champions challenge -1
-
బెల్జియం చేతిలో భారత మహిళల ఓటమి
గ్లాస్గో: చాంపియన్స్ చాలెంజ్-1 హాకీ టోర్నీలో భారత మహిళల జట్టుకు మరో పరాజయం ఎదురైంది. పూల్ ‘ఎ’లో భాగంగా గురువారం బెల్జియంతో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 0-5 తేడాతో ఓటమిపాలైంది. ఆరంభంలో హోరాహోరీగా పోరాడి బెల్జియంను అడ్డుకున్న భారత మహిళలు 33వ నిమిషంలో మనన్ సైమన్స్ తొలి గోల్ సాధించినప్పటి నుంచి పట్టు కోల్పోయారు. బెల్జియం క్రీడాకారిణులు జిల్ బూన్ (38వ నిమిషం), లూయిస్ వెర్సవెల్ (41వ), ఎమ్మా పవ్రెజ్ (64వ), లీసెలోట్ వాన్ లింట్ (69వ)లు వరుసగా గోల్స్ నమోదు చేసి భారత్‌పై ఆ జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను శుక్రవారం అమెరికాతో ఆడనుంది. -
భారత్ పరాజయం
గ్లాస్గో (స్కాట్లాండ్): చాంపియన్స్ చాలెంజ్-1 మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టుకు తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా 2-4 గోల్స్ తేడాతో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. ఆట 12వ నిమిషంలో వందన గోల్ తో ఖాతా తెరిచిన భారత్ ఆ తర్వాత తడబడింది. ఒక్కసారిగా కొరియా దూకుడు పెంచి 14, 24, 28వ నిమిషాల్లో మూడు గోల్స్ చేసింది. 42వ నిమిషంలో కొరియా మరో గోల్ సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. 69వ నిమిషంలో పూనమ్ రాణి భారత్ ఖాతాలో రెండో గోల్‌ను జమచేసినా ఫలితం లేకపోయింది. సోమవారం జరిగే రెండో మ్యాచ్‌లో స్కాట్లాండ్తో భారత్ తలపడుతుంది. -
ఐర్లాండ్‌పై భారత మహిళల గెలుపు
బెల్జియం చేతిలో పురుషుల జట్టు ఓటమి న్యూఢిల్లీ: ఐర్లాండ్‌తో హాకీ టెస్టు సిరీస్‌లో భారత మహిళలు శుభారంభం చేశారు. చాంపియన్స్ చాలెంజ్-1 ట్రోఫీకి సన్నాహకంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 3-1 తేడాతో ఐర్లాండ్‌పై నెగ్గింది. మెగాన్ ఫ్రేజర్ 4వ నిమిషంలోనే నమోదు చేసిన గోల్‌తో తొలి అర్ధభాగంలో 1-0 ఆధిక్యం సాధించిన ఐర్లాండ్.. ఆ ఒక్క గోల్‌తోనే సరిపెట్టుకుంది. రెండో అర్ధభాగంలో పూనమ్ రాణి (37వ నిమిషం), రీతూ రాణి (61వ) సునితా లక్రా (68వ)లు వరుస గోల్స్ సాధించి భారత్‌కు విజయాన్నందించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ గురువారం జరగనుంది. పోరాడి ఓడిన పురుషుల జట్టు.. ప్రపంచకప్‌కు సన్నాహకంగా యూరప్‌లో పర్యటిస్తున్న పురుషుల జట్టుకు బెల్జియం చేతిలో ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 1-2 తేడాతో పోరాడి ఓడింది. 17వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను టామ్ బూన్ గోల్‌గా మలచడంతో ఖాతా తెరిచిన బెల్జియంను ఆ తరువాత భారత ఆటగాళ్లు సమర్థవంతంగా నిలువరించారు. 58వ నిమిషంలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్‌పాల్ సింగ్ గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు. అయితే మరుసటి నిమిషం (59వ)లోనే బూన్ మరో గోల్ నమోదు చేసి బెల్జియంకు ఆధిక్యాన్నందించాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను గురువారం నెదర్లాండ్స్‌తో ఆడనుంది.