
పంజాబ్ కింగ్స్ విజయలక్ష్యం 183
హైదరాబాద్:ఛాంపియన్ లీగ్ లో భాగంగా ఇక్కడ ఉప్పల్ లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్183 లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచిన పంజాబ్.. చెన్నైను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన చెన్నై ఆదిలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. డార్విన్ స్మిత్ (14), మెక్ కలమ్ (6) పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో చెన్నైకు గట్టి షాక్ తగిలింది. అనంతరం సురేష్ రైనా (6) పరుగులకే పెవిలియన్ కు చేరాడు.
ఆ తరుణంలో ప్లెస్సిస్(46), బ్రేవో(67)పరుగులు చేసి జట్టును గట్టెక్కించారు.చివర్లో జడేజా(27)పరుగులతో నాటౌట్ గా మిగలడంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 182 పరుగుల చేసింది. పంజాబ్ బౌలరల్లో అవానాకు నాలుగు వికెట్లు లభించగా,ఏఆర్ పటేల్ కు రెండు వికెట్లు దక్కాయి.