Chamika Karunaratne
-
క్లియర్‌గా రనౌట్.. అయినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి
ఆక్లాండ్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 198 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. కివీస్ పేసర్ల దాటికి కేవలం 76 పరుగులకే కూప్పకూలింది. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లీ ఐదు వికెట్లతో చెలరేగగా.. మిచెల్, టిక్నర్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? శ్రీలంక ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన బ్లెయిర్ టిక్నర్ బౌలింగ్‌లో నాలుగో బంతిని ఆడిన కరుణరత్నే వెంటనే సింగిల్ తీయడానికి తీయడానికి ప్రయత్నించాడు. అయితే బంతిని అందుకున్న కివీస్ ఫీల్డర్ నాన్ స్ట్రైకర్ వైపు త్రో చేశాడు. బంతిని అందుకున్న టిక్నర్ వెంటనే స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్కు చేశాడు. రిప్లేలో టిక్నర్ బెయిల్స్ పడగొట్టే సమయానికి కరుణరత్నే క్రీజుకు దూరంలో ఉన్నాడు. దీంతో కరుణరత్నే ఔట్ అని అంతా భావించారు. అయితే ఇక్కడే కరుణరత్నేని అదృష్టం వెంటాడింది. బంతి స్టంప్స్ తగలగానే వెలగాల్సిన జింగ్ బెయిల్స్ వెలగలేదు. వాటిలో బ్యాటరీలు అయిపోయాయి. దీంతో రూల్స్ ప్రకారం జింగ్ బెయిల్స్ వెలగని కారణంగా థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే అంపైర్ నిర్ణయం చూసిన కివీస్ ఆటగాళ్లు ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా రనౌట్ విషయంలో బెయిల్స్ వెలగకపోవడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Virat Kohli: ఇంగ్లీష్ పరీక్షలో విరాట్ కోహ్లిపై ప్రశ్న.. క్వశ్చన్ పేపర్ వైరల్ Not out 🏏 due to dead battery 😂#SparkSport #NZvSL pic.twitter.com/tYE044lemd — Spark Sport (@sparknzsport) March 25, 2023 -
కివీస్‌తో సిరీస్‌కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో ఫైనల్లో!
New Zealand Vs Sri Lanka 2023- Test Series: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. మార్చి 9 నుంచి ప్రారంభం కానున్న సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది. దిముత్ కరుణరత్నె సారథ్యంలోని ఈ జట్టులో లాహిరు కుమార, చమిక కరుణరత్నె, కసున్ రజిత, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో తదితరులకు చోటు దక్కింది. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరే క్రమంలో కివీస్‌తో సిరీస్ శ్రీలంకకు కీలకంగా మారింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను టీమిండియా వరుసగా రెండు టెస్టుల్లో ఓడించడం లంక పాలిట వరంలా మారింది. రోహిత్ సేన అదే జోరులో ఆసీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం సహా కివీస్‌ను గనుక లంక వైట్‌వాష్ చేస్తే.. సౌతాఫ్రికా- వెస్టిండీస్ ఫలితం తమకు అనుకూలంగా వస్తే టీమిండియాతో పాటు ఫైనల్ చేరే అవకాశాలు లేకపోలేదు. అయితే, న్యూజిలాండ్ గడ్డపై శ్రీలంకకు ఇది కత్తిమీద సాములాంటిదే. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక.. టాప్‌లో కొనసాగుతున్న ఆస్ట్రేలియా అంత ఈజీ కాదు గత రికార్డులు పరిశీలిస్తే కివీస్‌తో ముఖాముఖి తలపడిన 19 సందర్భాల్లో శ్రీలంక కేవలం రెండు టెస్టులు మాత్రమే గెలిచింది. అయితే, ప్రస్తుత కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ మార్గదర్శనంలో లంక జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ ప్రతిభకు అదృష్టం తోడైతే కరుణరత్నె బృందం ఫైనల్ చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే, గత డబ్ల్యూటీసీ విన్నర్ కివీస్‌ను ఓడించడం అది కూడా సొంత గడ్డపై వైట్‌వాష్ చేయడం అంటే ఆషామాషీ కాదు! మార్చి9 - ఏప్రిల్ 8 వరకు టూర్ ఇందుకోసం లంక సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంటుంది. కాగా మొట్టమొదటి డబ్ల్యూటీసీ టైటిల్‌ను న్యూజిలాండ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో టీమిండియాను ఓడించిన కేన్ విలియమ్సన్ సేన ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. కాగా మార్చి 9- ఏప్రిల్ 8 వరకు కివీస్- లంక మధ్య రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు జరుగనున్నాయి. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు లంక జట్టు: దిముత్ కరుణరత్నె(కెప్టెన్), ఒషాడా ఫెర్నాండో, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనుంజయ డి సిల్వ, దినేశ్ చండిమాల్, కమిందు మెండిస్, నిరోషన్ డిక్వెల్లా, నిషాన్ మదుష్క, రమేశ్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, చమిక కరుణరత్నె, కసున్ రజిత, లాహిరు కుమార, అషిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, మిలన్ రత్ననాయకె. చదవండి: T20 WC 2023 Final: సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఆఖరి పోరులో ఆసీస్‌తో.. Ind Vs Aus: మూడో టెస్టుకు కమిన్స్ దూరం.. బీసీసీఐ ట్వీట్! గ్రేట్ అంటున్న ఫ్యాన్స్ -
వారెవ్వా సిరాజ్.. శ్రీలంక బ్యాటర్‌కు ఊహించని షాక్! వీడియో వైరల్
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో తన 10 ఓవర్ల కోటాలో సిరాజ్ 32 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక 317 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అదేవిధంగా టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శుబ్మాన్ గిల్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. సంచలన రనౌట్‌తో మెరిసిన సిరాజ్.. ఏక పాక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఈ మ్యాచ్‌లో సంచలన రనౌట్‌తో మెరిశాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో నాలుగో బంతిని కరుణరత్నే నాన్‌స్ట్రైకర్ వైపు డిఫెన్స్ ఆడాడు. వెంటనే బంతిని అందుకున్న సిరాజ్ సమయస్ఫూర్తితో రెప్పుపాటులోనే స్ట్రైకర్ వైపు స్టంప్స్‌ను గిరాటేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. అయితే తను క్రీజులో ఉన్నానని భావించిన కరుణరత్నేకు మాత్రం ఊహించని షాక్ తగిలింది. ఎందుకంటే కరుణరత్నే క్రీజుకు కొంచెం వెలుపుల ఉన్నట్లు రిప్లేలో సృష్టంగా కన్పించింది. దీంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IND vs SL: ఇదేం ఆనందంరా బాబు.. బంతిని ఫొటో తీసిన ఫ్యాన్! కోహ్లి రియాక్షన్ వైరల్ pic.twitter.com/F3EpqK649o — The sports 360 (@Thesports3601) January 15, 2023 -
chamika Karunaratne: 'ఊడిన పళ్లు వెనక్కి.. మూతికి 30 కుట్లు'
శ్రీలంక క్రికెటర్ చమిక కరుణరత్నే క్యాచ్ పట్టబోయి మూతిపళ్లు రాలగొట్టుకున్న సంగతి తెలిసిందే. లంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గాలే గ్లాడియేటర్స్, జఫ్నా కింగ్స్ మధ్య మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. కాగా నోటి నుంచి రక్తం కారడంతో ప్రథమ చికిత్స తీసుకొని మళ్లీ మైదానంలోకి వచ్చాడు. మ్యాచ్ తర్వాత కరుణరత్నేను ఆసుపత్రికి తరలించి మూతికి సర్జరీ నిర్వహించారు. మూతికి 30 కుట్లు కూడా పడ్డాయి. ప్రస్తుతం కరుణరత్నే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇదే విషయాన్ని కరుణరత్నే తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చాడు. ''నాలుగు పళ్లు ఉడినా తిరిగి వచ్చాయి.. మూతికి 30 కుట్టు పడ్డాయి.. కానీ నేను ఇప్పటికి నవ్వగలను. త్వరలోనే కోలుకొని తిరిగి జట్టులోకి వస్తా.. సీ యూ సూన్'' అంటూ మెసేజ్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కాండీ ఫాల్కన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గాలే గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మోవిన్ శుభసింగా 38 బంతుల్లో 40 పరుగులు, ఇమాద్ వసీమ్ 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్ 30 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. కమిందు మెండిస్ 44, పాతుమ్ నిస్సాంక(22), ఆండ్రీ ఫ్లెచర్(20) పరుగులు చేశారు. Chamika Karunaratne lost 4 teeth while taking a catchpic.twitter.com/WFphzmfzA1 — Out Of Context Cricket (@GemsOfCricket) December 8, 2022 View this post on Instagram A post shared by Chamika Karunaratne (@chamikakarunaratne) చదవండి: LPL 2022: మూతిపళ్లు రాలినా క్యాచ్ మాత్రం విడువలేదు ఆట గెలవడం కోసం ఇంతలా దిగజారాలా? -
