకం వాళ్ళకి కటాక్షింపబడుతుందని. ఇక్కడ ఈ ప్రపంచాన్ని చూస్తే దైవం ఎంతో క్రూరుడులాగా కనపడుతాడు గాని, తక్కిన లోకాలు అనంతమైన, దయామయమైన లోకాలలో మనం ప్రేమించే దైవం మన కోర్కెల్ని, సంతోషాల్ని, మన అందాల్ని, ఆశయాన్ని తప్పకండా తీరుస్తుందని నా నమ్మకం. అక్కడైనా నేను కోరేది ఏమీలేదు. వుత్త ప్రేమ. నాతో పక్కన ఒకర్ని వొకరు ప్రేమిస్తో నాతో తిరిగే మిత్రులుంటే చాలు. ఆ విధంగా నా జీవితం వుండాలని నా ఆశ. నా దృష్టి అట్లాంటి ఆశయం మీద వుండబట్టి నాకేదీ ఇది కావాలి, అది కావాలని వుండేది కాదు. ఈ నాటికీ ఏదీలేదు. అదేమి నాకు తృప్తినివ్వదని నాకు తెలుసు. అందుకనే నా కథల్లోను, నాటకాల్లోను, సంపాయించుకోవాలని కోర్కె పడేవాళ్ళు, గొప్పవాళ్ళు కనపడరు. ఎంతసేపటికి వున్నవేవో వొదిలించుకుందామనే తప్ప, కావాలని, ఇది తెచ్చుకుందామనే మనుషులే కనపడరు నా రచనల్లో. ఎంతసేపటికి ప్రేమ కోసం బంధువుల్ని, బంధాల్ని వొదిలించుకోవడం కోసం, ఈ బంధాల్నించి ఇంకో విశాలమైన ప్రేమలోకి పోవడం కోసం, అంతే తప్ప అంతకంటే వాళ్ళకి వేరే ఏమీ అక్కర లేదు. -
పురుగుతో కైలాసం
మా పెద్ద తగాదా ఐన తరవాత మూడువారాలకి జయలక్ష్మి ఓనాటి ఉదయం చీటీ పంపింది. కాని నాకు తెలుసు. కలుసుకున్నా లాభం లేదు. సాయంత్రం లోపలే మళ్లీ పోట్లాడుకుంటాము. కాని పోట్లాడి విడిపడ్డ తరవాత, జీవితంలో యీ కాసిని గంటలూ ఎందుకు వృథా చేసుకుంటున్నామా అని నిశ్చయంగా పరితాపపడి నిలవలేక నిమిషాలమీద కలుసుకుంటాము. కాదు. ఈవేళ స్పష్టంగా మాట్లాడి వొస్తాను. ఇక లాభం లేదని, నా కోసం చీటీ రాయవద్దని, నిశ్చయంగా చెప్పేసి వెళ్లిపోతాను. ఈ మాత్రం అందం దొరకదా ఏమిటి నాకు? సామాను సద్దమన్నాను నౌకర్ని. బొంబాయికి బెర్తు రిజర్వు చేయించాను. తాత్సారం చేసి చేసి నాలుగింటికి బైలుదేరాను జయలక్ష్మి ఇంటికి. తలుపు లోపల గడియవేసి వుంది. గట్టిగా తలుపు కొట్టాను. దూరంనించి దాసీది కనకం వొస్తున్నానని కేకవేసింది. అమ్మగారు తలంటి పోసుకుంటున్నారుట. గదిలో కూచున్నాను. అరగంటయింది. దూరంగా నీళ్లు పోసుకుంటున్న చప్పుడు తప్ప ఇంకేం వినపట్టంలేదు. రాదేం ఇంకా? కావలిసే ఈ ఆలస్యం? సరాసరి నీళ్ల గదిలోనికి వెడితే? ‘‘జయా!’’ నమ్రతగా పిలిచాను. ‘‘ఏం సంగతి!’’ వెక్కిరింపు. ‘‘ఎంతసేపు’’ ‘‘నాలుగు గంటలు కాలయాపన చెయ్యగలిగిన అయ్యగారికి యీ పది నిమిషాలు భారమైనాయి గావును’’ అని చీదరించుకుంది. నా కోపాన్ని మింగుకుని– ‘‘ఒక్కసారి నిన్ను చూడనీ.’’ ‘‘వీల్లేదు. నేను వొచ్చేలోపల దొడ్లోకి వెళ్లి స్తానం చేస్తున్న నీటి కాలవని ఆరాధించండి.’’ విసుక్కుని దొడ్లోకి పోయినాను. తూములోనుంచి నవ్వుతో దూకుతున్నాయి తెల్లటి నీళ్లు– వట్టివేళ్ల సున్నిపిండితో పరిమళమైన నీళ్లు. ఇంతేనా? ఈమెని విడవలేనా? మళ్లీ ఆ మాయలో పడుతున్నానా? స్త్రీలేంది బతకలేను. స్త్రీతో వేగలేను. ఈ చక్రంలోంచి విముక్తి లేదా? మోహప్రవాహంలో ఇట్లా కొట్టుకుపోవడానికి వొప్పుకోను. ఆ నీళ్ల కాలవ వెంట పదడుగులు నడిచాను. ఆ నీళ్లు ఓ మురిగిన పేడకుప్పని పాయలై చుట్టుకుంటున్నాయి, స్త్రీ హస్తాల వలె. చప్పున పెద్ద విరక్తి తోచింది. ఇంతే స్త్రీ మోహం. ఇంతకన్న నీచం ఇంకేంలేదు. నా కళ్లముందు ప్రపంచం తళతళమంది. దివ్యచక్షువు తెరుచుకున్నట్టయింది. ఇల్లు దొడ్డి అన్నీ మాయమైనాయి. నా ముందు ఆ మురిగిన పేడకుప్ప తప్ప యింకేం కనిపించలేదు. ఆ పేడకుప్ప పెరిగి నా లోకమైపోయింది. నా దృష్టి ఆ పేడని చీల్చుకుని చూస్తోంది. కుప్పనిండా పురుగులు– పెద్దవీ, చిన్నవీ. వాటి సంభాషణ కూడా అర్థమౌతోంది. టీచరు: ‘‘భూమి గుండ్రముగా వుందనడానికి నిదర్శనం ఏమిటి?’’ విద్యార్థి: ‘‘ఎంత తిరిగినా పేడ తప్ప ఏం కనిపించదండీ.’’ టీచరు: ‘‘రైట్, పది మార్కులు. కొన్ని యుగాల కిందట, ఈ భూమి పొగలు కక్కుతూ ఉండేదిట. ఇప్పుడు చల్లారింది. అటు తరవాతే యీ జీవసృష్టి ప్రారంభమైంది.’’ (ఇందాకనేకదా ఆవు పేడ వేసింది. ఆ వేడి సంగతి గావును!) పక్కనే ఇంకోచోట ఒక సభ జరుగుతోంది. అక్కడ కాషాయ వస్త్రాలు వేసుకున్న పురుగూ, నల్లటి సూటు వేసుకున్న తెల్లటి పురుగూ సభలో ఎత్తు స్తలం మీద కూచున్నారు. సూటు పురుగు ఉపన్యాసం ఇస్తోంది. ‘‘నిన్న రాత్రి నాకు కలలో ఈశ్వరుడు కనబడ్డాడు. ఈ కొత్త మతవిధానాన్ని ప్రసాదించాడు. ఇంక కొత్తయుగం ప్రారంభం కాబోతోంది. ఇంక మరణభయం లేదు’’ ఇంతలో పొరుగమ్మ వొచ్చి పేడ ఓ ముద్ద చేతిలోకి తీసుకుంది. ఆ ముద్దలో యీ ఉపన్యాసకుడు కూడా లేచి వెళ్లిపోయినాడు. సభాసదులంతా ‘బొందితోనే కైలాసానికి వెళ్లాడని’ అతనికి గొప్ప సమాధి కట్టించడానికి తీర్మానాలు చేసుకుంటున్నారు. ఆ పక్కనే ఓ ఆడపురుగు తన పిల్లతో అంటోంది– ‘‘ఒసే ఎన్నడన్నా మన వంశంలో వుందే ఇట్లాంటి నీచపు గుణం? ఆ పాడు మురికి నల్లపురుగుని నీ తోకతో దాని ముదనష్టపు తోకని కలవనిచ్చావే!’’ ఇంకోవేపు చూశాను. రెండు పురుగులు పోట్లాడుకుంటున్నాయి. ‘‘నా గీతాలు ఆచంద్రార్కంగా నిలుస్తాయి. ఈ పేడకుప్పలో నా అంత అందంగా రాసేవాణ్ణి చూపగలవా? నీ మొహం నువ్వూ ఓ కవివే!’’ రెండో పురుగు: ‘‘నా కవిత్వం ఈనాటి ప్రజలకు కాదు. నాలుగు యుగాలు పోయాక పుట్టబోయే పురుగులకి. అవి నీకన్న తెలివైన మెదడుతో పుడతాయి.’’ ఇంతలో ఓ బొండుపురుగు సమీపించి ‘‘నాకో పుస్తకం అంకితం ఇవ్వరా మీలో వొకరు? నా పేరు ఆకల్పాంతం నిలుస్తుంది. నేను పుస్తకాన్ని అందంగా పేజీకి ఒక్క పంక్తి చొప్పున అచ్చు వేయిస్తాను’’ అంటోంది. ఇంక కొంతదూరంలో ఒక మొండిగోడల ఇల్లు కనపడ్డది. దాంటో కొన్ని పురుగులు తలకిందుగా వేళ్లాడుతున్నాయి. కొన్ని మేకుల మీద పడుకునివున్నాయి. చెక్క మీద ‘‘యోగాశ్రమం. దీంటోకి స్త్రీలు ప్రవేశించకూడదు’’ అని వుంది. వాకిలిముందు ఒక పెద్ద సభ. ఆశ్రమపు అధ్యక్ష పురుగు ఉపన్యాసం ఇస్తోంది. ‘‘ఈలోకం అసత్యం. ఆత్మ శాశ్వతం. ఇంద్రియాల్ని అరికట్టితేనేగానీ ఆత్మజ్యోతి దర్శనం కాదు. యోగప్రభావం వల్ల గాలిలో పైకిలేచే శక్తి వొస్తుంది.’’ అంటోవుండగా ఆ వేపుకు వొచ్చిన ఓ కోడి ఆ యోగిపురుగుని ముక్కుతో పైకెత్తింది. పురుగుల కళ్లదృష్టి అంతయెత్తుకి చూడలేదు గనక ఆ యోగి అట్లా పైకి లేచి వెళ్లిపోయినాడనుకొని భక్తితో అన్ని పురుగులు సాష్టాంగపడ్డాయి. కొన్ని పురుగులు ఒకచోట చేరి, సభ చేస్తున్నాయి. ‘‘మన పేడ వేరు, మన జాతి వేరు. పక్కనున్న నల్ల పురుగులు, అవి పేడని వుండలుగా చేసుకునిగాని తినవు. మనం ఎట్లానన్నా సత్యాగ్రహం చేసి ఐనా సరే విడిపోవాలి’’ అంటూ వుండగా పైనించి ఆవు వుచ్చపోసింది. ఆ ధారతో ఆ దేశమంతా జలమయమయింది. బతికిన ఒక జడలపురుగు ‘‘ఈ వరదలు మన తాతలు చేసిన పాపాలకి ఈశ్వరుడు కోపించి చేసిన ప్రతీకారం’’ అంటున్నాడు. ఒక తెల్లని గడ్డంపురుగు, ‘‘ఇదేమి మూర్ఖం, మన తాతలు చేసినదానికి మన మీద కోపం కలుగుతుందా ఈశ్వరుడికి? అదేదో నీటిధార పడ్డది. శాస్త్రజ్ఞులు దానికి కారణం కనుక్కోగలరు!’’ అన్నాడు. ఆ మాటలకి పురుగుజాతికి కోపమొచ్చి, ఆ గడ్డంపురుగుని మోసుకుపోయి గట్టిపేడలో వూపిరాడకుండా పాతి చంపేశాయి. ఇంకొకచోట అఖిల సారస్వత సమ్మేళనం. ఒక సంపాదకీయ పురుగు చచ్చిన చిన్న పురుగుమీద నుంచుని ఉపన్యాసమిస్తోంది. ‘‘ఈ పురుగు పేడ వాంగ్మయానికి చాలా సేవచేసింది. మనం ఒక్క సన్మానమూ చెయ్యలేదు. మనం చందాలిచ్చి గొప్ప స్మారకచిహ్నం కట్టాలి.’’ గుసగుసలాడుతున్నారు సభాసదులు. ‘‘చందాలన్నీ వీడే కొట్టెయ్యడానికి.’’ అక్కడే ఓ ముసలిపురుగు కొంత పేడని పోగుచేసుకుని దానిమీద కూచుంది. పిల్ల కవి పురుగులు తమ రచనల్ని అర్పించి, వరుసగా చదువుతున్నాయి. ఆ పురుగు తన యిష్టప్రకారం ‘‘ఈ కావ్యం తుక్కు. ఈ కావ్యం పదేళ్లు నిలుస్తుంది’’ అంటోంది. అందమైన ఆడపురుగుల కావ్యాలు మాత్రం ఆచంద్రార్కంగా నిలుస్తాయని దీవించి, తన పీఠం మీద కూచోపెట్టుకుంటోంది. ఇంతలో పెద్దపెద్ద జండాలతో అరుపులతో ఓ పురుగు గుంపు ప్రవేశించింది. ‘‘లాగెయ్యండి వాణ్ణి. కిందికి లాగెయ్యండి. ఇదంతా పేడ గలవారి సారస్వతం. వీళ్లు రాసే గ్రంథాలూ, కవిత్వాలూ, ఎవరికీ అర్థం కావు. దేవుడూ భక్తీ శృంగారం ఇట్లాటివే రాస్తారు వీళ్లు. వీళ్లనీ వీళ్ల కవిత్వాన్ని ధ్వంసం చేస్తేనేగానీ శాంతి లేదు లోకానికి’’ అని చిందరవందరచేసి పోయినారు వాళ్లు. ఇంతలో పెద్ద పెద్ద జండాలు పట్టుకుని ఓ గుంపు ప్రవేశించింది. దాంటో బక్కపురుగు, గంభీరోపన్యాసం ప్రారంభించింది. ‘‘యీ పురుగు దేశముందే యిది దేవతలు స్వయంగా నిర్మించుకున్న భూమి. దీనికి పతనం లేదు. ఇది అనంతకోటి యుగాల వరకు ప్రపంచానికి జ్యోతిౖయె వెలగాలంటే, నాకు మీ ఓట్లు యివ్వండి...’’ ఇంతలో జయలక్ష్మి స్నానం నీళ్లు పేడకుప్ప చుట్టూ పెద్దమడుగు కడుతున్నాయి. పేడ నాని పెళ్లలు పెళ్లలుగా కూలిపోతోంది. ‘‘అసలు పచ్చి పేడనేగానీ మగ్గిన పేడని తినకూడ’’దని కొన్ని పురుగులు బోధిస్తున్నాయి. పేడరసాన్ని పులిపించి తాగడంవల్ల ఘోరాలు తటస్తిస్తున్నాయననీ, పేడ మద్యాన్ని నిషేధించమనీ ప్రభుత్వానికి అర్జీలు పెడుతున్నాయి కొన్ని పురుగులు. ఇంతలో జయలక్ష్మి దాసీది వొచ్చి పొయ్యి అలకడానికి ఆ పురుగులున్న పేడనంతా ముద్దచేసి తీసుకుపోయింది. ఆ ముద్దకింద నించి రెండు తెల్లటి పురుగులు బైటపడ్డాయి. ఒకదానికి జయలక్ష్మి మొహం, ఇంకాదానికి నా మొహం. వెంటనే పేడకుప్ప నా కళ్లముందు మాయమై ప్రపంచం మామూలుగా ప్రత్యక్షమయింది. జయలక్ష్మి తలలో కదంబం, గులాబి పువ్వులు పెట్టుకుని, ఆకుపచ్చ వెంకటగిరి చీర కట్టుకుని, నవ్వుతోంది నన్ను చూసి. ‘‘ఆరాధన అయిపోయిందా?’’ ‘‘ఏం బతుకు మనది?’’ ‘‘ఈ తగాదాలేనా?’’ ‘‘అసలు ఈ ప్రేమ’’ ‘‘బతుక్కీ ప్రేమకీ కూడా అర్థం కనపట్టం లేదా మీకు?’’ ‘‘ఏమిటో యిప్పుడు పుట్టి రేపు నశించే పురుగులం’’ ‘‘కాని ఈ రాత్రికి దేవతలం’’ ‘‘పోట్లాడతావు నాతో’’ ‘‘నా పోట్లాట మాత్రం ఏం శాశ్వతం? ఎందుకంత బాధగా తీసుకోవాలి నువ్వు? ఏదో రేపు పొద్దున్నకి నశించేవాడివి? పద.’’ రెండు పురుగులు గూట్లోకి వెళ్లాయి. -మహారచయిత చలం(1929–89) కథ ‘ఈలోకం’ సంక్షిప్త రూపం ఇది. కానీ దీని పూర్తి పాఠం చదివితేనే అసలైన మజా! చలం -
నలుగురి కథ
‘‘4 ఇడియట్స్’ సినిమాలో అందరూ కొత్తవాళ్లు నటించారు. ఇప్పటి పరిస్థితుల్లో చిన్న సినిమాల విడుదల చాలా కష్టం. వారానికి 6 సినిమాలు విడుదలవుతున్నా ప్రేక్షకులు థియేటర్‌కి రావటం లేదు. అది చాలా బాధగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. కార్తీ, సందీప్, చలం, సన్నీ, చైత్ర, ప్రియా, శశి, రుచి ప్రధాన పాత్రల్లో నాగార్జున సినీ క్రియేషన్స్ పతాకంపై సతీష్ కుమార్ శ్రీరంగం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘4 ఇడియట్స్’. జయసూర్య స్వరపరచిన ఈ చిత్రం పాటలను సి. కల్యాణ్ విడుదల చేశారు. సతీష్ కుమార్ శ్రీరంగం మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నేను ఇప్పటివరకు చేసిన 14 చిన్న సినిమాలు మంచి విజయం సాధించాయి. ‘4 ఇడియట్స్’ కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. గతంలో ఇండస్ట్రీలో ఎవరికైనా సమస్య ఉంటే దాసరి నారాయణరావుగారు ఉండేవారు. ఇప్పుడు సి.కల్యాణ్‌గారు ఉన్నారు. సెప్టెంబర్‌లో మా సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నిర్మాతలు తుమ్ములపల్లి రామ సత్యనారాయణ, సాయి వెంకట్, మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య, కార్పొరేటర్ సంజయ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నగేష్. -
ప్రతిధ్వనించే పుస్తకం
