champ
-
చైనా గ్రాండ్‌ప్రి చాంప్ రికియార్డో
షాంఘై: ఈ సీజన్లో జోరుమీదున్న సెబాస్టియన్ వెటెల్ ‘హ్యాట్రిక్’ ఆశలపై రెడ్‌బుల్ డ్రైవర్ డానియెల్ రికియార్డో నీళ్లు చల్లాడు. ఫార్ములావన్ చైనా గ్రాండ్‌ప్రిలో రికియార్డో విజేతగా నిలిచాడు. షాంఘై సర్క్యూట్లో ఈ ఆస్ట్రేలియన్ డ్రైవర్ అసాధారణ వేగంతో దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రధాన రేసును ఆరో స్థానం నుంచి ప్రారంభించిన రికియార్డో 56 ల్యాప్‌ల రేసును గంటా 35 నిమిషాల 36.380 సెకన్లలో పూర్తి చేశాడు. తన కెరీర్లో అతనికిది ఆరో విజయం. క్వాలిఫయింగ్‌లో పోల్ పొజిషన్ సాధించిన వెటెల్‌కు ఈ రేసు నిరాశను మిగిల్చింది. ఇప్పటికే రెండు రేసుల్ని తన ఖాతాలో వేసుకున్న ఫెరారీ డ్రైవర్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఇతని సహచరుడు, రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన రైకోనెన్‌కు మూడో స్థానం లభించగా, మెర్సిడెస్ డ్రైవర్ బొటాస్ రన్నరప్‌గా నిలిచాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా 11, 12వ స్థానాలు పొందారు. ఈ సీజన్లో తదుపరి రేసు అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి ఈ నెల 29న జరుగుతుంది. -
పీబీఎల్ చాంప్ హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై, సొంత ప్రేక్షకుల మధ్య హైదరాబాద్ హంటర్స్ గర్జించింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్లో విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన టైటిల్ పోరులో హైదరాబాద్ 4–3 స్కోరుతో బెంగళూరు బ్లాస్టర్స్‌పై విజయం సాధించింది. మొదట పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో మార్కిస్ కిడో– యూ ఇయాన్ సియాంగ్ (హంటర్స్) 9–15, 10–15తో మథియాస్ బోయె– కిమ్ సా రంగ్ చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల సింగిల్స్ హంటర్స్‌కు ట్రంప్ మ్యాచ్ కాగా లీ హ్యూన్ ఇల్ 15–7, 15–13తో శుభాంకర్ డేపై గెలుపొందడంతో హైదరాబాద్ 2–1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది అయితే తర్వాత రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ను బెంగళూరు ట్రంప్‌గా ఎంచుకుంది. ఈ పోరులో సాయిప్రణీత్ (హంటర్స్) 8–15, 10–15తో ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో హైదరాబాద్ 2–3తో వెనుకబడింది. అనంతరం జరిగిన మహిళల సింగిల్స్‌లో ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ (హంటర్స్) 15–8, 15–14తో గిల్మోర్‌పై గెలుపొందడంతో స్కోరు 3–3తో సమమైంది. ఈ దశలో కీలకమైన మిక్స్డ్ డబుల్స్‌లో పియా జెబదియా–సాత్విక్ సాయిరాజ్ (హంటర్స్) 15–11, 15–12తో సిక్కిరెడ్డి–కిమ్ సా రంగ్‌పై విజయం సాధించడంతో హైదరాబాద్ పీబీఎల్‌లో తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. -
ఓవరాల్ చాంప్‌గా విజయవాడ డివిజన్
విజయవాడ స్పోర్ట్స్ : సికింద్రబాద్‌లో ఈ నెల 18 నుంచి 29వ తేదీ వరకు జరిగిన దక్షిణ æమధ్య రైల్వే ఇంటర్ డివిజనల్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో పతకాల పంట పండించిన విజయవాడ డివిజన్జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఈ జట్టును చీఫ్ మెకానికల్ ఇంజినీర్ అర్జున్ముండియ అభినంధించారు. శుక్రవారం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో అర్జున్ ముండియా విజయవాడ జట్టుకు ఓవరాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీ అందజేశారు. -
ఓవరాల్ చాంప్‌గా విజయవాడ డివిజన్
విజయవాడ స్పోర్ట్స్ : సికింద్రబాద్‌లో ఈ నెల 18 నుంచి 29వ తేదీ వరకు జరిగిన దక్షిణ æమధ్య రైల్వే ఇంటర్ డివిజనల్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో పతకాల పంట పండించిన విజయవాడ డివిజన్జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఈ జట్టును చీఫ్ మెకానికల్ ఇంజినీర్ అర్జున్ముండియ అభినంధించారు. శుక్రవారం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో అర్జున్ ముండియా విజయవాడ జట్టుకు ఓవరాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీ అందజేశారు.