champion league
-
పంచ్‌లో బెబ్బులి..కిక్ ఇస్తే.. ప్రత్యర్థులకు చుక్కలే ఎవరీ దేవి?
పెరెగ్రైన్ ఫాల్కన్ కన్నా వేగవంతమైన కిక్‌లకు టెక్నిక్ మేళవించి ప్రత్యర్థులను మట్టి కరిపిస్తుంది. చిరుత కంటే వేగంగా పాదాలను కదిలించి ఎదుటివారిని చిత్తు చేస్తుంది. పాల్గొన్న ప్రతిపోటీలోనూ పతకం సాధించి తనకుతానే సాటిగా అంతర్జాతీయ వేదికపై మరోమారు సత్తా చూపించేందుకు సిద్ధమవుతోంది సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన కరాటే క్వీన్ దేవిహంసిని. ఇప్పటి వరకూ అనేక జాతీయ, అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొని బంగారు, వెండి మెడల్స్‌తోపాటు పలు అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది.- చిలకలగూడ యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) ఫుజైరాలో 2025 ఫిబ్రవరిలో జరిగే కరాటే–1 యూత్‌లీగ్ పోటీలకు అండర్–14 కటా విభాగంలో తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక క్రీడాకారిణి దేవిహంసిని. వడోరై కరాటే డూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యుఏఈలో జరిగే యూత్‌లీగ్ పోటీలకు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణలకు చెందిన ఎనిమిది మందిని ఎంపిక చేశారు. చిన్ననాటి నుంచే.. సాధారణ కుటుంబానికి చెందిన పెబ్బిలి దేవిహంసిని (12) సికింద్రాబాద్ సెయింట్ మేరీ హైసూ్కల్లో ఏడో తరగతి చదువుతోంది. తండ్రి కోటేశ్వరరావు ప్రైవేటు ఉద్యోగి, తల్లి అంజలి గృహిణి. తన ఆరో ఏట నుంచే మార్షల్ ఆర్ట్స్‌పై చిన్ననాటి నుంచే మక్కువ పెంచుకుంది. మొదట విశాఖపట్నంలోని కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్‌లో చేరింది. కరాటే కోచ్ సిహాన్, సీహెచ్ శ్రీనివాసరావు వద్ద ఓనమాలు నేర్చుకుంది. కఠోరశ్రమ, చిత్తశుద్ధి, నేర్చుకోవాలనే తపనతో మెళకువలను ఔపోసన పట్టి బ్లాక్‌బెల్ట్ సాధించింది. సినీనటుడు సుమన్ నుంచి బ్లాక్‌బెల్ట్ అందుకోవడం గర్వంగా ఉందని చెబుతోంది దేవి. సాధించిన పతకాలు..జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన దేవిహంసిని పాల్గొన్న ప్రతి పోటీలోనూ బహుమతి సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. కటా, కుమిటీ విభాగాల్లో పది గోల్డ్, రెండు వెండి, జాతీయ స్థాయిలో 22 బంగారు, ఐదు వెండి, మూడు రజిత పతకాలు కైవసం చేసుకుంది. సౌత్ నేషనల్ లెవల్లో 7 గోల్డ్, ఒక్కో సిల్వర్, బ్రాంజ్, ఆసియన్ లెవల్లో ఒక్కో సిల్వర్, బ్రాంజ్, స్టేట్ లెవల్లో ఐదు బంగారు, ఒక్కో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సొంతం చేసుకుంది. మువ్వన్నెల జెండా ఎగురవేస్తా.. అంతర్జాతీయ వేదికలపై మువ్వన్నెల జెండా ఎగురవేస్తా. యుఏఈ ఫుజైరాలో కరాటే యూత్‌లీగ్‌లో విజయం సాధిస్తా. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహం కూడా అవసరం. అందరి సహకారం ఉంటే గెలుపు తథ్యమని దేవిహంసిని ధీమా వ్యక్తం చేస్తోంది. చదవండి: చదివింది 10వ తరగతే..ముగ్గురు పిల్లలు : అట్టడుగు స్థాయినుంచి వ్యాపారవేత్తగా -
పంజాబ్ కు షాక్: ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్
హైదరాబాద్: కీలక మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ చతికిలబడింది. నాకౌట్ దశకు చేరుకుని క్రమంలో ఒక్క మ్యాచ్ లో కూడా పరాజయం చవిచూడని పంజాబ్.. సెమీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఘోర ఓటమిని చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఛాంపియన్ లీగ్ లో భాగంగా ఇక్కడ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ 65 పరుగుల తేడాతో బొక్కబోర్లాపడింది. చెన్నై విసిరిన 183 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పంజాబ్ ఆదిలోనే వీరేందర్ సెహ్వాగ్(0) వికెట్టును కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం వాహ్రా(16), సాహా (6), మ్యాక్స్ వెల్ (0) వరుస క్యూకట్టడంతో పంజాబ్ తేరుకోలేకపోయింది. స్కోరు బోర్డుపై 50 పరుగులు దాటకుండానే ఆరు వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ కు పరాజయం తప్పలేదు. పంజాబ్ జట్టులో మిల్లర్(22), ఏఆర్ పటేల్ (31) పరుగుల మినహా ఏ ఒక్క ఆటగాడు ఆకట్టుకోలేదు. కింగ్స్ పంజాబ్ లోఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో జట్టు 18.2 ఓవర్లలో 117 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవిచూసింది. చెన్నై బౌలర్లలో నెహ్రా, శర్మ, రైనా, నేగీ తలో రెండో వికెట్లు తీసి పంజాబ్ పతనాన్ని శాసించారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్183 లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై ఆదిలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి కష్టాలో పడ్డా ప్లెస్సిస్ (46), బ్రేవో(67)పరుగుల చలవతో చెన్నై నిర్ణీత ఓవర్లలో 182 పరుగులు చేసింది. చివర్లో జడేజా(27)పరుగులతో నాటౌట్ గా మిగిలి మరోసారి ఆకట్టుకున్నాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్-కోల్ కతా తో జరిగే ఫైనల్ పోరుకు సిద్ధమైంది. -