ఊర్వశి: ఏం చేశావు ఇన్నేళ్లు? పురూరవుడు: యుద్ధాలు చేశాను. రాజ్యపరిపాలన చేశాను. ఊర్వశి: ప్రేమించావా? చలం రాసిన పురూరవ నాటకాన్ని మూడు ముక్కల్లో పరిచయం చేయాల్సివస్తే... ఇంతే. మనుషులు అధికారం కోసం ఏదేదో చేస్తారు. ‘ఏదీ చేసీ ఏది చెయ్యకా పోయిందేమీ లేదని గ్రహించరు’. అనవసరమైన దానికోసం బాధపడుతారు. ‘అసలు బాధలో అంత బాధ లే’దని తెలుసుకోరు. అసలైనది అందివచ్చినప్పుడు పోల్చుకోరు. ‘ఎన్నాళ్ళు? ఎప్పుడు? ఏం జరుగుతుంది? ఇట్లా ఆలోచిం’చి, ప్రశ్నలతో బుర్ర పాడుచేసుకుంటారు. ‘యోచనంత నిష్ఫలం ఏదీ లేదు’. లౌకిక ఆడంబరాలను వస్త్రాలుగా ధరిస్తారు. జ్ఞానం, పాండిత్యం అనుకునేవి ‘బుద్ధిహీనత’గా గ్రహించరు. భయం, రోగం, మృత్యువు, ఆకలి... వీటన్నింటినీ జయించగలిగే మార్గం ప్రేమ మాత్రమే. ప్రేమకు మించిన ఐశ్వర్యం లేదు. ప్రేమకు మించిన సత్యం లేదు. ప్రేమకు మించిన సౌందర్యం లేదు. ‘నేనే నీ లోకం. నేనే నీ అన్వేషణ. నేనే నీ అనుభవం. నానుంచే నీకు సమస్త సృష్టి రహస్యాలూ బోధపడుతాయి’ అంటుంది శాపవశాన భూమ్మీదకు వచ్చిన ఊర్వశి. ఇంకొకరు చెప్పడం వల్ల ఇది అర్థమయ్యేది కాదు. ‘మాటలతో నేర్చుకునేవి చాలా అల్పమైన విషయాలు’. కానీ ప్రేమ వూరికే వాంఛిస్తే వస్తుందా? ప్రేమ ముందు మోకరిల్లడం తెలియాలి. ప్రేమించడం ఒకరికి చేసే ఉపకారం కాదని తెలియాలి. ఆ యోగ్యత సంపాదించలేక, తన అహంకారపు చక్రవర్తితనాన్ని వదులుకోలేక, జీవితాన్ని ముక్కలుగా కాక మొత్తంగా చూడలేక, రంగులూ కాంతులూ లోకాలూ శ్రావ్యగాన మాధుర్యాలూ పరిమళాలూ అన్నీ తానైవున్న ఊర్వశిని అర్థం చేసుకోలేక, తనలో ఉన్న తననే తెలుసుకోలేక, ఊర్వశిని దూరం చేసుకుని విరహంతో కుమిలిపోయే పురూరవుడి వ్యథ ఇది. ‘వెళితే వెతుకుతావ్ వెయ్యేళ్లు’ అని ముందే హెచ్చరిస్తుంది ఊర్వశి. అసలైన శాంతికీ స్వేచ్ఛకూ ప్రతీక ఊర్వశి. దాన్ని అందుకోలేని క్షుద్రత్వానికీ అల్పత్వానికీ సూచిక పురూరవుడు. నాటకమంతా రెండు పాత్రల సంభాషణగానే సాగుతుంది. వాక్యాలన్నింటా కొత్త వెలుగూ గొప్ప చింతనా కనబడుతుంది. ప్రకృతి వర్ణన సున్నితంగా మనసును తాకుతుంది. చివర్లో శాపవిముక్తి అయిన ఊర్వశి దేవలోకానికి వెళ్లిపోతుంది. అసలైన శాపగ్రస్థుడిలాగా పురూరవుడు భూమ్మీద మిగిలిపోతాడు. చలం సృజించిన మొత్తం సాహిత్యానికి ఒక ముందుమాటగా ఉంటుంది ‘పురూరవ’. చలం సాహిత్యంతో పరిచయం లేనివారు దీనితో మొదలుపెట్టొచ్చు. -
చలం నాన్న లేఖలు
అంతరంగం చలంగారి ఉత్తరాలను ఎందరో ప్రచురించారు. దాదాపు 60 సంవత్సరాల తర్వాత నా ఉత్తరాలు ఇప్పుడు ప్రచురిద్దా మనుకుంటున్నాను. చలంగారు ఉన్న రోజుల్లోనే - 1960 ప్రాంతంలో, ఎవరో చలంగారి ఉత్తరాలు ప్రచురించాలనే కోరికతో, వారిని అడిగారట. ‘‘ఈమధ్య రాసిన ఉత్తరాల్లో కామేశ్వరికి మంచి ఉత్తరాలు రాశాను. అడగండి. ఆమె ఒప్పుకుంటే ప్రచురణకు వెళ్లండ’’న్నారట. ‘‘నాన్నా ఈ ఉత్తరాలు మీరు ప్రేమతో నాకు రాసినవి, దీనివల్ల ప్రపంచానికి ఏమి ఉపయోగం. వద్దులెండి. ఇవి నా కోసమే ఉంచుకుంటాను’’ అని అన్నాను. అది తప్పేమోనని నాకు ఈ మధ్యవరకు అనిపించనేలేదు. నేను 13-14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే చలంగారి పుస్తకాలు నాకు దొరికినవి చదివాను. పురూరవలోని ఊర్వశి, శశాంకలోని తార, జీవితాదర్శంలోని లాలస, అరుణలోని అరుణ, చలంగారి ఇతర స్త్రీ పాత్రలన్నీ నన్నాశ్చర్యపరిచేవి. తర్వాత కాలంలో అడిగాను గూడా చలంగారిని. ‘‘నాన్నా నిజంగా మీరు ఇలాంటి స్త్రీలని చూశారా? అంతటి సౌందర్యవంతులు, అటువంటి స్థైర్యం ఉన్నవారు, అంతటి శృంగారమూర్తులు, జీవితం యెడల అంత చక్కటి అవగాహన ఉన్నవారు ఉన్నారంటారా? అసలు కాస్తై అటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్లని చూడకపోతే, ఎలా సృష్టించారు అలాంటి పాత్రలని’’ అని. నాన్న అనేవారు ఎంతో ఆలోచించి, ‘‘దాదాపు లేరు. కాస్త లీలగారు, కాస్త పద్మావతి పిన్ని’’ అని. నేను పెద్దయ్యాక తప్పక చూడాలనుకున్న వ్యక్తులలో చలం గారు ఒకరు. నేను 3, 4వ సంవత్సరం ఎంబీబీఎస్‌లో ఉండగా ‘‘కవిగా చలం’’ వజీర్ రెహమాన్ రాసిన పుస్తకం చదివాను. మళ్లీ చలంగారిని చూడాలనే వెర్రి కోరిక వచ్చింది. కనీసం వారంటే, వారి రచనలంటే నాకెంత అభిమానమో తెలియజేస్తూ ఒక ఉత్తరమైనా రాయాలనిపించింది. కాని వారెంతో గొప్ప కవి. వారికెంతమంది ఫ్యాన్స్ ఉంటారో! ఆఫ్ట్రాల్ ఒక చిన్న కాలేజీ స్టూడెంట్‌ని, వారికేం గొప్ప? జవాబయినా ఇస్తారో, ఇవ్వరో? ఆయన జవాబయినా ఇవ్వకపోతే నా అహం దెబ్బతింటుంది. ఇప్పటివరకూ వున్న గౌరవాభిమానాలు కూడా తగ్గిపోతాయేమో అని