మూతిపళ్లు రాలినా క్యాచ్ మాత్రం విడువలేదు
లంక ప్రీమియర్ లీగ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్యాచ్ తీసుకునే క్రమంలో మూతి పళ్లు రాలగొట్టుకున్నాడు లంక క్రికెటర్ చమిక కరుణరత్నే. కాండీ ఫాల్కన్స్, గాలె గ్లాడియేటర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. గాలె గ్లాడియేటర్ ఇన్నింగ్స్ సమయంలో బ్యాటర్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునేందుకు కరుణరత్నే పరిగెత్తుకొచ్చాడు. అదే సమయంలో మరో ఇద్దరు ఫీల్డర్లు కూడా రావడం చూసిన కరుణరత్నే వారిని వద్దని వారించాడు. ఇక క్యాచ్‌ను సులువుగా పట్టుకున్నట్లే అని మనం అనుకుంటున్న దశలో బంతి అతని మూతిపై బలంగా తాకింది. ఆ దెబ్బకు అతని ముందు పళ్లు ఊడివచ్చాయి. నోటి నుంచి రక్తం కారుతున్నప్పటికి క్యాచ్‌ను మాత్రం జారవిడవలేదు. ఆ తర్వాత పెవిలియన్ వెళ్లి ప్రథమ చికిత్స తీసుకొని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కాండీ ఫాల్కన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గాలే గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మోవిన్ శుభసింగా 38 బంతుల్లో 40 పరుగులు, ఇమాద్ వసీమ్ 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్ 30 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. కమిందు మెండిస్ 44, పాతుమ్ నిస్సాంక(22), ఆండ్రీ ఫ్లెచర్(20) పరుగులు చేశారు. Chamika Karunaratne lost 4 teeth while taking a catchpic.twitter.com/WFphzmfzA1 — Out Of Context Cricket (@GemsOfCricket) December 8, 2022 చదవండి: క్రిప్టో కరెన్సీ కంటే దారుణంగా పడిపోతున్నారు.. టీమిండియాపై సెహ్వాగ్ సెటైర్ -
స్టార్ ఆల్‌రౌండర్‌కు ఊహించని షాక్.. ఏడాది పాటు నిషేధం
శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ చమికా కరుణరత్నేపై శ్రీలంక క్రికెట్ ఏడాది పాటు నిషేధం విధించింది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో బోర్డుకు సంబంధించిన పలు అగ్రిమెంట్లను కరుణరత్నే ఉల్లంఘించాడు. దీనిపై విచారణ జరిపేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని నియమించింది. అయితే కమిటీ విచారణలో నిబంధనలను ఉల్లంఘించినట్లు కరుణరత్నే అంగీకరించాడు. దీంతో ఏడాది పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా అతడిపై లంక క్రికెట్ బోర్డు వేటు వేసింది. అతడిపై నిషేదం విధించడమే కాకుండా 5000 వేల డాలర్ల( భారత కరన్సీ ప్రకారం రూ. 4లక్షలు) జరిమానా కూడా విధించింది. "టీ20 ప్రపంచకప్-2022 సందర్భంగా కరుణరత్నే బోర్డు నిబంధనలను ఉల్లంఘించాడు. అతడి చేసిన తప్పిదాలపై ముగ్గురు సభ్యలతో కూడిన విచారణ కమిటీని వేశాం. కమిటీ విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడు. అతడు ఇటువంటి తప్పిదాలకు మరోసారి పాల్పడకుండా గట్టిగా హెచ్చరించాలని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. దీంతో అతడిపై ఏడాది పాటు అన్ని రకాల క్రికెట్ ఆడకుండా కమిటీ నిషేదం విధించింది. అదే విధంగా 5000 వేల డాలర్ల ఫైన్ కూడా ఫైన్ కూడా చెల్లించాలంటూ అంటూ" శ్రీలంక క్రికెట్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఆసియాకప్-2022ను శ్రీలంక కైవసం చేసుకోవడంలో కరుణరత్నే కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఆఫ్గానిస్తాన్‌తో తొలి వన్డేకు ముందు లంక క్రికెట్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. ఎక్స్‌ప్రెస్ పేసర్ ఎంట్రీ! సంజూ కూడా