పంజాబ్ కింగ్స్ విజయలక్ష్యం 183
హైదరాబాద్:ఛాంపియన్ లీగ్ లో భాగంగా ఇక్కడ ఉప్పల్ లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్183 లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచిన పంజాబ్.. చెన్నైను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన చెన్నై ఆదిలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. డార్విన్ స్మిత్ (14), మెక్ కలమ్ (6) పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో చెన్నైకు గట్టి షాక్ తగిలింది. అనంతరం సురేష్ రైనా (6) పరుగులకే పెవిలియన్ కు చేరాడు. ఆ తరుణంలో ప్లెస్సిస్(46), బ్రేవో(67)పరుగులు చేసి జట్టును గట్టెక్కించారు.చివర్లో జడేజా(27)పరుగులతో నాటౌట్ గా మిగలడంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 182 పరుగుల చేసింది. పంజాబ్ బౌలరల్లో అవానాకు నాలుగు వికెట్లు లభించగా,ఏఆర్ పటేల్ కు రెండు వికెట్లు దక్కాయి. -
సెమీ ఫైనల్ బెర్తులు ఖరారు
హైదరాబాద్: ఈసారి కూడా చాంపియన్ లీగ్ లో మూడు ఐపీఎల్ టీంలు సెమీ ఫైనల్ కు అర్హత సాధించాయి. గ్రూప్ ఏ నుంచి కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ సెమీ ఫైనల్ కు దూసుకెళ్లగా, గ్రూప్ బి నుంచి పంజాబ్ కింగ్స్ ఎలెవన్ సెమీ ఫైనల్ కు చేరింది. వీటితో పాటు విదేశీ జట్టు హోబార్ట్ హరికేన్ సెమీ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. అక్టోబర్ 2 వ తేదీన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా తో హోబార్ట్ హరికేన్స్ తలపడనుంది. అనంతరం అదే రోజు సాయంత్రం రెండో సెమీ ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ ను పంజాబ్ జట్టు ఢీకొంటుంది. ఈరెండు సెమీ ఫైనల్ మ్యాచ్ లు కూడా హైదరాబాద్ లో జరుగుతుండటం గమనార్హం. లీగ్ దశలో పంజాబ్, కోల్ కతా లు ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా సెమీ ఫైనల్ కు చేరగా, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఒక్క మ్యాచ్ లో ఓటమి చవిచూసింది. గత ఛాంపియన్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ లు సెమీస్ కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. -
'నాల్గో విజయం కూడా సాధిస్తాం'
మొహాలీ:ఛాంపియన్స్ లీగ్ లో నాల్గో విజయం కూడా సాధించి పరిపూర్ణంగా నాకౌట్ కు వెళ్లాలనుకుంటున్నామని కింగ్స్ పంజాబ్ కోచ్ ఆర్. శ్రీధర్ స్పష్టం చేశాడు. ఆదివారం కేప్ కోబ్రాస్ పై కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తాము సెమీస్ లోకి అడుగుపెట్టినా.. కేప్ కోబ్రాస్ తో జరిగే మ్యాచ్ ను తేలిగ్గా తీసుకోవడం లేదన్నారు. శనివారం నార్తరన్ డిస్ట్రిక్స్ తో జరిగిన మ్యాచ్ లో 120 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తమ జట్టు సెమీస్ కు చేరిన అంశాన్ని పరికిస్తే.. చివరి వరుస ఆటగాళ్లకు బ్యాటింగ్ రాకుండా పంజాబ్ అద్భుత విజయాలు నమోదు చేసిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. టీం పరిస్థితిని చూస్తే నాల్గో విజయం కూడా సాధిస్తామని శ్రీధర్ తెలిపాడు. ప్లే ఆఫ్ లో అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించి నాకౌట్ రౌండ్ లో ఘనంగా అడుగుపెడతామన్నాడు. -
పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ
-
పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ
మొహాలీ: చాంపియన్స్ లీగ్ లో భాగంగా ఇక్కడ నార్తరన్ డిస్ట్రిక్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 120 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ కింగ్స్ 216 పరుగుల లక్ష్యాన్ని నార్తరన్ డిస్ట్రిక్స్ కు నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన నార్తరన్ డిస్ర్టిక్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు విలియమ్ సన్(20),హారిస్(9)పరుగులు చేసి పెవిలియన్ కు చేరడంతో ఆ జట్టుకు కష్టాలు ఆరంభమయ్యాయి. అనంతరం డేవ్ రిచ్(28) పరుగులు చేసి నిష్క్రమించడంతో నార్తరన్ పతనం మొదలైంది. తరువాత ఓ ఒక్క ఆటగాడు పోరాట పటిమ ప్రదర్శించకపోవడంతో కేవలం 95 పరుగులకే పరిమితమైన నార్తరన్ డిస్ట్రిక్స్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. నార్తరన్ జట్టులో 8 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితమవడం గమనార్హం. పంజాబ్ బౌలర్ల కరణ్ వీర్ సింగ్ నాలుగు వికెట్లు లభించగా, పటేల్ కు రెండు వికెట్లు దక్కాయి. వరుసుగా మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించిన పంజాబ్ ఘనంగా సెమీస్ లోకి అడుగుపెట్టింది. -
నేటి నుంచి చాంపియన్స్ లీగ్ యాక్షన్