భయం. అందుకే ఉత్తరం రాయలేదు. నేను సెలవుల్లో మద్రాసులో ఉన్నాను. ఆ రోజుల్లోనే నండూరి సుబ్బారావుగారు పోయారు. ఒంటరిగా ఉన్న జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి గారు మా ఇంటికి వచ్చి నండూరి వారినీ, వారి స్మృతులనూ తలచుకుంటూ కంటతడి పెట్టుకుని మా ఇంట్లోనే ఉండిపోయారు. ఆ మర్నాడు చెప్పాను. కవిగా చలం చదివాక నా భావాలు, చిన్నప్పటి నుండి చలం గారిని చూడాలనే వెర్రి కోరికను. ఆయనకు కనీసం ఉత్తరం రాయాలన్న ఆకాంక్షను, రాయలేకపోవడానికి కారణాలను అన్నీ చెప్పాను. ఆ తరువాత ఆ సంగతి కూడా మర్చేపోయాను. కొన్నాళ్లకి ఒక మంచి ఉత్తరం వచ్చింది చలంగారి నుండి! నమ్మలేకపోయాను. ఆశ్చర్యంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఉత్తరంలో- 3/6/57 Dear unknown friend, మీరు నన్ను చూడాలనుకోవడం, నాకు సన్మానం. అలాంటి వాంఛ మన మనసుని మించి నరాల్లోకి ఇంకి హృదయాన్ని చేరుకుంటే, ఇక దేహాలు చూసుకోవడమనేది స్వల్ప విషయమౌతుంది. జీవితం- తప్పవు ఆశలు, నిరాశలు, ambitions. కాని ఏ స్థితిలోనూ హృదయంలోని అందమైన విలువల్ని అడుగున పడనీకండి- ఎన్ని కష్టాలు అడ్డం వచ్చినా సరే. ఈశ్వరాశీర్వాదాలతో, చలం. ఎంతో మంచి ఉత్తరం. అదీ వారంతట వారే రాయడం. వారే మొదటిసారిగా ఉత్తరం రాసింది నాకేనట! ఎంత అదృష్టవంతురాలిని! ఆ తరువాత ఎన్నో ఉత్తర ప్రత్యుత్తరాలు మా మధ్య. ఎన్నెన్ని పేజీలు నింపి రాసేవారో! డాక్టర్ కామేశ్వరి -
ఏ జ్ఞానమైనా సరే....
గ్రంథపు చెక్క జ్ఞానం సంపాదించడం వల్ల శాంతి చెడదు. సంపాయించిన జ్ఞానాన్ని విశ్వసించి దాన్ని జీవితం మీదికి తెచ్చుకొని ఆ జ్ఞానం ప్రకారం జీవితాన్ని వంకర తిప్పడం వల్ల కలుగుతాయి అనర్థాలు ఏ జ్ఞానమైనా సరే అది రిలెటివ్. ఓ మూల నుంచి ఓ కోణం నించే అది సత్యం. సంపూర్ణమైన జ్ఞానం ఏదీ కాదు. నీకు సత్యం కనుక అది నాకు సత్యం కానక్కర్లేదు అనే స్తిమితం, విశాలత్వం ఉంది ఈ దేశంలో త్యాగమనేది త్యాగమని తెలియకుండానే జరగాలి. తెలిసి జరిగినప్పుడు తనకీ, ఇతరులకీ విషతుల్యం బోధనలు రెండు విధాలు...తాను నమ్మినది బోధించడం, తాను నమ్మనిది బోధించడం! ద్వేషం ప్రేమకు చాలా సన్నిహితం. అందుకనే మనం ప్రేమిస్తున్నవాళ్ళు అపరాధం చేసినప్పుడు మనకి ఎక్కువ ద్వేషం కలుగుతుంది మనుష్యుడు మృగాల కన్న వివేకవంతుడైనందుకు, మృగాల ఆనందాన్ని త్యజించడానికి కాదు ఆ వివేకాన్ని ఉపయోగించాల్సింది. - చలం ‘విషాదం’ (ఇతర వ్యాసాలు) పుస్తకం నుంచి. -
ఎవరూ మాట్లాడని చలం నవల- మార్తా
ప్రేమంటే ఏమిటి? చలంగారు బహుశా తన జీవితమంతా ఈ ప్రశ్న మీదనే ఆలోచిస్తూ వచ్చారు. ‘శశిరేఖ’ నుంచి ‘జీవితాదర్శం’ వరకు దాదాపు ముప్పై యేళ్ల పాటు ఆయన దానికి సంబంధించిన తన అంతర్మథనమంతా 8 నవలల్లో ఇమిడ్చి పెట్టారు. వాటిల్లో ‘అమీనా’ కావడానికి చిన్న నవలే అయినా రాయడానికి చాలా కాలం పట్టిన నవల. మొదటి రెండు భాగాలూ 1926లో రాస్తే తర్వాత రెండు భాగాలూ 1942లో రాశారు. అంతకాలం పాటు ఆయన దృష్టి పెట్టిన నవల కాబట్టి ‘అమీనా’ చలం అంతఃకరణ చిత్రణ అని ఆర్.ఎస్.సుదర్శనం అంటారు. ప్రేమ గురించి, జీవితం గురించి, స్త్రీపురుష సంబంధాల గురించి చలం అన్వేషణ ‘పురూరవ’ నాటకంతోనూ, ‘జీవితాదర్శం’ నవలతోనూ పరిపూర్ణతకి చేరుకున్నట్టు చాలామంది భావిస్తారు. అయితే చలం జీవితకాల అన్వేషణ పరిపూర్ణతకి చేరుకున్న రచన ఇదేదీ కాదు. ఆయన అరుణాచలానికి వెళ్లి పదేళ్లు గడిచిన తర్వాత రాసిన నవల ‘మార్తా’. అందులో ఆయన తనను వేధిస్తున్న సామాజిక, మానసిక, కళాత్మక, ఆధ్యాత్మిక సమస్యలన్నిటికీ ఒక సమాధానం కోసం వెతికారు. కానీ ఆ నవల గురించి ఎవరూ ఎక్కడా ఏమంత మాట్లాడినట్టు కనిపించదు. 1961లో రాసిన ఆ పుస్తకాన్ని ఆళ్ల గురుప్రసాదరావు 2000లో తిరిగి ముద్రించే దాకా అటువంటి రచన ఒకటుందని కూడా ఎవరికీ పెద్దగా తెలిసినట్టు లేదు. ‘మార్తా’ బైబిల్లో సువార్తల్లో కనవచ్చే ఒక పాత్ర. ముఖ్యంగా లూకా సువార్తలో (10:38-40) నాలుగు వాక్యాల్లో పేర్కొన్న ఒక సంఘటన మీద చలం ఆ నవల రాశారు. సువార్తలో ఆ సన్నివేశం ఇట్లా ఉంది: ‘యేసు, ఆయన శిష్యులు తమ దారిలో ఒక గ్రామాన్ని చేరుకున్నప్పుడు మార్తా అనే ఒక స్త్రీ ఆయన్ను తన ఇంటికి ఆహ్వానించింది. ఆమెకి మరియ అనే సోదరి కూడా ఉంది. యేసు రావడంతోనే మరియ ఆయన పాదాల దగ్గరే కూర్చుండి ఆయనేది చెప్తే అది వింటూ ఉండిపోయింది. ఇంటికొచ్చిన అతిథికి చెయ్యవలసిన ఏర్పాట్లలో తలమునకలుగా ఉన్న మార్తా ఏసు దగ్గరకు వచ్చి ‘ప్రభూ.. చూడు.. మా చెల్లెలు పనులన్నీ నాకు వదిలేసి నీ దగ్గరకొచ్చి కూచుంది. ఆమెని నాకు సాయం చెయ్యమని చెప్పవూ?’ అనడిగింది. అందుకు ఏసు ‘మార్తా... నువ్వు చాలా వాటి గురించి ఆలోచిస్తున్నావు. ఆందోళన పడుతున్నావు. కాని నిజంగా పట్టించుకో వలసింది కొన్ని విషయాలే. ఆ మాటకొస్తే ఒకే ఒక్క విషయం మటుకే. ఏది మంచిదో దాన్నే మరియ ఎంచుకుంది. దానిని ఆమె నుంచి ఎవరూ తీసుకోలేరు’ అన్నాడు. నాలుగైదు వాక్యాల ఈ సన్నివేశం గొప్ప ఆధ్యాత్మిక చర్చకు కేంద్రంగా నిలబడింది. కర్మ, భక్తి, యోగాలకు చిహ్నాలుగా నిలబడ్డ ఆ ఇద్దరు అక్కచెల్లెళ్లనీ, యేసునీ కలిపి చిత్రించడానికి ప్రసిద్ధి చెందిన ప్రతి పాశ్చాత్య చిత్రకారుడూ ఉత్సాహపడ్డాడు. అయితే చలం ఆ కథని చెప్పాలనుకోవడానికీ, చెప్పిన సమయానికీ చాలా ప్రత్యేకత ఉంది. ఆయన జీవించిన జీవితం- అంటే బ్రహ్మసమాజం రోజుల నుంచీ అరుణాచలంలో తొలినాళ్ల దాకా మార్తాలాగా ‘చాలా విషయాల గురించి’ పట్టించుకున్న జీవితం. చాలావాటి గురించి ఆందోళన చెందిన జీవితం. కాని మరియలాగా నిజంగా పట్టించుకోవలసినవి కొన్ని మాత్రమేననీ ఆ మాటకొస్తే ఒకే ఒక్కటి మాత్రమేననే మెలకువ కలుగుతున్న కాలంలో ఆయన ఈ నవల రాశారు. అంతే కాదు చలం మొదటి 8 నవలల్లో భాషకీ శైలికీ ఈ నవలలో భాషకీ శైలికీ మధ్య చాలా వ్యత్యాసముంది. అమీనా నవల చివరి భాగాల నాటికే చలంకు తన శైలిపట్ల అసహనం స్పష్టపడింది. ‘నా శైలీ నా రచనలూ తగలబడనూ నా అమీనా.. నా అమీనా’ అన్న వాక్యం మీద సుదర్శనం చాలానే చర్చించారు. మార్తా నవలా శైలి వేరు. అప్పటికి చలం గీతాంజలితో సహా టాగోర్ కవిత్వాన్ని చాలానే తెలుగులోకి తీసుకు వచ్చారు. గీతాంజలి అనుసృజన చేసిన కలం మాత్రమే మార్తా నవల రాయగలదనిపిస్తుంది. కేవలం శైలి మాత్రమే కాదు బైబిల్ని నిర్దుష్టంగా చదువుకున్నవాడు మాత్రమే అటువంటి కథనానికి పూనుకోగలడు. అంత విస్పష్టమైన బైబిల్ పాండిత్యం మరే తెలుగు రచయితలోనూ మనకి కనబడదు. అప్పటికే చలం నాలుగు సువార్తల్నీ ‘శుభవార్తలు’ పేరిట తెలుగు చేయడం కూడా అందుకు కారణం కావచ్చు. ఏసు ప్రేమని, ఆయన యెరుషలేంలో అడుగుపెట్టడాన్ని, ఆయన్ను సుగంధతైలంతో మూర్ధాభిషిక్తుణ్ణి చెయ్యడాన్ని, ఆయన్ను శిలువ వెయ్యడాన్ని, సమాధిలో ఉంచబడటాన్ని, తిరిగి పునరుత్థానాన్నీ ఇవన్నీ చూసిన మహిళలుగా మార్తా, మేరీ, మేరీ మాగ్దలేనూ బైబిల్లో ప్రసిద్ధి చెందారు. అందులో శిలువ వెయ్యబడ్డ దృశ్యం వరకూ చలం తన నవలలో చిత్రించారు. పునరుత్థానాన్ని వదిలి పెట్టేశారు. అయితే తన నవలని మరింత మాతృహృదయస్ఫోరకంగా ముగించారు. సువార్తల్లో చెదురుమదురుగా ఉన్న కొన్ని వాక్యాలు ఆధారంగా మార్తా కథ చెప్పడంలో చలం చూపించిన కథనకౌశలం గురించి మరింత వివరంగా ముచ్చటించు కోవాలి. కాని ఆ కథ ద్వారా ఆయన తన జీవితకాలం అన్వేషణకొక సమాధానం వెతుక్కున్నారని మాత్రం చెప్పితీరాలి. మళ్లా మన ప్రశ్న దగ్గరికే వద్దాం. ప్రేమంటే ఏమిటి? బహుశా దాన్ని మనం రెస్పాన్సిబిలిటీ అనో ఇర్రెస్పాన్సిబిలిటీ అనో వివరించలేం. మనం ప్రేమ పేరిట ప్రతి అనుబంధాన్ని బంధంగా మారుస్తున్నట్టున్నాం. అందుకే ఉక్కిరిబిక్కిరవు తున్నాం. కాని నిజంగా చెయ్యవలసింది ప్రతి బంధాన్ని అనుబంధంగా మార్చుకోవడం. రామాయణంలో రాముడు చేసిందీ బైబిల్లో ఏసు చేసిందీ అదే. చలంగారు మార్తా నవల ద్వారా సాధించిన సమాధానమిదేనననుకుంటాను. - వాడ్రేవు చినవీరభద్రుడు 9490957129 -
ప్రముఖుల లేఖలు: చలం
కన్యాకుమారి ఇంద్రజాలం రామేశ్వరం- 25-5-1934 ఈ ద్వీపమంతా తిరిగాం. ఏ ప్రదేశం నుంచి అయినా సరే కొబ్బరి తోపుల్లో నుంచి నీలంగా సముద్రం మెరుస్తో కనబడుతుంది, ఎంతో అందంగా. ఏ చోటనైనా సరే ఇసిక బంగారం మల్లే మెరుస్తో కనబడుతుంది. ఈ ద్వీపమంతా శ్రీరాముడు తిరిగిన చిహ్నలతో ప్రజ్వరిల్లుతోంది. భక్తి ఏమాత్రం లేని నాకు ఆలయం చూస్తే ప్రేమ. జాజిపువ్వులు...పువ్వుల్లో కెల్లా ఇష్టమైనవి. చందనం, నాదస్వరం, హారతి అన్ని నాకు అమితంగా ఇష్టం. ఏమీ లేని బైరాగి, పెద్ద స్తంభాలు, ప్రాకారాలు, మెత్తని కాంతి, శ్రావ్యమైన సంగీతం, గొప్ప గోపురాలు, విగ్రహాలు, ఆస్పత్రుల నర్సుల వలే ఎప్పుడూ సేవ చేస్తో తిరిగే పూజార్లు. అట్లా ఆ ప్రదేశానికి అతుక్కుని పోతారు. ఇవాలో రేపో కుర్తాళం వెడుతున్నాం, అక్కణ్ణించి ఇంకా దక్షిణానికి, బహుశా కన్యాకుమారి దాకా. తోవలో రామనాథ్ చూస్తాం, రాముడితో నిండిన ఇంకో ప్రదేశం. తిరువనంతపురం, పబ్లిక్ గార్డెన్ 9-6-1034 ఈ తోట అద్భుతమైన అందాలు ఒలికే ప్రదేశం. ఈ పరగణానికి ఎండాకాలం అనేది లేదు. కన్యాకుమారి దివ్యమైన లావణ్యాన్ని చూడగలిగాను. ఆకారంలో, రంగులలో ఇంత అందమిచ్చే స్థలాన్ని వొదిలి వెళ్లవలసి రావడం హృదయాన్ని చీల్చేస్తుంది. ఈ సముద్రాన్ని, అడవుల్ని, కొండల్ని వొదిలి బెజవాడలో సిరా మచ్చల బల్లముందు కూచోవడం తప్పదనుకుంటే బతుకు మీద రోత కలుగుతుంది. ఈ సౌందర్యాన్ని చూసి, జీవితమంతా ఈ జ్ఞాపకంతో బాధపడే గతిని తప్పించుకున్న మిమ్మల్ని తలచుకొని ఈర్ష్యపడతాను. బీదరికంలోనూ, ఈ దేశపు స్త్రీల ముఖం మీద తృప్తిలో మునిగిన మాధుర్యం కనబడుతుంది. మీరు ఉంటే ఎంత బావుండేది! కన్యాకుమారి ఇంద్రజాలమల్లే ఉంది. - చింతా దీక్షితులుకు చలంగారి ఉత్తరాల నుంచి. -
చలాన్ని గొప్ప చేసి మాట్లాడటం చాలా మందికి నచ్చదు...
ఆరాధ్యం చలం రచనలు కొన్నైనా చదివి స్త్రీలు ప్రభావితం చెందాలంటే అసలు ఆయనేం రాశారో తెలియాలి. చలంగారి గురించి చర్చించడానికీ, కొత్తగా చెప్పుకోవడానికీ ఇప్పుడింకేమీ లేదు. నిజానికి ఆయన గురించి చర్చించడానికి ఆయనే ఏమీ మిగల్చలేదు. తన జీవితాన్ని కథల్లో, నవలల్లో, మ్యూజింగ్స్‌లో తనే పూర్తిగా బహిర్గత పరిచారు. మనమెంత చర్చించినా ఆయన మాటల్లో ఆయన అభిప్రాయమే తప్ప కొత్తగా ఇంకేదో చెప్పలేము. సాధారణంగా ఆత్మకథ జీవిత చరమాంకంలో రాస్తారు. కాస్త నిర్భీతిగా ఉన్నదున్నట్లు రాయగానే మనకు చాలా గొప్పగా మహాత్ములుగా కనిపిస్తారు. కాని చలం ప్రారంభం నుంచీ చెప్పింది ఆత్మకథే. కాని చలాన్ని గొప్ప చేసి మాట్లాడటానికి చాలామందికి మనసొప్పదు. ఎంతో నిర్భయంగా, సమాజానికి వెరవకుండా ఇలా కూడా రచన చెయ్యొచ్చా అని తోటి రచయితలు ఆశ్చర్యపోయేరీతిలో రచించారు. ఆయన రాసిన కథల్లో , నవలల్లో నాయకుడు, కథకుడు విడిగా కనపడరు. వారే వీరు వీరే వారు అనిపిస్తారు. పైగా చాలా కథలు ఆయన తన గురించి చెప్తున్నట్టుగా ఫస్ట్ పర్సన్‌లోనే రాశారు. తన భావాల్ని నాయకుడిలో లేదా నాయికలో ప్రవేశపెడ్తారు లేదా తనే నాయకుడిగా ప్రతిబింబిస్తారు. కొన్ని కథలైతే నిజంగా ఆయన జీవితంలో జరిగినవే యథాతథంగా రాశారేమో అనిపించకమానవు. చలంగారు స్త్రీ పక్షపాతనే విషయం లోకవిదితం. ఆయన రచనల్లో స్త్రీ పాత్రల ద్వారా తను కోరుకున్న స్వాతంత్య్రం, తను కోరే వ్యక్తిత్వం కనిపిస్తాయి. ఇలా స్త్రీలకు నోరిచ్చిన రచయిత ఎవరు? వారి గుండెల్లో ఏముందో బయటకు తెలియనిచ్చింది ఎవరు? చలంగారు తన పాత్రలను దాదాపు రక్షకుల వలే తీర్చిదిద్ది స్త్రీలకు అవసరమైనప్పుడు వారి నుంచి సహాయాన్ని, చైతన్యాన్ని, స్ఫూర్తిని పొందేంత స్థాయిలో శాశ్వతంగా నిలబెట్టారు. దైవమిచ్చిన భార్యలో పద్మావతి, మైదానంలో రాజేశ్వరి, అరుణలో అరుణ, వేదాంతంలో సత్తిరాజు భార్య, మాదిగ అమ్మాయి, ఎరికలమ్మ... వీళ్లంతా స్వతంత్ర స్త్రీలు. వీరి మాటలు తూటాలు, గురి తప్పని బాణాలు. ‘లేచిపోయినానని లోకం అంటే నాకు చాలా బాధగా ఉంటుంది’ అని ప్రారంభిస్తుంది రాజేశ్వరి. ప్లీడరు ఇంట్లోని ఇరుకు పడకగది కంటే మైదానంలో ఆరుబయట పడక, ఏటిలో స్నానం వర్ణించడం ఈ కాలం స్త్రీకైనా సాధ్యపడదు. ‘ప్రేమ గల వాళ్లు నన్నేం చేసినా ఊరుకుని, నన్నెలా అంటే అలా ఉపయోగించనిచ్చి, అసహ్యపెట్టి, అక్కర్లేనప్పుడు నా మొహం చూడక కావల్సినప్పుడు నా మీద దౌర్జన్యం చెయ్యనిచ్చి- అదా ప్రేమ? నేనెప్పుడూ ఒప్పుకోను’ అంటుంది పద్మావతి. తనతో రమ్మన్న రాధతో ‘నేను కనపడ్డప్పుడల్లా ఆశతో, ఆనందంతో నీ హృదయం కొట్టుకోవాలి. నన్ను నా నిర్మలత్వం చూసి నవ్వు భ్రమసి పోవాలి. నాకూ అలాగే ఉండాలి నిన్ను చూస్తే ఎన్నాళ్లయినా సరే. నీకు పని చేస్తూ పడి ఉండే దాసిదాన్ని చేస్తావా నీ హృదయేశ్వరిని తీసుకెళ్లి ప్రేమ పేరు పెట్టి. ప్రేమ లేకపోతే పోయిందిగాని ప్రేమని చంపుకోలేను నా చేతులతో’ అని నచ్చచెపుతుంది. వేదాంతంలో సత్తిరాజు భార్య ‘మనుషులు కుక్కలు. ఒక్కసారి సాయం చేశామా ఇంక వదలరు. కొంచెమిచ్చామా ఇంక ఈ కాముకుల మోస్తరే’ అని ఈసడిస్తుంది. ‘ఆపద వస్తే చాలదు. ఆపద ముందు కుంగిపోవాలి. సహాయానికై అరవాలి. సహాయం అక్కరలేదంటే ప్రపంచానికి ఎంతో కోపం వస్తుంది. ముఖ్యం ఆడదాని మీద’ అని తృణీకరిస్తుంది. మాదిగమ్మాయి తన నిస్సహాయత గురించి చెపుతూ ‘తాకడం కంటే, ఇంకేదో చెయ్యడం కంటే కూడా కొందరి చూపులు అసహ్యంగా. దుర్భరంగా ఉంటాయి. యెదురెళ్లి ముఖం మీద ఉమ్మెయ్యాలనిపించేది’ అంటుంది.అందరి కంటే భిన్నమైనది అరుణ ప్రేమ. ‘జాలీ, ప్రేమా, మోహం, వాంఛా! మాటలు. ఉత్త మాటలు. హృదయంలో ఆరాటం తెలియచేసే విధం తెలీక మాటలు’‘ప్రేమా- ప్రేమ విచిత్రం, నాకేనో అందరికేనో. నేనింత వరకూ ఎవర్నీ ప్రేమించలేదు. ఇప్పుడు తలచుకుంటే నా హృదయంలో గొప్ప ప్రేమ ఉంది. ప్రేమించాలనే ఆశ అపారంగా ఉంది. అందువల్లనే ఇవన్నీ. నా కలల్లో నా ఆదర్శపురుషుడు బతుకుతున్నాడు. ఈ మనుషులని చూస్తే దేహలోపాలు, గుణలోపాలు అన్నీ కనపడతాయి. నాకు మనుషుల్లోనే ఒకరికీ ఒకరికీ భేదం నశించింది. అందరూ అంతే. ఏం చేస్తారు పాపం. అంతకన్నా చేతకాదు’ అని బద్దలు కొడుతుంది. ఈ చైతన్యం చలం ఇవ్వకపోతే ఈ సమాజం ఇంకెంతకాలం చీకటిలో మగ్గి ఉండేదో. చలం రచనలు కొన్నైనా చదివి స్త్రీలు ప్రభావితం చెందాలంటే అసలు ఆయనేం రాశారో తెలియాలి. ఆయన పుస్తకాల్ని మగవారే చదవడానికి భయపడే రోజుల్లోంచి, స్త్రీలు కూడా బాహాటంగా చదవగలిగే రోజుల్లోకి వచ్చి కూడా ఇంకా ఉన్నారు ఆయన గురించి మాట్లాడడానికి, చదివామని నిర్భీతిగా చెప్పడానికి భయపడేవారు. దాదాపు 100 సంవత్సరాల క్రితమే స్త్రీలు, స్త్రీ స్వాతంత్య్రం గురించి తపన పడ్డ రచయిత చలం. స్త్రీల నిర్భీతి, కోపం, అసహాయత అన్నీ ఆయన చర్చించారు. ఎవరంటే వారు తోచిన వ్యాఖ్యానం చేసే రచయిత కాదాయన.నిజానికి, ఆయన ఇంకా మనందరం తడిమి తడిమి తెలుసుకోవాల్సిన గజ స్వరూపుడే. - ఎం. ఉమాదేవి డైరీ... సినీ జర్నలిస్టులు రాసిన కథలను ‘అంతర్ముఖం’ పేరుతో సంకలనపరిచి మార్చి 3 ఉదయం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆవిష్కరించనున్నారు. ఆవిష్కర్త: దాసరి. సంకలనకర్త: బత్తుల ప్రసాద్. శేషేంద్ర ప్రఖ్యాత పద్యకావ్యం ‘ఋతుఘోష’ స్వర్ణోత్సవ సభ మార్చి 3 సాయంత్రం హైదరాబాద్ త్యాగరాయగానసభలో జరుగుతుంది. ఆచార్య అనుమాండ్ల భూమయ్య తదితరులు పాల్గొంటారు. వివరాలకు: సాత్యకి- 77029 64402 సౌదా అరుణా థియేటర్ మూవ్మెంట్ సమర్పణలో ‘జాతిపిత అంబేద్కర్ వర్ణనిర్మూలన’ బహుజన నాటకం 48వ ప్రదర్శన మార్చి 8 సాయంత్రం గుంటూరు జిల్లా రేపల్లెలోని ఆంధ్రరత్న స్కూల్లో ప్రదర్శించనున్నారు. 49వ ప్రదర్శన మార్చి 15న మిర్యాలగూడలో, 50వ ప్రదర్శన ఏప్రిల్ 14న తిరుపతిలో ఉంటుంది. వివరాలకు: 9247150243 కార్టూనిస్ట్ శేఖర్ కార్టూన్లకు పాతికేళ్లు వచ్చిన సందర్భంగా రజతోత్సవ వేడుక. మార్చి 2 ఆదివారం, సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 11 నుంచి. }నివాస్ వాసుదేవ్ కవితా సంపుటి ‘ఆకుపాట’ ఆవిష్కరణ మార్చి 1 సాయంత్రం హైదరాబాద్ గోల్డెన్ థ్రెషోల్డ్‌లో జరుగుతుంది.